![KTR Take Charge As TRS Working President - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/17/KTR.jpg.webp?itok=LiZPO4WD)
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం తెలంగాణ భవన్‌లో ఈరోజు (సోమవారం) ఉదయం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బసవతారం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
దాదాపు 20వేలకు పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్ వద్దకు తరలివచ్చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ ఆటలతో టీఆర్‌ఎస్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment