
పోస్టాఫీసు పక్కనే పన్నులు వసూలు చేస్తున్న జీపీ ఉద్యోగి
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గురువారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. ఆ వెంటనే పోస్టాఫీసు పక్కనే గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒకరు కూర్చొని గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి పన్నులు వసూలు చేయొద్దని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు అందుకు విరుద్ధంగా ఇలా పన్నులు వసూలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment