mpdo
-
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం
సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్లో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమగోదావరి జల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేరుకున్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యులతో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఆ తరువాత సునీతతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్ నోట్లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ సమాచారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు. -
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీడీఓ మృతి
కల్వకుర్తి: చారకొండ మండల ఎంపీడీఓ జయసుధ(46) బ్రెయి న్ స్ట్రోక్‌కు గురికావడంతో నాలు గు రోజులుగా చికిత్స పొందుతూ.. మృతిచెందారు. డిసెంబర్ 28 రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెల్దండ సమీపంలోని యన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. వారి మృతదేహాన్ని కల్వకుర్తిలోని వారి స్వగృహానికి తరలించారు. చారకొండ మండల ఎంపీడీఓగా ఆరేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఆమె అకాల మరణంతో బంధువులు, స్నేహితులు మండలంలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్వగృహంలో వారి పార్థీవ దేహానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, మండలంలోని ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఆయా శాఖల అధికారులు, నాయ కులు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. -
'పదేళ్లకు పైగా ఒకేచోటు' వదలరు.. కదలరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ అధికారులు రెండు మూడు ఏళ్లకు ఒకసారి బదిలీ కావడం సర్వసాధారణం. అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో ఎలాంటి పక్షపా త ధోరణి ప్రదర్శించకుండా ఉండేందుకు గాను బ దిలీలు చేయడం అనేది తప్పనిసరి, ఆనవాయితీ కూడా. అయితే జిల్లాలో కొందరు జిల్లా, మండల స్థాయి అధికారులు తాము ఉన్న సీట్లను వదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు కీలక అధి కారులు పదేళ్లకు పైగా ఒకేచోట పని చేస్తుండడంగ మనార్హం. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలోని నందిపేట, డొంకేశ్వర్ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్ 12 ఏళ్లుగా అక్కడ నుంచి కదలకుండా ఉంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడంటూ కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడం గమనార్హం. నాగవర్ధన్ అక్రమాలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొందరు జిల్లా అధికారులు స్థాయి లేకున్నప్పటికీ ఇన్చార్జి హోదాలో (ఎఫ్ఏసీ) ఏళ్లతరబడి కొనసాగుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమాచారహక్కు చట్టానికి సైతం కొందరు అధికారులు తూట్లు పొడవడం గమనార్హం. మండలాల్లో.. నందిపేట, డొంకేశ్వర్ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్ 12 సంవత్సరాలుగా అక్కడే తిష్ట వేశారు. బోధన్ మున్సిపల్ డీఈ శివానందం తొమ్మిదిన్నర ఏళ్లుగా, మేనేజర్ నరేందర్ ఐదేళ్లుగా కొనసాగు తున్నారు. రుద్రూర్ ఎంపీడీవో బాలగంగాధర్, కో టగిరి, రుద్రూర్ ఎంఈవో శాంతికుమారి ఐదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల ఎంఈవో ఆంధ్రయ్య తొమ్మిదేళ్లుగా, బాల్కొండ వ్యవసాయ అధికారి మహేందర్‌రెడ్డి తొమ్మిదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. మోర్తాడ్ వ్యవసాయ అధికా రి లావణ్య ఎనిమిది ఏళ్లుగా, కమ్మర్పల్లి ఐకేపీ ఏపీ ఎం గంగారెడ్డి ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. మోర్తాడ్ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ముప్కాల్ ఎంపీడీవో దామోదర్ ఐదేళ్లుగా అదే పోస్టులో ఉన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు అధికారులకు ప్రమోషన్లు వచ్చినప్పటికీ అక్కడే కొనసాగుతుండడం విశేషం. ఎనిమిదేళ్లుగా.. జిల్లా సహకార అధికారి సింహాచలం ఎనిమిది సంవత్సరాలుగా ఆ పోస్టు నుంచి కదలడం లేదు. సింహాచలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం గమనార్హం. ఇక జెడ్పీ సీఈవో గోవింద్‌నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర సైతం ఆరేళ్లుగా కొనసాగుతున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాజీ మంత్రి అండతో ఇన్చార్జి హోదాలో గత ఐదేళ్లుగా కదలకుండా తిష్ట వేశారు. రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చినప్పటికీ ఛార్జి తీసుకోకుండానే వెళ్లేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే డీఎంహెచ్‌వో సుదర్శన్ సైతం ఆరేళ్లుగా ఇన్చార్జి హోదాలో కొనసాగుతున్నారు. సుదర్శన్ సైతం పలువురు కిందిస్థాయి సిబ్బందిని, కార్లు అద్దెకు పెట్టిన వ్యక్తులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లా ఉద్యాన అధికారి నర్సింగ్‌దాస్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి దేవేంద్రప్రసాద్ ఐదేళ్లుగా ఇక్కడే ఉన్నారు. ఇవి కూడా చదవండి: 'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్! -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
జనగామలో రిటైర్డ్ ఎంపీడీఓ సుపారీ హత్య!?
బచ్చన్నపేట/జనగామ: జనగామ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) దారుణ హత్యకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. అయినా మృతదేహం ఆచూకీ లభించలేదు. మూడు రోజులుగా మిస్టరీకి తెరపడినట్లు పోలీసులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో... వరంగల్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్య సమాచారం శనివారం సాయంత్రం బయటకు వచ్చింది. జనగామ మండలం సరిహద్దు చినరామన్‌చర్ల–పెదరామన్‌చర్ల శివారు చెరువు వద్ద మృతదేహం ఉన్నట్లు మొదటగా పుకార్లు వినిపించగా... ఆ తర్వాత చంపక్‌హిల్స్ క్రషర్ సమీపంలోని లోయ(చెరువు) వద్ద ఉందని తెలిసింది. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రాత్రి వరకు ఆరా తీశారు. దీనిపై అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో... మృతదేహం ఆచూకీ లభ్యమైనప్పటికీ పోలీసులు గోప్యత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా విచారణ బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నల్లా రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ.. ఆర్టీఏ కార్యకర్తగా యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. అతను ఈ నెల15న మధ్యాహ్నం మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రామకృష్ణయ్య సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. సెల్ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ జిల్లా ప్రజా ప్రతినిధి భర్తతోపాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్‌నకు పాల్పడింది అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని బాధితులు ఫిర్యాదు చేయడంతో.. సీపీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. టాస్క్‌ఫోర్స్ టీం సీఐతోపాటు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి లోతుగా విచారణ జరిపిస్తున్నారు. ఆయన హత్యకు ముందస్తు ప్లాన్ వేసి, సుపారీ గ్యాంగ్‌కు పెద్దఎత్తున ముట్టజెప్పినట్లు భావిస్తున్నారు. హత్యకు దారితీసిన ఉదంతం? ఇటీవల గోపాల్‌నగర్ శివారులోని ఓ సర్వే నంబర్లోని భూమిలో నిరుపేదలు గుడిసెలు వేశారు. తన భూమిలో గుడిసెలు ఎలా వేస్తారని ఓ బీఆర్ఎస్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు భూమి ప్రభుత్వ/అసైన్డ్ పరిధిలో ఉందని రామకృష్ణయ్య వారికి భరోసా ఇస్తుండడంతో.. గుడిసెలు వేశారని సదరు బీఆర్ఎస్ నేత అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. పోలీసులు పట్టించుకోలేదు.. తమ తండ్రి రామకృష్ణయ్యను కిడ్నాప్ చేసిన రోజు నే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, దర్యాప్తు ఆలస్యం చేయడంతోనే ఇంతపని జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త, బీఆర్ఎస్ నేత అంజయ్యనే హత్య చేయించారని కుమారులు అశోక్, శ్రావణ్, భరత్ తెలిపారు. ఎమ్మెల్యే కూడా వెనకుండి నడిపించారని ఆరోపించారు. -
ఏసీబీ వలలో ఎంపీడీవో
పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కె.ఆర్.విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ మంజూరు కోసం మండల పరిషత్ నుంచి 10 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మండలంలోని రాజులపాలెంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.1.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించాలని పంచాయతీలో నిర్ణయించారు. ఎంపీ లాడ్స్ మంజూరుకు ముందుగా గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం, మండల పరిషత్ నుంచి 10 శాతం సొమ్ము మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంది. మండల పరిషత్ మ్యాచింగ్ గ్రాంటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉప సర్పంచ్ ఎన్.విజయలక్ష్మి ఇటీవల ఎంపీడీవో విజయను కోరారు. అనుమతి ఇచ్చేందుకు ఎంపీడీవో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 6న విజయలక్ష్మి ఎంపీడీవోకు రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని ఎంపీడీవో ఒత్తిడి చేయడంతో ఉప సర్పంచ్ తమను ఆశ్రయించినట్టు ఏసీబీ ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయలక్ష్మి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో విజయను పట్టుకున్నట్టు చెప్పారు. తమ పరీక్షల్లో ఎంపీడీవో నగదు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఎంపీడీవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్, వై.సతీ‹Ù, ఎస్ఐ ఎస్.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక
గుంటూరు ఎడ్యుకేషన్: మూడున్నర దశాబ్దాలుగా ఒకే కేడర్‌లో పనిచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించడమనేది పరిపాలనలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎంపీడీఓల విషయంలో ఇది అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వాలు అవలంబించిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగోన్నతి లేక తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య ఎంపీడీఓలు విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 మంది ఎంపీడీఓలు జెడ్పీ డెప్యూటీ సీఈవో, డీఎల్డీవో, డ్వామా ఏపీడీలుగా ఉద్యోగోన్నతి పొందారు. మొత్తం 21 మందికి ప్రమోషన్ కల్పించగా, నలుగురు పదోన్నతిని వదులుకున్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో కొందరు ఇప్పటికే కొత్త స్థానాల్లో సంతోషంగా విధుల్లో చేరారు. (క్లిక్: బాలయ్యా... గుర్తున్నామా!) 35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు ఎంపీడీఓలకు ఉద్యోగంలో చేరిన 35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు లభించాయి. ప్రమోషన్లు పొందిన ఎంపీడీఓలందరూ కొత్త స్థానాల్లో విధుల్లో చేరి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. – డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ -
ఎంపీడీవోలు ఇలా ఉంటే ఎలా? కామారెడ్డి కలెక్టర్‌కు మంత్రి మందలింపు
సాక్షి, నిజామాబాద్ : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులు సైతం రాజకీయ నాయకుల్లాగా గాలిమాటలు, తప్పుడు లెక్కలు చెబితే ఎలా అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లా పరిషత్ హాలులో 5వ విడత పల్లెప్రగతి పనులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ధామాలు ఎన్ని వినియోగంలోకి వచ్చాయని కామారెడ్డి డీపీవోను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. డీపీవో సరైన లెక్కలు చెప్పలేదు. ఎంపీడీవోలు సైతం వివరాలు చెప్పకపోవడంతో ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై నమ్మకం లేకుండా పోయిందన్నా రు. వైకుంఠ ధామాలు వాడుకలోకి రాకుండానే చ్చినట్లు తప్పుడు లెక్కలు ఎలా చెబుతారన్నారు. లెక్కల్లో స్పష్టత ఉండాలన్నారు. మండలాల వారీగా కచ్చితమైన నివేదిక ఉండాలన్నారు. కాకిలెక్కలు చెబితే ఎలా అన్నారు. కామారెడ్డి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎంపీడీవోలు ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ క్ర మంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలుగజేసుకున్నారు. లెక్కలపై సందేహం వస్తోందన్నారు. కామారెడ్డి కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకోవాలన్నారు. ఈ నెల 18 లోగా మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు నీటి సౌకర్యం కల్పించి వాడుకలోకి తేవాలన్నారు. లేనిపక్షంలో మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం నుంచి తాను కాపాడలేనన్నారు. నెల తరువాత మళ్లీ వచ్చి చూస్తానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గ్రామపంచాయతీలు ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చె త్త నుంచి ఆదాయం ఆర్జించాలని మంత్రులు ఎర్ర బెల్లి, ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని ఓ చిన్న తండా మొక్కల పెంపకం ద్వారా రూ.15 లక్షల ఆదాయం ఆర్జించిందన్నారు. ట్రాక్టర్లు చాలకపోతే మరొక ట్రాక్టర్ తీసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థా ల తో మంచి ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ప్రస్తు తం ఇతర రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ దిగుమతి అవుతోందన్నారు. నిధుల కొరత లేదన్నారు. ఉపాధి హా మీ నిధులను పంచాయతీలు తెలివిగా వాడు కోవాలన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్షి్మ, షాదీముబారక్, పింఛన్లు, కేసీఆర్ కిట్లు తదితర సంక్షేమ పథకాల గురించి ఆయా పంచాయతీల్లో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ లెక్కలతో ఉంచాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్, గంగాధర్‌గౌడ్,ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సి నారాయణరెడ్డి, జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్: ఫాంహౌస్‌పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్ -
అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను..
సాక్షి,ఇల్లెందు( భద్రాద్రి): అంతా మీ ఇష్టమైపోయింది.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏ కార్యక్రమానికీ సమాచారం ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు గాంధీ జయంతికి నేను ఎందుకు రావాలి... మీరే చేసుకోండి’ అంటూ ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ నాగరత్నమ్మ హాజరయ్యారు. ఇదే సమయంలో గాంధీ జయంతి వేడుక నిర్వహిస్తుండగా రావాలని అధికారులు ఆహ్వానించారు. అయితే, ఇతర కార్యక్రమానికి వస్తే గాంధీ జయంతికి ఆహ్వానిస్తారా.. అసలు ఈ కార్యక్రమం ఉందని తనకు సమాచారమే ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ అప్పారావు ఆమెకు నచ్చజెప్పారు. సమాచారం ఇవ్వాలని యూడీసీకి చెప్పామని, ఆయన మరిచిపోయి ఉంటారని, ఈ విషయంలో యూడీసీకి మెమో ఇస్తామని చెప్పినా ససేమిరా అనడంతో.. చివరకు జెడ్పీటీసీ ఉమ, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు నచ్చ జెప్పడంతో చివరకు ఎంపీపీ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా! -
మెస్సేజ్‌కి స్పందించలేదని మెమోలిచ్చిన ఎంపీడీవో
గొల్లపల్లి (బుగ్గారం): అత్యవసర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో తిరుపతి వాట్సాప్ గ్రూప్‌లో పంచాయతీ కార్యదర్శులకు చేసిన సందేశానికి స్పందన లేకపోవడంతో సదరు అధికారి వారికి మెమోలు జారీ చేశారు. బుగ్గారం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కోరుతూ మూడురోజుల క్రితం నీటి వినియోగం పనులకు సంబంధించిన ఫొటోలను పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూపులో పంపించారు. ఆ సందేశాన్ని గ్రూపులో ఉన్న 11 మంది చూసికూడా కనీసం స్పందించలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తన సందేశానికి స్పందించలేదని భావించిన ఎంపీడీవో సెలవులో ఉన్న ఇద్దరిని మినహాయించి గ్రూపులోని 9మంది పంచాయతీ కార్యదర్శులకి వివరణ కోరుతూ మెమోలు జారీ చేశారు. ఈ విషయం ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో నెటిజన్లు ఎంపీడీవో తీరును తప్పుబడుతూ మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవికి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోలు
సాక్షి, తాడేపల్లి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రమోషన్ సమస్యను తీర్చినందకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోలు. ఈ క్రమంలో మంగళవారం ఎంపీడీవోలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ని కలిశారు. తమ ప్రమోషన్స్ వల్ల కింది స్థాయిలోని 13 కాడెర్స్ వారికి ప్రమోషన్స్ వస్తున్నాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎంపీడీవోలకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక తమకు న్యాయం జరిగిందన్నారు. మరో పదిరోజుల్లో తమ ప్రమోషన్స్ ఉత్తర్వులు రానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లో లక్ష మంది పంచాయతీరాజ్ ఉద్యోగులతో కృతజ్ఞత సభ పెడతాం అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఉద్యోగులకు పీఆర్సీ వంటివి అన్ని అమలు చేస్తారన్నారు. నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ న్యాయం చేశారు ‘‘మాలో కొంత మంది రిటైర్ కూడా అయ్యారు. నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ మాకు న్యాయం చేశారని’’ ఎంపీడీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.బ్రహ్మయ్య తెలిపారు. గతంలో వైఎస్సార్ దీనికోసం కృషి చేశారు... ఆయన కుమారుడు ఇప్పుడు అమలు చేశారన్నారు. సీఎం జగన్ నిర్ణయం వల్ల ఒకే సారి 300 మందికి ప్రమోషన్స్ వస్తున్నాయన్నారు. ఈ క్రమంలో తాము కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుని పనిచేస్తామన్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంపీడీవోలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించలేదని చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా వెంటనే సమస్యను అర్థం చేసుకున్నారని చెప్పారు. పదోన్నతులకు ఉన్న ఆటంకాన్ని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 12 కేడర్లకు చెందిన 18,500 మంది పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారిలో విశ్వాసాన్ని కలిగించారన్నారు. తాజాగా పదోన్నతులు పొందిన 255 మంది ఎంపీడీవోలను మంత్రి అభినందించారు. లోపాలను సవరించుకోవాలని చెప్పడం తప్పా? ఏ పరిశ్రమ అయిన నిబంధనల ప్రకారమే పని చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అదనపు ప్రయోజనాల కోసమే అమరరాజా పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్లాలనుకుంటోందన్నారు. అమరరాజా పరిశ్రమ వల్ల కాలుష్య సమస్య ఉందని పీసీబీ, ఎన్జీటీ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏ రసాయనిక పరిశ్రమ అయినా నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వేరే చోటికి తరలించాలని నిబంధనలుంటాయని, దానిని ఎవరైనా అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తూ, సీఎంపై బురద చల్లాలని చూడటం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రం నుంచి పరిశ్రమ తరలిపోవాలని కోరుకుంటుందా? అని మంత్రి ప్రశ్నించారు. తాము కూడా తమ జిల్లా నుంచి పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోమన్నారు. లోపాలను సవరించుకుని, నిబంధనలు పాటించాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. 5:3:3 నిష్పత్తిలో పదోన్నతులు.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంపీడీవోల పదోన్నతికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. పదోన్నతి విధానం లేక 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే పరిష్కారం సూచిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రమోషన్లలో సీనియారిటీ వివాదాలను పరిష్కరిస్తూ మధ్యేమార్గంగా మూడు కేటగిరీలైన.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంపీడీవోలు, ప్రమోట్ ఎంపీడీవోలు, ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎంపీడీవోలకు 5:3:3 నిష్పత్తిలో పదోన్నతి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు
-
నేను అట్ల అనలే; మహిళా అధికారిపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు
కమలాపూర్: మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో శుక్రవారం పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ.. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు తిరిగేలా పల్లెప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని, మళ్లీ నెల తర్వాత వస్తానని, అప్పటివరకు ఇంకా అందంగా తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉన్నారా అంటూ అడగడంతో ఆమె వచ్చి మంత్రి వెనకాల నిల్చోగానే ‘మేడం నువ్వయితే బాగానే ఊపుతున్నవు కానీ ఈడ ఊపుతలేవు’.. బాగానే పని చేస్తదిలే అంటూ వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యల వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి స్థాయిలో ఉండి గ్రామసభలో అందరిముందు అవమానపరిచేలా మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సంచలనం కోసమే వక్రీకరణ: ఎర్రబెల్లి కమలాపూర్: ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలు సంచలనం కోసం ప్రయత్నిస్తున్నాయని, వక్రీకరించి వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదని, ఉద్యోగులు, అధికారులపై తనకు గౌరవం ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎంపీడీవోపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఆ మహళా అధికారి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతోనే బాగున్నవా బిడ్డా (కూతురు) అంటూ పలకరించానని తెలిపారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో ఉన్న లోపాలు, పచ్చదనం పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల అమలుపై ఆరా తీశానని, తెలంగాణ ఉచ్ఛరణలో భాగంగా మీరు బాగా ఉరికి (పరిగెత్తి) పని చేస్తున్నారని, ఇంకా అందరినీ ఉరికించి పని చేయించాలని ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కానీ కొందరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని, ఇది వాంఛనీయం కాదన్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ
సాక్షి, పాల్వంచ : ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ శుక్రవారం పాల్వంచ ఎంపీడీఓ పి.ఆల్బర్ట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ వరంగల్, ఖమ్మం డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..పాండురంగాపురం గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఆడెపు రామలింగయ్యకు బిల్లు మంజూరు కావాల్సి ఉండగా..ఎంపీడీఓ ఆల్బర్ట్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. గతంలోనే కొంత డబ్బు ఇచ్చానని, అయినా ఇంకా అడుగుతున్నాడని విసిగిన సదరు కాంట్రాక్టర్ ఈనెల 9వ తేదీన ఖమ్మం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓకు డబ్బులు ముట్టజెప్పాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన గదిలోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, ఎంపీడీఓపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, క్రాంతికుమార్‌లు పాల్గొన్నారు. గతంలో ఇద్దరు.. రెండు సంవత్సరాల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో రూ.7,000లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత మార్చి 20వ తేదీన పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి పాండురంగాపురం గ్రామానికి చెందిన అరుణ్‌సాయికి ఓ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.3,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీడీఓనే రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. పాల్వంచలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
జక్రాన్ పల్లి ఎంపీడీఓ భారతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: జక్రాన్ పల్లి ఎంపీడీఓ భారతి శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. డిప్యూటేషన్ విషయంలో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యా యత్నం చేశారు. జక్రాన్ పల్లి మండలంలో ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతిని అధికారులు కొద్దిరోజుల క్రితం డిప్యూటేషన్ మీద సిరికొండ ట్రాన్స్ఫర్ చేశారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా తాను సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటేషన్‌ను నిలిపివేయాలని ఆమె పలుమార్లు కోరారు. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగారు. అది గమనించిన కుటుంబసభ్యులు మొదట ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. (శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని..) -
ఎంఈఓ, ఎంపీడీఓ డిష్యుం..డిష్యుం
చిన్నచింతకుంట: ఒకరు మండల పరిపాలనను గాడిలో పెట్టే అధికారి..మరొకరు మండలం విద్యాధికారి. వీరి ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి మనస్పర్థలతో విమర్శలు చేసుకుంటూ ఎంపీపీ కార్యాలయంలోనే ఎంపీపీ సాక్షిగా ఒకరిపైనొకరు దాడులు చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల ఎంఈఓగా లక్ష్మణ్‌సింగ్ కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యనే కోయిల్‌కొండ విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నచింతకుంట మండలంలో బాధ్యతలు విస్మరిస్తున్నారని ఎంపీపీ హర్షవర్ధన్‌కు ఎంపీ డీఓ పలుమార్లు విన్నవించారు. ఈక్రమంలోనే మండల కార్యాలయానికి వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ మూమెంట్ రిజిçస్ట్టర్‌లో సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఫయాజుద్దీన్ ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ హర్షవర్ధన్ ఎంపీడీఓ, ఎంఈఓలను తన చాంబర్లోకి పిలిపించారు. ఇరువురు అక్కడికి వెళ్లి ఆరోపణలు చేసుకుంటు ఘర్షణలకు పాల్పడ్డారు. తనను కులంపేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడని ఎంపీడీఓపై ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ వివరణ కోరగా ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ జూలై నెల మూమెంట్ రిజిçస్టర్లో ముందస్తుగా మూమెంట్ రాసుకున్నారని ఇది సరికాదని ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి పిలిపించి అడగారన్నారు. ఇబ్బందిగా ఫీలైన ఎంఈఓ తనపై దురుసుగా మాట్లాడారన్నారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఎంఈఓ దాడిపై టీఎస్ యూటీఎఫ్, తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిచేసిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. -
శభాష్.. పల్లవి
సాక్షి, దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవికి సీఎంఓ నుంచి గురువారం ఫోన్ వచ్చింది. ఎంపీడీఓగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. పర్యావరణ హితం కోసం వాడిపడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటిన విధానాన్ని సీఎం ప్రశంసించారు. ‘బొండాం భలే ఐడియా’శీర్షికన ఈనెల 4న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు సీఎంఓ నుంచి అభినందనలురావడం సంతోషంగా ఉందని పల్లవి చెప్పారు. చదవండి: బొండాంతో భలే ఐడియా! -
దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో
సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్ అనిల్‌కుమార్ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్, గుంటూరు వాసి మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్‌కుమార్ కుమురం భీ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసముంటున్నారు. అదనపు కట్నం కోసం గతంలోనూ తనపై హత్యయత్నం జరిగిందని మేరీకుమారి చెప్పారు. -
ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్
సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం. ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్‌లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్‌లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి. పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే. వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్‌పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్‌ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
మహిళా అధికారిపై అచ్చెన్నాయుడి చిందులు
సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో దందాలు చేసిన అచ్చెన్నాయుడికి ఇంకా పాత వాసనలు వదిలినట్టు లేదు.. ఏకంగా మహిళా ఎంపీడీఓ మీదే దండెత్తారు. గత ప్రభుత్వంలో అక్రమంగా సంక్షేమ పథకాలను అందుకున్న అనర్హులను అధికార యంత్రాంగం తొలగిస్తుండడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. సాక్షాత్తు తన సొంత మండలంలోనే ఇటువంటి పారదర్శక పాలన కొనసాగుతుండడంతో తన మార్క్‌కు భంగం కలుగుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. దీంతో శనివారం కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఇన్చార్జి ఎంపీడీఓ ఎస్.రాజేశ్వరమ్మతోపాటు మిగిలిన అధికారులను బెదిరిస్తూ చిందులు వేశారు. మండల పరిషత్ కార్యాలయానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువవుతోందని, దీనిని కట్టడి చేయాలంటూ ఆమెను హెచ్చరించారు. దంత పంచాయతీలో పింఛన్ల తొలగింపుపై చిందులు తొక్కారు. తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఇన్చార్జి ఎంపీడీఓను అచ్చెన్నాయుడు బెదిరించారు. దీంతో మండల పరిషత్ కార్యాలయ సిబ్బందితోపాటు మిగిలిన అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
ఎంపీడీవో.. నీ అంతు చూస్తా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్ తలుపులు మూసేసి కంప్యూటర్ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా బలరాం బలవంతంగా ఎంపీడీవోతో రెండో జాబితాపై సంతకం చేయించారు. తాము ఇచ్చిన జాబితాను ప్రకటించకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇది జరుగుతున్న సమయంలో కరణం అనుచరులు ఎంపీడీవో కార్యాలయంలోకి విలేకర్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కరణం తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయనకు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోయారు. గ్రామ వలంటీర్ల జాబితా విడుదల చేసిన ఎంపీడీవో 61 మందితో ఉన్న రెండు జాబితాలనూ ప్రకటించలేదు. జిల్లా ఉన్నతాధికారులకు రెండు జాబితాలు పంపినట్లు సమాచారం. గ్రామాల్లో తిరగనివ్వం: కరణం అనుచరులు.. ప్రకాశం జిల్లా చీరాల మండలంలో 446 గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హత ఆధారంగా ఆదివారం తుది జాబితాను తయారు చేశారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు సోమవారం జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరణం బలరాంతోపాటు ఆయన అనుచరులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి దౌర్జన్యానికి దిగారు. తమ వారి పేర్లు లేకపోతే వలంటీర్లను గ్రామాల్లో తిరగనివ్వమంటూ హెచ్చరికలు కూడా చేశారు. బలవంతంగా జాబితాలో తమకు చెందిన 61 మందిని చేర్చించారు. గ్రామ వలంటీర్ల జాబితా సిద్ధమైన తరువాత ఎమ్మెల్యే కరణం బలరాం తన చాంబర్‌కు వచ్చి 61 మంది పేర్లు మార్చి తమ వారి పేర్లు చేర్చాలని ఒత్తిడి చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. -
బిందాస్ ‘బస్వన్న’
రేగోడ్(మెదక్): అది మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఎంపీపీ చాంబర్. స్థానిక ఎంపీడీఓ బస్వన్నప్ప శుక్రవారం ఉదయం 11 గంటలకు తాపీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చీరాగానే ఎంపీపీ చాంబర్లోకి వెళ్లి టేబుల్‌పై ఇలా పడకేశారు. హాయిగా దినపత్రిక చదువుతూ కాలక్షేపం చేశారు. 11.19 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి ‘సాక్షి’ చేరుకోగా ఎంపీడీఓ చాంబర్‌కు గడియ పెట్టి ఉంది. ఎక్కడికి వెళ్లారని ఆరా తీయగా ఎంపీపీ చాంబర్లో ఉన్నారని తెలిసింది. 11:20 గంటలకు ఎంపీపీ చాంబర్ తలుపు తీసి చూడగా.. ఎంపీడీఓ బస్వన్నప్ప ఇదిగో ఇలా కనిపించారు. వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన వారంతా ఇది చూసి ముక్కున వేలేసుకున్నారు. అధికారి నిర్వాకాన్ని ‘సాక్షి’తన కెమెరాలో క్లిక్‌మనిపించగా, ఎంపీడీఓ టేబుల్‌పై నుంచి లేస్తూ.. ‘మీరిలా ఫొటో తీయడం మంచిది కాదు. నాకు ఆరోగ్యం బాగా లేక పడుకున్నా’అని దాటవేసే ప్రయత్నం చేశారు. -
విషాదంలోనే..వలంటీర్ ఇంటర్వ్యూకు హాజరు
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : ఓ వైపు భార్య చనిపోయిందన్న విషాదం, మరోవైపు ఇంటర్వ్యూకు హాజరు కాకపోతే ఉద్యోగం రాదేమోనన్న ఆందోళన మధ్య గురువారం గ్రామ వలంటీర్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఓ నిరుద్యోగి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని దిగువసార గ్రామానికి చెందిన బి.తులసి అనే బాలింత బుధవారం మృతి చెందింది. 40 రోజుల కిందట సీతంపేట సామాజిక ఆస్పత్రిలో ఆడ బిడ్డను కన్న ఆమె తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు గురువారం గ్రామ వలంటీర్ పోస్టు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటర్వ్యూ చేసిన ఎంపీడీవో రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీకి సమాధానాలు చెప్పారు. -
బాధ్యతగా పనిచేద్దాం.. జవాబుదారీగా ఉందాం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘ప్రజాధనంతో వేతనం పొందుతున్నాం... బాధ్యతగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉందాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మెరుగైన సేవలు అందించాలి. వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. నవరత్నాలు అమలు ద్వారా ప్రజాసంక్షేమానికి కృషి చేయాలి’ అని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ డిల్లీరావుతో కలిసి జిల్లా అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ పూర్తయిన తరువాత మండల స్థాయి అధికారులు డ్వామా, డీఆర్డీఏ అధికా రులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా, ఉపాధ్యాయులు కీలకమన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా పనిచేయాలని సూచించారు. చిన్నారుల మరణాలు పునరావృతం కానీయొద్దు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరుగురు చిన్నపిల్లలు చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్‌సెంటర్ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా వర్కర్ సమన్వయంతో పనిచేసి శిశుమరణాలను నియంత్రించాలన్నారు. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, పూర్తిగా పడేంత వరకు భూగర్భ జల మట్టం పెరగదన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి నివారణ కోసమే ఖర్చు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించండి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి కుంటలు, కందకాల నిర్మాణ పనులు కల్పించాలని ఆదేశిం చారు. సంక్షేమ శాఖలకు సంబంధించి రుణాల మంజూరులో ఎల్డీఎం కీలక పాత్ర పోషించాలన్నారు. మండల స్థాయిలో జేఎంఎల్టీసీ సమావేశాలను ఏర్పాటు చేసి రుణాల మంజూరు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తన వేరుశనగ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేడీఏ హబీబ్‌బాషాను ఆదేశించారు. అధికారులకు మెమోలు ఇవ్వండి ‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుడిబండ, వజ్రకరూరు, తనకల్లు, ఆమడగూరు, అమరాపురం, డి.హీరేహాళ్ ఎంపీడీఓలు, తహసీల్దార్లు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌కు వస్తుంటే, అధికారులు సమయానికి హాజరుకాకపోతే ఎలాగని ఆగ్రహించారు. గ్రీవెన్స్‌కు హాజరుకాని ఎంపీడీఓలు, తహసీల్దార్లకు మెమోలు జారీ చేయాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌ఓని ఆదేశించారు. -
తాడిపత్రి ఎంపీడీఓ కార్యలయంలో ఉపాధి కూలీలు ఆందోళన
-
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట -
పింఛన్ డబ్బులు కాజేశాడని ఫిర్యాదు
బజార్హత్నూర్: మండలంలోని గిర్నూర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నూర్సింగ్ పింఛన్ డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీవో దుర్గం శంకర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. 15వందల పింఛన్‌కు వెయ్యి రూపాయలు, రెండు నెలలకు సంబంధించిన పింఛన్ 2వేలకు వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, బయోమెట్రిక్ ద్వారా వచ్చిన ప్లే స్లిప్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండా చించివేస్తున్నాడని, బుక్కుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో ఈవోపీఆర్డీ విజయ్‌భాస్కర్‌రెడ్డిని గ్రామానికి పంపారు. గ్రామానికి వచ్చి న ఈవోపీఆర్డీ బీపీఎంతో మాట్లాడుతున్న సమయంలో వెయ్యి ఇచ్చి 2వేలు ఇచ్చినట్లు రాయడంతో గ్రామస్తులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ జయరాం, ఎస్సై అబ్ధుల్‌బాఖీ సంఘటన స్థాలానికి చేరుకుని పోస్టల్‌కు సంబంధించిన ఎస్పీఎం, మేయిల్ గార్డ్ అధికారులతో మాట్లాడారు. సోమవారం విచారణ చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ వినోద్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, భూపాల్‌రెడ్డి, గ్రామస్తులు కొమ్ము నారాయణ, బాపురావ్, రాములు, సాయికృష్ణ,లక్కం నారాయణ, గవ్వల సాయిచైతన్య పాల్గొన్నారు. -
లబ్ధిదారుల్లో ‘పింఛన్’ టెన్షన్
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్.. ఆసరా పింఛన్ పథకాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్‌కు వయస్సును 57 ఏళ్లకు కుదిస్తామని ప్రకటించారు. కొత్త ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. కానీ ఏప్రిల్ నెల సమీపిస్తున్నప్పటికి అధికారులు అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా ఉండటంతో ఎన్నికల కోడ్ తో జాప్యమవుతుందని పేదలు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన పింఛన్ వస్తుందో లేదోనని అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన పింఛన్‌ను త్వరగా వర్తింపజేయాలనిలబ్ధిదారులు కోరుతున్నారు. మండలంలో 10 వేల మంది లబ్ధిదారులు.. మండలంలో 19 గ్రామాలలో అన్ని రకాల పింఛన్లు పొందుతున్న 4,982 మంది లబ్దిపొందుతున్నారు. అయితే పింఛన్ డబ్బులను రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో కొత్త విధానంలో పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల హడావుడి ఉండటంతో పెరిగిన పింఛన్ డబ్బులు మంజూరయ్యేందుకు మరింత జాప్యం జరుగుతుందేమోనని లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. 57 ఏళ్లకు కుదింపుతో 2,393 మందికి లబ్ధి ఆసరా పింఛన్‌కు కొత్తగా కనీస వయస్సు అర్హతను 57 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ నిబంధనతో మండలంలోని 19 గ్రామాల్లో కొత్తగా 2,393 మందికి లబ్ధి చేకూరనుంది. 57 ఏళ్లకు పైబడినవారు సుమారు 11,341 మంది ఉన్నారు. 57 ఏళ్ల నిబంధన సైతం ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇవ్వడంతో ఆశావహులు ఏప్రిల్ నెల ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతగా ఎదిరిచూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కొత్త పింఛన్ ప్రక్రియను త్వరగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నెలల తరబడి జాప్యం వద్దు ఆసరా పింఛన్ 57 ఏళ్లకే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో పేదల్లో సంతోషం వ్యక్తమైంది. ఎప్పుడు వస్తాయోనని నెలల తరబడి ఎదిరిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఆసరా పింఛన్ డబ్బులను రెట్టింపు చేసి మంజూరు చేయాలి. 57 ఏళ్లున్న వారికి త్వరగా పింఛను మంజూరు చేయాలి. – ఎం.డీ సత్తార్, గంభీర్పూర్ ప్రతి నెల ఒకటో తేదీన అందించాలి ఆసరా పింఛన్ డబ్బులు ప్రతి నెల ఒకటో తేదిన అందించాలి. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితులున్నాయి. డబ్బులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులపాలువుతున్నారు. ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ప్రతి నెల ఒకటో తేదిన పింఛన్ డబ్బులు మంజూరు చేయాలి. – గుగ్లొత్ రవినాయక్, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఆదేశాలు రాగానే అమలు ఆసరా పింఛన్ డబ్బులను పెంచడంతోపాటు 57 ఏళ్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. గతంలో మంజూరైన పింఛన్లు యథావిధిగా లబ్ధిదారులకు అందుతున్నాయి. కొత్త విధానం అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. – కట్కం ప్రభు, ఎంపీడీవో, కథలాపూర్ -
జీతం ఇక్కడ.. ఉద్యోగం ఎక్కడో..
పశ్చిమగోదావరి, ఆకివీడు: జీతం ఒక చోట.. విధులు మరొకచోట.. పాలకులు పగబడితే ఎంతటి ఉద్యోగికైనా ఇటువంటి తిప్పలు తప్పవనటానికి ఆకివీడు ఎంపీడీఓగా పనిచేసిన సీతామహాలక్ష్మి నిదర్శనం. రెండు కళ్ల సిద్ధాంతంతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారనడానికి ఈ ఎంపీడీఓకు జరిగిన అన్యాయం ఓ నిదర్శనం. ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని అధికారులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల విభజనలో సీతామహాలక్ష్మిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన ఆమె తరువాత తన సొంత రాష్ట్రమైన ఆంధ్రా చేరుకున్నారు. సొంత గడ్డకు వచ్చానన్న ఆనంద భాష్పాలు ఆమె కళ్లల్లో కనిపించిన కొన్నాళ్లకే అవి కన్నీరుగా మారిపోయాయి. ఆకివీడు ఎంపీడీఓగా పనిచేస్తున్న తెలంగాణవాసి నాయిని శ్రీనాథ్‌ను రాజధాని అమరావతికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో గతేడాది ఎంపీడీఓగా సీతామహాలక్ష్మి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన 24 గంటలకే ఆమెను ఆకివీడు నుంచి ఉండి మండల పరిషత్‌కు డెప్యూటేషన్‌పై బదిలీ చేయించారు. అయితే అక్కడ కూడా పనిచేసేందుకు ఆమెకు అవకాశం దక్కనివ్వలేదు. అక్కడ ఐదారు నెలలు మాత్రమే ఆమె పనిచేశారు. అక్కడ నుంచి ఏలూరు డీఆర్సీకి బదిలీ చేశారు. ఏలూరులో పనిచేస్తున్న సీతామహాలక్ష్మి ఆకివీడు మండల పరిషత్‌లోనే జీతం తీసుకుంటున్నారు. మండలస్థాయి అధికారికే స్థానం లేకుండా చేస్తే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎఫ్ఏసీతోనే పాలన ఏడాదిన్నర నుంచి ఆకివీడు ఎంపీడీఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతల(ఎఫ్ఏసీ)తో సూపరింటెండెంట్‌కు అంటగట్టారు.మునిసిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆకివీడులో పరిపాలన సాగించడానికి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి సరిపోతాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజు ఎంపీడీఓ ఒక్క రోజు ఎంపీడీఓగా పనిచేసిన అధికారిని ఆకివీడు మండల ప్రజలు చూశారు. మండల స్థాయి అధికారి ఒక్కరోజు పనిచేసి వెళ్లిపోవడంతో ఆమెను ప్రజలు కూడా మరిచిపోయారు. మహిళా ఉద్యోగికి ఇన్ని తిప్పలా? మండలాభివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చిన మహిళా ఉద్యోగిని ఇన్ని తిప్పలు పెట్టడం సమంజసం కాదు. జీతం ఒక చోట, విధులు మరొక చోట.. సేవలందించడానికి వచ్చిన ఉద్యోగిని ఇబ్బందుల పాల్జేయడం సరికాదు. టీడీపీ పాలనలో ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఆ ఎంపీడీఓకు ఆకివీడులోనే పోస్టింగ్ ఇవ్వాలి.–మోరా జ్యోతిరెడ్డి,ఎంపీటీసీ సభ్యురాలు, ఆకివీడు ఇది సరైన పద్ధతి కాదు సొంత గడ్డపై సేవలందించేందుకు వచ్చిన ఉద్యోగినిని రాజకీయ కారణాలతో తిప్పలు పెట్టడం సరికాదు. మండల స్థాయి అధికారిలో ఈ విధంగా ఎక్కడెక్కడో పనులు చేయించుకోవడం దారుణం. జీతం ఒక చోట, పనులు మరొకచోట. పాలకులు ఇలా ఆడుకోవడం సరైన పద్ధతి కాదు.–డి.కల్యాణి, డెల్టా జిల్లా కార్యదర్శి, ఐద్వా -
ఎట్టకేలకు ఎంపీడీఓలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పదోన్నతులు లేకుండానే ఒకే పోస్టులో దీర్ఘకాలం పాటు పని చేసిన వారికి ఉపశమనం లభించింది. ప్రస్తుతమున్న నిబంధనలకు మినహాయింపులిస్తూ అడ్హాక్ తాత్కాలిక పద్ధతుల్లో 103 మంది ఎంపీడీఓ, డీపీఓలకు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల్లో పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 10 (ఏ) అనుగుణంగా ఎంపీడీఓలు/డీపీఓలను తాత్కాలికంగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కేడర్‌లో న్యాయస్థానం నిబంధనలకు లోబడి పదోన్నతులు కల్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పదోన్నతులపై హర్షం.. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పదోన్నతులు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ బి.శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతుల కోసం కృషి చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ నేతలు కేటీఆర్, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు పైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి నందకుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎంపీడీవో అవినీతిపై విచారణ చేపట్టండి
చిత్తూరు, రేణిగుంట: టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ మండల పరిషత్ నిధులను దోచుకుతింటున్న ఎంపీడీవో సుధాకర్‌రావు అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రేణిగుంట మండల వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు పట్టుబట్టారు. రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల మీట్‌కు వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది ఎంపీటీసీలు నల్లబ్యాడ్జీలను ధరించి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులమైన తమ హక్కులను ఎంపీడీవో కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలపై ఎంపీడీవో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన నోరు మెదపకపోవడంతో ప్రతిపక్ష ఎంపీటీసీలు సుజాత, జయలలిత, గంగారి సుజాత, అన్బుయాదవ్, నాగసుబ్రమణ్యంరెడ్డి, ముద్దురాయులు, నారాయణరెడ్డి, వెంకటయ్య, గంగమణి, జ్ఞానమ్మ మీటింగ్ హాల్లో నేలపై కూర్చుని ఎంపీడీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి మద్దతుగా పార్టీ మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సీఐ నాగరాజుయాదవ్, ఎస్ఐ మోహన్‌నాయక్ తమ సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులు, ఎంపీటీసీలతో చర్చలు జరిపారు. సుమారు గంటన్నర పాటు ఈ ఆందోళన జరిగింది. ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ లీలావతి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలను సమావేశానికి హాజరుకావాలని కోరారు. వారు ససేమిరా అనడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ స్వాతి ప్రకటించారు. దీంతో మండల స్థాయి అధికారులు వెనుతిరిగారు. అనంతరం పార్టీ నాయకులు ఎంపీడీవో కోసం జోలిపట్టి భిక్షం ఎత్తారు. -
కుర్చీ వదలా బొమ్మాళి..వదలా
నెల్లూరు, సైదాపురం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కుర్చీలాట సాగుతోంది. బదిలీ ఉత్తర్వులు అందినా ఇన్చార్జి ఎంపీడీఓ కుర్చీని వదలడం లేదు. అధికార పార్టీ నేతల సిఫార్సు తనకు ఉందని...మళ్లీ ఉత్తర్వులు తెచ్చుకుంటానని చెబుతూ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నూతన ఎంపీడీఓ చేసేది లేక జూనియర్ అసిస్టెంట్ సీటులో ఆశీనులయ్యారు. ఈ విచిత్రమైన పరిణామమం సోమవారం చోటు చేసుకుంది. సైదాపురం ఇన్చార్జి ఎంపీడీఓగా రాపూరు ఈఓపీఆర్డీ స్వరూపరాణి విధులను నిర్వహిస్తున్నారు. గత వారం ఎంపీడీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి బహిరంగంగా కార్యాలయంలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయులను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఎంపీడీఓ స్వరూపరాణిని జెడ్పీ సీఈఓ బదిలీ చేశారు. ఆమె స్థానంలో చిట్టమూరు ఈఓపీఆర్డీ వీరబ్రహ్మాన్ని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులతో వచ్చిన కొత్త ఎంపీడీఓ వీరబ్రహ్మానికి చేదు అనుభవం ఎదురైంది. బాధ్యతలను అప్పగించాల్సిన ఇన్చార్జి ఎంపీడీఓ స్వరూపారాణి అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం కార్యాలయానికి చేరుకున్న ఎంపీడీఓ వీరబ్రహ్మానికి ఎంపీడీఓ గదికి తాళాలు వేసి దర్శనమిచ్చాయి. ముందుగా కార్యాలయానికి చేరుకున్న బదిలీ అయిన ఇన్చార్జి ఎంపీడీఓ స్వరూపరాణి గదికి తాళాలు వేసుకుని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌డేకు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ సైతం గ్రీవెన్స్‌డేకు హాజరయ్యారు. గ్రీవెన్స్‌డేకు ఇద్దరు ఎంపీడీఓలు హాజరుకావడం చూసి మిగిలిన అధికారులు నవ్వుకుంటూ గుసగుసలాడుకున్నారు. బదిలీ ఉత్తర్వులనుపట్టించుకోని ఇన్చార్జి ఎంపీడీఓ సోమవారం ఉదయం 11:54 గంటలకు స్వరూపరాణిని బదిలీ చేసిన ఉత్తర్వుల కాపీ జెడ్పీ కార్యాలయం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి మెయిల్ ద్వారా వచ్చింది. అయినా ఇన్చార్జి ఎంపీడీఓ పట్టించుకోకపోవడం గమనార్హం. జూనియర్ అసిస్టెంట్ సీటులో నుంచి విధులు ఇన్చార్జి ఎంపీడీఓ కుర్చీని వదలకపోవడంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వీరబ్రహ్మం జూనియర్ అసిస్టెంట్ సీటులో నుంచే విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. బదిలీ అయినా స్వరూపరాణి కుర్చీని వదలకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఎంపీడీఓగా బాధ్యతలను చేపట్టిన వీరబ్రహ్మానికి ఇన్చార్జి ఎంపీడీఓ స్వరూపరాణి బాధ్యతలను అప్పగించ లేదు. ఇన్చార్జి ఎంపీడీఓ బాధ్యతలు అప్పగించకుండా విధులకు అంటకం కలిగించడంపై జెడ్పీ సీఈఓకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వీరబ్రహ్మాం సోమవారం తెలిపారు. అధికార పార్టీ నాయకుల మద్దతు ‘తనకు అధికార పార్టీ నాయకులు సిఫార్సు ఉంది. బదిలీ అయినా బాధ్యతలను ఎవ్వరికి అప్పగించొద్దని తనకు చెప్పారని, అందుకే బాధ్యతల నుంచి తప్పుకునే ఉదేశం లేదని’ బదిలీ అయిన ఎంపీడీఓ స్వరూపారాణి చెబుతుండడం గమనార్హం. ఓ బాధ్యత కలిగిన అధికారి ఉన్నతాధికారులు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హీరోలా ప్రశ్నిస్తే ఏ పనీ జరగదు
అనంతపురం, గుంతకల్లు రూరల్: ‘ఏదైనా పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులను ప్రాధేయపడాలి. అంతేకానీ హీరోలా ప్రశ్నిస్తే పనులేమీ జరగవిక్కడ. ముందు ఆఫీస్‌లో నుంచి కాలు బయటకు పెట్టి మాట్లాడు. లేదంటే పోలీస్ కేసు పెడతా’ అంటూ గుంతకల్లు ఎంపీడీఓ శంకర్ వ్యక్తిగత మరుగుదొడ్డి లబ్ధిదారుపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకెళితే.. మొలకలపెంట గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య ఈశ్వరమ్మ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేక పనులు మొదలుపెట్టకపోయారు. దీంతో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ శంకర్లు దగ్గరుండి వారి ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతలో నారాయణస్వామి అన్న మృతి చెందడంతో దాదాపు 40 రోజుల పాటు పనులను నిలిపివేయాల్సి వచ్చింది. జాబితా నుంచి పేరు తొలగింపు మరోవైపు త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మధ్యలోనే నిలిచిపోయినా వాటిని జాబితాలోంచి తొలగించి.. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించారు. నారాయణస్వామి తన అన్న మరణానంతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి మరుగుదొడ్డి పనులు పూర్తి చేశాడు. బిల్లు చేయలేం.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లు రాకపోవడంతో నారాయణస్వామి శుక్రవారం ఎంపీడీఓను కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించుకున్నాడు. నిర్మాణం జాప్యం జరగడంతో జాబితాలోంచి పేరు తొలగించామని, ఇప్పుడు బిల్లు ఏమీ చేయలేమని ఎంపీడీఓ అసహనంతో చెప్పారు. దగ్గరుండి మీరే నిర్మాణ పనులు ప్రారంభించి.. ఇప్పుడు పేరు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన నారాయణస్వామిపై ఎంపీడీఓ కోపోద్రిక్తులయ్యారు. నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ గద్దించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మంజూరు కాకపోతే ఏంటి పరిస్థితి అని డీలాపడిపోయిన నారాయణస్వామి ఒక అడుగు వెనక్కు తగ్గాడు. అప్పుడు ఎంపీడీఓ స్పందిస్తూ ‘ప్రాధేయపడి అడుక్కుంటేనే ఏదైనా పని జరుగుతుంది. గట్టిగా అడిగితే ఏ పనీ జరగదు’ అంటూ మందలించడంతో బాధితుడు నారాయణస్వామి కన్నీరుపెట్టుకుంటూ బయటకు నడిచాడు. -
21 ఏళ్ల తర్వాత..!
నల్లగొండ : ఎంపీడీఓలకు శుభవార్త.. పదోన్నతుల కోసం ఎప్పుడెప్పుడా అని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపికబురు అందించారు. ఎంపీడీఓల పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సీఎం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్టయింది. ఎంతోకాలం నుంచి ప్రమోషన్లు రాక ఎంపీడీఓలు అదే కేడర్లోనే రిటైర్డ్ అయి న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయమై ఎంపీడీఓలు సీఎంను కలిసి విన్నవించుకోవడంతో ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుని పదోన్నతుల ఫైల్‌పై సంతకం చేశారు. ఎంపీడీఓలతో పాటు కింది స్థాయి కేడర్‌కు కూడా పదోన్నతులు వస్తుండడంతో వారిలో ఆనందం నెలకొంది. ఎట్టకేలకు.. ఎంపీడీఓలు 21 సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి సమస్యను ఎవ రూ కూడా పట్టించుకోలేదు. అప్పుడు టీడీపీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఎంపీడీఓలు ఏళ్ల తరబడి అదే పోస్టులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఎంపీడీఓలకు ప్రమోషన్లు రా కపోవడంతో ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులకు కూడా పదోన్నతులు రాలేదు. వేతనం పెరిగి నా పదోన్నతులు రాకపోవడంతో భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 54 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరిలో సుమారుగా 20మందికి పైగా ఎంపీడీఓలు పదోన్నతులు పొందనున్నారు. డీఆర్డీఓ, జెడ్పీసీఈఓ, డిప్యూటీ సీఓ, అడిషనల్ డీఆర్డీఓలుగా వారి సీనియారిటీ బట్టి పదోన్నతులు లభిస్తాయి. కిందిస్థాయి ఉద్యోగులకూ పదోన్నతులు ఎంపీడీఓలకు పదోన్నతులు లభిస్తుండడంతో వా రి పోస్టుల్లోకి పదోన్నతులపై ఈఓపీఆర్డీ, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్లు పదోన్నతులు పొం దుతారు. కాగా ఖాళీ అయిన వీరి స్థానాల్లోకి సీని యర్ అసిస్టెంట్లు, వారి స్థానాల్లోకి జూనియర్ అసిస్టెంట్లు వీరి స్థానాల్లోకి రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లు అర్హతను బటి పదోన్నతులు పొందుతున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరుల్లో 150 మంది వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కోర్టు కేసుల ఉపసంహరణతో.. ఎంపీడీఓల పదోన్నతుల విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో 21 ఏళ్లుగా ప దోన్నతులకు అవకాశం కలగలేదు. అయితే ఎంపీడీఓ కేడర్‌లో ఉమన్ వెల్ఫేర్, ఈఓఆర్డీ డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా వచ్చిన వారు ఉన్నారు. ఈ మూ డు కేటగిరీల వారు ప్రమోషన్ల విషయంలో తమకే ముందు పదోన్నతులలో అవకాశాలు కల్పించా లంటే, తమకే ముందు కల్పించాలని పోటీపడి కోర్టుకు ఎక్కారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కేటగిరీల వారిని పిలిపించి చర్చలు జరిపారు. ఒక్కొక్క కేడర్ నుంచి వచ్చిన వారికి 1ః1 పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తానని చెప్పడంతో వారు సమ్మతించారు. కోర్టులో కేసులను ఉçపసంహరించుకుంటే పదోన్నతి కల్పిస్తానని చెప్పడంతో ఉద్యోగులు కేసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల పాటు ఎంపీడీఓల పదోన్నతుల నిరీక్షణకు తెర పడినట్లయింది. సీఎంకు కృతజ్ఞతలు 21ఏళ్ల పాటు పదోన్నతులు లేక ఎంతో ఆందోళన చెందాం. పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతామనే బాధ కలిగేది. ఎట్టకేలకు ముఖ్య మంత్రి కేసీఆర్ స్పందించి పదోన్నతులు కల్పించినందుకు ఎంపీడీఓల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – గోనె మోహన్‌రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
కలెక్టర్ల స్థానంలో వారే ఉంటారేమో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేక టీఆర్ఎస్ పార్టీనా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా.. ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యహారాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో జరగాలని.. కానీ పార్టీ నిర్వహించకూడదని భట్టి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలను ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రాంభించారని భట్టి అన్నారు. తన నియోజకవర్గంలోని కొత్త పంచాయతీ భవనాన్ని రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ప్రారంభించడమెంటని ప్రశ్నించారు. స్థానిక నాయకులు, అధికారులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కార్యక్రమం ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు నిర్వహించడాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీడీవోని బదిలీ చేయడం దుర్మార్గ చర్యగా భట్టి పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలన ఇలాగే సాగితే.. జిల్లాల్లో కలెక్టర్ల స్థానాల్లో టీఆర్ఎస్ అధ్యక్షులే పాలన చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో ఎంపీడీఓ
నర్వ (మక్తల్): మండలంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. బాధితులు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండగా ఒక్కొక్కరుగా ప ట్టుబడుతున్నారు. గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప ట్టుబడగా తాజాగా బుధవారం సాయంత్రం ఎం పీడీఓ డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెట్‌గా దొ రికిపోయారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ అందించి న వివరాల ప్రకారం.. నర్వ మండలం చంద్రఘ డ్ గ్రామానికి చెందిన గడ్డల బాల్‌రెడ్డి మే 16 2013 నుంచి 28 జూలై 2015 వరకు ఉపాధి హా మీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేశాడు. అ ప్పట్లో సామాజిక తనిఖీ అధికారులు అవినీతి జరిగిందని విధులనుంచి తొలగించారు. రెండేళ్ల త ర్వాత తిరిగి సీనియర్ మేటీగా నియమించారు. ప్రస్తుతం అతనికి రూ.3 వేల వేతనం అందుతోంది. గతంలో పనిచేసిన 23 నెలల పెండింగ్ వేతనానికి గాను కేవలం 11 నెలల వేతనం మాత్రమే అ« దికారులు అందించారు. మిగిలిన, ప్రస్తుతం పనిచేస్తున్న వేతనం కలిపి మొత్తంగా రూ.56 వేలు రావాల్సి ఉంది. వేతనానికి రూ.50వేలు డిమాండ్ ఈ విషయంపై ఎంపీడీఓను సంప్రదించాడు. అం దుకు ఆయన రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని రూ.15 వే లు ఇస్తానని, తిరిగి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా తీసుకోవాల ని ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు ఎంపీడీఓ పూర్తి అంగీకారం తెలిపారు. తనను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టిన ఎంపీడీఓను ఎలాగైనా పట్టించాలని అనుకుని పాలమూరులోని ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. మే 29న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా మే 30న ఏసీబీ అధికారులు మఫ్టిలో ఎంపీడీఓ కార్యాలయానికి వ చ్చారు. చివరకు బాల్‌రెడ్డి ఎలాగో అలా ఎంపీడీఓ ను రూ.10 వేలకు ఒప్పించాడు. డబ్బులతో ఎం పీడీఓను పట్టుకునేందుకు బుధవారం ఏసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్నం నర్వకు వచ్చి బాధితునితో ఫోన్ చేయించగా సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఎంపీడీఓ రాఘవ రూ. 10 వేలు తీసుకున్నా రు. వెంటనే అక్కడికి చేరుకున్న ఏసీబీ బృందం ఎంపీడీఓను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిని గదిలో ఉంచి విచారణ చేపట్టారు. -
విధుల్లో చేరేందుకు వచ్చిన ఎంపీడీఓకు షాక్
చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు ఎంపీడీఓగా విధుల్లో చేరేందుకు వచ్చిన సీహెచ్ కృష్ణకు స్థానిక ఒక వర్గం నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన విధుల్లో చేరాల్సిన ఎంపీడీఓ గదికి కావాలనే తాళం వేసి ఉండటంతో చేసేది లేక సూపరింటెండెంట్ గదిలోనే బాధ్యతలు స్వీకరించారు. మద్దిపాడు ఎంపీడీఓగా పనిచేస్తున్న సీహెచ్ కృష్ణ మద్దిపాడు మండలంలో రెగ్యులర్ ఎంపీడీఓగా పనిచేస్తూనే సంతనూతలపాడు మండలానికి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జెడ్పీ సీఈఓ నియమించారు. అప్పటి వరకు ఇన్చార్జి ఎంపీడీఓగా పనిచేస్తున్న తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ తాను విధులు నిర్వర్తించలేనంటూ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో మద్దిపాడు నుంచి నియమించారు. ఎంపీడీఓ విధుల్లో చేరేందుకు వచ్చే సమయానికి ఒక్క సీనియర్ అసిస్టెంట్ తప్ప మిగిలిన స్టాఫ్ ఎవరూ లేకుండా ముందుగానే వెళ్లిపోయారు. అంతే కాకుండా కొత్తగా ఎంపీడీఓ వస్తున్నట్లు ఎంపీపీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మండలంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో ఎంపీడీఓలు తరుచూ బదిలీలపై వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల్లో ఇప్పటి వరకు నలుగురు ఎంపీడీఓలు మారటమే ఆధిపత్యపోరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ ఇన్చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు బాలచెన్నయ్య నిర్వహించారు. ఆయనకు ముందు మాలకొండయ్య స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్లలో అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లి మరీ సస్పెండ్ చేయించారు. ఇలా వరుసగా నలుగురు ఎంపీడీఓలు మారడంతో స్థానిక నాయకులు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. పింఛన్ల సమస్య పరిష్కారం కొత్తగా విధు ్చyజ్చి చేరిన ఎంపీడీఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 543 పింఛన్లను త్వరలో పరిష్కరించి పంపిణీ చేస్తానని చెప్పారు. మద్దులూరు గ్రామానికి చెందిన ఒక సీనియర్ మేట్‌ను విధుల్లో చేర్చుకున్నారు. వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎంపీడీఓ తెలిపారు. -
కారులు..కాసులు
జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓ తన సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం పేరుతోనే ప్రతి నెలా రూ.35 వేలు డ్రా చేస్తున్నారు. ఈ వాహనాన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీస్తారంతే. ఆ ఎంపీడీఓనే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటారు. బినామీ పేరుతో అద్దె సొమ్మును ఎంచక్కా లాగేస్తున్నారు. ఆ సొంత వాహనంలో ఏ రోజూ క్షేత్ర పర్యటనకు వెళ్లిన దాఖాలాలు లేవు. అడపాదడపా సిబ్బందితో సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధి పథకం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కేవలం ఆ ఒక్క ఎంపీడీఓనే కాదు సింహభాగం ఎంపీడీఓలదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మందిదీ ఇదే తంతు. సాక్షి, మచిలీపట్నం: కష్టజీవుల ఆకలి తీర్చి, ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసులు కురిపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు దోచేయడం, దొంగ బిల్లులు పెట్టి స్వాహా పర్వానికి తెర తీస్తున్నారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇదిలా ఉంటే అందులో మరో కోణం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం కేటాయిస్తున్న వాహనాల వాహనాల అద్దె పేరుతో దోపిడీ దారి వెతుక్కున్నారు. నెల గడవడమే ఆలస్యం ఠంచనుగా ఎక్కడికక్కడ నిధులు డ్రా చేసేస్తున్నారు. అసలు వాహనాలనే అద్దెకు తీసుకోలేదు. అతికొద్ది మంది మాత్రమే అద్దె వాహనాలు తీసుకున్నారు. అయినా అద్దెకు వాహనాలు తీసుకున్నట్లు రికార్డులు చిత్రీకరించారు. కొందరు అతి తెలివి ఉపయోగించి.. నెలలో రెండు మూడు రోజులు మాత్రమే అద్దెకు తీసుకుంటున్నారు. వీరితోనే ఖాళీ బిల్లు తీసుకుని అద్దె డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదీ కథ! జిల్లాలో 49 మండలాలుండగా.. అన్ని మండాల్లో ఉపాధి పనులు సాగుతున్నాయి. ఎంపీడీఓలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధి పనులు తనిఖీ నిర్వహించేందుకు అద్దె ప్రాతిపదిక వాహన సౌకర్యం కల్పిస్తారు. ఇలా ఎంపీడీఓకు నెలకు వాహన అద్దెకు రూ.35 కేటాయిస్తారు. ఆ నిధులు వారు ఎప్పుడైన డ్రా చేసుకోవచ్చన్న వెసలుబాటు కల్పించారు. ఇలా 49 మండలాలుంగా 47 మండలాల్లో కార్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా అద్దె వాహనం ఏర్పాటు చేసుకోవాలి. సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చలామని చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు.. జిల్లా వ్యాప్తంగా 90 శాతానికిపైగా ఇదే తంతు సాగుతోంది. వాస్తవానికి ఎవరు ఏ వాహనాన్ని తీసుకున్నారు? ఆ యజమాని ఎవరు? డ్రైవర్ పేరు.. అతడి లైసెన్సు వంటి వివరాలన్నీ డ్వామా పీడీ కార్యాలయానికి పంపాలి. కానీ ఆ ఊసేలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో ఇదే నిదర్శనం. అద్దె వాహనాలు పెట్టారా? లేదా? అన్నది డ్వామా అధికార యంత్రాంగం కూడా కనీస శ్రద్ధ చూపలేదు. జిల్లా కేంద్రం నుంచి పీడీ, అదనపు పీడీలు, సహాయ పీడీలు క్షేత్ర పర్యటనకు వెళ్లే సంబంధిత ఉపాధి సిబ్బంది మాత్రమే వారి వెంట వెళ్తున్నారు. స్థానికంగా ఎంపీడీఓలు అసలు వెళ్లడం లేదు. ఉపాధి తమకు సంబంధం లేదన్న నిర్లక్ష్యం వైఖరి వీడలేదు. మండల స్థాయి పథక అధికారి (పీఓ) ఎంపీడీఓనే ఉంటారు. అందుకే ఆయన పేరుపైనే డిజిటల్ సంతకాల తాళం (డీఎస్కే) ఉంటుంది. ప్రతి బిల్లు చెల్లింపు ఎంపీడీఓ/ఏపీఓ ద్వారానే సాగుతుంది. నెలకు అద్దె రూ.35 వేలు... మండల స్థాయిలో ఉపాధి కీలక అధికారి ఎంపీడీఓనే. పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారి ఆయనే. ఆయన ఒక్కరే రెగ్యులర్ అధికారి. మిగిలిన ఏపీఓ, ఈసీ, టీసీ, సీఓ.. వంటి కేడర్ల సిబ్బంది మొత్తం హెచ్ఆర్ పాలసీ కింద ఉన్నారు. అందుకే డీఎస్కే పీఓగా ఉన్న ఎంపీడీఓకే ప్రాధాన్యం ఇచ్చారు. మండలం అంతా విస్తృతంగా తిరిగి కూలీలకు పని దినాలు కల్పించడం. వారి సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం.. వంటి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దె వాహన వసతిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత మండల సిబ్బందిని వెంట పెట్టుకుని మండలంలో తిరగాలి. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు నుంచి వాహన వసతిని సమకూర్చారు. ఈ ఏడాది మార్చి దాకా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు ఇచ్చారు. మొదట్లో రెండు నెలలకు ఒకేసారి రూ.70 వేలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా తప్పుకుండా డ్రా చేస్తేన్నారు. ఇలా ఒక్కో ఎంపీడీఓ అద్దె వాహనం రూపంలో రూ.లక్షలు డ్రా చేశారు. మొత్తంగా నెలకు రూ.16.45 లక్షలు అద్దె వాహనాలకే వెళ్తోంది. ఎంపీడీఓలు ఏ వాహనం వాడుతున్నారు. దీనికి సంబంధించి వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో నేరుగా సీఆర్డీ కార్యాలయం నుంచే అద్దె చెల్లించారు. ఈ వాహనాలకు సంబంధించి పీడీ కార్యాలయంలో ఏ వివరాలు లేవు. ఊసేలేని క్షేత్ర పర్యటన! ఉపాధి పనుల సీజన్ మొదలైంది. పల్లెలకు వెళ్లి కూలీలతో మాట్లాడాలి. గ్రామ సభలు నిర్వహించాలి. వలసలను నియంత్రించేలా పనులు చూపాలి. ఇందుకు సిబ్బందితో నిత్యం సమీక్షలు జరపాలి. జిల్లాలో ఎక్కువ శాతం ఎంపీడీఓలు ఇవేమీ పట్టడం లేదు. నివాస ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వెళ్లడం.. సిబ్బందిపై కర్ర పెత్తనం చెలాయించడానికే పరిమితం అయ్యారు. డ్వామా అధికారులు కూడా వారితో పనిచేయించడం లేదు. వారితో ఏనాడూ సమీక్ష జరపలేదు. అందుకే పని దినాలు కూడా రోజూ 60 వేలు కూడా దాటం లేదు. మరోవైపు.. వ్యక్తిగత పనులకే వాహనాలు ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం మంది ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటుండటం, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి రావడం.. తిరిగి వెళ్లిపోవడం.. దీంతోనే ప్రభుత్వం కేటాయించిన 2,000 కిలో మీటర్లు ముగుస్తున్నాయి. ఇక తమకు కేటాయించిన దూరం తిరిగేశామని మిన్నకుండిపోతున్నా. ఈ విషయమై డ్వామా పీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఏసీబీ వలలో ఎంపీడీఓ
త్రిపురాంతకం : స్థానిక ఎంపీడీఓ కె. మాణిక్యరావు ఏసీబీ వలలో చిక్కారు. పదివేలు నగదు తీసుకుంటుడగా పట్టుబడ్డారు. బిల్లులు ఇవ్వకుండా నెలలు తరబడి తిప్పుతుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దూపాడు పంచాయతీ పరిధిలని హసానపురం గ్రామానికి చెందిన ఎనిబెర భిక్షాలు ఫెర్క్యులేషన్ ట్యాంకు పనులకు గత ఏడాది మే నెలలో వర్క్ ఆర్డర్ తసుకుని మూడు నెలల వ్యవధిలో పూర్తి చేశాడు. దీనికి సంబంధించి రూ. 1.52 లక్షల మెటీరియల్‌కు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో ఉపాధి హామీ టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అధికారులు గత ఏడాది జూలై 23న బిల్లులు చెల్లించాలని రికార్డులు, ఎం బుక్‌లను అధికారులకు సమర్పించారు. అయితే అప్పటి నుంచి ఎంపీడీఓ.. భిక్షాలును బిల్లుల కోసం తిప్పుతూ కాలయాపన చేస్తున్నాడు. తాను పేదవాడినని లంచాలు ఇవ్వలేనని.. వడ్డీలకు అప్పుతెచ్చి ఈపని చేశానని ప్రాథేయపడినా తనకు పర్సంటేజీ ఇస్తేనే బిల్లు చేస్తానని ఎంపీడీఓ మాణిక్యరావు తేల్చి చెప్పాడు. దీంతో ఏసీబీని బాధితుడు ఆశ్రయించినట్లు డీఎస్పీ తోట ప్రభాకర్, సీఐ ప్రతాప్ తెలిపారు. అధికారులు పథకం రచించారు. భిక్షాలు పదివేల రూపాయలను (ఐదువందల నోట్లు) ఎంపీడీఓ మాణిక్యరావుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదుతో పాటు వర్క్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని, ఎంపీడీఓ మాణిక్యరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు ఇలా ఇబ్బందులు పెడుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. -
ఎంపీడీఓపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
సాలూరురూరల్ (పాచిపెంట): పింఛన్ల మంజూరు విషయమై టీడీపీ నాయకులు ఎంపీడీఓ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సూచించిన వారికి పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు కాకపోవడంపై నిలదీశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్‌దేవ్ సమక్షంలో గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ తతంగం చోటుచూసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం లేకుండా పింఛన్లు ఎలా మంజూరు చేస్తారని ఎంపీడీఓను టీడీపీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, ముఖే సూర్యనారాయణ, తదితరులు ప్రశ్నించారు. తాను నిబంధనల మేరకే పింఛన్లు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు శాంతించలేదు. మండలంలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, మీరు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం మమ్మల్ని పట్టించుకోవడం లేదని భంజ్‌దేవ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు మంజూరు చేయించుకోలేకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగ్గలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో భంజ్‌దేవ్ కూడా ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
పట్టుదలతో సాధించారు!
ఆళ్లగడ్డ: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షంషాద్‌బాను. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో బీసీ– మహిళ కోటాలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించారు. తద్వారా ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. షంషుద్దీన్, ఫాతిమాబీ దంపతుల కుమార్తె షంషాద్‌బాను. తల్లిదండ్రులు వంట మనుషులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పేదరికం కారణంగా షంషాద్‌బాను చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక ఎంపీపీ మెయిన్ స్కూల్, 6 నుంచి 10 వ తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థానిక రాఘవేంద్ర ఎయిడెడ్ కళాశాలలో చదివారు. అనంతరం కర్నూలులో డీఎడ్ పూర్తి చేశారు. 2000 నవంబర్‌లో నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. 2002లో వివాహమైంది. పెద్ద చదువులు చదివి ప్రజలకు సేవచేయాలన్న తలంపుతో ఉన్న షంషాద్‌బానుకు టీచర్ ఉద్యోగం పెద్దగా తృప్తినివ్వలేదు. దీంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. భర్త మహమ్మద్‌రఫీ కూడా ఆమెను ప్రోత్సహించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే విరామ సమయంలో గ్రూప్స్‌నకు సిద్ధమయ్యారు. 2010 గ్రూప్–1లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అంతటితో నిరుత్సాహ పడకుండా మళ్లీ 2011 గ్రూప్–1లో పోటీపడ్డారు. ఇందులో 363 మార్కులు సాధించారు. బీసీ మహిళ కోటాలో స్టేట్ రెండో ర్యాంకు సాధించి..ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ పోస్టుపైనా పెద్దగా ఆసక్తి లేదని, ఎలాగైనా ఆర్డీవో పోస్టు సాధించడమే తన లక్ష్యమని, అందుకు ఇప్పటి నుంచే మళ్లీ ప్రిపేర్ అవుతున్నానని షంషాద్‌బాను చెప్పారు. -
ఎంపీడీఓపై టీడీపీ నాయకుల దురుసు ప్రవర్తన
సోమందేపల్లి: సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదని మండల పరిషత్ అబివృద్ధి అధికారి లలితాబాయిపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎంపీడీఓపై టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, మాజీ సర్పంచ్ రంగప్ప, మహిళా ఎంపీటీసీ సభ్యురాలు భర్త బాబయ్య దౌర్జన్యంగా వ్యవహరించారు. అధికారి, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల మాటలతో మనస్థాపానికి గురైన ఎంపీడీఓ.. గ్రీవెన్స్‌లో అధికారుల సమక్షంలోనే కంట తడిపెట్టారు. తాను ఇక్కడ పని చేయలేనని,సెలవుపై వెళ్తానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు అక్కడికి చేరుకోవడంతో తగ్గిన టీడీపీ నాయకులు మెత్తబడ్డారు. అనంతరం అక్కడికక్కడే ఆమె మెడికల్ లీవ్‌పై వెళ్తున్నట్లు తహశీల్దార్ రామాంజనరెడ్డితో తెలిపారు. టీడీపీ మండల కన్వీనర్ గతంలోనూ పలు సమావేశాల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. -
ఎమ్పీడీఓపై టీడీపీ నేతల దౌర్జన్యం
-
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
పార్వతీపురం టౌన్: డివిజన్లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సబ్‌ప్లాన్ మండలాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎంపీడీఓలతో మలేరియా నివారణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గతేడాది దోమలపై దండయాత్ర చేసినా మలేరియా అదుపులోకి రాలేదని చెప్పారు. ఈ ఏడాది ముందుగానే మేల్కొవాలని ఆదేశించారు. ప్రతీ శనివారం డ్రై డే గా ప్రకటించామన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశవర్కర్, అంగన్వాడీ కార్యకర్త, పంచాయతీ సెక్రెటరీ, వెలుగు సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ లేదా గోపాలమిత్రలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి దోమల వ్యాప్తి కారకాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మురికినీరు, నీటి నిల్వలు, ఖాళీ కొబ్బరి చిప్పలు, టైర్లలో దోమలు వ్యాప్తి చెందుతాయని వాటి నివారణపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి విడత దోమల మందు పిచికారి వేగంగా పూర్తిచేయాలన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి దోమల ఆవాసాలను గుర్తించాలని చెప్పారు. గత ఏడాది 27వేల దోమ తెరలు పంపిణీ చేశామని, అవి వినియోగిస్తున్నారో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. విస్తృతంగా వైద్య శిబిరాలు మలేరియా గ్రామాలను గుర్తించి దోమల మందు పిచికారీ చేయాలని చెప్పారు. ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహించాలనీ, అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది మలేరియా మరణాలు జరగకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తప్పుడు నివేదికలిస్తే కఠిన చర్యలు : అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులపై సబ్‌ప్లాన్ మండలాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి కూలీల వేతనాలు పెంచడంతో తప్పుడు నివేదికలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు తప్పని సరిగా వేతనాలు పెంచడానికి కృషిచేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫొటోలను పంపించాలని చెప్పారు. గతవారం క్షేత్ర సహాయకులకు నిర్దేశించిన లక్ష్యాలు వచ్చే వారంలోగా పూర్తిచేయకపోతే విధులనుంచి తొలగిస్తామని హెచ్చరించారు. -
దోచిపెట్టేందుకేనా..?
బాగున్న భవనం కూల్చివేతకు రంగం సిద్ధం రూ.కోటితో రామగిరి ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా మంత్రి ఎత్తుగడ? రాతి కట్టడంతో పటిష్టంగా ఉన్న రామగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని కూల్చి.. దాని స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భవనం కూలే దశలో ఉందని కానీ, మరమ్మతులు అవసరం అని కానీ స్థానిక అధికారులు నివేదిక ఇవ్వకపోయినా నూతన భవనం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ వారికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఓ మంత్రి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. - అనంతపురం సిటీ జిల్లాలో వజ్రకరూరు, తలుపుల మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. తలుపులలో ఎంపీడీఓ కార్యాలయాన్ని రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. గతంలోనే నూతన భవనానికి నిధులు మంజూరైనా స్థానిక నేతల విభేదాల వల్ల నిర్మాణం ముందుకు సాగలేదు. ఇటువంటి వాటిపై దృష్టి సారించకుండా కాలం తీరని రామగిరి మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని కూల్చేసి కొత్తగా నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలారు. ఓ మంత్రి చొరవతోనే ఉన్నతాధికారులు ప్రణాళికలు తయారు చేయడంతో మూడు నెలల కిందట కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి. వారం రోజుల్లో కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి వర్గీయులు చెప్పారని మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరావును వివరణ కోరగా టెండరుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు పంపామన్నారు. వారంలోపు సమాచారం వస్తుందని, టెండరు ఎవరికి దక్కిందనేది అప్పుడు చెబుతామని అన్నారు. ప్రస్తుతమున్న భవనం శిథిలావస్థలో ఉందని, నూతన నిర్మాణం అవసరమని తాము ఎవరికీ నివేదించలేదని రామగిరి ఎంపీడీఓ పూల నరసింహులు తెలిపారు. ఒక వేళ పంచాయతీరాజ్ ఇంజినీర్లు ఏమైనా ప్రణాళిక పంపారేమో తమకు తెలియదన్నారు. వారంలోపు కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి నుంచి సమాచారం అందిందన్నారు. -
ఎంపీడీఓ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన
- జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్ ఉయ్యాలవాడ : జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి బీఆర్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కాగిత రహిత పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లోనే నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఉపాధి కూలీలకు మంచినీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎంపీడీఓ మహేష్‌కుమార్, ఈఓఆర్డీ పాపారాయుడు, ఏపిఓ గణేష్‌బాబు, ఉయ్యాలవాడ గ్రామ సర్పంచ్ మిద్దె సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
టైపిస్టును చెప్పుతో కొట్టిన ఎంపీపీ భర్త
-
టైపిస్టును చెప్పుతో కొట్టిన ఎంపీపీ భర్త
అనంతపురం: అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఇటీవల విజయవాడలో ఎంపీ కేశినేని నాని.. రవాణా శాఖ అధికారిని దుర్బాషలాడి అనంతరం ఆ అధికారికి క్షమాపణ చెప్పిన వైనం మర్చిపోకముందే అనంతపురం జిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది. కనగానపల్లెలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయ టైపిస్టు మూర్తిపై దౌర్జన్యం చేశారు. తాము చెప్పినట్లు వృద్ధాప్య పెన్షన్ల జాబితా తయారు చేయలేదనే కోపంతో టైపిస్టును ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారు. అడ్డుకోబోయిన ఎంపీడీఓ జలజాక్షిని దుర్భాషలాడారు. ఈ దౌర్జన్యంపై మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని వెనకేసుకొచ్చిన మంత్రి... ఓ సారీ చెప్పిస్తే సరిపోతుందని అనడంతో వారు ఖంగుతిన్నారు. కాగా, టీడీపీ నాయకుల భయంతో టైపిస్టు, ఎంపీడీఓలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ఈ ఘటనను వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడిని ఖండిస్తున్నామని, మంత్రి పరిటాల వ్యవహార శైలిని ముఖ్యమంత్రి పునపరిశీలించాలని ఆయన అన్నారు. -
‘తూర్పు’ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతాం
615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31కి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కలెక్టర్ అరుణ్‌కుమార్ పి.గన్నవరం : జిల్లాలోని 615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ వివరించారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో మిగిలిన 400 గ్రామాల్లో కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నూరు శాతం పూర్తిచేసి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై పర్యవేక్షణలో భాగంగా శనివారం ఆయన పి.గన్నవరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలోని ఆరు ఓడీఎఫ్ గ్రామాల్లో ఇంకా 1,100 మరుగుదొడ్లు నిర్మించాల్సిన నేపథ్యంలో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీహెచ్‌సీలో డాక్టర్ల నియామకానికి చర్యలు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టుల నియామకానికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానిక ఆస్పత్రిలోని వార్డులను, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు, ఓపీపై ఆయన ఆరా తీశారు. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రిని దత్తత తీసుకున్న అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. స్కానింగ్ మిషన్ ఉన్నా..టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి స్కానింగ్ తీయించుకుంటూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఎక్స్‌రే మిషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సీహెచ్‌సీకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం మంజూరైందని డిప్యూటీ సివిల్ సర్జన్ అప్పారి సూర్యనారాయణ కలెక్టర్‌కు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న బాలింతలతో ఆయన మాట్లాడారు. కలాం ట్రస్ట్ సేవలు అభినందనీయం జిల్లాలో బాగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పి.గన్నవరం సీహెచ్‌సీ ఒకటని కలెక్టర్ అన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్న కలాం చారిటబుల్ ట్రస్ట్‌ను ఆయన అభినందించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో ట్రస్ట్‌కు భాగస్వామ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటనన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, తహసీల్దార్ బి.బేబీజ్ఞానాంబ, ఆర్ఐ జి.ఉమాశంకర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వడదెబ్బ ప్రమాదాలపై అవగాహన కల్పించాలి కాకినాడ సిటీ : వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా అవగాహన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాలులో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలను వ్యాపార కూడళ్లల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్‌స్టేషన్, తదితర చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, మజ్జిగ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలల్లో తాగునీరు సరఫరా చేయాలని లోతట్టు ప్రాంతాల్లో తోపుడుబళ్లు, లోడింగ్ అన్ లోడింగ్ చేసే కార్మికులకు నీటి సరఫరాతో పాటు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీఎంఅండ్హెచ్ఓకు సూచించారు. డ్వాక్రా గ్రామైక్య సభ్యులు వేసవిలో తీసుకోవాల్సిన చర్యలు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటలలోపు పనులు పూర్తి చేయాలని వారికి తాగునీరు, మజ్జిగ టెంట్లు ఏర్పాటు చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్ఓ చెన్న కేశవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యద్దనపూడి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకం
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): సీనియర్ పాత్రికేయులు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశం హాలులో సీనియర్ జర్నలిస్ట్ యద్దనపూడి 6వ వర్ధంతి సభ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా మాణిక్యాలరావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సూర్యనారాయణ మూర్తి విగ్రహానికి స్వాంతంత్ర సమరయోధులు ప్రత్తి శేషయ్య, పాత్రికేయులు పూలమాలలు వేసి నివాళ్ళుర్పించారు. సభ కార్యక్రమంలో సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సూర్యనారాయణమూర్తి జ్ఞాపకాలు పచ్చగానే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు యద్దనపూడిని ఆదర్శంగా తీసుకుని వృత్తి నిబధతతో పనిచేయాలని సూచించారు. ప్రత్తి శేషయ్య మాట్లాడుతూ యద్దనపూడితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన పాత్రికేయునిగా యద్దనపూడి సమాజానికి సేవలందించారన్నారు. విద్యుత్, టెలికాం, రైల్వే, బస్ సౌకర్యాలు కోసం పోరాటాలు చేసి ప్రజలకు వాటి సేవలనందించారన్నారు. జిల్లా అధ్యక్షులు జీవీఎస్ రాజు మాట్లాడుతూ మంచి కుటుంబాన్ని సమాజానికి అందజేసిన మహానీయుడు సూర్యనారాయణ మూర్తి అన్నారు. జిల్లా తొలి సమావేశపు ప్రాంగణ వేదికకు యద్దనపూడి పేరు పెడతామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వానపల్లి సుబ్బారావు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టులకు సన్మానం: యద్దనపూడి స్మారక అవార్డులో భాగంగా సీనియర్ పాత్రికేయులైన శర్మ, ఐవీ సుబ్బారావు, వాసా సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. అంతేగాక గురునాథ్ ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2016 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మల్లేశ్వరపు స్వాతికి రూ 5, 116 లు, దుస్తులను కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పైలు శ్రీనివాస్, తేతలి గంగాధర రెడ్డి, చిట్యాల రాంబాబు, పాత్రికేయులు, కుటుంబ సభ్యులు యద్దనపూడి బాల త్రిపుర సుందరి, వైబిఆర్ లక్ష్మి, అన్నపూర్ణ, పద్మావతి, సుబ్బారావు, అనంత లక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఎంపీడీవోలకు హోదా
ఏలూరు (మెట్రో) : ఏళ్లు కాదు.. దశాబ్దాల నాటి కల సాకారమయ్యింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) చాలా ఏళ్లుగా ఒకే రకమైన విధులతో విసుగెత్తిపోయారు. ఉద్యోగరీత్యా ఎదుగూ బొదుగూ లేక వారిలో నిరుత్సాహం అలముకుంది. వారితోపాటు ఉద్యోగాలు పొందిన మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం పదోన్నతులు పొంది ఉన్నతాధికారులు కావడంతో ఎంపీడీవోల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 6 నుంచి 18 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి వివిధ కేడర్లలో హోదాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని ఎంపీడీవోల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెరగనున్న హోదా జిల్లాలో 48 మండలాలకు గాను 46 మండలాలకు పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు ఉన్నారు. కామవరపుకోట ఎంపీడీవో మరణంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడగా దెందులూరు ఎంపీడీవో ఇటీవల పదవీ విరమణ పొందారు. సాధారణంగా ఎంపీడీవోలకు జెడ్పీ డెప్యూటీ సీఈవో, ఏవోగా పదోన్నతులు కల్పిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతి ఇచ్చేందుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రయత్నించినప్పుడల్లా సీనియార్టీని నిర్ణయించడంపై వివాదాలు ఏర్పడి కోర్టులను ఆశ్రయించేవారు. దీంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జిల్లాలో 42 మంది ఎంపీడీవోలకు హోదా లభించనుంది. మూడు రకాల క్యాడర్లు ఎంపీడీవోల సర్వీసు ఆధారంగా ప్రభుత్వం హోదాలను నిర్ణయించింది. ఆరేళ్లు పూర్తిచేసిన ఎంపీడీవోలకు సహాయ సంచాలకుడు (ఏడీ), 12 ఏళ్లు పూర్తిచేసిన వారికి ఉప సంచాలకుడు (డీడీ), 18 ఏళ్లు పూర్తిచేసిన వారికి సంయుక్త సంచాలకుడు (జేడీ) హోదాలను ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో ఏడీ క్యాడర్లో 8 మంది, డీడీ క్యాడర్లో 27 మంది, జేడీ క్యాడర్లో ఏడుగురు పదోన్నతులు పొం దారు. మిగిలిన ఆరుగురికి ఆరేళ్ల సర్వీసు పూర్తికాలేదు. జేడీలుగా అందరూ మహిళలే.. ఇప్పటివరకూ మండలస్థాయిలో విధులు నిర్వహించిన మహిళా ఎంపీడీవోలు ప్రస్తుతం జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ హోదా పొందారు. వీరిలో గణపవరం ఎంపీడీవో జి.పద్మ, ఇరగవరం ఎంపీడీవో జి.విజయలక్ష్మి, మొగల్తూరు రమాదేవి, పెనుగొండ పద్మిని, ఉంగుటూరు జె.రేణుకమ్మ, వీరవాసరం పి.జగదాంబ, జీలుగుమిల్లి ఎంపీడీవో పీకే నిర్మలాదేవి జిల్లా స్థాయి పోస్టులు సాధించనున్నారు. -
డామిడ్.. కథ అడ్డం తిరిగింది
ఏలూరు (మెట్రో) ప్రభుత్వం అప్పగించిన పనులు చేయాలని, కనీసం ఇంకుడు కుంటలు తవ్వకాలలోనూ ఎంపిడిఒలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఇలా చేసుకుంటూ పోతే ప్రజలకు ప్రభుత్వ సేవలు ఏ విధంగా అందుతాయని కలెక్టర్ చెబుతుంటే... పనుల ఒత్తిడి తమపై పడుతోందనీ, విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, తాము ప్రభుత్వం అప్పగించిన పనులు చేయలేమనీ, ప్రతి వారం నిర్వహించే సమావేశాలనూ తగ్గించాలని ఎంపిడిఒలు అంటున్నారు. ఇలా అధికారులు, కలెక్టర్ మధ్య వైరం కొనసాగుతుంటే ఈ వైరాన్ని ఎంపిడిఒలకు అనుబంధంగా ఉండే ఒక జిల్లా స్థాయి నాయకుడు మాత్రం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఎంపిడిఒలు జిల్లా కలెక్టర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీవ్ర పతిఒత్తిడికి గురి చేస్తున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెలవులు ఇచ్చేందుకు కూడా వేధిస్తున్నారని, వారం వారం సమీక్షా సమావేశాలతో విసిగిస్తున్నారని ఎంపిడిఒలు కలెక్టర్‌పై తిరుగుబాటు ప్రకటించారు. అంతే కాకుండా మూకుమ్మడిగా సెలవుపై వెళ్లిపోతామంటూ బెదిరింపు దోరణులకూ దిగారు. అయితే దీనికి వెనుక ఉండి రెచ్చగొట్టింది మాత్రం సదరు అధికారులకు అనుబంధంగా ఉండే జిల్లాకు చెందిన ఒక నేత అనేది వెలుగులోకి వచ్చింది. సదరు నేత మాత్రం ఏమీ తెలియనట్లు అధికారులను రెచ్చగొట్టి విషయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధృష్టికి తీసుకొచ్చి కలెక్టర్‌ను బదిలీ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆమేరకు సదరు నేత నివాసంలో మంగళవారం రాత్రి మంతనాలు సాగించి ముందుగా ఎంపిడిఒలు నిరసన వ్యక్తంచేస్తే ఆతరువాత పంచాయతీ కార్యదర్శులను, అనంతరం తహశీల్దార్లను నిరసనకు సిద్ధం చేస్తానని ఎంపిడిఒలకు వివరించి ఆమేరకు ఆందోళనకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే బుధవారం ఆందోళనకు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎంపిడిఒల ఆందోళను విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నేరుగా జిల్లా పరిషత్‌కు చేరుకుని ఎంపిడిఒల సమస్యలను తెలుసుకున్నారు. ఈ విషయంపై కలెక్టర్ ఎంపిడిఒలతో మాట్లాడుతూ తాను సొంత పనులు చేయించడం లేదనీ, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందనీ, దీనిలో భాగంగా తాను కూడా జిల్లాలో పథకాలు అమలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎంపిడిఒలకు వివరించారు. అంతే కాకుండా ఇబ్బందులు పెట్టే సమీక్షలనే తొలగిస్తానని హామీ ఇచ్చారు. అయినా ప్రభుత్వం చేయాలనే పనులు చేయమని కోరితే ఎందుకు ఇబ్బందని ఎంపిడిఒలను ప్రశ్నించారు. అదే వేదికపై కనీసం ఇంకుడు కుంటల తవ్వించేందుకు ఎంపిడిఒలు ముందుకు రావడం లేదని ఇదెక్కడి పనితీరని విధుల్లో మరింత అశ్రద్ధ ప్రదర్శించే ఎంపిడిఒలను ప్రశ్నించారు. అంతే కాకుండా ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం కూడా చేయాలని సలహాలు సైతం ఇచ్చారు. దీంతో ఎంపిడిఒలు ఆందోళనను విరమించారు. బెడిసికొట్టిన నాయకుని ప్రయత్నాలు ః దీంతో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్లు, ఎంపిడిఒలు, కార్యదర్శులను ఆందోళన బాట పట్టించేందుకు సిద్ధపడుతున్న సదరు నేత ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నేతకు మింగుడు పడటం లేదు. దీంతో ఉన్నతాధికారితో మార్గం మూసుకుపోవడంతో చివరకు ఎంపిడిఒలతో రాజీ చేయించే పనిలో నిమగ్నమయినట్లు చెప్పుకొచ్చి, ఎంపిడిఒలను బుజ్జగించి, ఆందోళన విరమింపచేయించానంటూ సహచర నాయకులతో చెప్పుకొంటూ ఆందోళనను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అధికారుల ఆంతర్యం ఏమిటి ః ఈ తతంగం ఒక వైపు జరుగుతుంటే జిల్లాలోని అధికారులతో శుక్రవారం అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ప్రత్నిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞలో భాగంగా ఒక నెలరోజుల పాటు ఎవరు అవినీతిని దూరంగా పెడతారో వారే ప్రతిజ్ఞలో ఉండాలని కలెక్టర్ చెప్పడంతో కొందరు ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలు ప్రతిజ్ఞ చేయకుండానే సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో అసలు అధికారుల ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలని సహచర అధికారులు చర్చించుకోవడం సమావేశంలో కనిపించింది. ఏది ఏమైనా ఈ విషయంలో పనిచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా విధులు నిర్వహించాలని సూచించే కలెక్టర్‌ది తప్పా, లేక పనులు చేయలేకపోతున్నామని చెప్పే అధికారులది తప్పా, లేక వీరిని అడ్డం పెట్టుకుని ఆటలాడే నాయకునిది తప్పా అనేది జిల్లా ప్రజలే నిర్ణయించాలి. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి
తలకొండపల్లి: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఏంపీడీఓ శ్రీనివాసాచార్య వంట ఏజెన్సీలతో పాటు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని యడవల్లిలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, చెన్నారంలో ఆసరా పింఛన్ల పంపిణీతో పాటు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. చెన్నారం, చుక్కాపూర్లలోని ఉపాధి హామి పనులను పరిశీలించారు. యడవల్లిలో అంగన్వాడీ కార్యకర్త గైర్హాజరీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలో వారంలో రెండు గుడ్లు మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నారని తెలుసుకుని ఆగ్రహించారు. వారంలో తప్పనిసరిగా మూడు గుడ్లను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఉపాధి పనులను చేపట్టి, వ్యవసాయాభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. -
బ్యాంకే ఆసరా
ఆసరా పింఛన్‌దారులను నగదు రహిత లావాదేవీల బాట పట్టించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల ద్వారానే ఆసరా పింఛన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్న గ్రామీణాభివృద్ధిశాఖ సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఇటీవల ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ విధానమే మంచిదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఖాతాల నంబర్లు సేకరించాలని అధికారులను ఆదేశించారు. చేశారు. అరుుతే ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే సామాజిక తనిఖీ ఆపేశారు. వాస్తవానికి 2008-09లో మున్సిపాలిటీల్లో పింఛన్లు బ్యాంకుల ద్వారానే అందజేశారు. కానీ ఆ తర్వాత పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ ఇప్పుడు చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే చేయాలని నిర్ణయించారు. ఫించన్‌దారుల్లో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి..? ఎంతమందికి లేవు..? అనే దాని పై సమగ్ర సమాచారం సేకరించి ఖాతాలు కలిగిన వారి వివరాలను ఎంపీడీఓల లా గిన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తపాలా శాఖ ద్వా రానే ఫి ంచన్లు పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల సౌకర్యం లేని మోత్కూరు, చంద ంపేట, గుండాల, డిండి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల సహా యంతోనే ఫించన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ విధానం ఈ నెల నుంచి రద్ధు కానుంది. ఆగ్రా మాల్లో ఫించన్‌దారులను సమీప బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి ఈ నెల 10లోగా ఎంపీడీ ఓల లాగిన్‌లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల నుంచి ఆయా గ్రా మాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లోనే ఫించన్ సొమ్ము జమవుతుంది. మూడు జిల్లాల్లో 3.97 లక్షల మంది... నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి ఆసరా పింఛన్‌దారులు 3,97,650 మంది ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 1,78,313, సూర్యాపేటలో 1,29,8 54, యాదాద్రి జిల్లాలో 89,483 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా నల్లగొండ జిల్లాలో రూ.21.04 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.15.15 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.10.34 కోట్లు తపాలా శాఖద్వారానే చెల్లిస్తున్నారు. ఇక జనవరి నుంచి పింఛన్‌దారులకు బ్యాంకుల ద్వారానే చెల్లింపులు చేస్తారు. ఒక వేళ పరిస్థితులు అనుకూలించని చోట తపాలా శాఖ ద్వారా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘మోటకొండూరు’లో వద్దు ఆత్మకూరు(ఎం) : మోటకొండూరు మండలం మాకొద్దని మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ అయ్యప్ప స్వాములు ఆదివారం నిరసన తెలిపారు. ముత్తిరె డ్డిగూడేన్ని ఆత్మకూరు(ఎం) మండలంలో కలపాలని ఫ్లెక్సీ బ్యానర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువు రు మాట్లాడుతూ మోటకొండూరు మండలంలో తమ ను చేర్చడం వల్ల మా గ్రామ ప్రజలకు అనూకూలంగా ఉండదని, ఆత్మకూరు(ఎం) మండలం అయితేనే రాకపోకలకు అన్నిరకాలుగా అం దుబాటులో ఉంటుదన్నారు. ముత్తిరెడ్డిగూడెం గ్రామా న్ని వెంటనే ఆత్మకూరు(ఎం) మండలంలోనే చేర్చాలని కోరారు. -
హంతకులెవరు?
– వీడని రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య మిస్టరీ – ఎనిమిది నెలలైనా ముందుకు సాగని దర్యాప్తు అప్పట్లో తమ పరిధి కాదంటే తమది కాదని కేసు నమోదుకే తాత్సారం చేసిన పోలీసులు దర్యాప్తులోనూ స్తబ్దుగా ఉన్నారు. హతురాలి తరఫు నుంచి అడిగేవారు లేకపోవడంతో ఏమాత్రమూ కేసులో పురోగతి లేదు. కేసును మూసివేస్తారా.. లేక మిస్టరీని ఛేదించి హంతకులను పట్టుకుంటారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు ఏం జరిగిందంటే.. రామసుబ్బమ్మ యాడికి ఎంపీడీఓగా పని చేస్తూ 2014లో రిటైర్డ్ అయ్యారు. ఆమెకు భర్త లేరు. కూతురు శైలజ వివాహం కావడంతో మెట్టినింటికి వెళ్లిపోయింది. రామసుబ్బమ్మకు అనంతపురం నగర శివారులోని విద్యారణ్యనగర్‌లో సొంతిల్లు ఉంది. ఒక పోర్షన్లోæ ఆమె ఉంటుండగా, మరో పోర్షన్ అద్దె కిచ్చారు. 2016 మార్చి 24న రాత్రి నుంచి రామసుబ్బమ్మ ఇంట్లో టీవీ బాగా సౌండుతో ఆన్‌లో ఉంది. మరుసటి రోజు ఉదయం పక్కపోర్షన్లో ఉన్న వారు మోటార్ ఆన్ చేసేందుకని రామసుబ్బమ్మ ఉంటున్న పోర్షన్ వెనుకవైపునకు వెళ్లారు. మోటార్ ఆన్‌చేసి కిటికీలోనుంచి ఇంట్లోకి తొంగిచూడగా...రామసుబ్బమ్మ విగతజీవిగా పడి ఉంది. వెంటనే మృతురాలి బంధువులకు సమాచారం తెలియజశారు. వారు వచ్చి లోపలికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. రామసుబ్బమ్మ నోరు, ముక్కు భాగాల్లో తీవ్ర రక్తస్రావమైంది. ముందు రోజు (24వ తేదీ) సాయంత్రమే హత్య జరిగి ఉందని పోలీసులు నిర్ధారించారు. ఎవరి పని..? రిటైర్డు ఎంపీడీఓ రామసుబ్బమ్మది ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా... గేటులో నుంచి వారిని చూసి తెలిసినవారైతేనే తలుపు తీస్తుంది. లేదంటే లోపలి నుంచే మాట్లాడి పంపుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఆ రోజు ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఈ హత్య తెలిసిన వారిపనేనా? లేక నిందితులెవరైనా చాకచక్యంగా లోపలికి ప్రవేశించారా? అన్నది తెలుసుకోలేకపోతున్నారు. మామూలుగా రెండు చైన్లు, చేతివేళ్లకు రెండు ఉంగరాలు, చెవులకు కమ్మలతో కనిపించేది. హత్య జరిగిన రోజు రామసుబ్బమ్మ మెడలో ఎలాంటి బంగారు నగలూ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే నగల కోసమే ఈ ఘాతుకాని ఒడిగట్టి ఉండవచ్చునని పోలీసుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. త్వరలోనే ఛేదిస్తాం ఇటీవలే నేను ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పటి వరకూ శాంతిభద్రతలను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాం. రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య కేసును సవాల్‌గా తీసుకుంటున్నాం. త్వరలోనే ఈ కేసులో నిందితులను పట్టుకుంటాం. ఆమె బంధువులు, చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు సహకరించకపోవడం వలనే దర్యాప్తు ఆలస్యమవుతోంది. - శ్రీరామ్, ఎస్ఐ, నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్, అనంతపురం -
వివక్ష..! అవమానాలు!!
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఓ చిరుద్యోగి. పిచుకపై బ్రహ్మస్త్రం అన్నట్లుగా రాజకీయ నాయకులు, ఓ ఉన్నతాధికారి కత్తి కట్టారు. అవమానాలతో పాటు వేధింపులకు గురయ్యా.. న్యాయం చేయండని జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అధికారులందరినీ ఆమె అభ్యర్థించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సైతం సానుకూలంగా స్పందించినా జిల్లా యంత్రాంగం కరుణించలేదు. పైగా అట్రాసిటి కేసు ఉపసంహరించుకోకపోతే, ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేక, ఎటూ పాలుపోక, ఇంతకాలం చేసిన పోరాటం వృథా అవుతోందనే ఆవేదన ఓవైపు ఆమెను కృంగదీసింది. దీంతో మనసైథర్యం కోల్పోయినా ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వేధింపులు భరిస్తూనే.. ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ముద్దనూరులో ఎం. మేరి విధులు నిర్వర్తిస్తున్నారు. ముద్దనూరు ఎంపీడీఓ మనోహర్‌రాజు వేధింపులు అధికమయ్యాయని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. తుదకు ఇక్కడి నుంచి బదిలీ చేయండనీ స్వయంగా పీడీ రమేష్‌కు ఏప్రిల్ 21న రాతపూర్వకంగా మొరపెట్టుకుంది. ఆరు మండలాలను ఆఫ్షన్ ఇస్తూ బదిలీ చేయాలని అభ్యర్థించింది. ఎలాంటి తప్పు చేయలేదు, మీరేందుకు బదిలీ కావాలి, తామున్నామంటూ ఉన్నతాధికారులు అప్పట్లో నోటిమాటలు చెప్పారు. ఉపాధి కూలీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకపోగా, ఉన్నతాధికారులు సైతం అండగా ఉండటంతో ఓవైపు వేధింపులు భరిస్తూనే విధులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. చివరకు విసిగిపోయి జేసీ శ్వేతను జూన్ 2న ఆశ్రయించినట్లు తెలుస్తోంది. జేసీ సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గత జూన్ 24న ముద్దనూరు పోలీసుస్టేషన్లో ఎంపీడీఓపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని మేరి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అనంతరం వార్నింగ్‌లు.... ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి మేరికి వార్నింగ్‌లు ఆరంభమైనట్లు తెలుస్తోంది. కేసు ఉపసంహరించుకోకపోతే ఉద్యోగం మనుగడ కష్టమని హెచ్చరికలు తీవ్రతరమయ్యాయి. ఎలాంటి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదని మేరి గట్టిగా ఉన్నతాధికారుల ఎదుట వాధించినట్లు సమాచారం. మహిళగా మేరి తెగువను అభినందించాల్సి పోయి, శాఖపరంగా మరింత వేధింపులు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు స్వయంగా ఆమె తన ఆవేదన చెప్పుకున్నట్లు సమాచారం. ఒంటరి పోరాటం.. దక్కని న్యాయం ఏ తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్లు ఉన్నతాధికారులకు వివరించాను. అండగా ఉండాల్సిన వారు సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఎంతవరకూ సమంజసమంటూ నిలదీస్తూ జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ టెక్నికల్ అసిస్టెంట్ మేరీ పోరాటం చేయసాగింది. అత్యున్నతాధికారులతోపాటు ఎస్సీ,ఎస్టీ జాతీయ సభ్యురాలు కమలమ్మ, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావులను కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై వివరించారు. అయినా న్యాయం జరగకపోగా మరోమారు అవమానాలకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగం కావాలో? కేసు కావాలో తేల్చుకోవాలనే అల్టిమేటం జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని డ్వామా పీడీ రమేష్‌కు ఉదయాన్నే మేరీ ఫోన్లో మొరపెట్టుకున్నట్లు సమాచారం. అమె ఆవేదన విన్పించుకోకుండా ఫోన్ కట్ చేయడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో గత్యంతరం లేక కడపకు చేరుకుని ఎస్పీ కార్యాలయం బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. చిరుద్యోగి, అందునా మహిళ, పైగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఇంతటి వివక్షకు గురికావడం వెనుక ఓ ఎమ్మెల్యే అదృశ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏకపక్ష చర్యలను వీడాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
కామారెడ్డి రూరల్: గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణ పనులను వేగవం తం చేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డు, శ్మశానవాటికల పనులలతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభిం చాలని, హరితహా రంలో భాగంగా మొ క్కలు నాటిన కూలీ ల కు డబ్బులు చెల్లించాలని, మొక్క ల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏపీవో సాయిబాబా, టెక్నికల్ అసిస్టెంట్లు మహిపాల్‌రెడ్డి, నరేశ్, స్వప్న, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్ సదస్సుకు ఎంపీడీఓ
ఆమదాలవలస : ఢిల్లీలోని ఇండోశ్యాన్లో ఈ నెల 30న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ సదస్సు కు హాజరు కావాలని ఆమదాలవలస ఎంపీడీవో ఎం.రోజారాణికి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. దేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతి, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై సదస్సులో చర్చిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు హాజరు కావాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జవహార్‌రెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి ఆహ్వానాలు అందగా, శ్రీకాకుళం జిల్లా నుంచి తనకు అవకాశం వచ్చినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే స్వచ్ఛభారత్ సదస్సులో హాజరు కానున్నట్టు తెలిపారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటారా..
ఎంపీడీఓను ఫోన్లో నిలదీసిన గొట్టిప్రోలు వాసులు నాయుడుపేట: ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నగదును రికవరీ చేయాలని కోరితే చెప్పుతో కొడతామని బెదిరిస్తారా..అని గొట్టిప్రోలు వాసులు నాయుడుపేట ఎంపీడీఓ శివయ్యపై మండిపడ్డారు. గ్రామంలోని కూలీలందరూ మంగళవారం గ్రామంలోని రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవినీతి సొమ్ము రికవరీపై అక్కడి నుంచే ఎంపీడీఓకు ఫోన్ చేశారు. ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడంతో పాటు రికవరీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2014లో జరిగిన సామాజిక తనిఖీలో రూ.2 లక్షల కూలీల నగదును సీఎస్పీ స్వాహా చేశారని తేలినా ఎందుకు రికవరీ చేయలేదో చెప్పాలని కోరారు. వీటికి సమాధానం చెప్పకుండా తమను చెప్పుతో కొడతానని ఎంపీడీఓ శివయ్య బెదిరించాడని గొట్టిప్రోలు వాసులు వాపోయారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకుండా స్విచ్ఛాఫ్ చేశారన్నారు. తమ కాయకష్టాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకోమని కోరితే ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి
కుల్కచర్ల: మండలాభివృద్ధి అధికారిగా టీ.సుభాషిణి గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఉన్న ఎంపీడీఓ నిరంజన్ ఎనిమిది నెలల కిందట పదవి విరమణ పొందాడు .అప్పడి నుంచి ఈఓపీఆర్డీ సురేష్‌బాబు ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెలవులో ఉన్న ఎంపీడీఓ సుభాషిణి కుల్కచర్ల ఎంపీడీఓగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. -
సమస్యల పరిష్కారం
దేవరకద్ర : మండలంలోని గోపన్‌పల్లిలో మంగళవారం పల్లెవికాసం కా ర్యక్రమం నిర్వహించారు. జెడ్పీటీసీ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ భాగ్యల క్ష్మీతో పాటు పలువురు మండల అధికారులు గ్రామంలోని పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఇంకా విరివీగా మొక్కలు నాటి హరితహారాన్ని విజ యవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తన వంతు ప్రయత్నంగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనీఖీ చేసి రికార్డులను పరిశీలించా రు. పిల్లల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీని వాసరెడ్డి, ఎంపీటీసీ బాల్‌రాజు, సర్పంచ్ ఫకిరన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ సులోచన తదితరులు పాల్గొన్నారు. అడ్డాకుల : మండల పరిధిలోని మూసాపేటలో మంగళవారం పల్లెవికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి పెద్దమ ందడి శ్రీనివాసులు, ఎంఈఓ నాగయ్య, స్థానిక సర్పంచ్ భాస్కర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శెట్టిశేఖర్లు గ్రామంలో పర్యటించా రు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివిధ సమస్యలపై చర్చించారు. వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలపై ఏఓ శ్రీనివాసులు గ్రామస్తులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో సాక్షరభారత్ కోఆర్డినేటర్ రవీందర్‌నాయక్, కార్యదర్శులు పాండురంగయ్య, కుర్మ య్య, క్షేత్ర సహాయకుడు ప్రదీప్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
లేపాక్షి / చిలమత్తూరు : ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. గురువారం ఆయన లేపాక్షి, చిలమత్తూరు ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలతో పలు అంశాలపై చర్చించారు. సిబ్బంది కొరత ఉందని ఎంపీడీఓలు ఆయన దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన లేపాక్షిలో విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ప్రహరీ ఏర్పాటుపై ప్రత్యేక దష్టి సారిస్తామన్నారు. తాగునీరు, ప్రహరీ లేని పాఠశాలలను గుర్తించి మండల ఇంజనీర్లతో నివేదికను తయారు చేసి జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపి నిధులు మంజూరు కావడానికి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో పబ్లిక్ మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, నాగభూషణ, సర్పంచ్ నరసింహమూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు
• కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు • జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్నద్ధంగా ఉండండి కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు. అన్ని వివరాలతో.. ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం
శ్రీకాకుళం టౌన్ : –మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో ఎంతో ఆర్భాటంగా గోతులు తవ్వాం. వాటిని పూడ్చడానికి ఇంత వరకు అతీగతిలేదు. చెల్లింపులు లేకే అవి పూడ్చకుండా వదిలేసి కాగితాలపై లెక్కలేసుకుంటున్నాం..ఇదీ ఇంకుడు గుంతల పరిస్థితి. –జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు లక్షల మొక్కలు నాటేస్తామని చెప్పుకున్నాం. మాటలు నమ్మి మంత్రులు వచ్చి ఆ మొక్కలు నాటి లక్షల్లో మొక్కలు నాటేశామని చెప్పుకున్నారు. వాస్తవానికి ఇంతవరకు మొక్కలు నర్సరీల్లోనే ఉన్నాయి. కడియం నుంచి వచ్చే మొక్కలపై కాకిలెక్కలు చెబుతున్నారు. –వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి. ఈ నెల 25న కేంద్ర బృందం ఓడీఎఫ్ గ్రామాల పరిశీలనకు వస్తుంది. అప్పటికైనా ఇవి పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. –ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలరోజులు గడిచిపోయింది. ఫారం పాండ్స్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి ఉంటే రైతుల పొలాల్లో నీరు నిల్వ ఉండేది. సాగుకు తగినంత నీటిని వినియోగించుకునేందుకు వీలు లేకుండా చేశారు. –గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు ఇంకుడు గుంతలు కప్పే బాధ్యతలు అప్పగించండి. వారు చేయకపోతే సర్పంచ్, కార్యదర్శి, లబ్ధిదారుని సహాయంతో వాటిని పూర్తి చేయండి.. అంటూ కలెక్టరు పి.లక్ష్మీనరసింహం ఎంపీడీవోలు, నీటి యాజమాన్య సంస్థ ఏపీవోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులతో మండలాల వారీగా మంజూరు, లక్ష్యాలు, చెల్లింపులు తదితర అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు. ముందుగా ఓడీఎఫ్ గ్రామాలను శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమం వర్షాకాలం తర్వాత చేపడితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పథకం అమలులో వెనుకబడడానికి గల కారణాలు వెతికి త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు రోణంకి కూర్మనాథ్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ మోహనమురళి, డీఎఫ్‌వో శాంతిస్వరూప్, సామాజిక అటవీ శాఖాధికారి లోహితాస్యుడు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఎంపీవోలు, ఈసీలు పాల్గొన్నారు. -
మండల పరిషత్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
కొందుర్గు : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న మండల పరిషత్ కార్యాలయం భవనం కోసం శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ స్థలం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వీలైనంత త్వరగా నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు భవనం, మార్కెట్ గోదాముల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాదయ్య, తహసీల్దార్ పాండు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాజేష్‌పటేల్, రఘునాథ్‌రెడ్డి, రామచంద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్షన్ అయినట్టా.. కానట్టా?
* ఎంపీడీవో సస్పెన్షన్‌పై మండలంలో చర్చ * పత్రికల్లో వార్త వచ్చిన రోజే విధులకు హాజరు.. ముప్పాళ్ళ: మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.ఉషారాణి సస్పెన్షన్ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు తరచూ గైర్హాజరవడంతో పాటుగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి చర్యలపై రెండు రోజుల క్రితం కలెక్టర్ ఆగ్రహానికి గురై ఆమె సస్పెన్షన్‌కు ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అందిన ఫిర్యాదుల మేరకు జెడ్పీ సీఈవో ఎస్.వెంకటసుబ్బయ్యను విచారణకు పంపించారు. విచారణలో భాగంగా ఆయన కార్యాలయానికి వచ్చి సిబ్బందిని వివరాలు నమోదు చేసుకొని సంబంధిత రికార్డులను తనతోపాటుగా తీసుకెళ్లారు. ఎంపీడీవో ఉషారాణికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో రాత్రికి రాత్రే సస్పెన్షన్ రద్దయినట్టుగా స్థానిక నేతలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె విధులకు హాజరయ్యారు. సస్పెండ్ అంటూ పత్రికలలో వార్త వచ్చినరోజే విధులకు హాజరవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఎంపీడీవో సస్పెండ్ అయినట్టా...విధుల్లో ఉన్నట్టా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు ఉద్యోగవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీడీవోను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. సస్పెన్షన్ ఆదేశాలు అందలేదు : ఎంపీడీవో తనను సస్పెన్షన్ చేసినట్టు గాని, చర్యలు తీసుకుంటున్నట్టు గాని తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, రోజువారీ విధుల్లో బాగంగానే స్మార్ట్ సర్వేను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో టి.ఉషారాణి తెలిపారు. మండలంలో 288 మంది,104 కుటుంబాల వివరాలను సర్వేలో సేకరించామని చెప్పారు. అన్ని పంచాయతీల్లోను సర్వేను వేగవంతం చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
సస్పెండ్ అయినట్టా..విధుల్లో ఉన్నట్టా..?
ముప్పాళ్ళ (గుంటూరు): మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.ఉషారాణి సస్పెన్షన్ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తరచూ గైర్హాజరవడంతో పాటుగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం,ప్రభుత్వం నిర్వహించే ప్రజా సాధికార సర్వే నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి చర్యలపై కలెక్టర్ ఆగ్రహానికి గురై సస్పెన్షన్ కు ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అందిన ఫిర్యాదుల మేరకు జెడ్పీ సీఈఓ ఎస్.వెంకటసుబ్బయ్యను విచారణకు పంపించారు. విచారణలో భాగంగా ఆయన కార్యాలయానికి వచ్చి సిబ్బందిని వివరాలు నమోదు చేసుకొని సంబంధిత రికార్డులను తనతోపాటుగా తీసుకెళ్లారు. ఎంపీడీవో ఉషారాణికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో రాత్రికి రాత్రే సస్పెన్షన్ రద్దయినట్టుగా స్థానిక నేతలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె విధులకు హాజరయ్యారు. సస్పెండ్ అంటూ పత్రికలలో వార్త వచ్చినరోజే విధులకు హాజరవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఎంపీడీవో సస్పెండ్ అయినట్టా...విధుల్లో ఉన్నట్టా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు ఉద్యోగవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీడీవోను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. సస్పెన్షన్‌పై నాకెలాంటి ఆదేశాలు అందలేదు : ఎంపీడీవో తనను సస్పెండ్ చేసినట్టు గాని, చర్యలు తీసుకుంటున్నట్టు గాని తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, రోజువారీ విధుల్లో బాగంగానే స్మార్ట్ సర్వేను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో టి.ఉషారాణి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో మృతి
కనకదుర్గ వారధి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పమిడిముక్కల ఎంపీడీవో బసవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. గుంటూరులో ఇంటి నిర్మాణం పనులు చూచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ తన ఇంటికి వెళుతున్న బసవరాజును కనకదుర్గ వారధి వద్దకు రాగానే ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బసవరాజు తల బస్సు వెనక టైరు కింద పడడంతో హెల్మెట్ ఉన్నప్పటికీ తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బసవరాజు ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
ప్రతి గ్రామానికీ వంద పండ్ల మొక్కలు
ఎంపీడీఓ యాదయ్య కొందుర్గు : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించిన పండ్ల మొక్కలను పిల్లల్లా పెంచాలని ఎంపీడీఓ యాదయ్య సూచించారు. సోమవారం ఆయన ఎంపీటీసీలు, సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. ఇదివరకే 5వేల జామ, 2వేల బాదామి మొక్కలు పంపిణీ చేశామని, ప్రస్తుతం కార్యాలయానికి వచ్చిన 2500 కొబ్బరి మొక్కలను గ్రామానికి 100 చొప్పున అందిస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లో మామిడి, బొప్పాయి మొక్కలు కూడా వస్తాయని తెలిపారు. ఈ మొక్కలను నీటివసతి ఉన్న కుటుంబాలకే అందించాలని సూచించారు. ప్రతిమొక్కను పసిపిల్లవాడిని పెంచినట్లు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు అందించారు. గ్రామాల్లో ఇదివరకు నాటిన మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
చండూరు ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ
చండూరు : జిల్లాలో ఏ శాఖకూ నిధుల కొరత లేదని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 2013–2014, 2014–2015 సంవత్సరాల చెందిన వార్షిక నిధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖలకే మల్లిస్తున్నట్లు తెలిపారు. బీఆర్జీఎఫ్ నిధులు క్లోజ్ అయ్యాయని, 14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎస్‌ఎప్‌సీ నిధులు రాకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందన్నారు. గ్రామాల్లో వీధిలైట్ల బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 200 గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు కాగా మిగతా పంచాయతీల్లో 65 శాతం మాత్రమే వసూలైనట్లు చెప్పారు. దసరా తర్వాత పన్నులు వసూలు చేయనున్నట్లు వివరించారు. జిల్లా పరిధిలో 350 అంగన్వాడీ కేంద్రాలు, 151 గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యాదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శైలజ తదితరులు ఉన్నారు. -
హరితహారం టార్గెట్ పూర్తి చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా కేటాయించిన టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో బుధవారం రాత్రి ఎంపీడీఓలతో హరితహారంపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జఫర్‌గఢ్ వంటి మండలాలు 90 శాతం లక్ష్యాన్ని సాధిస్తే అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు మొక్కల పెంపకంలో ఎందుకు వెనకబడుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సెలవులు, పండుగ రోజుల్లో కూడా మొక్కలు నాటాలని సూచించారు. ఇకపై ప్రతి రోజు సాయంత్రం ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. కాగా, హరితహారం లక్ష్యసాధనలో పూర్తిగా వెనకబడిన తాడ్వాయి, గణపు రం ఎంపీడీఓలకు చార్జ్ మెమోలు ఇవ్వాలని జెడ్పీ సీఈఓను.. కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శ్రీనివాస్, సీపీఓ రాంచందర్‌రావు, సీఈఓ విజయగోపాల్, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రసాభాసగా ముగిసిన మండల సభ
మఠంపల్లి : స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఎంపీపీ అంజమ్మబుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కేవలం 10 నిమిషాల్లోనే రసాభాసాగా ముగిసింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీపీ మాట్లాడుతుండగా ఇటీవల మంజూరైన మాడా రుణాల వివరాలు తెలపాలని వైఎస్ ఎంపీపీ సయ్యద్బీబీతో పాటు మరో ముగ్గురు ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ, ఈఓఆర్డీ జానకీరాములుతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీనికి తోడు బయట ఉన్న పలువురు ఎంపీటీసీల భర్తలు, బయటి వ్యక్తులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు, వారి అనుచరులు కుర్చీలు విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ సమావేశం ముగిసినట్లుగా ప్రకటించి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనుల నిమిత్తం పూర్తిస్థాయిలో అధికారులు హాజరయ్యే పరిస్థితి లేనప్పటికీ సమావేశం నిర్వహించామని అన్నారు. సమావేశాన్ని ప్రారంభించకుండానే నలుగురు ఎంపీటీసీలు బయటి వ్యక్తులతో కలిసి గొవడ సృష్టించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ, ఎంపీటీసీలు సోవమ్మ, దస్రు, రంగమ్మ, సామ్యేలు, జయమ్మ, నాగు, బాల, ఈఓఆర్డీ జానకీరాములు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీటీ బాలాజీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలోకి వచ్చి గొడవకు దిగిన వ్యక్తులపై ఎంపీపీ అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యులంతా హాజరైనప్పటికీ సభను వాయిదా వేయడం సరికాదంటూ జెడ్పీటీసీ నీలా మంజీనాయక్, జెడ్పీకోఆప్షన్ సభ్యుడు రాజారెడ్డిలు అన్నారు. అనంతరం మాడా రుణాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఈఓఆర్డీకి వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయింపు సమావేశం ముగించి ఎంపీపీ ఛాంబర్లోకి వెళ్లగానే సమావేశంలో ఆందోళన చేసిన నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ మాట్లాడుతూ మండల పరిషత్‌లో గౌరవ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవల మంజూరైన మాడా రుణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించారు. -
సమస్యలు పరిష్కరించాలి
చివ్వెంల : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కల్పగిరి యశోద అధ్యక్షతన జరిగిన సర్వసభ్వ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్‌తండా, పాండ్యానాయక్‌తండా, బి.చందుపట్ల గ్రామాల సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నూతన బోర్లు మంజూరు చే యాలని సభకు దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా మండలంలో మలేరియా, డెంగీ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కుడకుడ గ్రామ ఎంపీటీసీ రత్నావత్ నాగరాజు కోరగా వైద్యాధికారి స్పందించి ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రోళ్లబండ తండా, వట్టిఖమ్మంపహాడ్ గ్రామాల్లోని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని సర్పంచ్ అనంతుల వెంకటమ్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బుసైదులు గౌడ్లు కోరారు. దీంతో ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మండల కేంద్ర శివారులోని ఊర చెరువు వరద కాలువను పూడ్చి వేసి కొంతమంది రియల్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారని మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్ సభ దృష్టికి తీసకురాగా సంబందిత వ్యాపారులకు నోటీసులు జారీచేస్తామని ఈఓఆర్డీ పేర్కొన్నారు. ఇంకా పలువురు సభ్యులు పలు సమస్యలను సభలో ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు రౌతు చొక్కమ్మ, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్రావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, పశు వైద్యాధాకారి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ పుష్ప, ఎఈలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్కరూ...
పోస్టులు ఖాళీ ఎంపీడీవోకు అదనపు బాధ్యతలు గంగాధర: సిబ్బంది లేక మండల పరిషత్ కార్యాలయం వెలవెలబోతోంది. జూనియర్ అసిస్టెంట్ ఒక్కరే ఇక్కడ అన్ని విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఒక ఉద్యోగి ఉండడంతో కార్యాలయంలోని పలు పనులు కుంటుబడుతున్నాయి. దీంతో పలు పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాక ప్రజాప్రతినిధులు తంటాలు పడుతున్నారు. సమయానికి పనులు జరగకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరు బదిలీపై, మరొకరు సెలవుపై వెళ్లడంతో ఉద్యోగుల కొరత ఏర్పడింది. మరోపోస్టు ఖాళీగా ఉండడంతో కార్యాలయం సిబ్బంది లేక బోసిపోతోంది. కార్యాలయం సిబ్బందికంటే అటెండర్లే ఎక్కువగా ఉన్నారు. మండలపరిషత్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో సూపరింటెండెంట్ ఎప్రిల్లో బదిలీపై వెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ మార్చి నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడు. టైపిస్ట్ పోస్టు సంవత్సర కాలంగా ఖాళీగా ఉంది. ఈవోపీఆర్డీ, జూనియర్ అసిస్టెంట్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఆర్డబ్లూ్యయస్ ఎఈలు ఉన్నా, ఈవోపీఆర్డీ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులే నిర్వరిస్తుంటారు. ఇంజినీరింగ్ అధికారులు తమ,తమ పనులకు సంబంధించి గ్రామాల్లో పర్యవేక్షిస్తుంటారు. ఎంపీడీవోకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎవోగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. అందరు పోగా ఇక్కడ మిగిలింది ఒక్క జూనియర్ అసిస్టెంట్ మాత్రమే. తానే అన్ని పనులు చేయాల్సి వస్తోంది. పట్టించుకోని జిల్లా పరిషత్ మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని నెలలుగా సిబ్బంది లేక వెలవెల బోతున్నా జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదు. సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేసే అవకాశం ఉన్నా మండల పరిషత్ సిబ్బంది, పాలకవర్గం చేసిన తప్పిదాలతో అధికారులు సిబ్బందిని ఇక్కడి పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించే మండల పరిషత్ కార్యాలయ భవనం శంకుస్థాపనకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడి సిబ్బందిపై గుర్రుగా ఉన్నారు. పాలకవర్గం సభ్యులు కూడా సిబ్బందిని ఈ కార్యాలయానికి బదిలీ చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. -
ఎంపీడీవోపై టీడీపీ నేత దాడి
తుగ్గలి: అంగన్ వాడీ భవనం బిల్లు చెల్లించడం లేదని ఎంపీడీవో పై టీడీపీ నేత దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలిలో గురువారం వెలుగుచూసింది. సింగిల్ విండో మాజీ డెరైక్టర్ వెంకటపతి స్థానికంగా ఓ అంగన్వాడీ భవనాన్ని నిర్మించాడు. దీనికి సంబంధించిన బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌పై కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. అయినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఇవ్వడం కుదరదని ఎంపీడీవో చెప్పడంతో.. కోపోద్రిక్తుడై ఆయన పై చేయి చేసుకున్నాడు. ఈ విషయం పై ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు ఎంపీడీఓల సస్పెన్షన్
ఒంగోలు: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎంపీడీవోలను సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ అధికారి టి.బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గుడ్లూరు మండల పరిషత్ అధికారి వసంతరావు నాయక్, గిద్దలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్‌లను సస్పెండ్ చేయాలనే కలెక్టర్ ఆదేశానుసారం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. గుడ్లూరు ఎంపీడీవో వసంతరావు నాయక్ గతంలో పుల్లల చెరువు మండలం ఈవోఆర్డీగా పనిచేశారు. ఆ సమయంలో కొమరోలుకు చెందిన రూ.6.85 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి నిధుల దుర్వినియోగం నిజమేనని స్పష్టం చేయడంతో వసంతరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిద్దలూరు ఎంపీడీవో రాజశేఖర్ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సుజాతశర్మ ఆగ్రహించింది. అయినా జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేశారు. -
మేళ్లచెర్వులో సర్వసభ్య సమావేశం
మేళ్లచెర్వు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వును కరువు మండలంగా ప్రకటించాలని ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, ఆసరా పింఛన్లు, కరువు ప్రభావంతో పశుగ్రాసం, దాణా, దొండపాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వివాదం, తాగు నీటి సమస్య, మరుగుదొడ్లు బిల్లులు, ఉపాధి పనులు, అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ శాంతకుమారి, డిప్యూటీ తహసీల్దార్ సంధ్యారాణి, మండల ఉపాధ్యక్షుడు మధిర సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ సైదానాయక్, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు, పీఆర్ ఏఈ కోక్యానాయక్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ, పశువైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డబ్లూ్య ఏఈఈ వెంకన్న, ఎంపీటీసీలు కొండా వెంకటేశ్వర్లు, వీరకుమార్, పుష్పావతి, గోపిశెట్టి లక్ష్మమ్మ, గుండెబోయిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్‌లు కొట్టె సైదేశ్వరరావు, రుక్కయ్యయాదవ్, దేశాల పద్మ, గోనె లక్ష్మీ, బిక్రి, భూక్యా సైదమ్మ పాల్గొన్నారు. -
ఎంపీడీవో బదిలీల్లో మార్పులు?
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ఇటీవల నిర్వహించిన మండలాభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. మెళియాపుట్టి ఎంపీడీవోగా పనిచేస్తున్న చంద్రకుమారిని తొలుత వీరఘట్టంలో నియమించగా... విజయనగరం జిల్లాలో పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవులో ఉన్న బి.అరుణను మందసకు కేటాయించారు. అయితే మెళియాపుట్టి ఎంపీడీవో చంద్రకుమారి వీరఘట్టం వెళ్లేందుకు సుముఖంగా లేక పోవడంతో ఆమెను మందసకు మార్చారు. అలాగే విజయనగరం జిల్లాలో పని చేసిన అరుణను వీరఘట్టంలో నియమించేందుకు జిల్లా పరిషత్ యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన ఆచార్యులను జిల్లాకు కేటాయించడంతో అతన్ని సోంపేట ఎంపీడీవోగా నియమించేందుకు నిర్ణయించారు. అతనికి పదోన్నతి కల్పించినా వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ మార్పులకు చైర్పర్సన్ పచ్చజెండా ఊపే అవకాశం ఉందని కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. -
రిటైరయ్యే వరకు ఎంపీడీఓనేనా..?
జిల్లాలో 38 మండల పరిషత్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 35 మంది ఎంపీడీఓలు విధులు నిర్వహిస్తున్నారు. 2001లో ఎంపీడీఓలుగా చేరిన వారు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. 2007, 2009 గ్రూప్ 1 పాసై ఎంపీడీఓలుగా ఉద్యోగాల్లో చేరిన వారూ అక్కడే ఉన్నారు. పదోన్నతుల విషయంలో ఎంపీడీఓలపై చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ‘ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీసు పూర్తయ్యేలోపు రెండు పదోన్నతులు కల్పిస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించడానికి టీడీపీ అధికారంలోకి రాగానే జీఓ ఇస్తాం’ అంటూ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినా ఫలితం లేకపోయింది. శ్రీకాకుళం టౌన్ : పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో మండల అభివృద్ధి అధికారిగా ఉద్యోగంలో చేరితే సర్వీసు పూర్తయ్యే వరకు అదే సీట్లో ఉండాల్సి వస్తోంది. సర్వీసు కమిషన్ ద్వారా ఉద్యోగంలో చేరినప్పడు మండల స్థాయి అధికారి పోస్టుగదా అని ఎంపీడీఓగా చేరితే ఇక అంతే. తన కంటే కిందిస్థాయిలో ఉన్న వారు పదోన్నతులు పొందుతూ పైకి ఎదిగిపోతుంటే... వీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. నిత్యం రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నా దానికి తగ్గ ఫలాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. కీలక బాధ్యతలు... జాబ్ చార్టు ఆధారంగా 29 ముఖ్య విధులునిర్వహించే ఎంపీడీఓలకు ప్రభు త్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కీలక భాగస్వామ్యం ఉంటుంది. ఏ పార్టీ వారు అధికారంలో ఉన్నా వీరిపై ఒత్తిళ్లు సహజం. మండల స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో కూడా వీరే కీలకం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు, నవనిర్మాణ యాత్రలు, ఇతర ప్రచార కార్యక్రమా లూ నిర్వహించారు. పైసా రాల్చకుండా ఈ పనులన్నీ ఎంపీడీఓల చేత చేయిం చుకుంటున్న ప్రభుత్వం వారి పదోన్నుతులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాహనమూ కరువే... మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న వారికి కనీస వసతులు కూ డా లేవు, జిల్లాలో వారి కంటే దిగువ స్థా యి ఉద్యోగులకు సైతం వాహన యో గం ఉంది. ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీఓలకు వాహన సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించింది. వెలుగులో కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏపీడీలకు సైతం వాహన సౌకర్యం కల్పించింది. కానీ ఎంపీడీఓలకు మాత్రం వాహనం ఇవ్వడం లేదు. ఎంపీడీలకు పదోన్నతులు కల్పించాలంటే జెడ్పీలో డిప్యూటీ సీఈఓ, ఎంఓ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, డుమా, డీఆర్డీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులుగా నియమించే అవకాశాలున్నాయి. అలాగే ఏడీ స్థాయిలో నియామకాలు కల్పించే అవకాశం ఉంటుందని వీరు ఆశ పడుతున్నారు. అభ్యర్థించినా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీడీఓల పదోన్నతులు కోరుతూ లిఖితపూర్వకంగా అభ్యర్థించాం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే పోస్టుల వెసుల బాటు ఆధారంగా పదోన్నతులు ఇచ్చేందుకు జీఓ జారీ చేసింది. అదే తరహాలో ఏపీలో జీఓ జారీ చేసి పదోన్నతులు ఇవ్వాలి. -కె హేమసుందర్, జిల్లా ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు సీనియారిటీ జాబితా ప్రకటించండి... పదోన్నతులు కల్పించడానికి ముందుగా సీనియారిటీల జాబితా ప్రకటించాలి. అలాగే పదోన్నతులకు అవసరమైన సర్వీసు రూల్స్ ఫ్రేం చేయాలి. ఆ తర్వాత సింగిల్ సిటింగ్ పదోన్నతులు ఇవ్వాలి. ప్రభుత్వం ఎంపీడీఓల విషయంలో నిర్ధిష్టమైన జీఓ విడుదల చేయలి. - కిరణ్‌కుమార్, ఎంపీడీఓ, లావేరు -
ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ధర్నా
చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృధా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎమ్మెల్యేకు ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే ధర్నాకు దిగారు. కోరం లేకున్నా ఎంపీడీవో పార్వతమ్మ మాత్రం ఈ సమావేశాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఎంపీడీఓల బదిలీలకు
► కొందరు అధికారపార్టీ నేతల్లో అసంతృప్తి ► యూనియన్ నేతకు ప్రాధాన్యంపై ఆగ్రహం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఎంపీడీఓల బదిలీలకు బ్రేక్‌పడింది.. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారితో పాటు పలు ఆరోపణలు, ఫిర్యాదులు.. తదితర కారణాలతో 25 మంది ఎంపీడీఓలను బదిలీచే స్తూ మంగళవారం జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంపీడీఓల బదిలీలు అధికారపార్టీకి చెందిన కొందరు నేతల్లో అసంతృప్తిని రాజేసింది. తమకు కావాల్సినవారిని ఇతర ప్రాంతాలకు పంపించడం, తమ కన్నా ఓ యూనియన్ మాటే చెల్లుబాటు అయిందన్న కారణాలతో ఎంపీడీఓల బదిలీలను తాత్కాలికంగా నిలిపేయాలని అధికారపార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఈ బదిలీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో అధికారులు బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అధికారపార్టీకి చెందిన కొందరు నేతలతో పాటు ఎంపీడీఓల్లో అసంతృప్తిని కలిగించింది. ప్రస్తుతం కీలకస్థానాల్లో ఉన్న అధికారులకే మళ్లీ కీలకస్థానాలు లభించడం వెనక ఏ మంత్రాంగం జరిగిందోన్న అంశం ఎంపీడీఓల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధుల అసంతృప్తిని తగ్గించేందుకు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీచేయకుండా ప్రభుత్వానికి ర్యాపికేషన్ రూపంలో పంపించడానికి సిద్ధమవుతున్నారు. ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి అధికారపార్టీ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరినీ సాధ్యమైనంత వరకు సంతృప్తిపరిచేలా బదిలీల్లో కూర్పుచేసినా చివరికి నిలిపివేయాలని పార్టీ నేతల నుంచే ఒత్తిడి రావడంపై ఒక ప్రజాప్రతినిధి కొందరు ఎంపీడీఓల ముందే ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీడీఓల బదిలీల వ్యవహారం జిల్లాలో రాజకీయ వేడిని కలిగించింది. ఎంపీడీఓల బదిలీల్లో యూనియన్ నేత ఒకరు కీలకంగా వ్యవహరించడం సైతం అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధుల్లో అసంతృపి రగిలించేందుకు కారణమైందని ప్రచారం జరుగుతోంది. సదరు యూనియన్ నేతకు బదిలీకి అర్హత లేకపోయినా పరిపాలన కారణాల పేరుతో తన నివాస ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్ ఇవ్వడం ఇటు అధికార పార్టీలోనూ అటు ఎంపీడీఓల్లోనూ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల్లో కొందరి పోస్టింగ్ సహేతుకంగా లేదని వాటిని మార్చాల్సిందేనని పట్టుబట్టడం విశేషం. దీంతో ఆఘమేఘాల మీద ఎంపీడీఓల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. -
లెక్కివ్వకుండా సంబరాలా?
సంక్రాంతి సంబరాలకు వెచ్చించిన డబ్బుకే దిక్కులేదు.. అప్పట్లో ఒక్కో ఎంపీడీఓ రూ.50 వేలు చేతి నుంచి పెట్టుకున్న వైనం ఆ డబ్బుల కోసం ఇప్పటికీ ఎదురు చూపు తాజాగా ఉగాది సంబరాలు నిర్వహించాలంటూ ఆదేశం మండలానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని సూచన స్మార్ట్ విలేజ్, జీపీడీపీ కార్యక్రమాల బకాయిలూ అందలేదు.. ఇలాగైతే ఎలా అంటూ లబోదిబోమంటున్న ఎంపీడీఓలు ప్రొద్దుటూరు : ఉగాది సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించాలని ఉన్నట్లుండి గురువారం ఆదేశాలు రావడంతో ఎంపీడీఓలు అసహనానికి గురవుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించాలని వైఎస్ఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేత నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఎంపీడీఓలు ఆందోళనకు గురయ్యారు. కనీసం రెండు రోజులు ముందైనా సమాచారం అందజేస్తే బావుండేదని, ఉన్నపళంగా చెబితే ఏర్పాట్లు ఎలా చేయాలని అధికారులు ఒకరినొకరు చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల్లో మూడు రోజుల ముందుగానే ఎంపీడీఓలకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉగాది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం గత నెల 28న జీఓ ఆర్టీ నెంబర్ 97ను జారీ చేసింది. అయితే ఇంత వరకు మండల అధికారులకు ఈ సమాచారం అందలేదు. గురువారం సాయంత్రం 3.30 గంటల నుంచి ఎంపీడీఓ, తహశీల్దార్లు, మండల స్థాయి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని ముందుగా ఆదేశాలు రావడంతో అధికారులంతా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఎంపీడీఓలకు ఉగాది ఉత్సవాల సమాచారం మెయిల్ ద్వారా అందింది. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేసి ఉత్సవాలు నిర్వహించమనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆదేశాలు అందుకున్న అధికారులు కొంత సమయం అయిపోగానే వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటికి వచ్చి ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఉగాది ఉత్సవాల నిర్వహణకు పురోహితుల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల ఆహ్వానం కోసం ఫోన్లలో బిజీగా గడిపారు. వాస్తవానికి తమ యూనియన్ బలంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, పక్క జిల్లాల్లో ముందుగా సమాచారం అందించగా, ఇక్కడ 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఈ సందర్భంగా ఓ ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇప్పటికే జిల్లాలో ఓ ఎంపీడీఓ మరో విభాగానికి వెళ్లారని, మరొకరు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఎంపీడీఓ తెలిపారు. గత ఏడాది ఎంపీడీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ ఆత్మహత్యాయత్నం చేసుకుని కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లిన తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవడంలో జాప్యం జరుగుతోంది. తమలో తాము మాట్లాడుకున్నా ఇంకా యూనియన్ను అధికారికంగా ప్రకటించలేదన్న విష యం కూడా చర్చకు వచ్చింది. ఉగాది ఉత్సవాల నిర్వహణకు మండలానికి రూ.20 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండలానికి రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, హంస ఉగాది పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తోపాటు ఇతర మండలాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లను ఆహ్వానించాలని తెలిపారు. ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనానికి రూ.5 వేలు, కళాజాత నిర్వహణకు రూ.5 వేలు, ఉగాది పచ్చడికి రూ.1000, మిగిలిన మొత్తం ఇతర ఏర్పాట్లకు కేటాయించారు. సంబంధిత బిల్లులు, ఓచర్లు కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని వారం లోపు డబ్బు విడుదల చేస్తామని సూచించారు. ఉగాది పురస్కారాలు ఏ విధంగా ఇవ్వాలన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. ఇప్పటికీ అందని సంక్రాంతి సంబరాల బకాయిలు ప్రభుత్వం జనవరిలో అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఇందులో భాగంగా జనవరి 11న గ్రామ పంచాయతీల్లో, 12న మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఎంపీడీఓలు నగదు బహుమతులు అందజేశారు. ఈ ప్రకారం మండలానికి రూ.25 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండల కేంద్రాలకు రూ.30 వేలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన, మేలు జాతి పశువుల ఎంపిక, గాలి పటాల పోటీలు, కబడ్డీ పోటీలు, వంటకాల పోటీలు, రంగవళ్లుల పోటీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రతి మండలానికి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఇంత వరకు ఈ డ బ్బు ఎంపీడీఓలకు అందలేదు. గత నెలలో స్మార్ట్ విలే జి, స్మార్ట్ వార్డు కార్యక్రమాలకు సంబంధించి మండల కేంద్రాల్లో ఎంపీడీఓల అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మండలానికి రూ.25 వేల వరకు కేటాయించారు. మండల స్థాయి అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.110 చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 15 మందిని ఆహ్వానించి శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఈ ప్రకారం ప్రతి సభ్యునికి భోజనంతోపాటు పెన్ను, పుస్తకం తదితర వాటికి రూ.150 చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం ఎంపీడీఓలు రూ.35 వేల వరకు ఖర్చు చేశారు. ఈ డబ్బును ఎంపీడీఓలే చేతి నుంచి ఖర్చు చేశారు. వీరికి ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు ఇవ్వకుండానే ప్రస్తుతం మళ్లీ ఉగాది ఉత్సవాలు అనే సరికి వారికి గుబులు పట్టుకుంది. -
సస్పెండ్ చేయిస్తా..
పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ఎంపీడీఓపై స్పీకర్ ఆగ్రహం చిట్యాల : స్థానిక ఎంపీడీఓ త్రివిక్రమరావుపై స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెదడు పని చేస్తలేదా.. డబ్బులు బాగా వసూలు చేస్తున్నావట.. కేసు పెట్టించి.. సస్పెండ్ చేయిస్తా’ అంటూ మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ రుణాల ఎంపికలో ఎంపీడీఓ, చల్లగరిగె కాకతీయ గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మధ్య దళారులతో కుమ్మక్కై పేదలకు అన్యాయం చేశారని నైన్పాక గ్రామానికి చెందిన ఈర్ల మల్లక్క, మరికొంత మంది స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆశవర్కర్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఐకేపీ సీఏ, నర్సరీ ఎంపికలో అధికారులు అర్హులకు అన్యాయం చేశారని పలువురు ఏకరువు పెట్టారు. దీంతో స్పీకర్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తీసుకుని అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు. -
పింఛన్లు అందలేదని గ్రామస్తుల ఆందోళన
పింఛన్లు అందడంలేదని ఆదిలాబాద్ జిల్లా ఇప్పెనెల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఇప్పనెల్లి గ్రామానికి చెందిన తమకు మూడు నెలల నుంచి పింఛన్లు ఇవ్వలేదని బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. తమకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. -
పని చేయకపోతే పంపించేస్తా
కార్పొరేషన్ల ఈడీలపై కలెక్టర్ అసంతృప్తి ఎంపీడీఓల పనితీరుపైనా ఆగ్రహం ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక శాఖల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష కర్నూలు: కొందరు అధికారులు పని చేయకపోవడం వల్లే అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని.. ఇకపై అలాంటి అధికారులను గుర్తించి జిల్లా నుంచి పంపించేస్తానని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. గురువారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న రుణాల మంజూరులో జాప్యం జరగకుండా అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీఓలదే కీలక పాత్ర అని, చాలా చోట్ల లబ్ధిదారుల జాబితాలు బ్యాంకులకు చేరవేయడంలో జాప్యం చేయడం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. కొన్ని బ్యాంకుల్లో లక్ష్యాలు తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారని ఎల్డీఎం నరసింహారావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపని బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికిచర్యలు తీసుకుంటామన్నారు. వేసవి దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చార్జిమెమోలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో కాకుండా మండల, జిల్లా కేంద్రాల్లో ఉండి పనిచేస్తామంటే సహించేది లేదన్నారు. నెలలో 21 రోజులు మండలాధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై ఏ పత్రికలోనైనా తాగునీటి సమస్యపై కథనాలు వచ్చాయంటే ఆ ప్రాంత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, మైనార్టీ కార్పొరేషన్ ఈఓ కరీముల్లా, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, డీపీఓ శోభాస్వరూప రాణి, మెప్మా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ సురేంద్రనాథ్, -
ఎంపీడీఓపై ఉపాధి కూలీల దాడి
కొడంగల్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి తగిన కూలి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఇన్చార్జి ఎంపీడీఓ వీరబ్రహ్మచారిపై కూలీలు దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో బుధవారం జరిగింది. పర్సాపూర్‌కి చెందిన సగం మంది కూలీలు ర్యాలపేట చెరువు మట్టిరోడ్డు పనులకు వెళ్లారు. వారం రోజుల పాటు పని చేశారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.10-12 మాత్రమే కూలి డబ్బులు వచ్చే విధంగా ఈజీఎస్ సిబ్బంది బిల్లులు తయారు చేశారు. దీంతో ఆగ్రహించిన కూలీలు బుధవారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు చావు డప్పు కొట్టుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లారు. వీరబ్రహ్మచారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పర్సాపూర్‌కి చెందిన రామకృష్ణ, జీడీ మల్లేష్, సాకలి మల్లప్ప, జీడీ మొగులప్పలపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ కార్యకర్తలా..? అధికారులా..?
భోగాపురం : మీరు అధికారులా...? అధికార పార్టీ కార్యకర్తలా...? మా వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయకుండా, మీరు ప్రభుత్వం తరపున మాట్లాడతారా... ఇలా అయితే అధికారులెవ్వరూ గ్రామాల్లోకి రాలేరు అని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు తహశీల్దార్ లక్ష్మారెడ్డిని నిలదీశారు. ముందుగా తూడెం గ్రామంలో జన్మభూమి సభ నిర్వహించారు. అనంతరం కవులవాడ పంచాయతీలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన ఎంపీడీఓ పద్మజ, వివిధ శాఖల అధికారులకు చుక్కెదురైంది. తూడెం కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు సభకు హాజరయ్యేందుకు ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజులు బసవపాలెం మీదుగా వెళ్తుండగా, కవులవాడ పంచాయతీలో సమావేశాన్ని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు అడ్డుకుంటున్నారని విషయం తెలుకుని వారిద్దరూ కవులవాడ గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సమావేశం జరగనివ్వకుండా వైఎస్సార్సీపీకి చెందిన ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. అయితే వారికి నచ్చజెప్పేందుకు ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. - టీడీపీలో చేరితే ఎయిర్‌పోర్టు రాకుండా చేస్తారా? మీ వెంట ఉంటే ఎయిర్‌పోర్టు ప్లానులో మీ భూములు తప్పిస్తామని మీరు కొంతమందితో ఫోన్లో మంతనాలు చేస్తున్నారు కదా... మీ వెనుక కాదు ఏకంగా టీడీపీలో చేరిపోతాం ఎయిర్‌పోర్టు రాకుండా చేయగలరా అని ఏఎంసీ చైర్మన్‌ను రైతులు, గ్రామస్తులు నిలదీశారు. భూములు, గ్రామాలు పోయి మేం ఏడుస్తుంటే మీరు రాజకీయం చేస్తారా అటూ మండిపడ్డారు. దీంతో కార్యక్రమాన్ని వారుుదా వేయూలని ఎంపీపీ బంగార్రాజు, ఎంపీడీఓ పద్మజకు చెప్పి వెళ్లిపోయూరు. కుర్చీలను గ్రామస్తులు తీసేయడంతో అధికారులు సుమారు రెండు గంటల పాటు వేదికపై నిలబడాల్సి వచ్చింది. అనంతరం అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠారుుంచి నినాదాలు చేశారు. కార్యక్రమంలో బెరైడ్డి ప్రభాకరరెడ్డి, దాట్ల శ్రీనివాసరాజు, కొల్లి రామ్మూర్తి, కొండపు లక్ష్మారెడ్డి, దల్లి శ్రీనివాసు, దారపు అప్పన్న రెడ్డి, శీరపు గురునాథరెడ్డి, అన్నమయ్య, కోరాడ అప్పన్న, మట్ట నర్శింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్ స్టేషన్‌కు పాముల బెడద
పాముల బెడదతో చేవెళ్ల పైర్‌స్టేషన్ సిబ్బంది భయపడిపోతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ క్వార్టర్స్‌లో ఉన్న పైర్స్టేషన్కు పాముల బెడద పట్టుకుంది. గత వారం రోజుల నుంచి ఫైర్ సిబ్బంది ఐదు పాములను చంపారు. స్వంత భవనంలో లేకపోవటంతో తాత్కాలికంగా ఎంపీడీఓ క్వార్టర్స్‌లో ఫైర్‌స్టేషన్ కొనసాగుతోంది. ఈ క్వార్టర్స్ శిధిల భవనాలతో నిండి ఉండటంతో నిత్యం పాములు స్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నాయి. స్వంత భవనం త్వరగా ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బందులు తప్పుతాయని, లేదంటే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. -
బదిలీలకు తెర
- 25 మంది ఎంపీడీఓలకు స్థానచలనం - పదోన్నతులు పొందిన 10 మందికి పోస్టింగ్‌లు - అయిష్టంగానే జెడ్పీ చైర్పర్సన్ ఆమోదం - ఎంపీడీఓల అసంతృప్తి.. మంత్రి హరీశ్‌ను కలిసే యత్నం సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓల బదిలీల వ్యవహారానికి తెరపడింది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే పదోన్నతులపై జిల్లాకు వచ్చిన పది మంది ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల ఫైల్‌పై జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అయిష్టంగానే సంతకం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల విషయమై జెడ్పీ చైర్పర్సన్, సీఈఓ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఒత్తిడి రావటంతో బదిలీల జాబితాపై ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. శివ్వంపేట, జిన్నారం, రామచంద్రాపురం, కొండాపూర్, జిన్నారం మండలాల్లో బదిలీలపై ఆమె కొన్ని సూచనలు చేయగా.. ఆ మార్పులు చేయకుండానే అధికారులు బదిలీ జాబితాను ఆమోదం కోసం బుధవారం సాయంత్రం పంపినట్లు సమాచారం. ఆపై బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. మరోపక్క బదిలీలపై ఎంపీడీఓలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం పలువురు ఎంపీడీఓలు నవాబ్‌పేటకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో శుక్రవారం కలిసేందుకు సిద్ధమవుతున్నారు. 25 మంది బదిలీ.. పదిమందికి పోస్టింగ్‌లు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారు. పదోన్నతి పొందిన 10 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఫిర్దోస్ అలి-మనూరు, జితేందర్‌రావు-పాపన్నపేట, బి.శ్రీరాములు-కౌడిపల్లి, ఆర్.మల్లేశం-టేక్మాల్, ఎం.ఎ.ముజీబ్-కల్హేర్, పి.బాల-చిన్నశంకరంపేట, రహ్మతుల్లాఖాన్-దుబ్బాక, ఎం.డి.జాఫర్-చిన్నకోడూరు ఎంపీడీఓగా పోస్టింగ్‌లు పొందారు. పదోన్నతి పొందిన జయలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె డీఆర్డీఏ ఏపీఓగా ఉన్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు ముగిసినా.. ఇంకా రామాయంపేట, చేగుంట, నంగునూరు, తొగుట, అందోలు, చిన్నకోడూరు, రామచంద్రాపురం మండలాల్లో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పారదర్శకంగా బదిలీలు చేపట్టామని సీఈఓ మధు తెలిపారు. -
నాచావుకు కారణం ఆమే..
నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలందుగ్యాల్ర గామంలో ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణం ఎంపీడీవో సరస్వతి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు... ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసే పరమేశ్(32) కూలీల పేర్లతో సుమారు రూ 32 వేలు డ్రా చేసుకున్నాడు. ఆడిట్ లో విషయం బయట పడటంతో ఎంపీడీవో సరస్వతి ఆదేశాల మేరకే తాను అలా చేసినట్లు పరమేశ్ బయటపెట్టాడు. అయితే తన పేరు ఎందుకు చెప్పావని ఎంపీడీవో సరస్వతి మంగళవారం పరమేశ్ ను మందలించినట్టు తెలిసింది. దీంతో పరమేశ్ అర్ధరాత్రి సమయంలో పురుగు మందు తాగి ఇంటి నుంచి పొలానికి వెళ్లి పడిపోయాడు. బయటికి వెళ్లిన పరమేశ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెల్లవారు జామున కుటుంబ సభ్యులు వెతగ్గా.. పొలంలో శవమై కనిపించాడు. పరమేశ్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. ఎంపీడీవో అరెస్ట్
పీఎం పాలెం (విశాఖ): ఓ మహిళను మోసం చేసిన ఎంపీడీవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని మాడుగుల ఎంపీడీవో ఆర్.సత్యనారాయణ గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు అడ్డదారులు తొక్కాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం వాల్తేరులోని స్వగృహంలో ఉన్న సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణ అరకులో ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో ఆఫీసు అటెండర్‌గా ఉన్న కొర్రా లక్ష్మితో సన్నిహితంగా మెలిగాడు. భర్త చనిపోయి, ముగ్గురు పిల్లలున్న లక్ష్మిని లోబర్చుకున్నాడు. అన్ని విధాలుగా చూసుకుంటానని చెప్పి ఉద్యోగం మాన్పించాడు. పది నెలల క్రితం అక్కడినుంచి వడ్డాది మాడుగులకు బదిలీ కావటంతో ఆమెను వదిలించుకోవాలని చూశాడు. తనకు అన్యాయం జరుగుతోందంటూ ఆమె పెద్దలను ఆశ్రయించింది లక్ష్మి. ఇక మరోదారి లేక రూ.3 వేలు నెలనెలా ఖర్చులకు పంపిస్తానంటూ బేరానికి వచ్చాడు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి మారికవలసలోని రాజీవ్ గృహకల్ప ప్లాట్‌లో ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా గత నెల 26న లక్ష్మి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పిన సత్యనారాయణ విశాఖలోని మానసిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించే ప్రయత్నం చేశాడు. ఆమె మానసికంగా ఆరోగ్యంగానే ఉందని తేల్చిన అక్కడి వైద్యాధికారులు సత్యనారాయణను మందలించి వారిని పంపించేశారు. అనంతరం తిరిగి వచ్చే క్రమంలో ఆమెను ఏదోలా వదిలించుకోవాలని సత్యనారాయణ ప్లాన్ చేశాడు. ఒక హోటల్ వద్ద ఆపి, భోజనం చేద్దామంటూ ఆమెను కిందికి దించాడు. ఆమె లోపలికి వెళ్లగా సత్యనారాయణ మాత్రం కారుతో ఉడాయించాడు. ఈ విషయాలపై బాధితురాలు మహిళా సంఘాల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గాడితప్పిన ‘పరిషత్’ పాలన
- 36 మండలాలకు 19 మందే ఎంపీడీఓలు - 16 ఈఓపీఆర్డీ పోస్టులూ ఖాళీ - ఏళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు - పదోన్నతులను గాలికొదిలిన ప్రభుత్వాలు ఇందూరు : గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే మండల పరిషత్ కార్యాలయాలు ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలు, అధికారులతో కళకళలాడిన ఈ కార్యాలయాలు ఇప్పుడు వెలవె లబోతున్నాయి. రెగ్యులర్ ఎంపీడీఓలు లేకపోవడం, నిధుల లేమితో పాలన గాడి తప్పింది. అధికారులు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 17 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కిందిస్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించలేదు. ఫలితంగా మండల పరిషత్‌ను అధికారుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఇన్‌చార్జ్‌లు పని భారం మోయలేకపోతున్నారు. జిల్లాలోని 36 మండలాల్లో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో ప్రస్తుతం 17 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీఓలున్నారు. సగం మండలాల్లో సూపరింటెండెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ ఎంపీడీఓలకు జిల్లా పరిషత్‌లో ఒకరికి డిప్యూటీ సీఈఓగా, మరొకరికి ఏఓగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఈఓపీఆర్డీ పోస్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మండలానికి ఒకరు చొప్పున 36 మండలాలకు 36 మంది రెగ్యులర్ అధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 16 మండలాల్లో ఈ పోస్టులు అధికారులు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ కార్యకలాపాలు చూడటం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధిహామీ, మరుగు దొడ్ల నిర్మాణం, మండల పరిషత్ సమావేశాల నిర్వహణ, ఇతర పనులతో పనిభారం తీవ్రమైందని ఇన్చార్జ అధికారులు వాపోతున్నారు. 718 గ్రామ పంచాయతీలు, 477 క్లస్టర్లకు 236 మంది మాత్రమే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. పదోన్నతులు లేకపోవడం కూడా ప్రధాన కారణం... ఎంపీడీఓ, ఈఓపీఆర్డీల కొరత వెనుక ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా దాదాపు 41 మంది సూపరింటెండెంట్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. నిజానికి 5 సంవత్సరాలు ఇదే పోస్టులో పనిచేసిన వారికి ఎంపీడీఓగా పదోన్నతి కల్పించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తాయనే ఆశతో పనిచేసిన సూపరింటెండెంట్లు చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. అయితే పదోన్నతుల విషయంతో పాటు తమకు గెజిటెడ్ హోదా కల్పించాలనే డిమాండ్‌తో పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కలుస్తూనే ఉన్నారు. కానీ,పదోన్నతులకు మాత్రం మోక్షం లభించడం లేదు. అతిగా ఒత్తిడి చేస్తే కోర్టులో కేసు ఉందని చెప్పి బుకాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ఎంపీడీఓ పోస్టులను సీనియార్టీ జాబితా ప్రకారం 35 శాతం సూపరింటెండెంట్లకు, 35 శాతం ఈఓపీఆర్డీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలి. 30 శాతం పోస్టులను నేరుగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. 1998 సంవత్సరం తర్వాత ఒక్కరికి కూడా పదోన్నతులు కల్పించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తే జిల్లాలో ఖాళీ ఉన్న 17 ఎంపీడీఓ, 16 ఈఓపీఆర్డీ పోస్టులు ఎప్పుడో భర్తీ అయ్యేవి. ఖాళీ అయిన ఈఓపీఆర్డీ, సూపరింటెండెండ్ పోస్టులు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతుల ద్వారా లభించేవి. పదోన్నతులు చేపట్టాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు చేర్చాలంటే మండల పరిషత్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి మండల పరిషత్‌తో ఎంపీడీఓతో పాటు, సూపరింటెండెండ్, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 36 మండలాల్లో 50 శాతం ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. తద్వారా పాలన సాధ్యం కావడం లేదు. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలు పదోన్నతుల విషయాన్ని మరిచిపోయాయి. ఏళ్లుగా పదోన్నతులు లేక ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. ప్రభుత్వం పదోన్నతులు వెంటనే చేపట్టాలి. - గోవింద్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఏంటి రాజకీయాలు చేస్తున్నారా?
మహేశ్వరం : ‘ఏంటి రాజకీయాలు చేస్తున్నారా? సమావేశంలో ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్లండి’ అని ఎంపీటీసీ సభ్యులపై ఎమ్మెల్యే తీగల ఆగ్రహంతో ఊగిపోయారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ సమావేశం హాలులో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామజ్యోతిలో తమకు ప్రాధాన్యత కల్పించి, గ్రామాల్లో చిప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టవద్దని పలువురు విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ప్లకార్డులతో నిరసన చేస్తున్న ఎంపీటీసీలపై ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు, ఘట్టుపల్లి ఎంపీటీసీ సలేంద్ర శ్రీశైలం గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తుండగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు చాలా ప్రాధాన్యత ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ ద్వారా కొన్ని మండలాలకే నీరు వస్తున్నాయని , పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా అని ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమవేశానికి ఎంపీటీసీలు పలువురు బహిష్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో ఆప్షన్ సభ్యుడు షేక్ అబుబాకర్ పాల్గొన్నారు. -
చచ్చినా వదలరు!
- మృతుల పేర్లపై పింఛన్లు స్వాహా - మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించని వైనం - వారి ఫొటోల పక్కన నమోదవుతున్న వేలిముద్రలు - పుష్ఠిగా ఆరగిస్తున్న పంచాయతీ కార్యదర్శులు - చోద్యం చూస్తున్న మైలవరం ఎంపీడీఓ - ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప : ఆ పండుటాకులు ఎప్పుడో కాలమైపోయినా, వారి పేరుతో నెల నెలా పింఛన్ మాత్రం వస్తోంది. వారి ఫొటోలు, పేర్ల పక్కన వేలి ముద్రలు వేసి పింఛన్ ఇప్పటికీ తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మృతి చెందిన వారు వచ్చి పింఛన్ తీసుకోవడం ఎలా సాధ్యమనే అనుమానం రావడం ఎవరికైనా సహజం. అయితే మైలవరం మండలంలో అధికారుల మాయాజాలం వల్ల ఈ అక్రమాల పరంపర కొనసాగుతోంది. మైలవరం మండలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ జాబితాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో మృతుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఐదారు నెలల క్రితం మరణించిన వారు సైతం నేటికీ పింఛన్ తీసుకుంటున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క వద్దిరాల పంచాయతీలోని దాదాపు 10 మంది చనిపోయిన వారి పేర్లతో ప్రతినెల పింఛన్లు డ్రా అవుతున్నాయి. బెస్తవేముల పంచాయతీలో కూడా ఇదే తంతు జరుగుతోంది. దన్నవాడ, గొల్లపల్లె, చిన్న వెంతుర్ల, చిన్న కొమెర్ల తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో చనిపోయిన వారి పేర్లు కనిపిస్తున్నాయి. ఇలా మండల వ్యాప్తంగా 50 మందికి పైగా మరణించిన వారి పేర్లతో ఆయా పంచాయతీ కార్యదర్శులు పింఛన్లను స్వాహా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వేలిముద్రల సాక్షిగా.... మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన పాణ్యం నారాయణమ్మ (పింఛన్ ఐడీ నెంబరు 486293) ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించింది. అప్పట్లో పోస్టల్ శాఖ వారు పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆమె పింఛన్‌ను నిలిపివేశారు. అయితే, మే నెలలో పింఛన్ పంపిణీ పగ్గాలు చేతబట్టిన ఆ పంచాయతీ కార్యదర్శి.. ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకున్నట్లుగా నారాయణమ్మ ఫొటో పక్కన వేలిముద్ర వేసి రూ.3 వేలు డ్రా చేసేశాడు. జూన్, జూలై మాసాల్లో కూడా బోగస్ వేలిముద్రలు వేసి ఠంచన్‌గా పింఛన్ డ్రా చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వికలాంగుడైన షట్కారి ఓబులేశు (ఐడీ నెంబరు 420693), షట్కారి నాగమ్మ (ఐడీ నెంబరు 420628)లు ఫిబ్రవరిలోనే మరణించారు. వీరి పింఛన్లు సైతం నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం మరణించిన మేకలదొడ్డి లక్షుమ్మ (ఐడీ నెంబరు 33052), కొండమ్మ (ఐడీ నెంబరు 280576)ల పేర్లు కూడా తాజా జాబితాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బెస్తవేముల పంచాయతీకి చెందిన తంబళ్ల ఈశ్వరమ్మ (ఐడీ నెంబరు 370199), బొందల నరసింహులు (ఐడీ నెంబరు 282149), పొమెర నిలకమ్మ (ఐడీ నెంబరు 279492)ల పింఛన్లు నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. వీరందరి మరణ ధ్రువీకరణ పత్రాలు ఆనాడే అందజేసిన ఆ పంచాయతీ కార్యదర్శికి పింఛన్ల జాబితాల నుంచి వారి పేర్లు తీసి వేయడానికి ఎందుకో మనసొప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులకు మొండిచేయి ఎందరో వృద్ధులు, వికలాంగులు సంవత్సర కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మైలవరం మండలం చిన్నవెంతుర్లకు చెందిన గిత్తల లక్ష్మన్నకు రెండు కళ్లు పూర్తిగా కనబడవు. వంద శాతం అంధ్వత్వం ఉన్నట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు కూడా. అన్ని ధ్రువపత్రాలతో పింఛన్ కోసం లక్ష్మన్న ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మైలవరం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఈయన గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క లక్ష్మన్నే కాదు...మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 15,500 మంది వృద్ధులు, 10 వేలకు పైగా వితంతువులు, ఐదు వేల మంది వికలాంగులు, 1200 మంది చేనేతలు ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అర్హులకు ఇవ్వకపోగా దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటున్నా చూస్తు మిన్నకుండిపోతోంది. పర్యవేక్షణ లోకపోవడంతోనే.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే పింఛన్ల జాబితా నుంచి సుమారు 44 వేల మంది పేర్లను తొలగించేశారు. విచారణ పేరుతో కొన్ని నెలలు కాలాయాపన చేసి వారిలో కొందరి పేర్లను తిరిగి జాబితాలో చేర్చారు. ఇలా తొలగిపోయి మళ్లీ చేరిన వారికి తొలిసారి రెండు నెలల పింఛన్ వచ్చింది. చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు రూ.1000 మింగేసి, రూ. వెయ్యి మాత్రమే అందజేశారు. ఇక కొత్తగా మంజూరైన పింఛన్‌దారుల నుంచి మొదటి నెలలో రూ.500 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతినెల వేల రూపాయల్లో ఆదాయం కళ్ల చూస్తున్నా అవినీతి కార్యదర్శుల ఆశ చావలేదు. ఏకంగా మృతి చెందిన వారి పేరు పక్కన వేలి ముద్రలు వేసుకుంటూ ఆ పాపం కూడా మూటగట్టుకున్నారు. ఇదంతా మైలవరం ఎంపీడీఓకు తెలిసినా ఆయన పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాడన్న విమర్శలున్నాయి. చర్యలు తీసుకుంటాం చనిపోయిన వారి స్థానంలో డైడ్ అని విధిగా కార్యదర్శులు నమోదు చేయాలి. ఎంపీడీఓల పరిధిలో ఇలాంటి తనిఖీ జరగాల్సి ఉంది. ఎవ్వరు కూడ ఫించన్ల పంపిణీ సందర్భంగా కార్యదర్శులకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి పేర్లతో పెన్షన్లు పొందడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - అనిల్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
మంత్రి చెప్పారని..నగదు డ్రా!
- కురుడు పంచాయతీ నుంచి రూ. 15లక్షలు విత్‌డ్రా - ఎంపీడీవో సొంత ఖాతాలోకి జమ - విచారణ చేసేందుకూ భయపడుతున్న జిల్లా అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారం ఉందికదా... ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారో... ఏమో మంత్రిగారు చెప్పారని ఓ పంచాయతీనుంచి మొత్తం రూ. 15లక్షలు డ్రా చేసుకుని తన సొంతఖాతాలో జమచేసుకున్నారు. ఇది సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళంజిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి ఎంపీడీఓ ఘనకార్యం. మంత్రిగారు వెనకున్నారని తెలుసుకున్న జిల్లా అధికారులు దీనిపై విచారణ చేపట్టేందుకు కూడా సాహసించడంలేదు. టెక్కలి నియోజకవర్గంలో సుమారు 120గ్రామాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచ్‌లున్నారు. అంతకుమించి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన సర్పంచ్‌లూ ఉన్నారు. రాజకీయ కక్షతో గత సెప్టెంబర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి చెందిన 18మంది సర్పంచ్‌లకు చెక్ పవర్ తప్పించేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం తీర్మానాలు చేపట్టి, పనుల వివరాలను స్థానిక అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేసి నిధుల్ని పక్కాగా వినియోగించుకోవాల్సిన స్థానిక సిబ్బంది ఇదే అదనుగా సర్పంచ్‌లు లేని చోట, చెక్ పవర్ రద్దయిన చోట తమ సత్తా చూపించుకుంటున్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి ఎంపీడీఓ బి.రాజులు కురుడు పంచాయతీ నిధులు రూ.15లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. అసలేమైందంటే... కురుడు సర్పంచ్‌గా వైఎస్సార్సీపీకి చెందిన రొక్కం సూర్యప్రకాశరావు(జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు)కు రాజకీయ కక్షతో గత ఏడాది సెప్టెంబర్‌లో చెక్‌పవర్ రద్దు చేయించారు. అనంతరం మంత్రి కనుసన్నల్లో మార్చిలో రూ. 3లక్షల 25వేల పంచాయితీ నిధులు తప్పించేశారు. తాజాగా జూన్ 11వ తేదీన మంత్రి అనుచరుడు బోర నాగభూషణరావు పేరిట స్థానిక ఎంపీడీవో రాజులు రూ.15లక్షలు డ్రా చేయడమే గాకుండా కోటబొమ్మాళిలోని ఇండియన్బ్యాంకులోని తన సొంత ఖాతాలో జమ చేయించుకున్నారు. ఈ విషయం ట్రె జరీలో సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల్ని అక్కడి ఎంపీడీవో 004287/846నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004288/847నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004289/849నంబర్ చెక్కుద్వారా రూ.2లక్షల 90వేలు, 004290/849 నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 30వేలు, 004291/850 నంబర్ చెక్ ద్వారా రూ.2లక్షలతోపాటు జూన్ 11, 2015త తేదీనే చెక్కులతో పాటు ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా మరో రూ.2లక్షలు డ్రా అయినట్టు జిల్లా ట్రెజరీ అధికారులు సహకార హక్కుచట్టం ద్వారా చేసిన వినతికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై ఎంపీడీవోను అడిగితే ‘మంత్రిగారు డ్రా చేసుకోమన్నారు..డ్రా చేసుకున్నా’అని చెప్పడం గమనార్హం. మంత్రి కుటుంబీకులకు ఈ మొత్తాన్ని చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని స్థానికులు కొందరు జూన్ 24న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జెడ్పీ సీఈవోకు పరిశీలించాల్సిందిగా పంపించారు. జెడ్పీ సీఈవో టెక్కలి డీఎల్పీవోకు విచారణ చేయాలని అప్పగించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతీ లేదు. అయితే చేయని పనులు చేయించినట్టు ఇప్పుడు రికార్డులు సృష్టించే పనిలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. పాత తేదీలతో అంచనాలు తయారు చేయించేసి, ఎంబుక్‌ల నిర్వహణ, పనులు చేపట్టినట్టు రికార్డులు తయారు చేయించడానికి అక్కడి ఇంజినీర్లపైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈవో, టెక్కలి డీఎల్పీవో, ఎంపీడీవోలను వివరణ కోరేందుకు సాక్షి పలుమార్లు ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదు. చర్యలెందుకు తీసుకోవట్లేదు? పంచాయితీ చట్టానికి విరుద్ధంగా డబ్బులు డ్రా చేయడం, నిధులు మళ్లించే అధికారం ఎంపీడీవోకు ఎవరిచ్చారు. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఎంపీడీవో ఇక్కడెన్నో దారుణాలకు ఒడిగడుతున్నా అడిగే నాథుడే లేడు. మొత్తం రూ.15లక్షలు మాయమైతే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావట్లేదు. - రొక్కం సూర్యప్రకాశరావు, సర్పంచ్, కురుడు గ్రామ పంచాయితీ -
పొదలకూరు ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు!
♦ మరుగుదొడ్లకు బలవుతున్న ఎంపీడీఓలు ♦ పనితీరు మెరుగుపర్చుకోకుంటే చర్యలు తప్పవంటున్న కలెక్టర్ నెల్లూరు(రెవెన్యూ) : మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి చూపని ఎంపీడీఓలపై చర్యలు మొదలయ్యాయి. మొన్న సైదాపురం ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ జానకి.. శనివారం ఏకంగా పొదలకూరు ఎంపీడీఓ శ్రీహరిని సస్పెండ్ చేయాల్సిందిగాఆదేశించారు. మరికొందరు అధికారులపైనా చర్యలకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ పెట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరుగుదొడ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో ఉన్నతాధికారులు, మంత్రులు జిల్లా అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ ఎం. జానకి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాను 8 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆత్మకూరు క్లస్టర్ సమావేశాన్ని స్థానిక గోల్డెన్ జూబ్లీహాలులో నిర్వహించారు. మండలాలవారీగా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తిచేసినా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపులు తదితర విషయాలపై ఎంపీడీఓలకు రెండు పర్యాయాలు సదస్సులు నిర్వహించారు. వారానికి ఒక పర్యాయం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి సమీక్షిస్తున్నారు. రెండు నెలలు సమయం ఇచ్చినా ప్రగతి కనిపించలేదు. నిర్మాణాలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. పొదలకూరు ఎంపీడీఓ రెండు నెలల నుంచి బిల్లులు చెల్లించకుండా రెండు రోజుల్లో 100కుపైగా బిల్లులు చెల్లించారు. ఈ విషయంపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23లోపు ఒక్క బిల్లు కూడా చెల్లించకపోవడంతో ఎంపీడీఓ శ్రీహరిని సస్పెండ్ చేయమని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల కిందట బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నా సైదాపురం ఎంపీడీఓను, ఆర్డబ్ల్యూఎస్ ఏఈని సస్పెండ్ చేశారు. అనేకమంది పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు నిలిపివేశారు. ఈ నెల 23లోపు బిల్లులు చెల్లించిన వారి జాబితా కలెక్టర్ చేతిలో ఉంది. ఆరు క్లస్టర్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. క్లస్టర్ సమావేశాలు పూర్తి అయ్యేటప్పటికీ ఎంతమంది ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండవుతారో చూడాలి. -
మండల పరిషత్‌లు ఖాళీ...!
నల్లగొండ : మండల పరిషత్ కార్యాలయాలకు శాశ్వత అధికారులు లేక ఇన్చార్జిల ఏలుబడిలో మగ్గుతున్నాయి. స్థానికంగా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఎంపీడీఓలు సొంత శాఖ సేవలపైన మొహం చాటేశారు. రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఎంపీడీఓలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోగా...మరికొంత మంది హైదరాబాద్ వదిలిరాలేక అక్కడే మకాం వేశారు. మరికొంత మంది పొరుగు శాఖల్లో పునరావాసం పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు, దీపం కనెక్షన్లు, ఆసరా పెన్షన్లు సామాన్య ప్రజలకు చేరకుండానే మధ్యవర్తులు ఎగురేసుకుపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెన్ సర్వీసు పేరుతో ఎంపీడీఓలు మండలాలు వదిలి పట్టణాల బాట పట్టడంతో వారి బాధ్యతలు సమీప మండలాల్లోని ఎంపీడీఓలు, సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకు అప్పగించారు. చం డూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా వెళ్లడ ంతో సంస్థాన్ నారాయణ్పురం ఎంపీడీఓకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోనే ఉం టూ మండలాల్లో పనిచేయడం కష్టమని భావించిన కొందరు జిల్లా నీటి యాజమాన్య సంస్థకు వచ్చి చేరారు. ఇప్పటికే జిల్లా పరిషత్ బదిలీలు లేక సిబ్బంది కొరతతో సతమతమవుతంటే పనిచేయాల్సిన ఎంపీడీఓలు మండలాలు వదిలి రావడంతో ఆ మండలాల్లో ప్రభుత్వ పరంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అభివృద్ధికి ఆటంకం... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంపీడీఓలు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లపై అదనపు భారం పడింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి ప్రతిబంధకం గా మారింది. ఈ మండలాల్లో ప్రత్యేక ంగా అదనపు అధికారులకు నియమిస్తే తప్ప మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినత స్థాయిలో ముందుకు సాగదనిపిస్తోంది. దీపం కనెక్షన్లు, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు ఎంపిక చేసే క్రమంలో కూడా ఇన్‌చార్జ్‌లు అనే క సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలైన డిండి, చింతపల్లి,మోతె, నాంపల్లి, నూ తనకల్ మండలాల్లో ప్రభుత్వ పథకాల అమలు అ యోమయంగా తయారైంది. ఈ మండలాల్లో ఎంపీడీఓలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల సమచారం కూడా ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి ఉంది. జిల్లా పరిషత్‌లో.. ఇక జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈఓ, డిప్యూటీ సీఈవో, ఏఓ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించకపోవడంతో రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈఓగా నియమించారు. కట్టంగూరు ఎంపీడీఓకు అదనంగా డిప్యూటీ సీఈఓ, తిప్పర్తి ఎంపీడీఓకు ఏఓ బాధ్యతలు అప్పగించారు. కాగా తిప్పర్తి ఎంపీడీఓ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నందున ఏఓ పోస్టు కూడా ఖాళీ కానుంది. రాజకీయ యుద్ధాలు... ఇప్పుడున్న ఎంపీడీఓలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో నియమించారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నేతల నుంచి అనేక ఒత్తిళ్లు వస్తుండడంతో మండలా కార్యాలయాల్లో రాజకీయ యు ద్ధాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు ఉన్న మండలాల్లో ఎంపీడీఓలకు, ఎంపీపీలకు మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. పీఏపల్లి ఎంపీపీ అక్క డి ఎంపీడీఓపై అనేక సమావేశాల్లో ఫిర్యాదు చేశారు. అలాగే గుర్రంపోడు, మోత్కూరు, గరిడేపల్లి, పోచంపల్లి మండలాల్లో ఎంపీడీఓలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య ఘర్షణలు పెచ్చుమీరాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలో రెండు గ్రూపులు ఉన్న మండలాల్లో అయితే అధికారులు విధులు వదిలి పారి పోయే పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎంపీడీఓలను మార్చాలని గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో రాజకీయ ఒత్తిళ్లు ద్వారా ఏలాగైన సరే వారిని బయటకు పం పించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ఎంపీడీఓలు లేని మండలాలు అనుముల, చింతపల్లి, డిండి, మోతె, నాంపల్లి, నిడమనూరు, నూత నకల్, రామన్నపేట, తుంగతుర్తి, యాదగిరిగుట్ట, మునుగోడు. ఈ నెలఖారుకు పదివీ విరమణ కారణంగా ఖాళీగా అయ్యే మండలాల్లో బొ మ్మలరామారం,మునగాల, తిప్పర్తి, ఆత్మకూరు (ఎం). ఫారెన్ సర్వీసు పేరుతో పొరుగు శాఖల్లో ఉన్న వారు.. ఎం.నాగేశ్వరారవు (సెర్ప్ హైదరాబాద్), పి.శైలజారెడ్డి (జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ), ఎం.కాళిందిని (డ్వామా, నల్లగొండ), శర్మద (డ్వామా, పశ్చిమ గోదావరి), పి.ఉమాదేవి (డీఆర్ డీఏ రంగారెడ్డి), ఏ.సునీత (స్టేట్ ఎలక్షన్ కమిషన్, హైదరాబాద్), రఘు రాం (జీహెచ్ఎంసీ, హైదరాబాద్), ఇందిర (డ్వామా, నల్లగొండ), చండూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు, సూర్యాపేట ఎంపీడీఓ మంత్రి పీఏగా వెళ్లారు. దీంతో పదవీ విరమణ అయ్యే మండలాలతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 59 మండలాలకు గాను 17 మండలాలు ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలో ఉన్నాయి. -
ఆ ఇద్దరి వల్లే ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నం
టీడీపీ కార్యకర్తల్లా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం దారుణం {పజల పక్షాన పనిచేసే అధికారులకు వైఎస్ఆర్సీపీ అండ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వినాయకంపై వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం కడప కార్పొరేషన్ : జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వేధింపులవల్లే లింగాల ఎంపీడీఓ మురళీమోహన్ మూర్తి ఆత్మహత్యాయత్నం చేశాడని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక ైవె ఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మురారిచింతలలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒక వర్గానికి ఎంపీడీఓ, మరో వర్గానికి తహశీల్దారు జన్మభూమి నిర్వహించారన్నారు. అందులో 90 శాతం ప్రజల అభీష్టాన్ని కాదని టీడీపీ నాయకుని ఇంటికి వెళ్లి రేషన్ తీసుకోవాలని చెప్పడం వల్లే వివాదం రేగిందన్నారు. ఆర్డీఓ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేయమని తహశీల్దారును ఆదేశించిన ఆర్డీఓ ‘వారి(టీడీపీ నాయకుని) ఇంట్లోనే రేషన్ పంపిణీ చేస్తారు, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు’ అని మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. అలా మాట్లాడిన అధికారిపై కాకుండా ప్రజలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. నీతి, నిజాయితీగా పనిచేసే అధికారులను టీడీపీ కార్యకర్తల్లాగా పనిచేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడి తేవడం దారుణమన్నారు. అలా పనిచేయని వారిని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు. కలెక్టర్, ఆర్డీఓలు కలిసి ఎంపీడీఓను సస్పెండ్ చేయడమే కాకుండా బెదిరింపులకు గురిచేస్తూ తీవ్రంగా వే ధించారన్నారు. వారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని ఎంపీడీఓ అందరికీ మెసేజ్‌లు పంపాడన్నారు. ఆ మెసేజ్ల్లోనే కలెక్టర్, ఆర్డీఓ శాసనమండలి డిప్యూటీ ఛెర్మైన్ ఎస్వీ సతీష్‌రెడ్డికి దఫేదార్లకంటే నీచంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడన్నారు. ఎంత మథనపడి ఉంటే ఆయన అలా చేశాడో అందరూ గ్రహించాలన్నారు. జిల్లా అధికారులంతా దీన్ని సమష్టిగా ఖండించాల్సిన అవసరముందన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాలని ఎవైరె నా అధికారులపై ఒత్తిడి తెస్తే వారికి అండగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రజల పక్షాన పనిచేసే అధికారులకు తాము ఎల్లప్పడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో నగర మేయర్ కె. సురేష్‌బాబు, మైదుకూరు, రాయచోటి, రైల్వేకోడూరు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనువాసులు, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, రాచమల్లు శివప్రసాద్రె డ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వీరందరూ జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని ఆయన బంగళాలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగాల ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులకు టార్గెట్‌గా మారారన్నారు. టీడీపీ నేతల సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓను సస్పెండ్ చేశారన్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కలెక్టర్ జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను కొట్టేసిందన్నారు. తమ ఉత్తర్వులపైనే హైకోర్టుకు వెళ్తావా.. నీ అంతు చూస్తాం అంటూ కలెక్టర్ , ఆర్డీఓ ఆయన్ను వేధించడంంతో ఎంపీడీఓ భయపడిపోయి ఈనెల 17న నిద్రమాత్రలు మింగి, ఇన్సులిన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఎంపీడీఓను వేధించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
లింగాల ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నం
కడప: కడప జిల్లాలో ఇటీవల సస్పెండైన లింగాల ఎంపీడీఓ మురళీ మోహన్ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్డీఓపై ఫిర్యాదు చేసినందుకు మురళీ మోహన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాంతో మనస్థాపం చెందిన మురళీ తన చావుకు ఆర్డీఓ, కలెక్టర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డే కారణమని పలువురికి ఎస్ఎంఎస్లు పంపి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ప్రస్తుతం మురళీ మోహన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడ్చల్ , శామీర్‌పేట్‌లలో.. మంత్రి హరీష్‌రావు పర్యటన నేడు
మేడ్చల్/శామీర్‌పేట్: రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గురువారం మేడ్చల్ మండలంలో పర్యటించనున్నారని బుధవారం ఎంపీడీఓ శోభ తెలిపారు. కండ్లకోయ పరిధిలోని మేడ్చల్ మార్కెట్ యార్డులో రూ.1.5 కోట్లతో నిర్మించిన 3 వేల మెట్రిక్ టన్నుల గోదాంను మంత్రి ప్రారంభించనున్నారు. జాతీయ రహదారి కండ్లకోయ చౌరస్తా నుంచి గుండ్లపోచంపల్లి వరకు రూ.65 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం మేడ్చల్ పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తారని ఎంపీడీఓ పేర్కొన్నారు. అలాగే శామీర్‌పేట్ మండలంలో గురువారం సాయంత్రం మంత్రి హరీష్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, లక్ష్మాపూర్ సర్పంచ్ కటికెల శ్యామల పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మాపూర్ పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులతో పాటు లక్ష్మాపూర్ నుంచి బొమ్మరాశిపేట్ వరకు నూతన రహదారి పనులను ప్రారంభిస్తారని వారు తెలిపారు. -
ఎంపీడీఓలదే బాధ్యత
- అంగన్వాడీల పనితీరుపై నివేదికలివ్వాలి - ఆర్అండ్బీ రోడ్లకు రూ.10 వేల కోట్లు - ఆర్అండ్బీ, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల - గజ్వేల్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన గజ్వేల్: అంగన్వాడీల పనితీరును ఎంపీడీఓలు సైతం పర్యవేక్షించవచ్చని రోడ్లు, భవనాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. అంతేగాక వారి పనితీరుపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలందించాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.1,600 కోట్లను కేటాయిం చినట్టు చెప్పారు. బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన నియోజక వర్గంలోని ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో పర్యటించారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.20కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొడకండ్ల-జగదేవ్‌పూర్ బీటీ డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అభివృద్ధికి బాటలు వేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారబోతున్నాయని తెలిపారు. మెరుగైన రోడ్ల ద్వారానే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే ఆర్అండ్బీ రోడ్లకు ఇటీవల రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మెదక్ జిల్లాకు రూ.1,100 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ పథకంతో పల్లెల్లోనూ మంచి నీటి సమస్య తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా మారబోతున్నదన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, గ్రామ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మీరే బాసులు
- ఎంపీడీవోలతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ - ఉపాధిహామీ పనులు పారదర్శకంగా ఉండాలి -జిల్లాలో జలప్రభ కింద 11 వందల బోర్లు - 200 మంది వికలాంగులకు పింఛన్లు అందడం లేదు - అనర్హులు 1200 మంది పింఛన్లు పొందుతున్నారు ఏన్కూరు: మండలంలో జరిగే ఉపాధిహామీ పనులకు ఎంపీడీఓలే బాసులని, నిత్యం పరివేక్షిస్తూ పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలంబరితి అన్నారు. స్థానిక క్లష్టర్ స్థాయి జీవనోపాదుల వనరుల కేంద్రంలో జిల్లాలోని ఎంపీడీఓలతో గురువారం ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పనుల్లో జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు నత్తనడక నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయూలన్నారు. వచ్చే నెల నుండి ఉపాధిహామీ కూలీలకు బ్యాంకుల ద్వార చెల్లింపులు చేస్తామన్నారు. వారి అకౌంట్లో కూలి డబ్బులు జమఅవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీల బీడు భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు ఇందిర జలప్రభ పథకం చేపట్టినట్లు వివరించారు. ఈ పథకం క్రింద 11 వందల బోర్లు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 500 బోర్లు వేశామని, మిగతా బోర్లు కూడ త్వరలో వేయనున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పనుల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా తాగునీరు, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలలో నిర్వహించే గ్రామసభలలో అర్హులైన పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఉంచాలన్నారు. జిల్లాలోని అర్హులైన వికలాంగులు 200 మందికి పింఛన్ రావడం లేదన్నారు. అనర్హులైన 1200 మందికి పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. దీనిని పరిశీలించాలని ఉన్నాతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పింఛన్ పంపిణీపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల నుండి బ్యాంకుల ద్వార పంపిణీ చేస్తామన్నారు. వన నర్సరీని పరిశీలించిన కలెక్టర్ స్థానిక ఐకేపీ కార్యాలయం ఎదుట ఉపాధిహామీ పథకం కింద పెంచుతున్న వన నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో ఎండిపోయిన టేకు మొక్కలపై సిబ్బందిని ప్రశ్నించారు. ఎండవేడిమి వలన మొక్క ఎండిపోయిందని అధికారులు సమాధానం చెప్పారు. మొక్కలు ఎండిపోకుండా తగిన జాగర్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డ్వామా పీడీ జగత్‌కుమార్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళిధర రావు, డిసిహెచ్ఎస్ ఆనందవాణి, ఉపాధిహామీ నాణ్యత పరిశీలానాధికారి టి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. -
చింతమడకలో బీడీ కార్మికుల ఆందోళన
అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు సిద్దిపేట రూరల్: అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి అందడంలేదంటూ గ్రామానికి వెళ్లిన అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్న సంఘటన సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించడానికి వెళ్లిన ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డిని బీడీ కార్మికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీడీ కార్మికులుగా పని చేస్తున్న తమకు జీవన భృతి కల్పించకుండా ఆనర్హులకు అందిస్తున్నారన్నారు. గ్రామంలో సుమారు 500మంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ వంద మందికి మాత్రమే జీవన భృతి మంజూరు చేశారన్నారు. అర్హులైన వారందరికి జీవన భృతి కల్పించాలన్నారు. అనంతరం ఓఎస్డీ బాల్‌రాజు మాట్లాడుతూ ఇంట్లో ఒకరికి ఏదైనా పింఛన్ వస్తే జీవన భృతికి అనర్హులన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జీవన భృతి చెల్లిస్తామన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికులకు నచ్చ జెప్పి పంపించారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి చెల్లించాలి రామాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివంది సత్యం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రామాయంపేట వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు చేసే విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీడీ కార్మికులకు న్యాయం జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిబంధనల పేరుతో అర్హులను తొలగిస్తున్నారు చిన్నకోడూరు: బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని బీఎంఎస్ జిల్లా కార్యదర్శి ముద్దం రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణలోని ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే నిబంధనల పేరుతో అర్హులను తొలగించడం ఎంత వరకు సమంజసమన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జీవన భృతికి ఎంపిక చేయడం వల్ల అనేక మంది అర్హులకు జీవన భృతి అందడం లేదన్నారు. సంవత్సరాల తరబడి బీడీలు చుట్టే వృతిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారికి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ఆసరాతో ముడిపెట్టి జీవన భృతి చెల్లించకపోవడం సరికాదన్నారు. వృద్ధులకు ఆసరా, బీడీ కార్మికులకు జీవన భృతి రెండు ఇస్తే తప్ప కార్మికులకు పొట్టనిండే పరిస్థితి లేదన్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే సొంత గ్రామస్తుడైతే పింఛన్ ఇవ్వరా?
ఐరాల: ‘ఎమ్మెల్యే సొంత గ్రామంలో నివాసముండే వారికి పింఛను ఇవ్వరా..?’ అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎంపీడీవో పార్వతమ్మను ప్రశ్నించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎంపీడీవోను ఉద్దేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న ఎంపైపల్లెకు చెందిన చెంగయ్యకు ఇటీవల కమిటీ సభ్యులు పింఛన్ తొలగించారన్నారు. ఆయన తనను సంప్రదించగా ఎంపీడీవోకు విన్నవించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఆయన మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి చెందిన వారు కావడంతో పింఛన్ తొలగించి ఉంటారని బాధితుడు ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. వయస్సు మీరిన వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీడీవో పార్వతమ్మ స్పందిస్తూ కమిటీ తొలగించిన తరువాత నిజానిజాలు పరిశీలించి పింఛనుదారుడి వివరాలను జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు. అనుమతి రాగానే పింఛను అందజేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పుత్రమద్ది బుజ్జిరెడ్డి, గురుమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, దళిత సంఘం నాయకులు సిద్దయ్య, చెంగపల్లి ఎంపీటీసీ చిలకమ్మ, చిన్నారెడ్డి, గుర్రప్ప, గణపతి, భానుప్రకాష్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, అయిరాల ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీనే బాస్ ఈ విషయంపై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గతంలో ఉన్న ఎంపీడీవో, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కమిటీలో 160 మందిని అనర్హులుగా గుర్తించారని, ఆ తరువాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని ఎమ్మార్వో సమక్షంలో పరిశీలించి తిరిగి నమోదు చేశామని తెలిపారు. వాటిని తొలగించడంలో చేర్చడంలో ఎంపీపీనే తమకు బాస్‌గా వ్యవహరించారని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహర దీక్ష చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అర్హత ఉండి పింఛను కోల్పోయిన వారందరూ హాజరు కావాలని కోరారు. -
తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో
ఒంగోలు : ఓ ప్రభుత్వ అధికారిణి ... టీడీపీ నేతలతో కలిసి నృత్యం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. వేదిక పక్కనే ఏర్పాటు చేసిన పాట కచ్చేరి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు చిందులేశారు. సీఎస్ పురం ఎంపీడీవో మహాలక్ష్మీ ఉత్సాహంగా ...తెలుగు తమ్ముళ్లతో పోటీ మరీ డాన్స్ చేశారు. అధికారులు రాజకీయ నాయకులతో కలిసి స్టెప్పులేయడాన్ని చూసి స్థానికులు అశ్చర్యపోయారు. -
డిపాజిట్ సొమ్ము వెనక్కు ఇచ్చేదెప్పుడో..!
వేంపల్లె : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి 17 నెలలు కావస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా మండలాల్లో ఎంపీడీవోలు ఖర్చు చేసిన సొమ్మును ఎన్నికల సంఘం నుంచి విడుదల చేయకపోవడంతో అధికారులు ఆవేదన చెందుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు వెనక్కి ఇవ్వకుండా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఉన్న కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి ఎంపీడీవోలంతా ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఒక్కో మండలానికి రూ.70వేల నిధులను అందించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి మిగిలిన నిధులు వచ్చేందుకు ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి అలాగే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీడీవోల బదిలీలు జరగడంతో ఈ విషయం అటకెక్కింది. ప్రస్తుతం పోటీచేసిన అభ్యర్థులు తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆయా ఎంపీడీవోల వద్దకు వెళ్లి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతోపాటు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చిన తర్వాతనే సంబంధిత డిపాజిట్లు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్లు : గత ఏడాది జులై నెలలో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డుమెంబర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్లు చెల్లించారు. జనరల్ కేటగిరిలో బరిలో దిగిన వారు రూ.2వేలు, బీసీలుగా బరిలో దిగిన వారు రూ. 1000లు.. ఓసీ వార్డు మెంబర్లు రూ.500లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డు మెంబర్లు రూ.250లను డిపాజిట్‌గా చెల్లించారు. ఇందులో ఓట్ల సంఖ్యలో 10శాతానికి తగ్గితే డిపాజిట్లు గల్లంతైన వారి పాజిట్ను జనరల్ ఫండ్‌కు కలుపుతారు. మిగతా వారి డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కో మండలం నుంచి రూ.1.50లక్షల వరకు డిపాజిట్ సొమ్ము అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా వచ్చిన డిపాజిట్ల మొత్తాన్ని ఎన్నికల సంఘం నుంచి నిధులు రాకపోవడంతో వాడుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చిన తర్వాత డిపాజిట్లు చెల్లిస్తామనుకున్న అధికారులకు డబ్బు రాకపోవడంతో ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. జిల్లాలోని 50మండలాల్లో అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం భోజన వసతి, బారికేడ్ల నిర్మాణం, వాహన సదుపాయం, డీజిల్ ఖర్చులు తదితర వాటికోసం ఒక్కో మండలానికి రూ.1.50లక్షలనుంచి రూ.4లక్షల వరకు ఖర్చు చేశారు. డిపాజిట్ల మొత్తం కొంత వాడుకోగా.. మిగిలిన మొత్తాన్ని అప్పులు చేసి చెల్లించారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్ల నిధులు ఎన్నికల సంఘం నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు, నామినేషన్ వేసిన అభ్యర్థులు కోరుతున్నారు. -
నకిలీ ‘ఆధార్’ కేసులో ఐదుగురి రిమాండ్
లింగంపేట : ఆధార్ కార్డులలో తక్కువ వయస్సు ఉండగా, ఎక్కువ వయస్సు ఉన్నట్లు చేసి తప్పుడు ఆధార్ కార్డులను తయారుచేసిన కేసులో బుధవారం ఐదుగురి నిందితులను రిమాండ్ చేసినట్లు ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంజీఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఎక్కపల్లితండాకు చెందిన గుగ్లోత్ సక్రూ, సబావత్ హరియా, లింగంపేట గ్రామానికి చెందిన కటికెరాజయ్య అనే వ్యక్తులు వృద్ధాప్య పింఛన్లను అక్రమంగా పొందడానికి ఎల్లారెడ్డిలోని ఎస్ఎస్ కంప్యూటర్ నిర్వాహకుడు దర్జి ప్రవీణ్ కుమా ర్, లింగంపేటలోని రేణుకా జిరాక్స్‌సెంటర్ నిర్వాహకుడు గుర్రపు నరేష్‌లను సంప్రదించారు. తమకు ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా ఆధార్ కార్డులను తయారు చేసి ఇవ్వాలని కోరారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకున్న ప్రవీణ్,నరేష్ డబ్బులకు ఆశపడి కంప్యూటర్, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్స్‌ల సహాయంతో ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా ఆధార్‌కార్డులను తయారుచేసి ఇచ్చారు. వాటిని తీసుకున్న సక్రూ, హరియా, కటికె రాజయ్యలు తమకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ డీఓ సతీష్ వద్దకు వెళ్లారు. ఆధార్ కార్డులను పరిశీలించిన ఎంపీడీఓ అవి నకిలీవిగా గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ పల్లె రాకేశ్ విచారణ చేపట్టగా డబ్బులకు కక్కుర్తి పడి ప్రవీణ్, నరేష్ బోగస్ ఆధార్‌కార్డులు తయారుచేసినట్లు తేలిందన్నారు. వీరి నుంచి ఐదు స్కానర్‌కం జిరాక్స్ మిషన్లు, రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఒకటి లామినేషన్ మిషన్, ఒక ల్యాప్‌టాప్ (రెండులక్షల విలువ జేసే ఎలక్ట్రానిక్ పరికరాలు) లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరిపై కుట్ర, ఫోర్జరీ, చీటింగ్ కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. -
‘ఆసరా’ అందేదెప్పుడు..?
ధర్మపురి : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో పింఛన్ల పంపిణీ రచ్చగా మారింది. కార్యక్రమానికి రాజకీయ రంగు పులుమడంతో అది కాస్తా రాస్తారోకో చేసే వరకు వెళ్లింది. ధర్మపురిలో సోమవారం పింఛన్లు పంపిణీచేశారు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం చేపడతామని ఎంపీడీవో భాస్కరాచారి నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయంలోనే పంపిణీచేయూలని సర్పంచ్ సంగి సత్తెమ్మ కోరారు. అయితే పండుటాకులు, వికలాంగులు గంటల తరబడి నిరీక్షించి ఆకలి, దప్పికకు దూరమయ్యారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని మండల కార్యాలయంలోనే పంపిణీచేయూలని పట్టుబట్టడంతో అధికారులు డైలమాలో పడిపోయూరు. మండలపరిషత్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని సర్పంచ్‌తోపాటు మరికొందరు అడ్డుకున్నారు. సభావేదికపై ఉన్న కుర్చీలు, టేబుళ్లు తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కార్యదర్శి మేఘమాల తహశీల్దార్ కార్యాలయూనికి వెళ్లింది. బయటకు రావాలంటూ నినాదాలు చేస్తు కార్యాలయాలను ముట్టడించారు. జాతీయ రహదారిపై సర్పంచ్ సంగి సత్తమ్మ, కాంగ్రెస్ నాయకులు, పింఛన్‌దారులు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. చివరకు కార్యదర్శి మేఘమాల గ్రామపంచాయతీలోనే పంపిణీచేసేందుకు ఒప్పుకోగా వివాదం సద్దుమణిగింది. అర్హులకు పింఛన్లు అందించాలని డిమాండ్‌చేస్తూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడే రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ అక్కడకు చేరుకుని మాట్లాడారు.. అర్హత ఉన్న వారందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. రామగుండం నగరపాలక సంస్థలో పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన సర్వేపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. పింఛన్లు పంపిణీ చేయడానికి డీఆర్డీఏ పీడీ ఎస్.విజయగోపాల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డీవో, తహశీల్దార్‌తో సమీక్ష జరిపారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయనకు వివరించారు. ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన పీడీ వారంలోగా అన్ని డివిజన్లలో రీ సర్వే పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు. కోరుట్ల మండలంలోని జోగిన్‌పల్లికి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీ వోకార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.పింఛన్లు అందించాలని మెట్పల్లి మండలం వేంపేట గ్రామస్తులు మండల పరిషత్ ఎదుట ఆందోళ చేశారు. రామగుండం మండలం జయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 400 మంది ఆందోళన చేపట్టారు. పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ కార్యద ర్శిని అడ్డుకున్నారు. పింఛన్లు అడిగితే ఈవోపీఆర్డీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వితంతులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తోందని, రేషన్ కార్డుల్లో పిల్లలు ఉన్నప్పటికీ పెండ్లిళ్లు అయ్యాయా..! అని ప్రశ్నించడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీడీవో కలుగజేసుకుని శాంతిపజేశారు. ఆసరా పథకం కింద అర్హులైన వారికి పింఛన్లు అందలేదని బోరుునపల్లి మండలం తడగొండ, బూర్గుపల్లి గ్రామాల్లో ఆందోళన చేశారు. తడగొండలో సర్పంచ్ కట్ట కనుకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కట్ట భాగ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్‌ను గంటసేపు పంచాయితీ కార్యాలయంలో నిర్భందించారు. ఎస్సై రాజేశ్వరరావు, ఏఎస్సై చల్ల వెంకట్రాజం వెళ్లి సముదాయించారు. అర్హులకు పింఛన్లు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
నేటినుంచి ‘ఆసరా’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు తదితరులు 3,62,166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,53,265 దరఖాస్తులు ఎస్కేఎస్ ద్వారా అప్లోడ్ అయ్యాయి. ఎంపీడీఓల వెబ్సైట్లలో కనిపిస్తున్నవి 1,92,585 కాగా.. అందరికీ పింఛన్లు అందించాలని నిర్ణయించారు. వీరికి నవంబర్, డిసెంబర్ల పెన్షన్ అందించనున్నారు. వీటికి సంబంధించి రూ. 40.52 కోట్లు ఇప్పటికే ఎంపీడీఓల ఖాతాల్లో జమయ్యాయి. పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ రొనాల్డ్ రోస్ మంగళవారం రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు నిర్వహించారు. పంపిణీ ప్రక్రియకు అధికారులను సమాయత్తం చేశారు. ప్రారంభ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భద్రత, సామాజిక పింఛన్లు తదితర దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వేగంగా సాగింది. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 15 వరకే అవకాశమని చెప్పినా.. 20వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. విచారణ, సర్వే కోసం వెళ్లిన సందర్భంలోనూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులకోసం 7,25,723, ఆసరా పింఛన్ల కోసం 3,85,210, కుల ధ్రువీకరణ పత్రాలకోసం 1,12,011, ఆదాయం ధ్రువీకరణ కోసం 1,00,531, నేటివిటీ సర్టిఫికెట్లకోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. సర్వే కోసం వెళ్తున్న బృందాలకు అక్కడక్కడా రాజకీయ ఒత్తిళ్లు, అడ్డంకులు ఎదురైనా... సకాలంలో విచారణను పూర్తి చేసినట్లు ప్రకటించారు. సర్వే కారణంగా పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి సర్కారు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వివరాల నమోదు సందర్భంలో జరిగిన తప్పిదాలు తలనొప్పిగా మారాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక ఇబ్బందికరంగా మారగా.. సుమారు 40 వేల దరఖాస్తులపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఇంకొంత మంది లబ్ధిదారుల కోసం ఆన్లైన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కొందరికి మోదం.. ఇంకొందరికి ఖేదం రెండు నెలలుగా పింఛన్లు రాక ఆందోళన చెందుతున్నవారు.. మొదటి విడత జాబితాలో తమ పేరు ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ జాబితాలో పేరు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో జిల్లాలో 2,79,816 మందికి పెన్షన్లు అందేవి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 1,52,563, వితంతు 74,612, వికలాంగ 29,634, చేనేత 1,143, గీతకార్మిక పెన్షన్లు 761 ఉండేవి. అభయహస్తం కింద మరో 21,103 మందికి పింఛన్లు పంపిణీ చేసేవారు. రెండు నెలల క్రితం వరకు వీరికి పెన్షన్ డబ్బులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచి, లబ్ధిదారుల జాబితాను వడపోయాలని నిర్ణయించి తిరిగి దరఖాస్తులు స్వీకరించింది. 3,62,166 మంది దరఖాస్తు చేసుకోసం వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో 87,231 పెన్షన్లు తగ్గాయి. అయితే అధికారులు మాత్రం పింఛన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆగిపోలేదని, నిరంతరం కొనసాగుతుందని పేర్కొం టున్నారు. అర్హులైన వారికి తప్పకుండా పింఛ న్ అందుతుందంటున్నారు. కాగా 1,92,585 మంది కోసం మంగళవారం రాత్రి వరకు 1.70 లక్షల పింఛన్ కార్డులను ముద్రించిన అధికారులు.. బుధవారం వాటిని కూడా పంపిణీ చేయనున్నారు. -
ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. రాజశేఖరరెడ్డి తనకు అనుకూలంగా వ్యవహారించడం లేదని ఓ ఉద్యోగి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి.... ఈ రోజు ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయం గది నుంచి రాజశేఖరరెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా బయటకు నెట్టి... రాజశేఖరరెడ్డి గదికి తాళం వేశారు. -
అవమానించారు
కడప ఎడ్యుకేషన్: ఎంపీడీవో బదిలీలను నిలిపివేయాలంటూ వచ్చిన జీవో విషయంపై సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రమణను కలిసి మాట్లాడేందుకు వెళ్లగా కనీస మర్యాద కూడా ఇవ్వలేదని జెడ్పీ చైర్మన్ గూడురు రవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితుడిని కావడం వల్లే అవమానించారని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా ప్రథమ పౌరుడిగా, జెడ్పీ చెర్మైన్ హోదాలో తాను కలెక్టర్‌ను కలిసేందుకు బంగ్లాకు వెళితే కనీసం కూర్చోమని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలచేత ఎన్నికైన తనకే కలెక్టర్ మర్యాద ఇవ్వకుంటే సామాన్య ప్రజలకు ఏం మర్యాద ఇస్తారన్నారు. బదిలీల విషయంలో సీపీఆర్ నుంచి వచ్చిన కాపీని కలెక్టర్‌కు చూపించేందుకు వెళితే దానిని చూడాల్సిన అవసరం లేదులే.. అనినిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్డ్‌ర్ కాపీ సోమవారం సాయంత్రం 3 గంటలకు వస్తే కలెక్టర్ మాత్రం జిల్లాలోని ఎంపీడీవోలకు విధుల్లో చేరవద్దని సోమవారం ఉదయం 6 గంటలకే మెసేజ్ పెట్టారన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చే విషయం ఆయనకు ముందే తెలుసేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కలెక్టర్ టీడీపీకి అండగా ఉంటున్నాడనే విషయం అర్థమవుతోందన్నారు. ఆ జీవో వైఎస్సార్ జిల్లాకే వర్తిస్తుందా: రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే నేటివ్ డివిజన్ బదిలీలు నిర్వహించామా ఇతర ఏ జిల్లాల్లో నిర్వహించలేదా అని జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, వైస్ చెర్మైన్ ఇరగంరెడి ్డసుబ్బారెడ్డి ప్రశ్నించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 26 ఎంపీడీవోలకు సంబంధించి బదిలీలు నిర్వహిస్తే అందులో 17 మందివి అధికార పార్టీకి అనుకూలంగానే జరిగాయన్నారు. మిగతా తొమ్మిది కూడా తమకు అనుకూలంగా జరపలేదని రాజంపేటకు చెందిన ఓ ప్రముఖ టీడీపీ నాయకుడు మరో నాయకుడితో కలిసి ఈపనికి ఒడిగట్టారన్నారు. బదిలీల విషయంలో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని వారు సవాల్ విసిరారు. ఆగిన ఎంపీడీవోల బదిలీలు: జిల్లాలో ఎంపీడీవోల బదిలీలు ఆగిపోయాయి. ఈనెల 12వ తేదీన ఎంపీడీవోలకు సంబంధించిన బదిలీలు జెడ్పీ చెర్మైన్ ఛాంబర్లో నిర్వహించారు. ఈనెల 22వ తేదీ రాత్రి పొద్దుపోయాక ఎంపీడీవోలను బదిలీ చేస్తూ జాబితా ప్రకటించారు. వారు 24వతేదీన విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే ఐదుగురు ఎంపీడీవోలకు సొంత డివిజన్లో పోస్టింగులు ఇచ్చారని ఇది నిబంధనలకు విరుద్ధమని ఈ బదిలీలను ఆపాలని సీపీఆర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. జెడ్పీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు, వస్తువులను స్వీకరించారంటూ ఫిర్యాదు అందటంతో బదిలీలను నిలిపివేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. దీంతో కథ మొదటికి వచ్చింది. -
మరుగున పడ్డాయి..
‘స్వచ్ఛభారత్’లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు... నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడంతో నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదీగాక ప్రజల అవగాహన లేమితో పాటు... ఏ శాఖ నిధులు విడుదల చేస్తుందనే విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం అంతగా దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4,709 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. * మరుగు దొడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపని జనం * నిధుల విడుదలలో తీవ్ర జాప్యం * కట్టాల్సినవి 97,547... పూర్తి చేసినవి 4,709 * ఏ శాఖ నుంచి నిధులిస్తారో వెల్లడించని వైనం * పట్టించుకోని అధికారగణం మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలని ప్రతి గ్రామ సభలోనూ కనీసం అరగంట సమయం కేటాయించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అయినా ప్రజల్లో అనుకున్నంత స్పందన రాలేదు. నిధుల లేమి ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 10వేలు మాత్రమే ఇచ్చేవారమని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 12వేలకు పెంచామని ప్రభుత్వం పదే పదే చెప్పినా వీటి నిర్మాణం మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. ఇటీవలి కాలం వరకు ఇసుక కొరత మరుగుదొడ్ల నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లలో 50శాతానికి పైగా వినియోగంలో లేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 4,709 మాత్రమే. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సిబ్బంది, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకోసం ఏ శాఖ నుంచి నిధులు కేటాయిస్తారనే అం శంపై ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని పలువురు ఎంపీడీవోలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని రానున్న కాలంలో ఈ వ్యవహారాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్థలం కొరత, వాస్తు భయం... గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ సొంత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రజలు వెనకంజ వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్డి నిర్మించాలంటే నాలుగేసి వరలతో రెండు ట్యాంకులు నిర్మించాలనే నిబంధన విధించారు. మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు ఇంటి ఆవరణంలో ఉంటే వాస్తు దోషం తగులుతుందనే అపోహతో వీటి నిర్మాణానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్డి అసలు లేని వారు దీనిని నిర్మించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే రూ. 12వేలు చాలవని, మరో రూ. 2 నుంచి రూ. 3వేలు అదనంగా ఖర్చు చేయాలనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. గతంలో కొందరు వ్యక్తులు మరుగుదొడ్లు నిర్మించడానికే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఈ సారి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో పని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా మరుగుదొడ్లు నిర్మించుకుంటే విడతల వారీగా నగదు మంజూరు చేస్తామని చెబుతున్నా... ముందస్తుగా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇసుక కొరతతో జాప్యం... ఒక మరుగుదొడ్డి నిర్మించాలంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రూ. 14,040 ఖర్చవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 870 ఇటుకలు, 30 అడుగుల ఇసుక, 9 అడుగుల పెద్దకంకర, 8 వరలు, రెండు మూతలు, రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల పొడవు ఉన్న తలుపు, 10 అడుగుల పీవీసీపైపు, ఐదు అడుగుల రేకు, బేసిన్, పైప్‌లైన్ అవసరం. నలుగురు మేస్త్రీలకు ఖర్చు రూ. 1600లని ఇంజనీర్లు నిర్ణయించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారే పనిచేసుకుంటే రూ. 1600 ఖర్చు కలిసి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయితే నాలుగు అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు, దొడ్డి లోపల భాగం వైపు జాగా ఉండేలా మరుగుదొడ్డి నిర్మించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకోవాలనే నిబంధన ఉండటంతో ఇటీవల కాలం వరకు ఇసుక కొరత తదితర కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ అంశం అమలులోకి రాలేదు. అయితే అధికారుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకున్న వారికి బిల్లులు రాని సంఘటనలుఉన్నాయి. ఇదిలా ఉండగా మరుగుదొడ్ల నిర్మాణంలో పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగిస్తుండడంతో నేటికీ రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నరేంద్రమోడీ తాను ప్రధాన మంత్రిగా ఉండి దేశంలో మరుగుదొడ్లు నిర్మించే అంశంపై దృష్టిసారించాల్సి వస్తోందని చెప్పడం గమనార్హం. నేపథ్యమిదీ... సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రాం (సీఆర్ఎస్పీ)ను 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం. మహిళల గౌరవాన్ని కాపాడడం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు అందేలా చూడడం, మురుగునీటి నిర్మూలన చేయడం. 1999 నుంచి ఈ కార్యక్రమాన్ని విసృ్తతం చేశారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్ఎల్డబ్ల్యూఎం), కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం పాటించిన పంచాయతీలకు నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను అందజేయాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా ఫార్ములా అమలు చేసేనా? గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాణిమోహన్ మరుగుదొడ్ల నిర్మాణంపై కఠిన నిర్ణయాలే తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డుపై సరుకులు తీసుకోవాలంటే మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన విధించటంతో ఆ జిల్లాలో 80శాతానికి పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని అధికారులు అంటున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రెండునెలల గడువు ఇచ్చి మూడవ నెలలో మరుగుదొడ్డి నిర్మాణం చేయని కుటుంబాలన్నింటికీ రేషన్ నిలిపివేయడంతో రాజకీయ నాయకుల నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినా వాటిని పక్కన పెట్టడంతో ఆ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ కొంతైనా ముందడుగు వేసిందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు. లక్ష్యాలివే.... * గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. * 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో కచ్చితమైన పారిశుద్ధ్యాన్ని పాటించి నిర్మల్ భారత్‌గా తీర్చిదిద్దడం. * ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా అవగాహన కల్పించడం. * గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం. * పర్యావరణ పరిరక్షణపై విసృ్తత ప్రచారం చేయడం. * ప్రతి గృహానికీ మరుగుదొడ్డి నిర్మించడం. * ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, సన్న, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వడం. * ప్రభుత్వ భవనాలు, పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడం. -
ఉపాధి హామీ పనుల బాధ్యత ఇకపై ఎంపీడీవోలదే
నందివాడ : గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులుగా ఎంపీడీవోలను పంతొమ్మిది నెలల విరామం తర్వాత మళ్లీ ప్రభుత్వం తిరిగి నియమించింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కీలకమైన డిజిటల్ సిగ్నేచర్ ‘కీ’ని (నిధుల తాళం) ప్రభుత్వం అప్పగించింది. ఇక నుంచి మండల స్థాయిలో ఎంపీడీవో కీలకం కానున్నారు. వీరి పర్యవేక్షణంలోనే ఉపాధి పనులు, బిల్లులు చెల్లింపు, ఇతరత్రా వ్యవహారాలు సాగనున్నాయి. ఈ పథకం ఆరంభం తర్వాత 2007 జూన్‌లో పీవో బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. అప్పట్లో ఉపాధి పనుల్లో ఎంపీడీవోలపై అవినీతి అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ పథకం అమలు బాధ్యతల నుంచి తమను తప్పించాలని ఎంపీడీవోలు ప్రభుత్వనికి తెగేసి చెప్పారు. తాము పీవోలుగా ఉండలేమని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఎంపీడీవోల స్థానంలో ఆగమేఘాలపై 2013 మార్చి ఒకటోతేదీ నుండి ఏపీవోలకే పీవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గత 19 నెలల్లో ఏపీవోలే మండల స్థాయిలో ఉపాధి పనులను నడిపించారు. రాష్ర్టంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఎంపీడీవోలకే బాధ్యతలు అప్పగిస్తూ గత సెప్టెంబర్ 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ రెండో తేదీన జీవో నెంబర్ 139 విడుదల చేసింది. ఆ తర్వాత జన్మభూమి ఉండడంతో డీఎస్కే(కీ)లను ఎంపీడీవోలకు ఇవ్వలేదు. ఈ మధ్యనే వారికి వీటిని అప్పగించినట్లు సమాచారం. కూలి చెల్లింపులకు గ్రామకమిటీ ఉపాధి పథకం కూలీల బిల్లు చెల్లింపులు ఇక నుంచి గ్రామకమిటీల ద్వారా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉపాధిహామీ పథకం సిబ్బంది చెబుతున్నారు. ఇన్నాళ్లు బిల్లుల చెల్లింపు చూసిన పీవో ఏజెన్సీని ప్రభుత్వం తొలగించింది. సాంకేతిక కారణాల వల్ల వచ్చేనెల 15 వరకు కూలీ చెల్లింపు మాన్యువల్‌గా జరుగుతుందని పథకం సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు గ్రామకమిటీని నియమించారు. ఈ కమిటీ కన్వీనర్‌గా గ్రామ కార్యదర్శి, సభ్యులుగా సర్పంచ్, క్షేత్ర సహాయకుడు గ్రామైక్య సంఘం(వీవో) నాయకురాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీఆర్పీ ప్రతినిధి ఉంటారు. అక్రమాలు జరిగినట్లు తేలితే వీరిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. -
ఎంపీడీవోల బదిలీ
ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని 48 మంది ఎంపీడీవోలకు 40 మందిని బదిలీ చేశారు. ఎనిమిది మందిని మాత్రం అవే స్థానాల్లో ఉంచారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ఇన్చార్జి సీఈవో పి. సుబ్బారావు శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ద్వారకాతిరుమల -కె.పురుషోత్తమరావు, భీమడోలు- ఏవీ విజయలక్ష్మి, లింగపాలెం -ఎస్.ఆశీర్వాదం పాలకోడేరు - పి.వెంకటరత్నం, తాళ్లపూడి - ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, ఉండ్రాజవరం - బి. వీరాస్వామి, పాలకొల్లు -ఆర్. విజయరాజు, బుట్టాయిగూడెం- టి.వెం కటలక్ష్మిని పనిచేసే చోటే ఉంచారు. పెనుమంట్ర తహసిల్దార్ ఎస్. వెంకటేశ్వరరావును ఆచంటకు, ఆకివీడు తహసిల్దార్ ఎం. కె.ప్రసన్నను పోడూరుకు, ఆచంట నుంచి డీవీఎస్ పద్మినిని పెనుగొండకు, పెరవలి నుంచి బి. రామప్రసాద్‌ను పెనుమంట్రకు, చింతలపూడి నుంచి వై. పరదేశ్కుమార్ను భీమవరానికి, భీమవరం నుంచి పి.జగదాంబను వీరవాసరానికి, చింతలపూడి ఎంపీడీఓగా ఈవోఆర్డీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. చాగల్లు నుంచి పీకే నిర్మలాదేవిని కామవరపుకోటకు, పోడూరు నుంచి పి.శ్రీదేవిని జంగారెడ్డిగూడెంకు, ఏలూరు నుంచి ఎన్.ప్రకాశరావును దెందులూరుకు, పెదవేగి నుంచి కె. శిల్పను పెదపాడుకు, పెదపాడు నుంచి పి.శ్రీనివాస్‌ను పెదవేగికి, దెందులూరు నుంచి కె.శ్రీదేవిని ఏలూరుకు బదిలీ చేశారు. కొయ్యలగూడెం నుంచి కేఆర్ఎస్ కృష్ణప్రసాద్‌ను గోపాలపురానికి, నిడమర్రు నుంచి కె.కోటేశ్వరరావును దేవరపల్లికి, నల్లజర్ల ఎంపీడీఓగా ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచారు. తణుకు నుంచి వై. దాసిరెడ్డిని కొవ్వూరుకు, కొవ్వూరు నుంచి జె.వేణుగోపాల్‌ను చాగల్లుకు, మొగల్తూరు నుంచి కె.కన్నమనాయుడును నరసాపురానికి, నరసాపురం నుంచి ఎన్వీఎస్పీ యాదవ్‌ను మొగల్తూరుకు, అత్తిలి నుంచి ఎ.ఆంజనేయులును నిడదవోలుకు, ఇరగవరం నుంచి ఎస్టీవీ రాజేశ్వరరావును పెరవలికి, పోలవరం నుంచి ఆర్సీ ఆనందకుమార్‌ను యలమంచిలికి, యలమంచిలి నుంచి ఏవీ అప్పారావును పోలవరానికి, కుకునూరు నుంచి బి. రామచంద్రరావును జీలుగుమిల్లికి, జంగారెడ్డిగూడెం నుంచి ఎం.రాజును కొయ్యలగూడెంకు బదిలీ చేశారు. టి నరసాపురం ఎంపీడీవోగా సూపరింటెండెంట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెంటపాడు నుంచి జీవీకే మల్లికార్జునరావును తాడేపల్లిగూడెంకు, ఉంగుటూరు నుంచి ఎ.రామును పెంటపాడుకు, తాడేపల్లిగూడెం నుంచి జి. రమణను తణుకుకు, పెనుగొండ నుంచి వి.విజయలక్ష్మిని ఇరగవరానికి, నిడదవోలు నుంచి ఎస్.నిర్మలాజ్యోతిని అత్తిలికి బదిలీ చేశారు. సెలవులో ఉన్న ఎంపీడీవో ఏబీపీవీ లక్ష్మిని ఉండికి, ఉండి నుంచి పి.రమాదేవిని కాళ్లకు, నల్లజర్ల నుంచి శ్రీనాధ్నాయిని ఆకివీడుకు బదిలీ చేశారు. దేవరపల్లి నుంచి జె.రేణుకమ్మను ఉంగుటూరుకు, గోపాలపురం నుంచి డి. దామోదరరావును నిడమర్రుకు, కాళ్ల నుంచి జి. పద్మను గణపవరానికి, టి.నరసాపురం నుంచి ఎం.రాజశేఖర్‌ను కుకునూరుకు, వీరవాసరం నుంచి కేవీఎస్ఆర్ రవికుమార్‌ను వేలేరుపాడుకు బదిలీ చేస్తూ సీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే 63 మంది సూపరింటెండెంట్లకు 28 మందిని, 108 మంది సీనియర్ అసిస్టెంట్లకు 56 మందిని, 268 మంది జూనియర్ అసిస్టెంట్లకు 100 మందిని బదిలీ చేశారు. 66 మంది టైపిస్టులకు 14 మందిని, 345 రికార్డు, లైబ్రెరీ, లాబ్ అసిస్టెంట్లకు గానూ 42 మందిని, 483 మంది ఆఫీస్ సబార్డినేట్లలో 56 మందిని బదిలీ చేశారు. డ్త్రెవర్లు ఆరుగురిని, ఎన్‌డబ్ల్యూ, ఎస్.డబ్ల్యూ సిబ్బంది 187 మంది ఉండగా వారిలో ఎవరినీ బదిలీ చేయలేదు. -
డబ్బు ఇచ్చుకో.. కోరిన చోటకు బదిలీ పుచ్చుకో
* జెడ్పీ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు * ప్రభుత్వ నిబంధనలకు పాతర * నేటితో బదిలీలకు తెర ఏలూరు టూటౌన్ : జిల్లా పరిషత్‌లో ఎంపీడీవోలు, ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి జెడ్పీ చైర్మన్, సీఈవో తమ ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 979 నంబర్ జీవోను తుంగలోకి తొక్కుతున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. జెడ్పీలోని కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బదిలీల్లో సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కోరుకునే వారి వద్ద రూ. 25 నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. నాలుగు రోజులుగా ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద నుంచి భారీస్థాయిలో సిఫార్సు లేఖలు జెడ్పీ సీఈవో, చైర్మన్‌కు అందాయి. నిబంధనల ప్రకారం ఎంపీడీవోలకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీలు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కోరిక మేరకు బదిలీలు జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌లో మినిస్ట్రీరియల్ ఉద్యోగులైన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లతో కలిపి మొత్తం వెయ్యి మంది వరకు ఉద్యోగులున్నారు. వీరిని జీవో నంబర్ 709 ప్రకారం 5 సంవత్సరాలు నిండిన వారిని 20 శాతం బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో జరపాల్సి ఉంది. అయితే ఆ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. గతంలో జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో యూనియన్ నాయకులతో కూడా సీఈవో, చైర్మన్ సంప్రదింపులు జరిపేవారు. కాని ఈసారి దానికి విరుద్ధంగా తమ ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే చేస్తాం : ఇన్చార్జి సీఈవో పి.సుబ్బారావు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బదిలీల నిబంధనల మేరకే చేస్తామని ఇన్చార్జి జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా కౌన్సిలింగ్ జరపాలనే నిబంధన లేదు. అందుకే ఉద్యోగుల ద్వారా అన్లైన్లో ఆప్షన్ తీసుకుని బదిలీలు చేస్తున్నాం. జీవో నెం.709 ప్రకారం బదిలీ చేయాలన్న నిబంధనతో ఫైల్ తయారు చేసి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు పంపామని చెప్పారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఎవరైనా డబ్బులు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఉపాధి’.. ఇక పకడ్బందీ..
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణకు ఉత్తర్వులు జారీ * పారదర్శకంగా పనులు, నిధుల ఖర్చు మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనుల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపు ప్రక్రియ, పనుల కేటాయింపు బాధ్యతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంపీడీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం జీవో 15 జారీ చేసింది. ఇన్నాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులే ఉపాధి పనుల ఎంపిక, వాటి నిర్వహణ బాధ్యతలు చూడడం, కొలతలను బట్టి కూలీలకు వేతనాలు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ మండలానికి ఒక ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ప్రతీ ఏడాది సామాజిక తనిఖీ బృందం చేసిన పనులు, చెల్లించిన వేతనాలపై తనిఖీ చేపట్టగా.. రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతో చేసిన పనులతో అంతగా ప్రయోజనం లేకుండా పోయినట్లు గుర్తించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో ‘ఉపాధి’ కాంట్రాక్టు సిబ్బంది ఇక నుంచి ఎంపీడీవోల ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుంది. దుర్వినియోగం తగ్గేనా..? జిల్లాలో 31,618 శ్రమశక్తి సంఘాల్లో 5,80,577 మంది కూలీలు ఉన్నారు. వీరిలో ఏడాదికి కనీసం 4 లక్షల మంది ఉపాధి పని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు కాలంలో పనులు తక్కువగా ఉండడంతో ఇతర పనులకు వెళ్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత ఉపాధి పనులు చేస్తేనే పూట గడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది పనుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చేసిన పనులు మళ్లీ చేయడం, చేయకున్నా కూలీల మస్టర్లు వేసి వేతనాలు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఎనిమిదేళ్లుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో రూ.12.17 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. వీటిలో ఇంకా సుమారు రూ.9కోట్లకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేలోపు వారు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. వారి నుంచి నిధులు రికవరీ చేయడం, చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని దృష్ట్యా పనుల్లో పారదర్శకత, నిధుల ఖర్చులో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీరిక లేకుండా ఉంటున్న మండల పరిషత్ సిబ్బంది.. ఉపాధి పనుల పర్యవేక్షణ, ఎంతమేరకు నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తారో వేచి చూడాల్సిందే. బాధ్యతల అప్పగింత.. పనుల పర్యవేక్షణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా మండలాల ఎంపీడీవోలకు అప్పగించారు. ఎంపీడీవోలు జాబ్‌కార్డుల జారీ నుంచి పనుల ఎంపిక, కూలీల బడ్జెట్ తయారీ, గ్రామపంచాయతీల్లో పనుల ప్రణాళిక తయారీ, చేసిన పనులకు సరైన వేతనాలు అందించే ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. పనుల నివేదికలను ఎప్పటికప్పుడు డ్వామా పీడీ, అడిషనల్ పీడీలకు అందించి, పథకం అమలు విషయంలో జవాబుదారీగా ఉండాలి. ప్రతీ పనిని పంచాయతీ కార్యదర్శి, సర్పంచుల ఆమోదం, గ్రామసభలో ప్రజలు సూచించిన పనుల ప్రణాళిక తయారీ, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్యవేక్షించడం, గ్రామాల్లో జరిగే పనుల తనిఖీ, కూలీలకు వేతనాలు అందేలా చూడడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈవోపీఆర్డీలు మండల ప్రణాళిక తయారీ, మస్టర్లు, పనుల తనిఖీ చేపడుతారు. పంచాయతీ రాజ్ ఏఈలు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంపీడీవోలకు తెలియజేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్లు ఉపాధి పనుల ఖాతాల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపుల రిజిష్టర్, ఆపరేటర్లు తయారు చేసే వేతనాలు పరిశీలిస్తారు. మండల పరిషత్ కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెల్లింపుల రికార్టులను స్వాధీనం చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. వీరి పర్యవేక్షణలో అక్రమాలకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. -
ఇదేమి అన్యాయం ‘బాబూ’!
- పింఛను తొలగింపుపై ఆవేదన - జన్మభూమిలో నిలదీసిన బాధితులు చోడవరం : ‘బాబూ కాళ్లూ చేతులు సరిగ్గా లేవు.. కళ్లు సరిగ్గా కనిపించవు... వెయ్యి రూపాయల పింఛనొస్తుందని ఆశపడితే.. ఇచ్చే రెండొందల పింఛను తొలగిస్తారా? ఇదేం అన్యాయం బాబూ’ అవయాలు కోల్పోయి, కదలలేని స్థితిలో ఉన్న మట్టిపిడి గంగమ్మ ఆవేదన ఇది. ‘నాకు కళ్లు కనిపించవు. నాలాటిదాన్ని పింఛనే తీసేత్తారా.. ఇదే నాయం బాబూ’ అంటూ తాకేటి చినతల్లి అనే నిరాదరణ అంధ మహిళ రోదన . ఇలాంటి అభాగ్యులెందరో పింఛన్ కోల్పోయి జన్మభూమి గ్రామ సభల్లో అధికారుల ముందు నెత్తీ నోరు కొట్టుకుంటున్న హృదయవిదాకర సంఘటనలు వెలుగుచూశాయి. చోడవరం మండలం గవరవరంలో శనివారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పింఛన్ జాబితాలో పేర్లు లేని ఎందరో అభాగ్యులు అధికారుల ముందు కన్నీరు పెట్టారు. ఈ గ్రామంలో 31 మంది పింఛన్లు తొలగించారు. వీరిలో నిరుపేదలైన అవ యవాలు స్వాధీనంలో లేని నిర్భాగ్యులు, అనాథ మహిళలు ఉన్నారు. పింఛన్ జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు వృద్ధులు టీడీపీకి చెందిన సర్పంచ్ చప్పగడ్డి వెంకటస్వామి నాయుడును, అధికారులను నిలదీశారు. హైదరాబాద్‌లో జాబితాను తొలగించారని, మళ్లీ ఇస్తామంటూ స్థానిక సర్పంచ్ చెప్పడానికి ప్రయత్నించినప్పటకీ వారు శాంతించలేదు. ఈ సభకు దిగువ స్థాయి అధికారులు మాత్రమే రావడంతో వీరి రోదన అరణ్య రోదనే అయ్యింది. ఈ గ్రామానికి చెందిన మట్టిపిడి గంగమ్మ కాళ్లు చేతులు పనిచేయక పోగా, ఎడమ చేతికి ఒక వేలు మాత్రమే ఉంది. మండ వరకు మిగిలిన వేళ్లు కోల్పోయింది. ఈమె భర్త 60 ఏళ్ల వయస్సులో రిక్షా లాగుతున్నాడు. ఈమెను పేరును జాబితా నుంచి తొలగించారు. కళ్లు కనిపించక... నా అన్న వారెవరూ లేని తాకేటి చినతల్లి పింఛన్ కూడా తొలగించారు. వైద్య సిబ్బందిపై ఫిర్యాదు ఇదిలా ఉండగా స్థానిక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదంటూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనర్హత పేరుతో 449 యూనిట్ల బియ్యం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెడెంట్ శివ, హెచ్‌డీటీ రామారావు, సీడీపీఓ ఉమాదేవి, గ్రామకార్యదర్శి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
యథాస్థానాలకు..
ఎంపీడీవోల పోస్టింగ్‌లపై కోర్టు ఎఫెక్ట్ - ఉన్నతాధికారులకు షాక్ - ఎన్నికల బదిలీల్లో మారిన పోస్టింగ్‌లు - అదే బాటలో మరికొంతమంది కరీంనగర్ సిటీ : జిల్లాలో ఎంపీడీవోల పోస్టింగ్‌ల వ్యవహారం మ్యూజికల్ చైర్‌ను తలపిస్తోంది. పైరవీలతో అనుకూలమైన పోస్టింగ్‌లు పొందే ఎంపీడీవోలు, ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించి మరీ తమ స్థానాలు ‘దక్కించుకుంటున్నారు’. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడ ం, ఎన్నికల కోడ్ ఎత్తివేశాక తిరిగి పాత స్థానాలకు పంపించడం సాధారణంగా జరిగే వ్యవహారం. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎంపీడీవోల బదిలీలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో ఉన్న 33 మంది ఎంపీడీవోలు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు బదిలీ అయ్యారు. మారిన స్థానాలు ఎన్నికల కోడ్ అనంతరం జూలై నెలలో ఇతర జిల్లాలకు వెళ్లిన ఎంపీడీవోలంతా తిరిగి వచ్చారు. జిల్లాకు వచ్చిన ఎంపీడీవోలకు యథాస్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా కరీంనగర్, బెజ్జంకి, రాయికల్, కథలాపూర్, కమాన్‌పూర్, పెగడపల్లి ఎంపీడీవోల పోస్టింగ్‌లను ఉన్నతాధికారులు వివిధ కారణాలతో మార్చారు. కరీంనగర్ ఎంపీడీవోగా బదిలీపై వెళ్లిన దేవేందర్‌రాజుకు ఎలిగేడు, రాయికల్ ఎంపీడీవో నర్సింహా రెడ్డికి భీమదేవరపల్లి, కథలాపూర్ ఎంపీడీవో శివాజీకి కోరుట్ల, బెజ్జంకి ఎంపీడీవో ఓబులేశ్‌కు ముస్తాబాద్ , కమాన్‌పూర్ ఎంపీడీవో వీరబుచ్చయ్యకు కరీంనగర్లో పోస్టింగ్ ఇచ్చారు. పెగడపల్లి ఎంపీడీవోగా ఉన్న కుమారస్వామి డ్వామాకు బదిలీ చేసి ఆ తర్వాత బెజ్జంకికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్‌ల మార్పుల వ్యవహారంలో కొన్ని పైరవీలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తారుు. కాగా ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఎంపీడీవోలకు పాత స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని జీవో నంబర్ 3172, తేదీ 01-06-2014 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును ఆసరాగా తీసుకొని తనకు పాత స్థానంలో పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని కరీంనగర్ ఎంపీడీవో దేవేందర్‌రాజు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇందుకు ప్రభుత్వ జీవోను ఆధారంగా చూపించారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం దేవేందర్‌రాజుకు కరీంనగర్ ఎంపీడీవోగానే పోస్టింగ్ ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీంతో దేవేందర్‌రాజు బుధవారం కరీంనగర్ ఎంపీడీవోగా విధుల్లో చేరారు. -
దోపిడీ దొంగల బీభత్సం
అనకాపల్లి రూరల్ : పట్టణ శివారు ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నక్కపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న దవలేశ్వరపు కృష్ణ (48) ఇక్కడి చినబాబుకాలనీలో కొనేళ్లుగా నివాసముంటున్నారు. ఇటీవల భార్య, పిల్లలు ఊరు వెళ్లడంతో 10 రోజుల నుంచి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటిలో వంట ఏర్పాట్లలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి, కత్తులతో ఇంటిలోకి చొరబడ్డారు. ఈలోగా సమీప ఇంటిలో నివాసముంటున్న గాంధీనగరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న నాగిరెడ్డి రామకృష్ణ (45) స్నేహితుడైన ఎంపీడీఓ కృష్ణ ఇంటికి పచ్చడి పట్టుకొని వెళ్లగా.. దుండగులు ఇద్దరినీ నిర్బంధించి ఇల్లు సోదా చేశారు. అయితే ఆశించినంతగా ఇంటిలో బంగారం, డబ్బు దొరకకపోవడంతో 50 వేల రూపాయలు ఇవ్వాలని కత్తులతో బెదిరించి డిమాండ్ చేశారు. సోదాలో దొరికిన ఏటిఎం కార్డు నెంబర్‌ను తెలుసుకొన్నారు. వారిలో ఒక వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి రూ. 3500 డ్రా చేసుకొని బీరు బాటిళ్లు కొనుక్కొని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. దుండగులు ముగ్గురూ బీరు సేవించారు. ఇంటిలోనే దొంగలు ఆమ్లెట్లు వేసుకొని భోజనం చేసి మాకు ఎలాగైనా 50 వేలు కావాలని పదే పదే డిమాండ్ చేశారు. ఈలోగా రామకృష్ణ భార్య తన భర్త ఎంతకీ రాకపోవడంతో 12 గంటల సమయంలో ఎంపీడీఓ కృష్ణ ఇంటికి వచ్చి తన భర్తను పిలిచారు. నీ భార్యను కూడా ఇంటిలోకి రమ్మని చెప్పు అని దొంగలు రామకృష్ణను కొట్టారు. ఇంటి ద్వారం వద్ద రామకృష్ణను ఉంచి భార్యను పిలవమని బలవంతం చేశారు. అయితే రామకృష్ణ భార్య ఇంటి వద్దకు రాకపోవడంతో దగ్గరగా వెళ్లి పిలుస్తాను అని దొంగలకు చెప్పి.. ఆయన ఒక్కసారిగా పరుగెట్టి తన భార్యను లాక్కువెళ్లిపోయి సమీపంలో ఉన్న ఇళ్ల వద్ద బిగ్గరగా అరుస్తూ తలుపులు కొట్టారు. దీంతో కంగారు పడ్డ దుండగులు అప్పటికే దొంగిలించిన 20 తులాల వెండి వస్తువులను అక్కడే వదిలి ఇంటి గోడ దూకి పారిపోయారు. ఈ తతంగమంతా సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. వెంటనే బాధితులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటిఎం ఫుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
‘జేబులు నింపిన ఎన్నికలు’ పై పోస్టుమార్టం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులను మింగేసిన కొందరు ఎంపీడీవోలపై విచారణ జరుగుతోంది. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిధులకు తోడు, మండల పరిషత్‌ల నిధులను వాహనాల వినియోగం కోసం ఖర్చు చేసిన విషయం విదితమే. కొందరు ఎంపీడీవోలు లాగ్‌బుక్‌లు లేకుండా వాహన వినియోగం పేరిట భారీగా నిధులు కాజేశారు. ప్రజాధనంతో తమ జేబు లు నింపుకున్న అధికారుల వ్యవహారంపై ‘సాక్షి’ గత నెల 30వ తేదీన ‘జేబులు నింపిన ఎన్నికలు’ శీర్షికన ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది. అక్రమార్కుల బండారం బయట పెట్టేందుకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగగా, తాజాగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు) సైతం ఆరా తీస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఈసారి కూడా భారీగానే నిధులు కేటాయించింది. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో మండలానికి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఎన్నికలను సజావుగా నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీడీవోలు సైతం ఈ నిధుల నుంచే ఆయా మండలాల్లో పోలింగ్ స్టేషన్లను బట్టి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వా హన వినియోగం కోసం ఖర్చు చేసే వీలుంది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ నిధులకు తోడు మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో.. ఒక్కో నెలకు రూ. 24 వేల చొప్పున డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నే పథ్యంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం విచారణకు దిగగా.. తాజాగా ఎంపీపీలు ‘పరిషత్’ నిధుల వినియోగంపై ఆరా తీస్తున్నారు. దీంతో రెండు రకాలుగా నిధులు కాజేసిన కొందరు ఎంపీడీవోల్లో దడ మొదలైంది. మండల పరిషత్ కార్యాలయాల ఖాతాల్లో నెలల వారీగా ఎంత జమయ్యింది? ఏ ఏ పద్దుల కింద ఎంపీడీవోలు ఎంత ఖర్చు చేశారు? ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు ముందు పరిషత్‌ల నిధుల నిల్వ ఎంత? జూలై ఒకటి నాటికి ఏ ఏ పద్దుల కింద ఎంతెంత ఖర్చు చేశారు? అన్న లెక్కలు తేల్చే పనిలో ఎంపీపీలు ఉన్నట్లు తెలుస్తోంది. జడ్పీ నుంచి రూ. 34 లక్షలు? మండల పరిషత్ నిధులకు తోడు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ. 34 లక్షలు డ్రా చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రూ. 2.92 కోట్లు ప్రభుత్వం కేటాయించగా.. జడ్పీ నుంచి మరో రూ. 34 లక్షలు డ్రా చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ల వారీగా నిధులతో పాటు మండల పరిషత్ నిధులను వాహనాల పేరిట కొందరు ఎంపీడీవోలు కాజేస్తే.. రూ. 34 లక్షల జడ్పీ నిధులు ఎటు వెళ్లాయన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
జేబులు నింపినఎన్నికలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ‘కాసుల’ వర్షం కురిపించాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 584 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల నిర్వహణకోసం ఒక్కో మండలానికి పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షలు విడుదల కాగా, ఇందులో నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాహన వినియోగానికి ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఇది కొందరు ఎంపీడీవోలకు వరంగా మారింది. ఎన్నికల విధుల నిమిత్తం వచ్చిన అధికారులతో పాటు జిల్లాలోని కొందరి ఎంపీడీవోల కన్ను ఈ నిధులపై పడింది. ఇంకేముంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంజూరైన నిధులతో పాటు మండల పరిషత్ ఖజానాకు చిల్లు పెట్టారు. అటు ఎన్నికల నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి నెలకు రూ.24 వేల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బిల్లులు లేపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాకు వచ్చిన ఎంపీడీవోల్లో కొందరితో పాటు జిల్లాలోనే పనిచేసే మరికొందరు రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన అక్రమ బాగోతం పంచాయతీరాజ్ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 36 మండలాలుంటే, 1768 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 16 వేల నుంచి రూ.19 వేల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ లెక్కన ఒక్కో మండలానికి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షల వరకు నిధులు విడుదల కాగా, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూ.2.92 కోట్ల వరకు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యల్పంగా కమ్మర్‌పల్లికి రూ.4,97,640 విడుదల కాగా, అత్యధికంగా రూ.14,99,180 ఎన్నికల నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా 36 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.2.92 కోట్లు మం జూరయ్యాయి. అయితే ఈ నిధుల నుంచి అత్యధికంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వాహన వినియోగంపై ఖర్చు చూపిన కొందరు ఎంపీడీవోలు మండల పరిషత్‌ల నిధుల నుంచి ఒక్కో మండలంలో రూ.65 వేల నుంచి రూ.72 వేల వరకు నిధులను వాహనాల పేరిట డ్రా చేశారు. ఈ వ్యవహారంపై ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బంది ద్వారానే బయటపడటం కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి భారీగా స్వాహా చేసిన కొందరు ఎంపీడీల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ఇంటలిజెన్స్ ఆరా.. వాహనాల వినియోగం పేరిట నిధుల స్వాహా కలకలం రేపుతుండగా.. ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం పంచాయతీరాజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం కమ్మర్పల్లి, నాగిరెడ్డిపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, జక్రాన్‌పల్లి మండలాలకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు విడుదల కాగా, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, డిచ్పల్లి, నం ది పేట, నిజాంసాగర్‌లకు రూ.10 లక్షల నుంచి రూ.14.99 లక్షలు వచ్చాయి. మిగతా మండలాలకు రూ.5.50 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఎన్నికల నిధులు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల నిధులకు తోడు మండల పరిషత్ నిధులను కాజేసిన అధికారుల వివరాలను ఆరా తీసేందుకు తాజాగా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి కలకలం రేపుతోంది. మండల పరిషత్‌ల సాధారణ నిధి నుంచి వాహన వినియోగం కోసం డ్రా చేస్తే తప్పకుండా లాగ్‌బుక్ నిర్వహించాలి. ఏ వాహనాన్ని వినియోగించారు, ఏయే రోజు ఎక్కడికి, ఎంత దూరం వెళ్లారు, ఎంత చమురు ఖర్చయ్యిం ది, ఆ నెలలో ఖర్చయిన మొత్తం, ఆ వాహనానికి సంబంధించిన వివరా లు సమర్పించాల్సి ఉంది. అయితే కనీసం లాగ్ బుక్‌లు లేకుండా వాహన వినియోగం నిధులు భారీగా లాగించేసిన కొందరు అక్రమార్క ఎంపీడీవోలపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తుస్తోంది. త్వరలోనే నిందితుల బండారం బట్టబయలు కానుంది. -
టీడీపీ దౌర్జన్యకాండ
►వైసీపీ నాయకులపై చింతమనేని, టీడీపీ నాయకుల దాడి ►రోడ్డు కోసం కొంత స్థలం ఇస్తామన్నా మొత్తం లాక్కునే ప్రయత్నం ►బాధితులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు ►దాడికి గురైన వారిపై ఇన్చార్జి ఎంపీడీవో ఫిర్యాదు ►కక్ష సాధిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ జగన్నాధపురం (పెదవేగి రూరల్) : తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలపై టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. సాక్షాత్తు ఎమ్మె ల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పెదవేగి మండలం జగన్నాథపురంలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరుడు గద్దే కిషోర్ దాడికి పాల్పడ్డారు. ‘గ్రామాభివృద్ధి కోసం కొంత స్థలం ఇస్తామన్నాం. మొత్తం మా స్థలమే ఆక్రమించుకుని రోడ్డు వేస్తామన్నారు. రోడ్డు వేసే పద్ధతి ఇదేనా? ఇదెక్కడి న్యాయమని అడిగినందుకు దౌర్జన్యం చేశారంటూ జగన్నాథపురం ఉప సర్పంచ్ కొడాలి కృష్ణ కుమారి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడాలి రాటాలు, దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్నాథపురంలోని కమ్మటూరు వీధిలో గత ఎంపీ కావూరి సాంబశివరావు ఎంపీ ల్యాడ్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. రూ.3 లక్షలతో 45 రోజుల క్రితం నిర్మాణం చేపట్టిన ఈ రోడ్డు పనులను పరిశీలించడానికి శనివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ఆ పనుతను మరికొంత దూరం పొడిగించాలని, కమ్మ వీధిలో మలుపుకాకుండా నిలువుగా రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. అలా పొడిగించే రోడ్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాటాలుకు చెం దిన స్థలంలోంచి వెళ్లాల్సి ఉన్నందున రాటాలు కొం త అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గజం స్థలం ఇస్తానని చెప్పారు. వెంటనే ‘మీరేంటి మాకిచ్చేది’ అంటూ ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ రాటాలుపై చేయిచేసుకున్నారు. రాటాలు అన్న కుమారుడు దుర్గాప్రసాద్‌ను కొట్టారు. అంతటితో ఆగకుండా వారిద్దరినీ అదుపులోకి తీసుకోవాల్సిం దిగా పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. పెదవేగి ఎస్సై కె.స్వామి వారిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారంటూ రాటాలు, దుర్గాప్రసాద్‌లపై పెదవేగి ఇన్చార్జి ఎంపీడీవో రవిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మీ పిల్లల బాధ్యత మాది
తిమ్మాపురం (కాకినాడ రూరల్) :తిమ్మాపురం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల విద్యార్థుల బాధ్యత తమదేనని వారి తల్లిదండ్రులకు అధికారులు భరోసా ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులను కరస్పాండెంట్ విచక్షణారహితంగా కొట్టిన దారుణ ఘటన వెలుగుచూడడంతో తమ పిల్లలను తీసుకువెళ్లిపోవడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటామని ఎంపీడీవో సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి, తహశీల్దార్ జె.సింహాద్రి, ఎంఈవో ఎస్.విజయలక్ష్మిదేవి హామీ ఇవ్వడంతో పిల్లలను అక్కడే ఉంచేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పాఠాలు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను, ఆటపాటలు నేర్పేందుకు మరో ఉపాధ్యాయుడ్ని అధికారులు నియమించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులను తరగతుల వారీ ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు నమోదు చేశారు. పాఠశాలలో ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని అధికారులు తెలిపారు. ‘గ్రీన్‌ఫీల్డ్’ను సందర్శించిన జెడ్పీ చైర్మన్ గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలను జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీ సీఈవో భగవాన్‌దాస్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి మంగళవారం సందర్శించారు. ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడంపై విచారణ జరుగుతుందని, ప్రభుత్వ ఆధీనంలో పాఠశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్ రాంబాబు చెప్పారు. విద్యార్థులను పరామర్శించారు. -
తీరనున్న తండ్లాట
పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వ నిర్ణయం * ఎంపీడీఓల ఆధ్వర్యంలో వివరాల సేకరణ పూర్తి * 500పైన జనాభా కలిగినవి 163...నెరవేరనున్న గిరిజనుల కల గ్రామాలకు సుదూరంగా అడవుల్లో, గుట్టల్లో, గుడ్డి దీపాలతో కాలం వెళ్లదీస్తున్న గిరిజన బతుకుల్లో వెలుగులు రానున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన వారి జీవితాలకు బంగారు బాటలు పడనున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి కల సాకారమయ్యే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి. చిలుకూరు : జిల్లాలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. తండాలను పంచాయతీలుగా మార్చాలని ఏళ్ల తరబడి గిరిజనులు వినిపిస్తున్న డిమాండ్ త్వరలో నెరవేరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధిక జనాభా కలిగిన తండాల వివరాలు సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలకు ఉత్తర్వులు పంపించారు. ఈ మేరకు ఎంపీడీఓలు తమకు అప్పగించిన పనిని పూర్తిచేసి ఉన్నతస్థాయి అధికారులకు అందజేశారు. 500 జనాభా ఉన్న తండాలు 163 జిల్లా వ్యాప్తంగా 905 తండాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 500, ఆపై జనాభా కలిగిన తండాలు 163 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలుగా మార్చేందుకు గుర్తించిన తండాలను కొన్ని షరతుల మేరకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీకి, కొత్తగా పంచాయతీగా మార్చేందుకు గుర్తించబడిన తండాలకు మధ్య ఉన్న దూరం, ఆదాయం తదితర అంశాల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గిరిజనులు అధికంగా ఉన్న మండలాలివే... మఠంపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, మేళ్లచెర్వు, చివ్వెంల, చందంపేట, పెదవూరు, పీఏపల్లి, కోదాడ మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఉన్న తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాం : కృష్ణమూర్తి, డీపీఓ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపీడీఓల సహకారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న తండాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. ప్రభుత్వం ఏ క్షణంలో సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నూతన గ్రామ పంచాయతీలను గుర్తిస్తాం. -
మమ అనిపించారు
* తూతూ మంత్రంగా పారిశుధ్య వారోత్సవాలు * నీటి ట్యాంకుల శుభ్రత దేవుడెరుగు * సిబ్బంది కొరతే కారణమంటున్న అధికారులు ఇందూరు: పల్లెలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను జిల్లా పంచాయతీ అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతు లు దులుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7నుంచి 12 వరకు పారిశుధ్య వారోత్సవాలను జరపడంలో అధికారులు విఫలమయ్యారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పట్టించుకోలేదు. తప్పదనుకున్న చోట పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభించిన రెం డో రోజే మరిచిపోయారు. దీంతో గ్రామా లలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయిం ది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, శుభ్రం చేయని మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు మంచినీరు అందించే ట్యాంకుల శుభ్రత, పైపులైను లీకేజీలకు మరమ్మతులను చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలా అయితే వ్యాధులు రావా? వర్షాకాలం ప్రారంభంతోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది పారిశుధ్యవారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు చిత్తశుద్ధితో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే అతిసారం, ఇతర అంటు వ్యాధు లు, విష జ్వరాలకు బ్రేకు వేసినట్లువుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. మురికి కాలువలలో చెత్తను తొలగించి గ్రామ శివారులో పడేయాలి. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని గ్రామాలలోనే కనిపించాయని అంటున్నారు. కనీసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించకుండా అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. కారణాలు ఇవేనా! జిల్లాలో మొత్తం 718 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందు లో కొన్ని గ్రామాలలో మాత్రమే సక్రమంగా పారిశుధ్య వారోత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారో తెలుసుకుంటే, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై ఒకటి నుంచి పది వరకు రెగ్యులర్‌గా గ్రామసభల నిర్వహణ, 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమం ఉండటంతో, ఆ పనులలో నిమగ్నమై పారిశుధ్య వారోత్సవాలపై అంతగా శ్రద్ధ పెట్టలేకపోయామని పంచాయతీ అధికారులు పేర్కొం టున్నారు. మండల, గ్రామస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రం గా ఉందని, మూడు కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి రావడంతో ప్రభావం పడిందని అంటున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శి చొప్పున మొత్తం జిల్లాలో 718 మంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 198 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. ఒక్కో కార్యదర్శికి నాలుగేసి పంచాయతీలను అదనంగా కేటాయించారు. దీంతో పారిశుధ్య వారోత్సవాలను అనుకున్న సమయానికి నిర్వహించలేకపోయారు. ఇటు గ్రామసభల నిర్వహణతో ప్రణాళికల తయారీలో కూడా ఇబ్బందిగా మారింది. మ రోవైపు 36 మండలాలకు గాను 16 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. ఈఓపీఆర్డీ పోస్టులు కూడా 20 ఖాళీగా ఉన్నాయి. గ్రామాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కార్మికులు లేకపోవడంతో పారిశుధ్య పనులలో జాప్యం జరుగుతోంది. -
మూడు లక్షలు మింగేసిన ఎంపీడీవో!
ఎంపీటీసీ అభ్యర్థుల డిపాజిట్టు, సిబ్బందికి ఇవ్వాల్సిన నగదు స్వాహా కార్యాలయంలోని టీవీ మాయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రస్తుతం ఎంపీడీవో పలమనేరు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ఎంపీడీవో మూడు లక్షలు మింగేసిన సంగతి సోమవారం వెలుగులోకొచ్చింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఎంపీడీవో జయసింహ ఎన్నికల విధుల కోసం పలమనేరు ఎంపీడీవోగా మార్చి 4వ తేది ఇక్కడికొచ్చారు. అప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఈయన ఆధ్వర్యంలో మొదలైంది. అనంతరం ఎన్నికలు పూర్తయ్యాక బదిలీల్లో భాగంగా మే 28న తిరిగి సొంత జిల్లాకు వెళ్లారు. ఆయన విధులు నిర్వహించిన సందర్భంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయన తర్వాత బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో మంజుల గుర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ రుసుం సుమారు రూ.60వేలను ఆయన తస్కరించినట్లు బయటపడింది. ఎంపీడీవో గదిలోని రూ.10వేలకు పైగా విలువజేసే ఓ టీవీ మాయమైంది. ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి అందాల్సిన రూ.2.60 లక్షల డబ్బును కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు. మొత్తం మీద రూ.3 లక్షలకు పైగా ఈయన స్వాహా చేసినట్లు తేలింది. ఆమేరకు ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీడీవోగా ఉన్న విద్యాసాగర్‌ను విచారణకు ఆదేశించారు. ఆమేరకు విద్యాసాగర్ పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌తో పాటు జెడ్పీ సీఈవోలకు ఈ మధ్యనే అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రస్తుత ఎంపీడీవో విద్యాసాగర్‌ను వివరణ కోరగా ఎన్నికల విధులకు ఇక్కడికొచ్చిన జయసింహ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై తాము ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు. -
ప్రజా ప్రతినిధులకు ఇదేనా మర్యాద..?
మెరకముడిదాం: పంచాయతీ వార్డు మెంబర్లంటే చులకనగా కనిపిస్తున్నామా? శిక్షణ తరగతులకు పిలిచి అవమానపరుస్తారా.. ప్ర జాప్రతినిధులకు ఇచ్చే గౌరవమిదేనా? అంటూ శిక్షణాతరగతులకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పలువురు వార్డు మెంబర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం మం డలంలోని 24 పంచాయతీలకు చెందిన 240 మంది వార్డుమెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించమని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా ముందుగా ఐదు పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చారు. అయితే వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులకు ప్రభుత్వం రూ.1,40,300 మంజూరు చేసింది. ఈనిధులను ఒక్కో వార్డు మెంబరుకు రెండురోజుల శిక్షణ తరగతులకు సంబంధించి భో జనానికి రూ.200, టీఏ,డీఏలకు రూ.250 చొప్పున పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం నాణ్యతలేని భోజనం వారికి పెట్టడమే కాకుండా, ఒక్కో వార్డు మెంబరుకు రూ.100 చొప్పున పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. దీనికి వార్డు మెంబర్లు కోట్లఅప్పలస్వామి, బెహరానరసింహమూర్తి, మామిడిసూర్యనారాయణ, రౌతుసూర్యనారాయణ, గవిడిశంకర్రావు, మజ్జిఅప్పలనాయుడు, ఎలకల లక్ష్మి, ఆల్తిరాజేశ్వరి, రెడ్డిసత్యవతి తదితరులు రెండురోజులు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు రాసుకుని తమకు మాత్రం రూ.100, నాణ్యతలేని భోజనం రోడ్డుపై పెట్టి అవమానించారని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శిక్షణకు అని పిలిచి మరీ అధికారులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన టీఏ, డీఏలను సక్రమంగా పంపిణీ చేయకపోతే మొత్తం 24పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌డే
- ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు - ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ - నేటినుంచి అమలు కలెక్టరేట్/చిలుకూరు : డివిజన్, మండల స్థాయిలోనూ సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ సమక్షంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు దీనిని చేపడతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితం జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే గ్రీవెన్స్‌డే నిర్వహించేవారు. అక్కడికి వచ్చిన వినతులను తిరిగి మండల స్థాయి అధికారులకు విచారణ కోసం పంపించేవారు. కాగా ప్రతి వారం బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసాలు పడాల్సివస్తోంది. అదీగాక ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తుండడంతో అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ నూతనంగా డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు హాజరు తప్పని సరి ఇక ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు డివిజన్, మండల స్థాయి అధికారులందరూ హాజరవుతారు. అక్కడ బాధితుల నుంచి వినతులు స్వీకరించి రశీదులు కూడా ఇస్తారు. ప్రతి వారం వచ్చిన సమస్యలను ఓ ప్రత్యేకమైన రికార్డులో నమోదు చేస్తారు. సాధ్యమైనంత వరకు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. ఇక్కడ పరిష్కారం కానివాటిని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తారు. ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ప్రజావాణి వెబ్సైట్లో నమోదు చేస్తారు. పర్యవేక్షణ ఇలా.. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం అధికారులను నియమించారు. దేవరకొండ, నల్లగొండ, భువనగిరి రెవెన్యూ డివిజన్లలో వైద్య ఆరోగ్యం, డ్వామా, ట్రాన్స్‌కో, ఐబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విభాగాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. జిల్లా పరిషత్, సూర్యాపేట, మిర్యాలగూడ డివిజన్లలో సాంఘిక సంక్షేమం, మైనార్టీ, ఆర్వీఎం, డీఆర్డీఏ, ఆడిట్ విభాగాలను ఏజేసీ, అదే విధంగా జిల్లా విద్యాశాఖ, మాడా, ఆర్అండ్బీ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, జిల్లా పంచాయతీ విభాగాలను జెడ్పీ సీఈఓ పర్యవేక్షిస్తారు. అలాగే ఐసీడీఎస్, పశుసంవర్ధక, వికలాంగుల సంక్షేమం, జిల్లా పరిశ్రమలు, ఏఎంఆర్ పులిచింతల, జిల్లా ప్రణాళికా విభాగాలను వ్యవసాయశాఖ జేడీ పర్యవేక్షిస్తారు. ఉద్యానవనశాఖ, ఏపీఎంఐపీ, పట్టు పరిశ్రమ, ఆత్మ, కార్మిక శాఖ, భూగర్భజలశాఖ, సహకార శాఖలు ముఖ్య ప్రణాళిక అధికారి పర్యవేక్షిస్తారు. మార్కెటింగ్, మున్సిపాలిటీలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తారు. అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ ప్రతి సోమవారం డివిజన్, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఆదివారం కోరారు. మండలస్థాయిలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, తాగునీరు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, ఏఓలు పాల్గొనాలని ఆదేశించారు. అదే విధంగా డివిజన్‌స్థాయిలో ఆర్డీఓలు డివిజన్ అధికారులను భాగస్వాములను చేసి గ్రీవెన్స్‌డే నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం ఉన్నతాధికారులను శాఖలవారీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై చేపట్టిన చర్యలను ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. -
మండల పరిషత్ స్వరూపం అధ్యక్షుల విధులు, బాధ్యతలు
మండల పరిషత్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాల అమలుకు ఎంపీడీవోపై పరిపాలన నియంత్రణ అధికారం కలిగి ఉంటారు. - సెక్షన్ 165(1)ఏ జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు పంపే ముఖ్యమైన ప్రతిపాదనలు అధ్యక్షుని ఆమోదంతో పంపించాలి. మండల సమావేశాలకు అధ్యక్షత వహించి, వివిధ కార్యకలాపాలు నిర్వహించే హక్కు ఉంటుంది. - సెక్షన్ 165(1)బి మండల పరిషత్‌కు సంబంధించిన ఏదైనా అమలు చేయాలని ఉంటే విషయ పరిజ్ఞానం కలిగి ఉండి, ఏ రాజకీయ పార్టీలోనూ కార్యవర్గ సభ్యుడుగా లేని వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితునిగా మండల పరిషత్ సమావేశాలకు ఆహ్వానించవచ్చు. - సెక్షన్ 159 సమావేశాల తేదీ, సమయం, అజెండా అంశాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సమావేశాల్లో క్రమశిక్షణ పాటించిన సభ్యులు తదుపరి సమావేశాల్లో పాల్గొనకుండా నాలుగు నెలల వరకు సస్పెండ్ చేసే అధికారం ఉంది. {పభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే ఏ నిర్మాణపు పనైనా, కార్యకమైన చేయాల్సిందిగా ఆదేశించరాదు. - సెక్షన్ 165(2) మండల విద్యాకమిటీ చైర్మన్ హోదాలో విద్యాకమిటీల పనితీరును సమీక్షించి మార్గదర్శకం చేయాలి. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్ పాఠశాలలను సందర్శించి విద్యాప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలి. మండలంలో అభివృద్ధి పనులను తనిఖీ చేసి సమీక్షించవచ్చు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితునిగా మండల సమస్యలపై చర్చించవచ్చు. ఎంపీటీసీ సభ్యుల విధులు - బాధ్యతలు మండల పరిషత్ సమావేశాల్లో సమస్యలపై చర్చించి ఇతర సభ్యులతో కలిసి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. మండల అభివృద్ధి కోసం విధాన నిర్ణయాలు సమావేశాల్లో తీసుకుంటారు. సభ్యులు హాజరై నిర్ణయాలను ప్రభావితం చేయాలి. ఎనిమిది రోజుల నోటీసుతో సమావేశాల్లో తీర్మానాలను ప్రతిపాదించవచ్చు. 15 రోజుల నోటీసుతో ప్రశ్నలను మండల పరిషత్‌కు పంపించి, వాటిని సమావేశాల్లో చర్చించడం ద్వారా జవాబు దారీతనాన్ని తీసుకు రావచ్చు. అధికారులను పనితీరును సమీక్షించి ముందస్తు నోటీసుతో మండల రికార్డులను పరిశీలించవచ్చు. ఏదైనా ప్రత్యేక అంశాన్ని చర్చించేందుకు 1/3వంతు సభ్యుల సహకారంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడిని కోరవచ్చు. పరిపాలన సంబంధిత అధికారాలు ఎంపీడీవో, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది, విద్యాసంస్థలపై పరిపాలన నియంత్రణ కలిగి ఉంటుంది. - సెక్షన్ 168 పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం మండలానికి నిర్దేశించిన ఏ పనినైనా చేయమని ఎంపీడీవోను నిర్దేశించవచ్చు. ఎంపీడీవో ఆధీనంలోని ఏ రికార్డునైనా తమకు దాఖలు చేయమని మండల పరిషత్ కోరవచ్చు. - సెక్షన్ 163 ఆర్థిక వనరులు పంచాయతీ రాజ్ చట్టం 1994లోని సెక్షన్ 172 ప్రకారం మండల పరిషత్‌కు ఆదాయ వనరులు అందుతాయి. ఆస్తి బదిలీలపై సుంకం నుంచి సర్‌చార్జీ, సీనరేజీ రుసుం, వినోద పన్నుల ద్వారా ఆదాయం. మార్కెట్ రుసుం, వాణిజ్య సముదాయాలు, ఫల వృక్షములపై ఆదాయం, రేవులపై సుంకం, సిబ్బంది నివాస గృహాలపై అద్దె, ఇతర పాఠశాలల నిధులు, నిరుపయోగ వస్తువుల అమ్మకాలు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల పరిషత్‌లకు రూ.8చొప్పున తలసరి గ్రాంటు విడుదలవుతుంది. ఆర్థిక సంఘం నిధులు, పథకాల అమలుకు నిధులు విడుదలవుతాయి. మండల పరిషత్ అధికారులు, ప్రజాప్రతినిధులకు రవాణా భత్యం, దిన భత్యం, గౌరవ వేతనాలు అందుతాయి. జిల్లా విద్యాశాఖ అధికారి విడుదల చేసే అగంతక నిధి(కాంటింజెంట్ గ్రాంటు) మండల పరిషత్‌లకు రవాణా, కాంటింజెంటు గ్రాంట్లు సామాజిక అభివృద్ధి పథకాల నిధులు ధర్మాదాయం, ధరావత్లు, పంచాయతీ విధించిన పన్నులపై సర్‌చార్జీ వనరుల సమీకరణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధులు రాబట్టుకోవాలి. జిల్లా పరిషత్ పూర్తి అనుమతితో మండలంలోని గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. - సెక్షన్ 161(3) ప్రభుత్వ అనుమతి మేరకు గ్రామ పంచాయతీ పన్నులపై కొంత సర్‌చార్జీ విధించవచ్చు. - సెక్షన్ 161(4) ప్రభుత్వ అనుమతి, షరతులకు లోబడి పంచాయతీరాజ్ చట్టం ద్వారా నిర్దేశించిన విధుల నిర్వహణకు అవసరమైన డబ్బును అప్పుగా పొందవచ్చు. - సెక్షన్ 161(1) -
విద్యారంగానికి పెద్దపీట
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) :తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామపంచాయతీ పరిధిలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధానరహదారి పక్కన రూ.9.60 కోట్లతో చేపట్టనున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న, సూర్యాపేట తహసీల్దార్ తిరందాసు వెంకటేషం, ఎంపీడీఓ డీయస్వీశర్మ, ఎంఈఓ శంకరాచారి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఇతర పార్టీలను వదిలిరండి భానుపురి : ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్లో చేరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గాంధీపార్కులో పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపే విధంగా సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడంలో కొంత స్వార్థముందన్నారు. ఆప్రాం తంలో సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని అందుకోసం సీఎం చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా ఉండేందుకు కుట్ర పన్ని ఆర్డినెన్స్ తె ప్పించారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఛత్తీస్‌ఘడ్ నుంచి 350 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు తమ అధినేత , సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. అందులో భాగంగానే దళితులకు మూడు ఎకరాల భూ మిని అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్ఎంపై చర్యలు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకిపురం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావుకు మెమో జారీ చేసిన ఆ పాఠశాల హెచ్ఎం సీహెచ్. శ్రీనివాస్‌రావుపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఖమ్మం డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రార్థన సమయంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు జై తెలంగాణ నినాదాలు చేయించారని, అందుకు అతడిని బాధ్యుడినిచేస్తూ ప్రధానోపాధ్యాయుడు మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని టీఆర్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి రాధాక్రిష్ణ మంత్రికి వివరించారు. దీంతో ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్ఎంను విధుల నుంచి తొలగించాలని ఖమ్మం డీఈఓకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు. -
పైరవీల్లో ఎంపీడీవోలు
- పోస్టింగ్‌ల్లో జాప్యం - కొనసాగుతున్న గందరగోళం కరీంనగర్ సిటీ : జిల్లాలో ఎన్నికల బదిలీలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న 33మంది ఎంపీడీవోలు సాధారణ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీవోలు విధుల్లో చేరారు. ఎన్నికలు ముగిసి, కోడ్ ఎత్తివేశాక ఎక్కడ పనిచేసే ఎంపీడీవోలను అదే స్థానంలోకి పంపించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయి పదిహేనురోజులు గడుస్తున్నా జిల్లాలో ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ పూర్తికాలేదు. ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించక కొందరు, ఇతర జిల్లాల నుంచి రిలీవ్ ఆర్డర్ పొందక మరికొందరి బదిలీలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా కొంతమంది తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం పైరవీలు తీవ్రతరం చేశారు. జిల్లాలో ఉన్న 33 మంది ఎంపీడీవోలు బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లగా, అందులోనుంచి 25 మంది జిల్లాకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన వారు అక్కడ రిలీవ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఇంకారాలేదని అధికారులు తెలిపారు. జిల్లాకు వచ్చినవారి పోస్టింగ్‌లు ఇవ్వడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పరిపాలనాపరంగా కొంతమంది స్థానాలు మారిపోయాయి. కరీంనగర్ ఎంపీడీవోగా ఉన్న దేవేందర్‌రాజును ఎలిగేడుకు బదిలీ చేయగా.. ఆయన విధుల్లో చేరలేదు. ఆయన స్థానంలో కరీంనగర్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. బె జ్జంకి స్థానం నుంచి ఓబులేశ్ బదిలీపై వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేసరికి ఆ స్థానం ఖాళీలేకపోవడంతో ముస్తాబాద్‌కు పోస్టింగ్ మార్చారు. గతంలో డ్వామాలో పనిచేసిన కుమారస్వామికి బెజ్జంకిలో పోస్టింగ్ ఇచ్చారు. రెండు మండలాలకు సంబంధించిన ఇతర జిల్లాల ఎంపీడీవోలను అధికారులు రిలీవ్ చేయడంలేదు. ఇటీవల ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేయడంతో ఆ డబ్బులు రికవరీ చేయాల్సిందేనని ఆదేశించారు. అప్పటివరకు ఆయా స్థానాల నుంచి రిలీవ్ చేసేదిలేదని తేల్చిచెప్పడంతో ఆ రెండు పోస్టింగ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. మరో ఎనిమిది స్థానాలు ఖాళీ ఉండడంతో కొంతమంది తమకు అనువైన స్థానాల కోసం పైరవీలు మొదలుపెట్టారు. అధికారపార్టీల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొంతమంది తమను అక్కడినుంచి బదిలీ చేయరాదంటూ ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. ఎంపీడీవోల పోస్టింగ్‌ల ప్రక్రియ పూర్తికాకపోవడం జిల్లా పాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడిపోయింది. మొత్తానికి ఎంపీడీవోల పోస్టింగ్‌ల్లో విపరీతమైన జాప్యం, పైరవీలకు, పరిపాలనాపరమైన ఇబ్బందులకు కారణమవుతోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎంపీడీవోల పోస్టింగ్‌ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి గందరగోళానికి ముగింపు పలకాల్సిన అవసరముంది. -
రెవెన్యూ బదిలీల్లో రాజకీయ రంగు
ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల అనంతరం వివిధ శాఖల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరింది. ఇప్పటికే ఎంపీడీ ఓల బదిలీలు పూర్తయ్యాయి. రెవెన్యూలో బదిలీలకు రాజకీయ రంగు పులుముకుంది. రెవెన్యూలో పోస్టింగులకు పైరవీలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు పెద్దఎత్తున లాబీయింగ్‌కు తెర తీశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలలో సాధారణ బదిలీలు పెద్దఎత్తున జరిగాయి. ఎన్నికలు పూర్తవడంతో తమను యథాస్థానాలకు పంపాలని వీరు తమ ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ శాఖలో యథాస్థానాల్లో పోస్టింగ్ ఇస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఆ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెవెన్యూ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పైరవీల జాతరకు తెర లేచింది. అనువైన చోటుకు, నియోజకవర్గ కేంద్రాలకు వచ్చేందుకు తహశీల్దారులు పోటీ పడుతున్నారు. వారు ఇప్పటికే రాజకీయ నాయకులను ఆశ్రయించారు. జిల్లా నుంచి 31మంది తహశీల్దారులు ఇతర జిల్లాలకు వెళ్తుండటంతో నచ్చిన చోట పోస్టింగ్ కోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టుకు రూ.15లక్షలు.. రెవెన్యూ శాఖలో దగ్గర మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తే 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ముట్టజెబుతామని బాహాటంగాగానే ప్రకటిస్తున్నారు. రంగంలోకి దళారులు .. రాజకీయ నేతల అనుచరులు దళారుల అవతారమెత్తారు. ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా ఇప్పిస్తామని, భారీ మొత్తంలో ఖర్చవుతుందని చెబుతున్నారు. గతంలో జిల్లాలో పనిచేసి ఎన్నికల బదిలీల్లో బాగంగా 38 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వారిలో 31 మంది జిల్లాకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన వారు ఖమ్మం చుట్టుపక్కల పోస్టింగ్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. వీరికి దళారులు వల వేస్తున్నారు. డిమాండున్న మండలాలు ఇవే... ఆర్థిక వనరులు ఎక్కువగాగల మండలాలకు వెళ్లేందుకు తహశీల్దారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కొణిజర్ల, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, కూసుమంచి వెళ్లేందుకు తహశీల్దారులు తహతహలాడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఇక్కడే ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయనే ప్రకటనలతో హైదరాబాద్ స్థాయిలో జిల్లా అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారు. -
సర్వీసు ఓటు వృథానే..!
ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న సర్వీసు ఓటర్లు తప్పుల తడకగా ఓటర్ల జాబితా మృతి చెందిన ఆర్మీ ఉద్యోగులకూ ఓటు రిటైర్డ్ అయినవారికీ పోస్టల్ బ్యాలెట్టే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటూ నమోదు కాలేదు చిరునామాలు తప్పని తిరుగు టపా ఓటు వేయలేని పరిస్థితిలో జిల్లాలోని 7039 మంది సర్వీస్ ఓటర్లు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సర్వీస్ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో 7039 మంది సర్వీస్ ఓటర్లున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపాల్సి ఉంది. అస్సాం, జమ్ము కాశ్మీర్, నీలగిరి,బెంగళూరు, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల్లో సైనిక ఓటర్లున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒంగోలులో బ్యాలెట్లు ముద్రించి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఎంపీటీసీల సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను తయారు చేయాలి. పోస్ట్‌ద్వారా పంపడానికి కనీసం మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. బేస్తవారిపేట మండలంలో 602 మంది సర్వీస్ ఓటర్లందరూ సైనికులే. ఓటర్ల జాబితాలో రెజిమెంట్ మాత్రమే నమోదు చేసి ఉండటంతో అక్కడి నుంచి పనిచేసే స్థానానికి పంపడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్‌ను పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో మండల అధికారులకు నిధులు విడుదల చేయకపోవడం ఓ కారణం. జమ్ము, కాశ్మీర్ వంటి దూర ప్రాంతాలకు బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్‌లో పంపాలంటే ఒక్కో దానికి * 50 ఖర్చవుతుంది. బేస్తవారిపేట మండలంలోని 602 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి * 30 వేలు ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును నేటికీ అధికారులకు అందజేయలేదు. మళ్లీ పోస్టల్ ఖర్చు తడిసిమోపడవుతుందని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సక్రమంగా లేని జాబితా: ఏడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంపిన సర్వీస్ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంపారు. చనిపోయిన, విశ్రాంత ఉద్యోగులకు ఓట్లు వచ్చాయి. రిటైర్డ్ అయినవారికి బ్యాలెట్లను గతంలో పనిచేసిన ప్రాంతాలకు పంపుతుండటంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వ స్తోంది. ఆర్మీ ఉద్యోగులకు మొదట పనిచేసిన చిరునామాలను నెట్లో ఉంచడంతో వారుకూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోనే అత్యధికంగా సర్వీస్ ఓట్లున్న గిద్దలూరు నియోజకర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పంపిన బ్యాలెట్లు ఓటు వేయకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుప్పలుగా అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని వెనక్కువచ్చాయి. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్లు అందేలా, మారిన చిరునామాలను సవరించేలా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ఓటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణరాజును వివరణ కోరగా సర్వీస్ ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితం అందజేశారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పంపిన 602 పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన పది రోజుల తరువాత వెనక్కువచ్చాయని, ఒక్క ఓటుకూడా నమోదు కాలేదని చెప్పారు. -
బ్యాలెట్ పేపర్ల ముద్రణను బాధ్యతగా నిర్వహించండి
ఎన్నికల అధికారులకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం కావాల్సిన 36 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణను బాధ్యతగా స్వీకరించి చేపట్టాలని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులను కలెక్టర్ బీ.శ్రీధర్ ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈనెల 30లోగా ఆయా మండలాలకు కేటాయించిన తేదీల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణను పూర్తిచేసి పోలీసు బందోబస్తు మధ్య మండల కేంద్రాలకు తరలించిన అనంతరం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఈనెల 26న, ఏప్రిల్ 1న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, వంద శాతం సిబ్బంది తరగుతులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.రెండు లక్షలు, ఎంపీటీసీకి రూ.లక్ష నిర్ధారించినందున అంతకుమించి ఖర్చుచేయకుండా ప్రత్యేక కమిటీలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఫిర్యాదులువస్తే 24 గంటలలోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జేసీ చంపాలాల్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్‌రెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బిజీబిజీ
జెడ్పీకి ఎలక్షన్ ఫీవర్... పాత ఫైళ్లను తిరగేస్తున్న అధికారులు సెక్షన్లను విభజించి బాధ్యతలను అప్పగించిన సీఈఓ జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీపీఓ సురేశ్‌బాబు ఎంపీటీసీ ఎన్నికలకు మండలానికో రిటర్నింగ్ అధికారి అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలు అర్ధరాత్రి వరకు సాగిన కలెక్టర్ సమీక్ష ఇందూరు,న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు బిజీ అయిపోయారు. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేనందున జిల్లా పరిషత్ అధికారులు, ఉద్యోగులు గత ఎన్నికలకు సంబంధించిన ఫైళ్లను వెతికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఎన్నికల పక్రియను సజావుగా పూర్తి చేసేందుకు కలెక్టర్ అనుమతితో జెడ్పీ సీఈఓ రాజారాం జిల్లా పరిషత్‌లోని ఉద్యోగులకు సెక్షన్ల వారీగా విభజించి బాధ్యతలను అప్పగించారు. వారితో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. సిబ్బంది శాఖ సంబంధిత పనులను దాదాపుగా పక్కన పెట్టి ఎన్నికల పనుల్లో లీనమైపోయారు. జెడ్పీలో ప్రత్యేకంగా ఎన్నికల విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఈ నెల 10న అన్ని మండల కార్యాలయా ల్లో, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. మరో రెండు రోజుల్లో పూర్తి ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేయగా 12న వాటి ముసాయిదా జాబి తాను మండల కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 13న వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది పోలింగ్ ష్టేషన్ల జాబితాను అధికారి కంగా ప్రకటిస్తారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలకు తెలు పు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ముద్రించాడానికి గాను 20 మెట్రిక్ టన్ను ల పేపర్‌ను జిల్లా పరిషత్‌లో సిద్ధంగా ఉంచారు. రిటర్నింగ్ అధికారిగా డీపీఓ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఒక రోజులోనే అధికారుల నియామకం వేగవంతంగా పూర్తయింది. జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లాపరిషత్లోనే స్వీకరించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగా అనువభం, అందులో పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన అధికారి కావడంతో డీపీఓకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను అప్పగించారు. జెడ్పీటీసీ ఎన్నికల అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలను నియమించారు. ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ప్రస్తుతం మండల ప్రత్యేకాధికారులుగా పని చేస్తున్న వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించారు. వారు పనిచేసే మండలాల్లోనే విధులను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. అలాగే ఒకటవ అసిస్టెంట్, రెండవ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమిం చారు. ఈ నెల 17వ తేదీ నుంచి జెడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్‌లో, ఎంపీటీసీ నామినేషన్లను మండల కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. అర్ధరాత్రి వరకు కలెక్టర్ సమీక్ష జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు తన చాంబర్లో జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులతో పాటు ఇతర సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. ఏకదాటిగా మూడు గంటలకు పైగా ప్రతీ విషయంపై క్షుణ్ణంగా చర్చించి, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. రాత్రికి రాత్రే రిటర్నింగ్, అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. అర్ధరాత్రి వరకు కలెక్టర్ అధికారులతో సమీక్షించడం ఇదే మొదటి సారి. అధికారులు కూడా ఓపికతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎల్లారమ్మజాతర
జామి,న్యూస్‌లైన్: భక్తుల కొంగుబంగారం, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ జాతర నేటినుంచి ప్రారం భం కానుంది. శనివారం తొలేళ్ల ఉత్సవం, ఆదివారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు లక్షకు పైగా హజరవుతారు. ప్రతి ఏడాది దేవాదాయకమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమలు, న్యాయస్థానం ఉత్తర్వుల మేర కు ప్రభుత్వం ఉత్సవ కమిటీలను రద్దుచేయడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదీ పాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఏర్పాట్లు పూర్తి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అమ్మవారి దర్శన నిమిత్తం బారికేడ్లను ఏర్పాట్లు చేశా రు. ఆలయానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దా రు. ముందుజాగ్రత్త చర్యగా మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి, ఈఓ కేవీ.రమణ ఆధ్వర్యంలో గ్రామంలోని తాగునీటి బోర్లలో క్లోరినేషన్ చేస్తున్నారు. జాతర సందర్భంగా రెండుపూటలా తాగునీటి సరఫరా ఇవ్వనున్నారు. ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీబాయి, ఈఓపీఆర్డీ కె.ధర్మారావు, ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. జాతర లో జామి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. 108 వాహనాన్ని జాతరలో సిద్ధంగా ఉంచడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ఎంపీడీఓ లక్ష్మీబాయ్ తెలిపారు. పోలీస్ బందోబస్తు జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. 130 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. జాతరకు సహకరించాలి జాతరకు అందరూ సహకరించాలని దేవాదాయశాఖ ఈఓ వి.అప్పారావు కోరారు. అమ్మవారిదర్శనానికి ఈ ఏడాది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఐపీ పాస్ లు రద్దుచేశామన్నారు. శీఘ్రదర్శనానికి 20,ప్రత్యేకద ర్శనానికి 10, విశిష్టదర్శనానికి 30 చొప్పున ఖరారు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులు విశిష్ట దర్శనం క్యూలోఅమ్మవారిని సందర్శించ వచ్చునని చెప్పారు. -
ఉపాధి కొండెక్కినట్టే
ఏలూరు నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వారికి స్వయం ఉపాధి కల్పించే విషయంలోనూ మొండిచేరుు చూపిస్తోంది. స్వయం ఉపాధి పథకాల కింద రుణాలిచ్చేందుకు జిల్లాలో దరఖాస్తు లు ఆహ్వానించిన ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ లు సవాలక్ష నిబంధనలు.. ఎన్నో ఆంక్షలు విధించారుు. ఎట్టకేలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారుు. అర్హత గల నిరుద్యోగులకు రుణాలిచ్చే విషయంలో కాలయూపన చేస్తూ వచ్చిన అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అరుునా లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతూ వచ్చారు. రుణాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న తరుణంలో వారి చివరి ఆశలు కూడా కొండెక్కేలా ఉన్నారుు. ఎన్నికల కోడ్ తరుముకొస్తుండటంతో రుణాలు ఇచ్చే పరిస్థితి కానరావటం లేదు. ఊరించి.. ఊరడించినా చివరకు రిక్తహస్తమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే దశలోనూ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో ఒక్క స్వయం ఉపాధి యూనిట్‌ను కూడా అధికారులు ప్రారంభించలేకపోయూరు. సబ్సిడీ మొత్తాలను పెంచుతామని ప్రభుత్వం ఆరు నెలలుగా ఊరిస్తూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో పథకాలపై ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిం ది. ఇంతలోనే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా రుణం మంజూరు కాలేదు. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే యూనిట్ల మంజూరు అటకెక్కినట్టేనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 8,418 మందికి రూ.65 కోట్లను రుణాలుగా ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో రూ.26 కోట్లతో 4,518 యూనిట్లను స్థాపిం చాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 378 మందికి రూ.1.89 కోట్ల సబ్సిడీని విడుదల చేయడానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,914 మందికి రూ.39.01 కోట్లను రుణాలుగా ఇవ్వాలని నిర్ణరుుం చగా, 1,456 మందికి రూ.5.96 కోట్లను సబ్సిడీగా ఇచ్చేందుకు ఎస్పీ కార్పొరేషన్ అధికారులు సిఫార్సు చేశారు. సబ్సిడీ మొత్తాలను జమ చేయూలంటే రుణం చెల్లింపులకు సంబంధించి లబ్ధిదారులు రెండేసి బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా ఇది పూర్తికాలేదు. దీంతో యూనిట్ల స్థాపనపై నీలి నీడ లు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నిర్వాకం.. లబ్దిదారులకు శాపం ఎస్సీ, బీసీ ఓట్లను దండుకునే ఆలోచనతో ప్రభుత్వం ఆయూ వర్గాలకు చెం దిన నిరుద్యోగులను మోసగిస్తోంది. సబ్సిడీ మొత్తాలను పెంచుతామని చెప్పి గత ఏడాది డిసెంబర్ వరకు తుది నిర్ణయం వెలువరించలేదు. దీనికి తోడు కాంగ్రెస్ కార్యకర్తల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక సాగాలన్న ఆచరణ యోగ్యం కాని నిబంధన విధించి నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలాడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మండల స్ధాయిలో ముగ్గురు సామాజిక కార్యకర్తలు, ఎంపీడీవో, బ్యాంకర్లు, మండల సమాఖ్య, డీఆర్డీఏ, సంబంధిత కార్పొరేషన్ ప్రతి నిధుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయూలనే నిబంధన విధించారు. మరోవైపు లక్ష్యంలో సగం మందిని కూడా ఇప్పటివరకూ ఎంపిక చేయలేదు. నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాక వయో పరిమితిని తగ్గించేశారు. దీంతో చాలామంది దరఖాస్తుదారులు అనర్హులుగా మిగిలిపోయూరు. ఇలాంటి నిబంధనలను, అవాంతరాలను దాటుకుని నిలబడిన లబ్ధిదారులకు ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో అయినా రుణాలు ఇస్తారని వారంతా ఆశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోందని, అందువల్ల ఎవరికీ రుణాలు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో కనీసం స్వయం ఉపాధి పథకం ద్వారా అరుునా ఉపాధి పొందుదామనుకున్న నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోతున్నారుు. -
కామవరపుకోట ఎంపీడీవో సస్పెన్షన్
కామవరపుకోట, న్యూస్‌లైన్ : కామవరపుకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె.శిల్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యూయి. ఈనెల 15న జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌కు హాజరు కాని కారణంగా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపీడీవో శిల్పకు ఈ ఏడాది మే 26వ తేదీతో ప్రొబేషన్ కాలం ముగియనున్నది. మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకుడు ఎ.రాంబాబు ఇన్చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తారు. ఏలూరులో ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్తి శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ జి.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఆయనను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. -
ప్రతిష్టంభన!
ఊగిసలాటలో ఎంపీడీఓలు తేలని బదిలీల వ్యవహారం మార్గదర్శకాల కోసం పంచాయతీరాజ్ శాఖ ఎదురుచూపు రెండు రోజుల్లో కొలిక్కి! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) బదిలీలపై ప్రతిష్టంభన తొలగలేదు. మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు స్థానచలనం కలిగించాలనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లడం.. బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోర్టు తేల్చి చెప్పడంతో ఈ వ్యవహారంపై సందిగ్ధత నెలకొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ఎంపీడీఓలను బదిలీ చేయాలని ఈసీ నిర్దేశించింది. ఈ మేరకు మూడేళ్లు పైబడిన అధికారుల జాబితాను రూపొందించిన జిల్లా యంత్రాంగం దాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఎలక్షన్ డ్యూటీల్లో తమకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ బదిలీల వర్తింపు సరికాదని ఎంపీడీఓల సంఘం కోర్టును ఆశ్రయించింది. జిల్లాస్థాయిలో తమకంటే ఎగువస్థాయిలో ఉన్న అధికారులను పక్కన పెట్టి తమనే బదిలీ చేయడం సహేతుకం కాదని వాదిస్తున్నారు. పోలింగ్ సమయంలో జోనల్ అధికారులుగా మాత్రమే వ్యవహరించే అవకాశమున్నందున.. తమను బదిలీల నుంచి మినహాయించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఒకవేళ బదిలీలు అనివార్యమైతే ఇతర జిల్లాలకు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలోనే వేరే నియోజకవర్గానికి పంపించాలని కోరారు. ఎంపీడీఓల పిటిషన్‌కు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల విధుల్లో ఎంపీడీఓల డ్యూటీలను నిర్దేశించాలని, ఆ మేరకు జాబితాను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఎంపీడీఓల ఎన్నికల విధుల ఖరారుపై స్పష్టతను కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ రాశారు. దీనికి స్పందించిన జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ఏ విధులకైనా ఎంపీడీఓలను వినియోగించుకుంటామని తేల్చిచెప్పింది. అంతేగాకుండా బదిలీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కూడా స్పష్టత లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఈ వ్యవహారంపై ఏమీ తేల్చుకోలేకపోతోంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో సాధారణ బదిలీలపై సడలించిన నిషేధం.. 11వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో ఎంపీడీఓల బదిలీకి, స్థానచలనాలకు సంబంధించిన బదిలీలపై 25వ తేదీ వరకు ఆంక్షలు సడలించాలని ప్రభుత్వానికి పీఆర్ వర్గాలు లేఖ రాశాయి. ఇదిలావుండగా.. బదిలీలపై స్పష్టత రాకపోవడంతో వారం రోజులుగా ఎంపీడీఓలు రాజధానిలోనే చక్కర్లు కొడుతున్నారు. ఏ క్షణంలోనైనా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కోరుకున్న పోస్టింగ్‌ను దక్కించుకోవాలనే ఎత్తుగడతో ఉన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీఓలు బదిలీల జాబితాలో ఉన్నారు. కాగా, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఆయన రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాతే బదిలీల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఎంపీడీఓలకు బదిలీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 25 మంది ఎంపీడీఓలకు బదిలీలు కానున్నా యి. జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటికే సం బంధిత బదిలీ జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వారి ఆమోదం రావడమే తరువాయి జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీఓలు రిలీవ్ కానున్నారు. జిల్లాలో మూడేళ్లు పైబడి పనిచేస్తున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న వారిని కూడా బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు బదిలీకి అర్హులైన వారి జాబితాను రూపొందించారు. జాబితాలో ఉన్న వారందరికీ ఎక్కడికి బదిలీ కావాలో కోరుకోవాలంటూ మూడు జిల్లాల ఆప్షన్లు ఇచ్చారు. వారిచ్చిన ఆప్షన్లతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు జాబితాను పంపించారు. ఎంపీడీఓలు ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒక జిల్లాకు రెండు మూడు రోజుల్లో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారులకు పంపించిన జాబితాలో కె.విజయలక్ష్మి, జి.బాబూరావు, సీహెచ్.సుబ్బలక్ష్మి, ఎస్.రవీంద్ర, బి.సుధాకరరావు, పి.కిరణ్‌కుమార్, కె.రవికుమార్, పి.చంద్రమ్మ, కె.రామచంద్రరావు, పీవీ.రమణ, ఎంవీబీ .సుబ్రహ్మణ్యం, వై.పద్మజ, ఎస్.ఇందిరమ్మ, బి.ఉషారా ణి, ఎల్ఎన్వీ .శ్రీధర్‌రాజా, జి.అరుందతిదేవి, ఎం.మణి, ఎన్.ఆర్.కె.సూర్యం, వీవీవీఎస్.లక్ష్మణరావు, ఎస్.శారదాదేవి, కె.రమామణి, జీఎస్.నిర్మలాదేవి, జీవీ.రమణమ్మ, వి.విజయలక్ష్మి, డి.లక్ష్మి, ఎన్.ఆర్.కె.సూర్యం ఉన్నారు. వీరి స్థానంలో పక్క జిల్లాల ఎంపీడీఓలు రానున్నారు. ఇదే తరహాలో జిల్లాలో పనిచేస్తున్న 34మంది తహశీల్దార్ల కు బదిలీలు జరిగిపోయాయి. 29మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి తహశీల్దార్లు రానున్నారు. మొత్తానికి జిల్లానుంచి ఒకేసారి పెద్ద ఎత్తున తహశీల్దార్లు, ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. -
ఎన్నికల వేళ.. బదిలీల జాతర!
సంగారెడ్డి డివిజన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. పార్లమెంట్, శాసనసభా ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారుల బదిలీకి సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లాలో ఒకే స్థలంలో మూడేళ్లుగా పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓ, సీఐల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది. అలాగే జిల్లాకు చెందిన స్థానిక అధికారుల జాబితాను సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ అధికారులు తమ పరిధిలో మూడేళ్లుగా ఒకే స్థలంలో కొనసాగుతున్న తహశీల్దార్ల జాబితాను కలెక్టరేట్‌కు పంపినట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 33 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మండల పరిషత్ అధికారులు(ఎంపీడీఓ)లను సైతం మొదటిసారిగా ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీఓల జాబితాను జిల్లా పరిషత్ అధికారులు సిద్ధం చేసి కలెక్టరేట్ అధికారులకు సమర్పించినట్లు సమాచారం. జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీఓలు సుమారు 20 మందికిపైగా ఉన్నట్లు అంచనా. దీంతో తహశీల్దార్లు, ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో సైతం ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న సీఐల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. -
అందరినీ కాపాడి..మృత్యు ఒడికి
గండేపల్లి/రాజమండ్రి రూరల్/ అనంతగిరి (విశాఖ), న్యూస్‌లైన్ : ప్రాణాపాయం ముంచుకొచ్చిన క్షణాల్లో గజగజ వణుకుతున్న సహచరులకు ధైర్యం చెప్పి, ఆ అపాయాన్ని తప్పించే ఉపాయాన్ని సూచించిన ధీరుడు ఆ ప్రమాదానికే బలైపోయారు. సౌందర్యారాధకుడి ప్రాణాన్ని ఆ ప్రకృతి ఒడిలోనే మృత్యువు హరించింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా వద్ద బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో గండేపల్లి ఎంపీడీఓ నారదాసు మురళీధర్(42) దుర్మరణం పాలయ్యారు. సహచరులతో కలిసి అరకు లోయ అందాలను చూడడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మురళీధర్‌కు భార్య శ్రీవాణి, పదో తరగతి చదువుతున్న కుమారుడు వంశీ, నాలుగో తరగతి చదువుతున్న కుమార్తె శ్రేయ ఉన్నారు. మురళీధర్ రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఇల్లు కట్టుకుని నివసిస్తుండగా తల్లిదండ్రులు స్వస్థలమైన తిరుపతిలోనే ఉంటున్నారు. వారికి ఈయన పెద్ద కొడుకు. రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అరకులోయ వెళదామని ప్రతిపాదించారు. ప్రకృతి ఆరాధకుడైన మురళీధర్ వెంటనే సరే అన్నారు. మొత్తం 32 మంది సిబ్బంది కలిసి శుక్రవారం రాత్రి రాజమండ్రికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో గండేపల్లి నుంచి అరకు వెళ్లారు. శనివారం విశాఖతో పాటు అరకులోయను సందర్శించారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం అల్పాహారం అయ్యాక బొర్రా గుహలకు బయల్దేరారు. బొర్రాకు 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే గేటు మలుపు వద్ద బస్సు బ్రేకులు చెడిపోయాయి. ఆ సమయంలో బస్సు ఘాట్ రోడ్లో ఎత్తు నుంచి పల్లానికి వెళుతోంది. సహచరులంతా ప్రాణాలు అరచేత పట్టుకుని భీతిల్లుతుంటే మురళీధర్ వారికి ధైర్యం చెప్పారు. డ్రైవర్ వద్దకు వెళ్లి.. ఎడమవైపున ఎంతో లోతైన లోయ ఉన్నందున కుడివైపున ఉన్న కొండను ఢీకొట్టి బస్సును ఆపమని సూచించారు. డ్రైవర్ అలాగే కొండను ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. అయితే ఆ సమయంలో ఫుట్‌బోర్డుకు తిన్నగా ఉన్న మురళీధర్ అదుపు తప్పి డోర్లోంచి రోడ్డుపై పడి, బస్సు కింద ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మురళీధర్ మృతదేహాన్ని ఎస్సై రామకృష్ణ పొక్లెయిన్ సాయంతో బయటకు తీయించారు. ఎస్.కోట ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గండేపల్లి తరలిస్తున్నారు. అక్కడి నుంచి హుకుంపేటకు, అనంతరం స్వస్థలమైన తిరుపతికి తరలించనున్నారు. కాగా అందరినీ కాపాడేందుకు తపించిన ఆయనే మృత్యువాత పడ్డారని ఎంఈఓ ఎం.చినరాజు, ఏపీఓ అగస్తల్కుమార్, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ పి.రఘురాం ప్రమాదస్థలంలో కన్నీరుమున్నీరయ్యారు. మక్కువైన ప్రకృతి ఒడిలోనే... మురళీధర్ దుర్మరణంతో హుకుంపేటలో, గండేపల్లిలో విషాదం అలముకుంది. జరిగిన ఘోరం గురించి చెపితే తట్టుకోలేదని ఆయన భార్య శ్రీవాణికి ప్రమాదంలో కేవలం దెబ్బలు తగిలాయని చెప్పారు. అయితే సాయంత్రానికి విషయం తెలిసిన ఆమె పట్టరాని దుఃఖంతో కుప్పకూలిపోయారు. ప్రకృతి అందాలంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ అని, ఆ మక్కువతోనే కార్యాలయ సిబ్బంది అరకు వెళదామనగానే అంగీకరించారని, ఆ ప్రయాణమే ఆయనకు అంతిమ ప్రయాణం అయిందని సన్నిహితులు కంటతడి పెట్టారు. మురళీధర్ మరణవార్త వినగగానే జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు హుకుంపేట వల్లేపల్లి వీర్రాజునగర్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అందరికీ తలలోనాలుకలా, అజాతశత్రువుగా ఉండే మురళీధర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కాగా మురళీధర్ భార్యాబిడ్డలను మంత్రి తోట నరసింహం, డీసీసీ ఉపాధ్యక్షుడు కోర్పు లచ్చయ్యదొర, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుందం రాజు ఆదివారం రాత్రి ఓదార్చారు. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈఓపీఆర్డీగా 1996లో బాధ్యతలు చేపట్టి మురళీధర్ 1999లో పదోన్నతిపై సీతానగరం ఎంపీడీఓగా తూర్పుగోదావరికి వచ్చారు. కాజులూరు మండలంలోనూ పని చేసిన ఆయన 2004లో గండేపల్లి ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. అనంతరం ఆలమూరు బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి 2009లో గండేపల్లికి వచ్చారు. నిబద్ధతతో పని చేసే అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారు. ఇటీవల జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మంండల జేఏసీ తరపున కీలకపాత్ర పోషించారు. ఎంపీడీఓల యూనియన్‌లో కూడా చురుకుగా వ్యవహరించారు. -
ఓటరు నమోదుపై దృష్టి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ కాంతిలా ల్ దండే ఎంపీడీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి నూరు శాతం ఫోటోతో కూడిన ఓటరు జాబితా ప్రచురణకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డివిజన్ అధికారుల తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్ఓలు అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీఎల్ఓలు ఎక్కడ ఉంటారన్న సమాచారం లేదని... అటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ ప్రతీ రోజూ పోలింగ్ స్టేషన్ల ఆవరణలో బీఎల్ఓలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విచారణ జరపండి.. ఓట్ల తొలగింపు సమయంలో నివసించిన వారి ఓట్లు తొల గించినప్పుడు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నా రు. ఎస్.కోటలో ఎటువంటి విచారణ లేకుండా 14 ఓట్లు తొలగించటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటూ విచారణ జరిపించాలని ఆర్డీఓ వెంకటరావును ఆదేశించారు. వివాహితుల ఓటర్ల చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదే శించారు. ఓటరు కార్డులో సవరణలు కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ అవి నమోదు కావటం లేదని ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి పధకాలపై దృష్టి.. ప్రజల అవసరాల కోసం అమలు చేస్తున్న తాగునీటి పథకాలు త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీ పథకాలు వాటి పరిస్థితిపై సమీక్షించారు. డివిజన్లో ప్రారంభం కాని 16 పనులను తక్షణమే ప్రారంభించాలని ఎస్ఇ మెహర్ప్రసాద్ను ఆదేశించారు. ఎక్కడైనా స్థలం లేక ప్రాజెక్టులు రద్దు చేస్తే తప్పనిసరిగా సంబంధిత మండల ఎంపీడీఓల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నా రు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీలకు తాగునీటి సదుపా యం ఉన్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. -
అవినీతి ఊట!
సాక్షి, కొత్తగూడెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, సిబ్బందికి బంగారు బాతుగా మారింది. ఏటా రూ.వందల కోట్లతో పనులు చేపడుతుండడంతో పైస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకంలో రూ.3.5 కోట్లు స్వాహా అయితే కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రికవరీ చేయడం గమనార్హం.ఉపాధి హామీ పనులకు నిధులు పుష్కలంగా విడుదల అవుతుండడంతో అవినీతి ఏరులై పారుతోంది. మండల స్థాయి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది తమ చేతివాటంతో పనులు చేయకుండానే.. రికార్డుల్లో చేసినట్లు చూపించి అందినంత స్వాహా చేస్తున్న పరంపర ఈ పథకం ప్రారంభం నుంచీ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఆరు విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అధికారులు, సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన స్వాహాలో ఇంకా రూ.2 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన పెనుబల్లి, దమ్మపేట ఎంపీడీఓలను ఇటీవల సస్పెండ్ చేశారు. అలాగే 20 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 30 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. ఈ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 500 మంది పైగా క్షేత్ర స్థాయి సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. గతంలో పినపాక, కొత్తగూడెం, పెనుబల్లి, దమ్మపేట మండలాల్లో పనులు చేయకుండానే ఎక్కడికక్కడ బిల్లులు స్వాహా చేసి తమ మాయాజాలాన్ని ప్రదర్శించారు. నిధులు పక్కదారి పట్టిన మండలాల్లో ప్రత్యేకంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా కొత్తగూడెం మండలంలోని సుజాతనగర్ పం చాయతీ పరిధిలో సామాజిక తనిఖీ చేయగా సిబ్బంది రూ.3 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు బయటపడడం ఇందుకు నిదర్శనం. కూలీలకు వేతనాలు ఇవ్వకుండా నిధులు కాజేశారని తేలింది. ప్రతి ఏటా ప్రాజెక్టు డెరైక్టర్లు మారుతుండడం, పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక తనిఖీలున్నా బెదరరు.. నిధులు స్వాహా అయినట్లు ఫిర్యాదు అందిన వెంటనే సామాజిక తనిఖీలు చేస్తున్నా సిబ్బంది చేతివాటం మాత్రం షరామామూలుగా మారుతోంది. ఈ తనిఖీలను అధికారులు పూర్తి స్థాయిలో చేయకపోవడం, నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తుండడంతో ఉన్న సిబ్బంది నిధులు దండుకోవడానికి వెనకాడడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో మండలాల్లో రెండు నుంచి మూడు సార్లు సామాజిక తనిఖీలు చేస్తున్నా నిధుల స్వాహా తంతు కొనసాగుతూనే ఉంది. ఆ శాఖ ఉన్నతాధికారుల ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరిస్తేనే.. సిబ్బంది స్వాహా చేసిన డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కేసుల విషయంలో కూడా ఇదే తరహాలో దృష్టి పెడితే నిధుల స్వాహాకు కొంతమేరకైనా కళ్లెం వేయవచ్చు. మళ్లీ పోస్టింగ్‌లు దక్కించుకునే యత్నం.. తొలగించిన కొంతమంది సిబ్బంది పైరవీలతో మళ్లీ పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ తొలగించిన సిబ్బంది ప్రదక్షిణలు చేస్తున్నారు. రూ.లక్షల్లో మింగిన డబ్బు తమ వద్ద లేదని, ఇప్పుడు రికవరీ చేయకుండా సదరు ఆధికారులను ఆదేశించాలని.. స్వాహాకు పాల్పడినవారు ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటున్నారు. దీంతో రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో సామాజిక తనిఖీ విభాగం ఉన్నతాధికారులు రికవరీ చేయడానికి వెనకంజ వేస్తున్నట్లు తెలిసింది. సామాజిక తనిఖీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో రికవరీ చేయలేకపోతున్నారు. ఇలా ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నా సామాజిక తనిఖీలతో ఆయా సిబ్బంది బెదరక ఇంకా అవినీతి పాల్పడుతుండడంతో.. ఉపాధి హామీ పథకం అవినీతి ఊటగా మారింది. రికవరీ చేస్తాం ఇప్పటి వరకు జిల్లాలో ఏడు విడతలుగా ఆడిట్ పూర్తి చేశాం. సిబ్బంది స్వాహా చేసిన రూ.1.7 కోట్లు రికవరీ చేశాం. మిగిలిన నిధులను కూడా త్వరలో రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఉపాధి నిధులు స్వాహా చేసిన సిబ్బందిపై పోలీస్ కేసులు పెట్టాం. వేతనంలో కోత విధించి కొంత మేరకు రికవరీ చేయగలుగుతున్నాం. సోషల్ ఆడిట్ ద్వారానే ఏ స్థాయిలో నిధులు స్వాహా చేశారో తెలుస్తుంది. ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేయం. రికవరీలో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. -టి.రమేష్‌బాబు, డ్వామా విజిలెన్స్ అధికారి -
ఉపాధి హామీలో అక్రమాలు
బిచ్కుంద, న్యూస్‌లైన్: మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనులపై బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది చేతి వాటం బహిర్గతమైంది. కూలీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ సిబ్బం ది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించకుండా ఆయా గ్రామాలలో అడుగడుగునా అవినీతికి పాల్పడినట్లు బహిర్గతమైంది. మండలంలో 2013-14కుగాను రూ 3 కోట్ల 70 లక్షల పనులు జరిగాయి. సామాజిక తనిఖీ బృందం ఒక్కొక్కరి అక్రమాలు బయటకు తీసింది. పెద్ద దడ్గి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో పనులు చేయించకుండా యంత్రాలతో చేయించారని తనిఖీ బృందం గుర్తించింది. ఆయా గ్రామాలలో కూలీలకు కూలి డబ్బులు రాలేదని, కందకాలు, కాలువల పనులు చేయకుండానే పను లు చేసినట్లు రికార్డులు చూపించడం, మంజూరు లేని పనులు చేసి డబ్బులు కాజేయడం తదితర అవినీతికి పాల్పడ్డారు. చిన్న దేవాడలో సహదేవ్ పేరుతో విద్యార్థి లేకపోయినా ఐకేపీ సిబ్బంది స్కాలర్షిప్ రూ 2,400 డ్రా చేసుకున్నారు. అలాగే గుండెకల్లార్లో దమ్ముల శీలా విద్యార్ధి పేరుతో రూ 1,200, వడ్లం గ్రామంలో జ్యోతి, సుజాత, శివరాం, భూమయ్య, సవిత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 1,200 స్కాలర్షిప్ అందలేదు. ఫోర్జరీ సంతకాలు చేసి ఐకేపీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. కూలిడబ్బు లు, స్కాలర్షిప్ డబ్బులు తమకు అందలేదని వి ద్యార్థులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ చేపట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, అందని వారికి డబ్బులు అందిస్తామని ఏపీడీ కుమార స్వామి హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ అధికారి భూమేష్, ఏపీవో రాజు, ఈయా గ్రామల సర్పంచులు, కూలీలు పాల్గొన్నారు. -
బంగారు తల్లికి బాలారిష్టాలు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇంతవరకూ ఈ పథకం పై తనకే అవగాహన లేదని ఇటీవల ఓ ఎంపీడీఓ స్వయంగా అన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని అమలు చేశారు. 2005 మే నెలలో బాలికా సంరక్షణపథకం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీని స్థానంలో ఈ ఏడాది మే 1 నుంచి బంగారు తల్లి పథకాన్ని అమలు చేశారు. కొన్ని విమర్శల నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఈ పథకంకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీంతో పథకం అమలులో జాప్యం జరిగింది తొలుత చాలా మందికి ఈ పథకంపై అవగాహన కొరవడటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా దీనిపై పడింది. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బాండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులు గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. అయితే దరఖాస్తు పత్రంలో గ్రామ సంఘం ప్రతినిధితోపాటు ఏఎన్ఎం, వైద్యాధికారులు సంతకాలు చేయాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదలు సైతం ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది పనితీరుపై వారు పెదవి విరుస్తున్నారు. ‘మీరు మా వద్ద టీకాలు వేయించుకోలేదని.. మీ సమాచారం మా వద్ద లేదని తాము సంతకాలు చేయలేమని’ చాలా చోట్ల ఏఎన్ఎంలు, డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదుచేయించుకున్నవారికి ఏఎన్ఎంలు క్రమం తప్పకుండా టీకాలు వేసి గర్భవతులపేర్లను నమోదు చేసుకుంటారు. ప్రైవేటు వైద్యుల వద్ద చూపించుకోవడంతో వారెవరో తమకు తెలియదని సంతకాలు చేయడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. మండల సమాఖ్య అధికారులకు శనివారం జిల్లా స్థాయిలో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల చేతనైనా సరే సంతకాలు చేయించాలని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే దరఖాస్తులో రేషన్ కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయాల్సి ఉంది. చాలా మందికి పెళ్లి అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డుకు దరఖాస్తుచేసినా మళ్లీ వచ్చే రచ్చబండలో కానీ ఇవ్వడం లేదు. 2011 నవంబర్‌లో రచ్చబండ జరగగా మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే బంగారుతల్లి పథకంకు సంబంధించిన సమాచారంపై అవగాహన లేక చాలా మంది అరకొరగా దరఖాస్తులను భర్తీ చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు వీటిని తిప్పిపంపుతున్నారు. అన్ని వివరాలను పూర్తి చేస్తేనే మీకు అర్హత లభిస్తుందంటున్నారు. పథకం ఒక ఆడపిల్లకే వర్తిస్తుందా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టినా వర్తిస్తుందా, కవలలు పుడితే పరిస్థితి ఏమిటి వంటి విషయాలపై ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. ఆపరేషన్ చేయించుకున్నవారికే పథకం వర్తిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పుట్టిన ఆడపిల్ల చదువుకోకపోతే ఈ పథకం వర్తించదు. అంగన్వాడీ కేంద్రం మొదలు ఇంటర్మీడియట్ వరకు చదివి పాస్ అయితే రూ.55వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష కలిపి మొత్తం రూ.1.55లక్షలు 21 ఏళ్లు వచ్చేనాటికి అందజేస్తారు. నగదు బదిలీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 155321తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా అధికారులు పూర్తి స్థాయిలో ఈ పథకంపై ప్రచారం చేయాల్సి ఉంది. -
ఎంపీడీఓల బదిలీల్లో ‘మంత్రాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీలకు తెర వెనుక ‘మంత్రా’ంగం నడుస్తోంది. బదిలీలపై ఆంక్షలున్నప్పటికీ, ఖాళీలను సాకుగా చూపి.. ఎంపీడీఓలకు స్థానచలనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పావులు కదుపుతోంది. మొయినాబాద్ ఎంపీడీఓగా పనిచేస్తున్న యాదయ్య ఇటీవల అపార్డ్‌కు బదిలీ అయ్యారు. దీంతో ఖాళీ అయిన ఈ పోస్టును దక్కించుకునేందుకు ఎంపీడీఓల మధ్య రేసు మొదలైంది. ఈ క్రమంలోనే జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ కనుసన్నల్లో పనిచేసే అధికారులను ఈ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా పలువురు ఎంపీడీఓలు ఈ ఇరువురి ప్రాపకం కోసం పైరవీలు మొదలుపెట్టారు. దీంతో ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ సిఫార్సు లేఖలతో ‘సమన్యాయం’ చేస్తున్నారు. హాట్ సీటు కోసం నగరానికి చేరువగా ఉన్న ఈ మండల ంపై కన్నేసిన గ్రామీణ ప్రాంత ఎంపీడీఓలు మంత్రి, మాజీ మంత్రి సిఫార్సు లేఖలతో సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మోమిన్‌పేట ఎంపీడీఓ సువిధ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉన్న మొయినాబాద్‌కు బదిలీ చేయాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌ను అభ్యర్థిం చడం.. ఆయన సానుకూలంగా స్పందించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఆమె పేరును సూచిస్తూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మాజీ మంత్రి సబితతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ పోస్టింగ్‌కు సిఫార్సు చేయించుకున్నారు. మొయినాబాద్ కుర్చీ కోసం ఇద్దరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అనూహ్యంగా పలువురు ఆశావహులు తెరమీదకు వచ్చారు. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్, గతంలో శంకర్‌పల్లిలో పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సుభాషిణి కూడా ఈ సీటు రేసులో ఉండడం గమనార్హం. కుర్చీలాట ఇదిలావుండగా పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మొయినాబాద్ సీటు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెది తనకు గుర్తెరిగిన కుటుంబం కావడంతో మాజీ మంత్రి సబిత ఆమె నియామకానికి మొగ్గుతున్నట్లు సమాచారం. మంత్రి ప్రసాద్ సిఫార్సు చేసిన సువిధ కు తన నియోజకవర్గంలోని మహేశ్వరం పోస్టు ను ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మండలంలోని గ్రామాలన్నీ నగర పంచాయతీలుగా మారడంతో సరూర్‌నగర్‌లో ఎంపీడీఓ పోస్టు రద్దు అనివార్యమవుతోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న శోభారాణిని మొయినాబాద్‌కు బదిలీచేసే అంశాన్ని పరిశీలించాలని సబిత సిఫార్సు చేసినట్లు తెలిసింది. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్‌ను మొయినాబాద్‌కు షిఫ్ట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్.రత్నం జిల్లా యంత్రాంగానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇలా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ఎంపీడీఓలు సచివాలయం, జెడ్పీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఉన్నతాధికారులకు చీరాకు తెప్పిస్తోంది. ఎవరికివారు కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఇదీ మూలం హయత్‌నగర్ ఎంపీడీ ఓ అరుణను రాత్రికేరాత్రే కుత్బుల్లాపూర్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న జ్యోతిని ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి కొందరు ప్రత్యేక జీఓలు తెచ్చుకోవడం.. మొయినాబాద్ ఎంపీడీఓ కుర్చీ ఖాళీ కావడం తో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధికారుల మధ్య కుర్చీలాటకు దారితీసింది. దీంతో గత వారం పదిరోజులుగా బదిలీల వ్యవహారం అధికార వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. -
రచ్చబండకు రాజకీయ రంగు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైనా తనకు అనుకూలంగా మలచుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలుండటంతో పాలకులు హడావుడి చేస్తున్నారు. పేదలను ఆదుకునేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఓట్లు దండుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే మూడో విడత రచ్చబండను రాజకీయ వేదికగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల స్థాయి నేతలకు రచ్చబండలో ప్రాధాన్యం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ముగ్గురు సభ్యులతో కమిటీ: రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసిన లబ్ధిదారులతో పాటూ గత నెల 24 దాకా గృహ నిర్మాణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల విభాగానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులకు పథకాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు, వారందరినీ మండల స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకువీలుగా ఓ కమిటీని వేయనున్నారు. ప్రభుత్వ ప్రయోజనం పొందే లబ్ధిదారులను సమీకరించే బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించి అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వేసే ఈ కమిటీలో సర్పంచ్, ఏదైనా మహిళా గ్రూపు సభ్యురాలు, ఎంపీడీఓ నామినేట్ చేసే వ్యక్తి మరొకరిని సభ్యులుగా నియమిస్తారు. యూనిట్లు పంపిణీ చేసే సమయంలో, లబ్ధిదారులకు అవగాహన కల్పించే విషయంలో వీరి పాత్ర ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులకు కాకుండా అధికార పార్టీ వర్గాలకు బాధ్యతలు అప్పగించడంతో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నచోట వారు చూసుకుంటారు. లేనిచోట కమిటీల ఎంపికలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తనకు ప్రయోజనం కలిగేలా చూసుకోవడం సాధారణమే అయినా..లబ్ధిదారులకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆరింటికి రచ్చబండ మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, బంగారు తల్లి పథకంలో లబ్ధిదారులకు బాండ్ల అందజేత, ఇందిరమ్మ కలలు పథకంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు 50 యూనిట్లలోపు వాడుకునే వారికి విద్యుత్ చార్జీల చెల్లింపులకు లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను విచారించి ఆన్లైన్లో నమోదు చేశారు. మొదటి విడత రచ్చబండ దరఖాస్తులకు మోక్షం కలిగేందుకు ఏడాదికిపైగా పట్టింది. రెండో విడత విన్నపాలకు అంతకంటే ఎక్కువ సమయమే పట్టింది. లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే లబ్ధిపొందేది మాత్రం వేలల్లోనే. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే దిక్కులేదు. ఇక వీటికి ఎప్పటికి మోక్షం కలుగుతుందోనని ప్రజలు విమర్శిస్తున్నారు.