సాక్షి, తాడేపల్లి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రమోషన్ సమస్యను తీర్చినందకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోలు. ఈ క్రమంలో మంగళవారం ఎంపీడీవోలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ని కలిశారు. తమ ప్రమోషన్స్ వల్ల కింది స్థాయిలోని 13 కాడెర్స్ వారికి ప్రమోషన్స్ వస్తున్నాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎంపీడీవోలకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక తమకు న్యాయం జరిగిందన్నారు. మరో పదిరోజుల్లో తమ ప్రమోషన్స్ ఉత్తర్వులు రానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్లో లక్ష మంది పంచాయతీరాజ్ ఉద్యోగులతో కృతజ్ఞత సభ పెడతాం అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఉద్యోగులకు పీఆర్సీ వంటివి అన్ని అమలు చేస్తారన్నారు.
నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ న్యాయం చేశారు
‘‘మాలో కొంత మంది రిటైర్ కూడా అయ్యారు. నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ మాకు న్యాయం చేశారని’’ ఎంపీడీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.బ్రహ్మయ్య తెలిపారు. గతంలో వైఎస్సార్ దీనికోసం కృషి చేశారు... ఆయన కుమారుడు ఇప్పుడు అమలు చేశారన్నారు. సీఎం జగన్ నిర్ణయం వల్ల ఒకే సారి 300 మందికి ప్రమోషన్స్ వస్తున్నాయన్నారు. ఈ క్రమంలో తాము కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుని పనిచేస్తామన్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment