నల్లగొండ : మండల పరిషత్ కార్యాలయాలకు శాశ్వత అధికారులు లేక ఇన్‌చార్జిల ఏలుబడిలో మగ్గుతున్నాయి. స్థానికంగా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఎంపీడీఓలు సొంత శాఖ సేవలపైన మొహం చాటేశారు. రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఎంపీడీఓలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోగా...మరికొంత మంది హైదరాబాద్ వదిలిరాలేక అక్కడే మకాం వేశారు. మరికొంత మంది పొరుగు శాఖల్లో పునరావాసం పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు, దీపం కనెక్షన్లు, ఆసరా పెన్షన్లు సామాన్య ప్రజలకు చేరకుండానే మధ్యవర్తులు ఎగురేసుకుపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెన్ సర్వీసు పేరుతో ఎంపీడీఓలు మండలాలు వదిలి పట్టణాల బాట పట్టడంతో వారి బాధ్యతలు సమీప మండలాల్లోని ఎంపీడీఓలు, సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకు అప్పగించారు. చం డూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా వెళ్లడ ంతో సంస్థాన్ నారాయణ్‌పురం ఎంపీడీఓకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోనే ఉం టూ మండలాల్లో పనిచేయడం కష్టమని భావించిన కొందరు జిల్లా నీటి యాజమాన్య సంస్థకు వచ్చి చేరారు. ఇప్పటికే జిల్లా పరిషత్ బదిలీలు లేక సిబ్బంది కొరతతో సతమతమవుతంటే పనిచేయాల్సిన ఎంపీడీఓలు మండలాలు వదిలి రావడంతో ఆ మండలాల్లో ప్రభుత్వ పరంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి.
అభివృద్ధికి ఆటంకం...
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంపీడీఓలు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లపై అదనపు భారం పడింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి ప్రతిబంధకం గా మారింది. ఈ మండలాల్లో ప్రత్యేక ంగా అదనపు అధికారులకు నియమిస్తే తప్ప మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినత స్థాయిలో ముందుకు సాగదనిపిస్తోంది. దీపం కనెక్షన్లు, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు ఎంపిక చేసే క్రమంలో కూడా ఇన్‌చార్జ్‌లు అనే క సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలైన డిండి, చింతపల్లి,మోతె, నాంపల్లి, నూ తనకల్ మండలాల్లో ప్రభుత్వ పథకాల అమలు అ యోమయంగా తయారైంది. ఈ మండలాల్లో ఎంపీడీఓలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల సమచారం కూడా ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి ఉంది.
జిల్లా పరిషత్‌లో..
ఇక జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈఓ, డిప్యూటీ సీఈవో, ఏఓ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించకపోవడంతో రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈఓగా నియమించారు. కట్టంగూరు ఎంపీడీఓకు అదనంగా డిప్యూటీ సీఈఓ, తిప్పర్తి ఎంపీడీఓకు ఏఓ బాధ్యతలు అప్పగించారు. కాగా తిప్పర్తి ఎంపీడీఓ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నందున ఏఓ పోస్టు కూడా ఖాళీ కానుంది.
రాజకీయ యుద్ధాలు...
ఇప్పుడున్న ఎంపీడీఓలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో నియమించారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నేతల నుంచి అనేక ఒత్తిళ్లు వస్తుండడంతో మండలా కార్యాలయాల్లో రాజకీయ యు ద్ధాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు ఉన్న మండలాల్లో ఎంపీడీఓలకు, ఎంపీపీలకు మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. పీఏపల్లి ఎంపీపీ అక్క డి ఎంపీడీఓపై అనేక సమావేశాల్లో ఫిర్యాదు చేశారు. అలాగే గుర్రంపోడు, మోత్కూరు, గరిడేపల్లి, పోచంపల్లి మండలాల్లో ఎంపీడీఓలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య ఘర్షణలు పెచ్చుమీరాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలో రెండు గ్రూపులు ఉన్న మండలాల్లో అయితే అధికారులు విధులు వదిలి పారి పోయే పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎంపీడీఓలను మార్చాలని గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో రాజకీయ ఒత్తిళ్లు ద్వారా ఏలాగైన సరే వారిని బయటకు పం పించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.
ఎంపీడీఓలు లేని మండలాలు
అనుముల, చింతపల్లి, డిండి, మోతె, నాంపల్లి, నిడమనూరు, నూత నకల్, రామన్నపేట, తుంగతుర్తి, యాదగిరిగుట్ట, మునుగోడు. ఈ నెలఖారుకు పదివీ విరమణ కారణంగా ఖాళీగా అయ్యే మండలాల్లో బొ మ్మలరామారం,మునగాల, తిప్పర్తి, ఆత్మకూరు (ఎం).
ఫారెన్ సర్వీసు పేరుతో పొరుగు శాఖల్లో ఉన్న వారు..
ఎం.నాగేశ్వరారవు (సెర్ప్ హైదరాబాద్), పి.శైలజారెడ్డి (జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ ), ఎం.కాళిందిని (డ్వామా, నల్లగొండ), శర్మద (డ్వామా, పశ్చిమ గోదావరి), పి.ఉమాదేవి (డీఆర్ డీఏ రంగారెడ్డి), ఏ.సునీత (స్టేట్ ఎలక్షన్ కమిషన్, హైదరాబాద్), రఘు రాం (జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్), ఇందిర (డ్వామా, నల్లగొండ), చండూరు ఎంపీడీఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు, సూర్యాపేట ఎంపీడీఓ మంత్రి పీఏగా వెళ్లారు. దీంతో పదవీ విరమణ అయ్యే మండలాలతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 59 మండలాలకు గాను 17 మండలాలు ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలో ఉన్నాయి.
మండల పరిషత్‌లు ఖాళీ...!
Published Sat, Jun 27 2015 11:40 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement