సాక్షి,ఇల్లెందు( భద్రాద్రి): అంతా మీ ఇష్టమైపోయింది.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏ కార్యక్రమానికీ సమాచారం ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు గాంధీ జయంతికి నేను ఎందుకు రావాలి... మీరే చేసుకోండి’ అంటూ ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ నాగరత్నమ్మ హాజరయ్యారు. ఇదే సమయంలో గాంధీ జయంతి వేడుక నిర్వహిస్తుండగా రావాలని అధికారులు ఆహ్వానించారు.
అయితే, ఇతర కార్యక్రమానికి వస్తే గాంధీ జయంతికి ఆహ్వానిస్తారా.. అసలు ఈ కార్యక్రమం ఉందని తనకు సమాచారమే ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ అప్పారావు ఆమెకు నచ్చజెప్పారు. సమాచారం ఇవ్వాలని యూడీసీకి చెప్పామని, ఆయన మరిచిపోయి ఉంటారని, ఈ విషయంలో యూడీసీకి మెమో ఇస్తామని చెప్పినా ససేమిరా అనడంతో.. చివరకు జెడ్పీటీసీ ఉమ, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు నచ్చ జెప్పడంతో చివరకు ఎంపీపీ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా!
Comments
Please login to add a commentAdd a comment