ఎంపీడీవోలకు పదోన్నతులతో పాటు కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించాలి
Jul 22 2016 12:42 AM | Updated on Sep 4 2017 5:41 AM
జి.సిగడాం: ఎంపీడీవోలకు పదోన్నతులతో పాటు కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.హేమసుందరరావు, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్నవారు కూడా ఇంకా ఎంపీడీవోలుగానే కొనసాగాల్సి వస్తోందన్నారు. మరోవైపు రాజకీయ వేధింపులు తప్పడంలేదని, పని ఒత్తిడి పడుతోందని వాపోయారు. భామిని, వీరఘట్టంతో పాటు మరో 10 ఎంపీడీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునేవారే కరువయ్యార్నారు. ఈ–ఆఫీస్ అమలుకు కార్యాలయాల్లో సదుపాయాలు లేవన్నారు. తక్షణమే 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement