MPDOS
-
30 లోగా జీపీ పనులు ప్రారంభించండి
పంచాయతీ భవనాల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని, కొన్ని ఇంకా ప్రారంభించలేదని సాక్షిలో మంగళవారం ప్రచురిత మైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ శరత్ స్పందించారు. రివ్యూ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలన్నింటినీ గ్రౌండింగ్ చేసి, పనులు ఈనెల 30 లోపు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ● స్వచ్ఛ సర్వేక్షణ్ కింద మూడు కేటగిరీలలో 15 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఆయా కేటగిరీలలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా సంబంధిత అధికారులు, ప్రత్యేక అధికారులు చూసుకోవాలన్నారు. ● హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో ఆయా అధికా రులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు ప్రణాళికతో మొక్కలు నాటాలని సూచించారు. ● హరితహారంలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్స్, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, విద్యాసంస్థల్లో నాటిన మొక్కలలో గల గ్యాప్స్ పూర్తి చేయాలని తెలిపారు. ● ఎంపీడీవోలు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ● బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం కింద జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు. ● మహిళా సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్య శాఖ సబ్ సెంటర్ బిల్డింగ్స్ నిర్మాణాలపైనా దృష్టి సారించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డీపీఎంలకు కలెక్టర్ సూచించారు. ● మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో మండలంవారీగా సమీక్షించారు. ● ఆయా పాఠశాలల్లో మంజూరైన పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ● పనుల పురోగతిపై రెగ్యులర్‌గా సమీక్షించాలని డీఇఓకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీపీఓ సురేష్ మోహన్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, డీ ఎల్పీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, ఏపీవోలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఎంఈఓలు, ఎంఈలు పాల్గొన్నారు. సర్వే నూరు శాతం చేయాలి ఎలక్ట్రోలు ఇంటింటి సర్వే నూరు శాతం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో డీఆర్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లతో ఈసీఐ నియమావళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బీఎల్ఓ, వీఎల్ఓ, బీఆర్ఓ, సూపర్ వైజర్లు ఇంటింటి సర్వే చేసి బోగస్ ఓట్లు గుర్తించాలన్నారు. 18 నుంచి 29 ఏళ్ల వారిని గుర్తించడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నా రు. మండలాలలో ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఓటరు ఎన్రోల్ మెంట్ నూరు శాతం చేయాలన్నారు. ఓటర్ లిస్టును క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. బోగస్ ఓట్ల నమోదు కాకుండా చూడాలన్నారు. బీఎల్ఓలు 80 ఏళ్ల వయసు గల ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు. 1,400 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండాలన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓటర్లకు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరా రెడ్డి, డీఆర్ఓ నగేశ్, అధికారులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం
అమరావతి: దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ కేఎన్వీ.ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావులు ఉన్నారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు వీరంతా సీఎం జగన్‌ను సన్మానించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోలకు పదోన్నతులను సీఎం జగన్ ఇచ్చారు. కొత్తగా 51డీఎల్డీవో పోస్టులు సృష్టించి ఏప్రిల్ లో పదోన్నతులు ఇచ్చారు. జిల్లాల విభజన ప్రక్రియ వల్ల ఏప్రిల్ ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వలేకపోయారు. వెంటనే ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే సీఎం ఆదేశించారు.నిన్న అర్హత కల్గిన ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ వ్యక్తిగతంగా అన్ని జిల్లాలకు నిన్న ఆదేశాలు పంపారు.పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్ ను కలిసి కృతజ్ణతలు తెలిపాం.గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎం ను కోరాం. అందుకు సీఎం జగన్ అంగీకరించారు’ అని తెలిపారు. చదవండి: CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల -
సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల
సాక్షి, అమరావతి: ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు. పదోన్నతులు పొందిన ఎంపీడీవోలలో నలుగురు జడ్పీ సీఈవో హోదాలో, మరో నలుగురు డీపీవోలుగా, 13 మంది డిప్యూటీ సీఈవోలుగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో 11 మంది, మరో ఆరుగురు డీఆర్‌డీఏలలో నియమితులయ్యారు. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారులుగా (డీఎల్డీవో) 44 మంది నియమితులు కాగా 118 మందిని జిల్లాల్లోని డ్వామా కార్యాలయ పరిధిలో వివిధ హోదాల్లో నియమించారు. ఇతర శాఖలో 37 మందిని నియమించారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీడీవోలలో మూడో వంతు మంది ఒకే విడతలో పదోన్నతులు పొందడంతో కిందిస్థాయిలో దాదాపు 1,000 మందికి పదోన్నతులు దక్కుతాయని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది. దీర్ఘకాల సమస్యకు పరిష్కారం పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీవోలు 312 మంది దాకా ఉండగా అందుకు అవకాశం ఉన్న పోస్టులు 13 మాత్రమే ఉండడంతో పాటు సీనియారిటీ జాబితా తయారీలో వివాదాల కారణంగా పాతికేళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతుల అంశం అపరిష్కృతంగా మిగిలింది. మండలాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎంపీడీవోల నియామకం, సర్వీసు రూల్స్‌పై విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ఒకేసారి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపకపోవడంతో సమస్య మరుగున పడింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి సారించి తొలుత ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. అయితే ఇక్కడ కొలిక్కిరాకపోవడంతో సీఎం జగన్ ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈక్రమంలో వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదన్నోతులు కల్పించేందుకు ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించారు. ఎంపీడీవోల పదోన్నతుల కోసమే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 51 డీఎల్డీవో పోస్టులు కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి తోడు 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌కు ధన్యవాదాలు ‘గత 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోని కారణంగా పంచాయతీరాజ్ శాఖలోని 12 క్యాడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. ఉద్యోగుల మనోవేదనను అర్ధం చేసుకొని రికార్డు సంఖ్యలో 237 మందికి ఒకేసారి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం జగన్‌కు ఎంపీడీవోల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ –వై.బ్రహ్మయ్య (ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు), జీవీ నారాయణరెడ్డి (ప్రధాన కార్యదర్శి), కె.శ్రీనివాసరెడ్డి (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్), డి.వెంకట్రావు (గౌరవాధ్యక్షుడు), కెఎన్వీ ప్రసాదరావు( కన్వీనర్), జీవీ సూర్యనారాయణ,ప్రతాప్‌రెడ్డి (ఉపాధ్యక్షుడు) -
ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా ఎంపీడీవోలు కంటున్న కలలు నెరవేరుతున్నాయి. 25 సంవత్సరాల కిందట ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరినవారు కూడా అప్పటి నుంచి పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నేరవేరబోతుంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్‌కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణాభివృద్ధిశాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధిశాఖలోని కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్‌షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్‌డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్‌లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు. 200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి.. పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఇప్పటికే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. -
నవంబర్‌లో లక్షమందితో కృతజ్ఞత సభ
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీఓల పదోన్నతి సమస్యను పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఏపీ ఎంపీడీవో అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వారు సీఎంను కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో వెంకటరామిరెడ్డి మాట్లాడారు. పాతికేళ్ల నుంచి అపరిష్కృతంగా.. పదోన్నతులు లేకుండా ఎంపీడీవోలు పాతికేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని.. తమ ఆవేదనను సీఎం జగన్‌కు తెలుపగా సమస్యను పరిష్కరిస్తానని కొద్ది రోజుల క్రితమే హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అన్నట్లుగానే అతితక్కువ కాలంలో ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో దాదాపు 300 మంది ప్రమోషన్లు పొందుతున్నారని ఆయన వివరించారు. దీనివల్ల పంచాయతీరాజ్ శాఖలోని 13 కేడర్లకు చెందిన 2,500 మంది కిందిస్థాయి సిబ్బందికీ ప్రమోషన్ల అవకాశం కల్గిందని ఆయన తెలిపారు. మరో పదిరోజుల్లో ఉత్తర్వులు రానున్నాయన్నారు. అలాగే, అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులను పర్మినెంట్ చేస్తారని వెంకటరామిరెడ్డి చెప్పారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అందరితో కలిపి నవంబర్‌లో లక్షమంది ప్రభుత్వోద్యోగులతో విజయవాడలో సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞత సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కరోనాతో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని.. పరిస్థితి మెరుగయ్యాక ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ పరిష్కరిస్తామని సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారని.. ఆయనపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయన్నారు. నమ్మకం పోతున్న సమయంలో న్యాయం ఏపీ రాష్ట్ర ఎంపీడీవోల అసోసియేషన్ అధ్యక్షులు వై. బ్రహ్మయ్య మాట్లాడుతూ.. తమలో కొంతమంది ఇప్పటికే రిటైరయ్యారని.. నమ్మకంపోతున్న ఈ సమయంలో సీఎం జగన్ దేవుడిలా న్యాయం చేశారని తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ తమకోసం కృషిచేశారని.. ఇప్పుడు ఆయన తనయుడు తమ కోరికలను అమలుచేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులులేక ఇబ్బందులు పడ్డామని.. ఈ సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. నిజానికి నాలుగు నెలల వ్యవధిలోనే ఫైల్ ఆమోదం పొందడం గొప్ప విషయమని బ్రహ్మయ్య తెలిపారు. ఎంపీడీవోలు అందరం నూరుశాతం బాధ్యతతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎంపీడీవోలు అందరి తరçఫున ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఎంపీడీవో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవీ నారాయణరెడ్డి, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కేఎన్వీ ప్రసాదరావు, పెన్నా రాఘవేంద్రనాథ్, మహిళా కార్యదర్శి నాతి బుజ్జి, కే శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోలు
సాక్షి, తాడేపల్లి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రమోషన్ సమస్యను తీర్చినందకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోలు. ఈ క్రమంలో మంగళవారం ఎంపీడీవోలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ని కలిశారు. తమ ప్రమోషన్స్ వల్ల కింది స్థాయిలోని 13 కాడెర్స్ వారికి ప్రమోషన్స్ వస్తున్నాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎంపీడీవోలకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక తమకు న్యాయం జరిగిందన్నారు. మరో పదిరోజుల్లో తమ ప్రమోషన్స్ ఉత్తర్వులు రానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లో లక్ష మంది పంచాయతీరాజ్ ఉద్యోగులతో కృతజ్ఞత సభ పెడతాం అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఉద్యోగులకు పీఆర్సీ వంటివి అన్ని అమలు చేస్తారన్నారు. నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ న్యాయం చేశారు ‘‘మాలో కొంత మంది రిటైర్ కూడా అయ్యారు. నమ్మకం పోతున్న సమయంలో సీఎం జగన్ మాకు న్యాయం చేశారని’’ ఎంపీడీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.బ్రహ్మయ్య తెలిపారు. గతంలో వైఎస్సార్ దీనికోసం కృషి చేశారు... ఆయన కుమారుడు ఇప్పుడు అమలు చేశారన్నారు. సీఎం జగన్ నిర్ణయం వల్ల ఒకే సారి 300 మందికి ప్రమోషన్స్ వస్తున్నాయన్నారు. ఈ క్రమంలో తాము కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుని పనిచేస్తామన్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం
‘‘25 ఏళ్లుగా ఎంపీడీఓగా పనిచేస్తున్నా.. ఇప్పటివరకూ ఉద్యోగోన్నతి లేదు. ప్రమోషన్ సాధించాలనేది మా ఎంపీడీఓల కల. ఆ కలను సాకారం చేసిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి’’ అంటూ గుంటూరు జిల్లా దాచేపల్లి ఎంపీడీఓ వై.మహాలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఎంపీడీఓల ఉద్యోగోన్నతికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మహాలక్ష్మీకి కూడా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా దాచేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెండుచేతులూ జోడించి నమస్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కటకం బ్రహ్మనాయుడు, కందుల జాను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, ఈఓపీఆర్డీ మంగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. - దాచేపల్లి -
అంతంకాదిది.. ఆరంభమే..
సాక్షి, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక నెల రోజులతోనే అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పనులను గుర్తించడం.. పరిష్కరించడం.. కొనసాగించడంపై నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. జిల్లాలో డీఆర్డీఏ ద్వారా నిరంతరం పనులు కొనసాగించాలని సూచించారు. సర్పంచ్‌తో సహా అంతా ఐక్యంగా ఉండి.. కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో నిరూపించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు గ్రామ పంచాయతీ నిధులను పెంపొందించేందుకు వందశాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి బుధవారం మండల స్థాయిలో జరిగే సమావేశానికి సర్పంచ్‌లు సైతం హాజరయ్యేలా సర్క్యులర్ జారీ చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. 584 గ్రామ పంచాయతీల్లో.. 100 జీపీల్లో డంపింగ్ యార్డులు ఉంటే.. ఇప్పటికే సుమారు 500 డంపింగ్ యార్డులకు స్థలాలను గుర్తించామన్నారు. అదే విధంగా 75 శ్మశాన వాటికలు ఉంటే, ప్రస్తుతం 520 శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. జిల్లాలో త్వరలో రాష్ట్రస్థాయి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శిస్తాయని, ఎక్కడైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్చార్జ్ డీపీఓ హన్మంతు కొడింబా మాట్లాడుతూ 30 రోజులుగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేశారన్నారు. మరో నెల రోజులు కూడా వాటిని కొనసాగించేందుకు యాక్షన్ ప్లాన్‌పై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో సర్పంచ్‌తోపాటు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి గుణాత్మక మార్పును తీసుకొచ్చారన్నారు. ప్రతి జీపీ నుంచి అధికారులు సమర్పించిన వివరాలను ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించి.. ఇవన్నీ సరైన వివరాలే అని నిర్ధారించి ఆన్లైన్లో నమోదు చేశారని, ఈ వివరాలు రాష్ట్రస్థాయి వరకు ఉంటాయని, ఏమైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచ్ల ఆవేదన కాగా.. సర్పంచ్‌లు తమ ఆవేదనను కలెక్టర్ కర్ణన్ ఎదుట వెలిబుచ్చారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేయాలని ఆదేశించారని.. మేం క్షేత్రస్థాయిలో పనులు చేస్తుంటే నగదు అందించడం లేదని వాపోయారు. విద్యుత్ శాఖాధికారులు పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదని, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికకు సంబం«ధించిన స్థలాల అంశం, ఒక ప్రాంతంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు వేర్వేరుగా పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే తదితర సమస్యలను వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కర్ణన్ సమన్వయంతో ముందుకెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి బి.ప్రవీణ, డీఆర్డీఓ ఇందుమతి, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్ జెడ్పీ సీఈఓ ప్రియాంక, విద్యుత్ శాఖ డీఈ రామారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్పంచ్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి, కడప(రాజంపేట) : ఏళ్ల తరబడి ఒక పోస్టులో సేవలందించిన మండలపరిషత్ అభివృద్ధి అధికారులు పదోన్నతులు లేకుండానే అదే పోస్టులో ఫెవికాల్‌వీరులుగా నేటి వరకు కొనసాగారు. ఒకేపోస్టులో రెండు దశాబ్ధాలు పైబడి పని చేశారు. 1992 నుంచి ఇలాంటి ఎంపీడీఓలు ఎందరో ఉన్నారు. కొందరైతే అదే పోస్టులో రిటైర్ అయ్యారు. మరికొందరు మృతి చెందారు. ఎంపీడీఓలుగా ఉన్న వీరు పదోన్నతి లేక అలాగే ఉండిపోయారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్‌సర్కారుతో.... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీడీఓలకు పదోన్నతులకు మోక్షం కలిగింది. దీంతో ఎంపీడీఓల మోములో ఆనందం వెల్లివిరిస్తోంది. రిటైర్ అయ్యేలోపు తాము పదోన్నతి పొందుతామో లేదో అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న వీరికి ప్రభుత్వ నిర్ణయం ఉపశమనం కలిగింది. జిల్లాలో ఇటువంటి వారు 20 మందికిపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మచ్చుకు జిల్లాలో... జిల్లాలో సుదీర్ఘకాలంగా ఎంపీడీఓలుగారమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, విజయకుమారి, వెంకటేశ్, జయసింహ, మల్రెడ్డి, వెంకటేశ్వర్లు, మెగిలిచెండు సురేష్, వెంకటసుబ్బయ్య, మద్దిలేటితో తదితరులు పని చేస్తున్నారు. వీరంతా ఎంపీడీఓలుగా నేటికి కొనసాగుతున్నారు. వీరు పదోన్నతి పొందితే జిల్లాపరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓ, సీఈఓలుగా పని చేసేందుకు వీలవుతుంది. జీఓజారీ చేసిన సర్కారు.. పదోన్నతులు లేకుండా సుదీర్ఘంగా ఎంపీడీఓలుగా కొనసాగుతున్న వారి కోసం ప్రభుత్వం జీఓ నెంబరు 143 జారీ చేసింది. ఈజీఓ ప్రకారం ఎంపీడీఓలు పదోన్నతుల కోసం కాన్సుటేషన్ కమిటీ వేశారు. వీరి సీనియారిటీ ప్రకారం పదోన్నతుల కోసం నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. కొత్త సర్వీసు విధానాలు(2001) ప్రకారం ఎంపీడీఓల పదోన్నతుల విషయం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక కమిటీ ఇలా.. సుదీర్ఘకాలంగా పని చేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎఏస్‌లు ఉన్నారు. కమిటీ చైర్‌పర్సన్‌గా రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సాంబశివరావు, సభ్యులుగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ దివ్వేది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనరు ఎం.గిరిజశంకర్‌లు ఉన్నారు. -
నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు
సాక్షి, రంగారెడ్డి : ఈ నెలాఖరు నాటికి ఆయా మండలాలకు కొత్త ఎంపీడీఓలు రానున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత మండలాలు 21 ఉండగా.. ఇందులో 8 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఈఓఆర్డీలు, సూపరింటెండెంట్లు ఇన్చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న పదోన్నతుల్లో భాగంగా ఈ మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు బాధ్యత తీసుకోనున్నారు. జిల్లా పరిషత్‌లో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఎంపీడీఓగా పదోన్నతి పొందేందుకు పది మంది సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీ పోస్టుల కోసం 11 మంది సీనియర్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. సీనియారిటీ, పనితీరు ఆధారంగా వీరికి పదోన్నతులు లభించనున్నాయి. రిమార్కులు, మెమోలు ఉంటే.. పదోన్నతులు పొందేందుకు అనర్హులే. అందిన దరఖాస్తులను నిర్దేశిత ప్రమాణాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు పరిశీస్తున్నారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ పదోన్నతుల ద్వారా ఎంపీడీఓలు, ఈఓఆర్డీ పోస్టు లు భర్తీ కానున్నాయి. అంతేగాక డివిజన్ లెవల్ పంచాయతీ అధికారులు కూడా రానున్నారు. జిల్లాలో ఐదు డీఎల్పీఓ పోస్టులకుగాను.. ఒక్కరే పనిచేస్తున్నారు. నాలుగు పోసు ్టలు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా జరగబోయే పదోన్నతుల ద్వారా ఇవి భర్తీ కానున్నాయి. ఖాళీలు ఇక్కడే.. మహేశ్వరం, కడ్తాల్, చౌదరిగూడం, నంది గామ, కొందుర్గు, షాబాద్, కేశంపేట, తలకొండపల్లి మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కావడంతో.. జూన్ 4 నుంచి కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ మండల పరిషత్‌లు మనుగడలోకి వచ్చాయి. తలకొండపల్లి ఎంపీడీఓ పోస్టు ఏడాదిగా, మిగిలిన నాలుగు మండలాల్లో దాదాపు ఆరునెలలుగా ఖాళీగా ఉన్నాయి. అప్పటి ఇక్కడ ఇన్చార్జి ఎంపీడీఓలే ఉన్నారు. -
అధికారుల వనవాసం ముగిసింది
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పక్క జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు తిరిగి తమ పూర్వ స్థానాలకు చేరుకున్నారు. నాలుగు నెలల క్రితం జిల్లాలోని తహసీల్దార్లను, మండల అభివృద్ధి అధికారులను జోనల్ పరిధిలో గల విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు బదిలీ చేశారు. వారు తిరిగి సోమవారం నాటికి సొంత జిల్లాకు చేరుకున్నారు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చారు. వారు కూడా ఒకటి రెండు రోజుల్లో వారి జిల్లాలకు వెళ్లనున్నారు. 41 మంది తహసీల్దార్లు జిల్లాకు రాక సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వెళ్లిన 41 మంది తహసీల్దార్లు జిల్లాకు చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లాలో వివిధ మండలాలు, ఆర్డీఓ కార్యాలయంలో పోస్టింగులు ఇవ్వాల్సివుంది. మన జిల్లాలో ఎన్నికల విధుల్లో గత నాలుగు నెలలుగా ఉన్న 41మంది తహసీల్దార్లు కూడా వారి స్వంత జిల్లాలకు వెళ్లనున్నారు. మన జిల్లాకు విజయనగరం నుంచి 13, విశాఖపట్నం నుంచి 28 మంది తహసీల్దార్లు వెనక్కు వచ్చారు. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సివుంది. శ్రీకాకుళం డివిజన్‌కు తహసీల్దార్ల కొరత తహసీల్దార్లు వెనక్కు వచ్చినా శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలో కొరత అలాగే ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవిన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చిన దృష్ట్యా స్వంత రెవిన్యూ డివిజన్లో వారికి పోస్టింగ్ ఇవ్వరాదని జీవోను విడుదల చేసింది. ఈ జీవో మంచిదే అయినప్పటికీ, అంత పెద్ద మొత్తంలో తహసీల్దార్లు లేదు, జిల్లాలో ఉన్న 41 మంది తహసీల్దార్లలో ఇతర రెవిన్యూ డివిజన్లకు చెందిన వారు 8మంది మాత్రమే ఉన్నారు. ఇతర జిల్లాకు చెంది ఈ జిల్లాలో ఉండాలని కోరుకున్న వారు మరో ముగ్గురు ఉన్నారు. అంటే 11 మంది తహసీల్దార్లు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం రెవిన్యూ విడిజన్ పరిధిలో 13 మండలాలకు 13 మంది తహసీల్దార్లు ఉండాలి, అలాగే శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా ఇద్దరు ఉండాలి. అలా ఇతర శాఖల్లో కూడా అంటే ఎపీఈపీడీసీఎల్, ఎస్సీ కార్పొరేషన్, డ్వామా, డీఆర్డీఎ, సాంఘిక సంక్షేమ శాఖ, ఇలా పలు శాఖల్లో తహసీల్దార్ల అవసరం ఉంది. రెవిన్యూ డివిజన్లో స్థానికులకు తహసీల్దారు పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధనల వలన ఈ సమస్య వచ్చింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వెసులుబాటు ఇస్తే తప్ప తహసీలార్ల కొరత తీరే అవకాశం లేదు. సీనియర్ ఎంపీడీవోలు ఉండాలి స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మండల అభివృద్ధి్ద కార్యాలయాల్లో సీనియర్ ఎంపీడీవోలు ఉండాల్సిన అవసరముంది. అభివృద్ధి, నవరత్నాల అమలు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండల అభివృద్ధి అధికారులు అనుభవజ్నులై ఉండాలి. జిల్లాలో ఉన్న సీనియర్ ఎంపీడీవోలు ఎక్కువ మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఫారిన్ సర్వీసుల్లో డెçప్యుటేషన్‌లో ఉన్నారు. ఈసారి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మండలాలకు సీనియర్ ఎపీడీవోలకు పోస్టింగ్ కల్పిస్తే, నవరత్నాల అమలు సజావుగా సాగుతోందని సీనియర్లు చెపుతున్నారు. -
వలంటీర్ పోస్టులకు.. 71,098 దరఖాస్తులు
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపటిన గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల పర్వం ముగిసింది. ఈ పోస్టులకు విశేషస్పందన లభించింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున నియమిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిని బట్టి జిల్లాకు గ్రామీణ ప్రాంతాల నుంచి 12,272 మంది వలంటీర్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటికి శుక్రవారం నాటికి జిల్లాలో 71,098 మంది దరఖాస్తు చేసుకున్నారు. 56,026 మంది దరఖాస్తులు పరిశీలన చేయగా, 53,503 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయి. 2,523 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. 15,072 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. తిరస్కరించిన దరఖాస్తులను ఈ నెల 8లోగా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. భర్తీకి జెడ్పీ సీఈవో సమన్వయకర్తగా.. అర్హత లేకపోవడం, కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలు దరఖాస్తులను తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి జెడ్పీ సీఈవో రమణమూర్తి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలో నియామకాలను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడమే కాకుండా స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీర్లకు 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఎంపిక విషయాలను తెలియజేస్తూ లేఖలు పంపే అవకాశం ఉంది. ఎంపికైన వలంటీర్లకు వచ్చే నెల 5 నుంచి పదో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 50 ఇళ్లు ఒక గ్రూపుగా.. సర్వే అధారంగా 50 ఇళ్లకు ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీతో కూడిన కమిటీ ఇళ్ల గ్రూపులను వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్ల కన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపుల్లో సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల వెల్లువ ► గ్రామ వలంటీర్ల పోస్టులకు జిల్లాలో 39 మండలాల నుంచి 71,098 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 56,026 దరఖాస్తులు పరిశీలించారు. 53,503 దరఖాస్తులను ఆమోదించారు. 2,523 దరఖాస్తులు తిరస్కరించారు. 15, 072 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ► హుకుంపేట మండలం నుంచి అత్యధికంగా 2804 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1751 దరఖాస్తులను పరిశీలించగా,1701 ఆమోదించారు. వివిధ కారణాలతో 50 దరఖాస్తులు తిరస్కరించారు. ► చోడవరం మండలంలో 2713 దరఖాస్తులు రాగా,2671 దరఖాస్తులు పరిశీలించగా, 2525 దరఖాస్తులు ఆమోదించారు. 146 దరఖాస్తులు తిరస్కరించారు. ► అనకాపల్లి మండలంలో 2447 మంది దరఖాస్తు చేసుకోగా,1323 మంది దరఖాస్తులు పరిశీలించారు. 1200 దరఖాస్తులు ఆమోదించారు. 251 దరఖాస్తులు తిరస్కరించారు. ► అరకు మండలం నుంచి 2344 మంది దరఖాస్తు చేసుకోగా,1255 మంది దరఖాస్తులను పరిశీలించారు. 1204 దరఖాస్తులు ఆమోదించగా, 51 దరఖాస్తులు తిరస్కరించారు. ► యలమంచలి మండలం నుంచి అతితక్కువ దరఖాస్తులు వచ్చాయి. 660 మంది దరఖాస్తు చేయగా, 463 దరఖాస్తులను పరిశీలించారు. 442 దరఖాస్తులను ఆమోదించారు. 21 తిరస్కరించారు. ► నర్సీపట్నం మండలంలో 901 మంది దరఖాస్తు చేసుకున్నారు. 865 దరఖాస్తులను పరిశీలన చేయగా, 621 ఆమోదించారు. 244 దరఖాస్తులు తిరస్కరించారు. ► కోటవురట్ల మండలంలో 1222 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 882 పరిశీలించగా, 881 ఆమోదించారు. ఒక దరఖాస్తును తిరస్కరించారు. ► రోలుగుంట మండలంలో 1366 మంది దరఖాస్తు చేయగా, వీటిలో 1221 దరఖాస్తులను పరిశీలించారు.1212 ఆమోదించారు. 9 దరఖాస్తులను తిరస్కరించారు. -
నెరవేరిన ఏంపీడీఓల కల
-
పనితీరులో మార్పు రాదా?
ఏలూరు సిటీ : నెల రోజుల్లో ఏడుగురికి మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ చేయిస్తారా? 14 సార్లు స్వయంగా చెప్పినా పనితీరులో మార్పులేదు. మండలంలో ఒక్కరికే రూపే కార్డు ఇప్పించారు.. ఇలా అయితే ఎలా? పనిచేయమంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారే తప్ప నేను చెప్పిన పనిచేయకపోతే నాకు మనోభావాలు ఉండవా? అంటూ చింతలపూడి ఎంపీడీవో రాజశేఖర్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని ఎంపీడీవోల సమావేశంలో నగదురహిత లావాదేవీలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర మండలాల్లో ఎంసీసీఐ మ్యాపింగ్ వందల సంఖ్యలో జరుగుతుంటే ఒక్క చింతలపూడిలోనే కేవలం సింగిల్ డిజిట్‌తో ఉండటం చూస్తే ఎంపీడీవో పనితీరుకు అద్ధం పడుతోందని కలెక్టర్ చెప్పారు. ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఒక మహిళ ఫోన్ చేసి చింతలపూడి ఎంపీడీవో అసలు ఆఫీసుకే రారని వచ్చినా సరైన సమాధానం చెప్పరని ఫిర్యాదు చేసిందన్నారు. 18 వేల ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం, తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలో ఫీల్డ్ చానల్స్ తవ్వకం, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే రాబోయే రెండు నెలల్లో రూ.60 లక్షల పనిదినాలు కల్పించడం కష్టం కాదన్నారు. ఇది నా జిల్లానే : కలెక్టర్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని చెబుతున్నారే తప్ప మరోవిధంగా తాము భావించడం లేదని, అయితే ఎంపీడీవోలంతా ఒకే స్థాయిలో పనిచేయాలని చెప్పడం వల్ల కొన్నిచోట్ల వీక్నెస్ వల్ల ఆశించిన మేరకు పనులు జరగడం లేదని, మా జిల్లా అభివృద్ధికి మేము కష్టపడతామని ఎంపీడీవో పరదేశికుమార్ చెప్పగా కలెక్టర్ స్పందిస్తూ ఇది నా జిల్లానే.. నేను కలెక్టర్‌గా పనిచేసే అవకాశం పశ్చిమలో కలిగిందని, తన స్వస్థలం పక్క జిల్లా అయినప్పటికీ యాధృచ్చికంగా పశ్చిమలో పనిచేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 315 కిలోమీటర్లు మాత్రమే సీసీ రోడ్లు వేసుకున్నామని, మరో 400 కిలోమీటర్లు పొడవునా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడమంటే బాధపడితే ఎలా? అని కలెక్టర్ ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్.అమరేశ్వరరావు పాల్గొన్నారు. -
లక్ష్యాలను నెరవేర్చండి : కలెక్టర్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రభుత్వం నిర్దేశించిన పలు అభివృద్ధి పనుల లక్ష్యాలను నెరవేర్చాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని ఎంపీడీఓలను కలెక్టర్ ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక దర్గామిట్ట జెడ్పీ కార్యాలయ సమావేశ మం దిరంలో ఆత్మగౌరవం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకార్యక్రమాలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇంతవరకు కొన్ని మండలాల్లో రెండంకెల స్థాయిలో సైతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, బిల్లుల విషయంలో జాప్యం జరగదని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో రాత్రి బసచేయాలన్నారు. గ్రామస్థాయిలో, ఎస్సీ, ఎస్టీ కాలనీ ల్లో విషజ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. విషజ్వరాల నివారణపై 24వ తేదీన ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా విషజ్వరాలను గుర్తించినట్లయితే కాల్‌సెంటర్ 1800 425 2499కు సమాచారం అందించాలన్నారు. జైడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్ఓ వరసుందరం పాల్గొన్నారు. -
ఎంపీడీవోలు.. విధులకు డుమ్మా!
* జెడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి * మొన్న ముప్పాళ్ల.. తాజాగా బెల్లంకొండ ఎంపీడీవోలకు చార్జి మెమోలు గుంటూరు వెస్ట్: మండల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ది కీలక పాత్ర. అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో వీరిపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. జిల్లాలోని పలువురు ఎంపీడీవోల పనితీరుపై ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కార్యాలయాలకు గైర్హాజరు కావడం, జిల్లాస్థాయిలో సమావేశాలకు హాజరవుతున్నామని చెబుతూ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వంటి విషయాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ముప్పాళ్ల ఎంపీడీవోపై చర్యలకు సీఈవో సిఫార్సు... ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైన ముప్పాళ్ల ఎంపీడీవో టి.ఉషారాణిపై విచారణ జరిపాలనిSకలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. విచారణ జరిపిన సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య ఆమె కార్యాలయ విధులకు తరచుగా గైర్హాజరవుతున్నట్లు ధృవీకరించుకున్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. ఈ ఘటన ఎంపీడీవోల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సీఈవో వెంకటసుబ్బయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల తొమ్మిదిన బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయాన్ని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి ఎంపీడీవో కేహెచ్ భ్రమరాంబ విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో ఆమెకు చార్జిమెమో అందజేశారు. చార్జిమెమో నుంచి తప్పించుకునే చర్యల్లో భాగంగా భ్రమరాంబ శుక్రవారం సాయంత్రం తనకు 10 రోజులపాటు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా పరిషత్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సగానికిపైగా ఎంపీడీవోలది ఇదే తీరు... జిల్లాలోని సగానికిపైగా ఎంపీడీవోలు గుంటూరులో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. వారంలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరై, మిగిలిన రోజుల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారనే విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నామంటూ విధులకు గైర్హాజరవుతుండటం గమనార్హం. పల్నాడు ప్రాంత మండలాల్లో విధులు నిర్వహించే ఎంపీడీవోలు ఈ తరహా సాకులు చెబుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు. బొల్లాపల్లి ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు విధులకు సక్రమంగా హాజరుకారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు కె.సంతోషమ్మ అనేకమార్లు సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం. కొంతమంది ఎంపీడీవోలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో చేపడుతున్న ఆకస్మిత తనిఖీలతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. -
ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం
నెల్లూరు(పొగతోట): అనుమతి లేకుండా సెలవులు పెట్టడం, సెలవు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. అనుమతి లేకుండా సెలవులు పెడుతున్న ఎంపీడీఓలను పంచాయతీరాజ్ కమిషనర్‌కు సరెండర్ చేస్తానని హెచ్చరించారు. విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూ చించారు. స్మార్ట్ పల్స్ సర్వేను ఈ నెలఖారులోపు పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, డ్వామా పీడీ హరిత తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించాలి
జి.సిగడాం: ఎంపీడీవోలకు పదోన్నతులతో పాటు కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.హేమసుందరరావు, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్నవారు కూడా ఇంకా ఎంపీడీవోలుగానే కొనసాగాల్సి వస్తోందన్నారు. మరోవైపు రాజకీయ వేధింపులు తప్పడంలేదని, పని ఒత్తిడి పడుతోందని వాపోయారు. భామిని, వీరఘట్టంతో పాటు మరో 10 ఎంపీడీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునేవారే కరువయ్యార్నారు. ఈ–ఆఫీస్ అమలుకు కార్యాలయాల్లో సదుపాయాలు లేవన్నారు. తక్షణమే 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
సిఫార్సు బదిలీలు!
- ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వాలిపోతున్న ఎంపీడీఓలు - నేడు ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరిగేనా..? అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల విషయంలో సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో బదిలీలు జరిగిన ప్రతి సారీ ఈ విషయం బహిర్గతమైంది. తొలిరోజు అందరి సమక్షంలో బదిలీలు పారదర్శకంగా జరిగినా తెల్లారేసరికి అవి తారుమారు అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో మొత్తం ఇలాగే మారిపోయాయి. తొలుత కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుపుతున్నామని ప్రకటించినా చివరకు మాత్రం అంతా తారుమారవుతున్నాయి. ఉద్యోగుల బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చెర్మైన్ చమన్ నిర్ణయాలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చుతున్నారు. తమ నియోజకవర్గంలోకి వచ్చే అధికారి తన ప్రమేయంతోనే రావాలని భావిస్తున్నారు. గతసారి బదిలీల్లో చెన్నేకొత్తపల్లి, కూడేరు, శింగనమల తదితర మండలాల ఎంపీడీఓలు ఆయా మండలాల్లో బాధ్యతలు చేపట్టకుండానే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచే సిఫార్సు లేఖలతో జెడ్పీకి వాలిపోతున్నారు. పరిపాలన సౌలభ్యం ముసుగులో : పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాలపరిమితితో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం రాజకీయ అండదండలు ఉన్న ఉద్యోగులకు వరంగా మారుతోంది. పరిపాలన సౌలభ్యం ముసుగులో అనుకున్న స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాతాలకు వెళ్లినా డెప్యుటేషన్ ముసుగులో తిరిగి యధాస్థానానికి రావచ్చులే అన్న ధీమా మరికొంతమందిలో కనిపిస్తోంది. దీని వలన కొన్నేళ్ల నుంచి మారుమూల ప్రాంతాల్లోనే తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యోగాలు చేస్తున్న వారికి తీవ్ర నష్టం కలుగుతోంది. తొలుత సాధారణ బదిలీలు పూర్తై తర్వాత నూతనంగా పదోన్నతులు పొందిన ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు కల్పించాలని నిర్ణయించారు. అయితే అందులో ఉన్న కొంతమంది ముందే చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. చెర్మైన్ దగ్గర ఉన్న సంబంధాలతో మంచి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులతో కళకళలాడింది. దీంతో శుక్రవారం జరగనున్న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయా.? కౌన్సెలింగ్‌లో దక్కించుకున్న ఉద్యోగులను ఆయా స్థానాల్లో కొనసాగిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
750 మంది ఎంపీడీవోల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చరిత్రలో తొలిసారిగా 75 శాతం మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ వీరిని బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్యనిర్వాహక అధికారులకు పంపించారు. ఒకే జిల్లాలో 15 సంవత్సరాలుగా పాతుకుపోయిన వారందర్నీ బదిలీ చేశారు. రాష్ట్రంలో 1,104 మండలాలు ఉండగా.. వీరిలో 750 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. తమకు ఎన్నికల విధులతో ప్రత్యక్షంగా సంబంధం లేదని తమను బదిలీ చేయడానికి వీల్లేదంటూ ఎంపీడీవోలు ఇప్పటికే కోర్టుకెళ్లారు. ఈనెల 10వ తేదీన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియడంతో ఇక బదిలీలు ఉండవని భావించారు. అయితే ప్రభుత్వం ఈనెల 25వ తేదీ వరకు బదిలీలు చేయడానికి అనుమతించడంతో.. సోమవారం రాత్రి ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ బదిలీలు చేశారు. బదిలీ అయిన అధికారులు మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఒక జిల్లాలోనే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు ఈసారి పక్క జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీలపై సీఎస్ సమీక్ష: సాధారణ ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేసినా.. వారు ఆ పోస్టుల్లో చేరడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడైంది. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా బదిలీ అయిన వారు ఇంకా ఆ పోస్టుల్లో చేరలేదని సీఎస్‌కు ఉన్నతాధికారులు వివరించారు. బదిలీ అయిన అధికారులంతా విధుల్లో తప్పకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు.