సాక్షి, హైదారాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌ను హరీష్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ భవిష్యత్‌లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అదే సమయంలో తామిద్దరం కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉంటామన్నారు. ‘వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. రేపు రాష్టాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా ఇద్దరు కలిసి పనిచేస్తాం’ అని హరీష్ రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment