మాట్లాడుతున్న కలెక్టర్ శరత్
పంచాయతీ భవనాల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని, కొన్ని ఇంకా ప్రారంభించలేదని సాక్షిలో మంగళవారం ప్రచురిత మైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ శరత్ స్పందించారు. రివ్యూ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలన్నింటినీ గ్రౌండింగ్ చేసి, పనులు ఈనెల 30 లోపు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
● స్వచ్ఛ సర్వేక్షణ్ కింద మూడు కేటగిరీలలో 15 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఆయా కేటగిరీలలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా సంబంధిత అధికారులు, ప్రత్యేక అధికారులు చూసుకోవాలన్నారు.
● హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో ఆయా అధికా రులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు ప్రణాళికతో మొక్కలు నాటాలని సూచించారు.
● హరితహారంలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్స్, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, విద్యాసంస్థల్లో నాటిన మొక్కలలో గల గ్యాప్స్ పూర్తి చేయాలని తెలిపారు.
● ఎంపీడీవోలు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
● బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం కింద జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు.
● మహిళా సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్య శాఖ సబ్ సెంటర్ బిల్డింగ్స్ నిర్మాణాలపైనా దృష్టి సారించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డీపీఎంలకు కలెక్టర్ సూచించారు.
● మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో మండలంవారీగా సమీక్షించారు.
● ఆయా పాఠశాలల్లో మంజూరైన పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
● పనుల పురోగతిపై రెగ్యులర్‌గా సమీక్షించాలని డీఇఓకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీపీఓ సురేష్ మోహన్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, డీ ఎల్పీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, ఏపీవోలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఎంఈఓలు, ఎంఈలు పాల్గొన్నారు.
సర్వే నూరు శాతం చేయాలి
ఎలక్ట్రోలు ఇంటింటి సర్వే నూరు శాతం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో డీఆర్‌ఓ, ఆర్డీఓ, తహసీల్దార్‌లతో ఈసీఐ నియమావళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బీఎల్‌ఓ, వీఎల్‌ఓ, బీఆర్‌ఓ, సూపర్ వైజర్లు ఇంటింటి సర్వే చేసి బోగస్ ఓట్లు గుర్తించాలన్నారు. 18 నుంచి 29 ఏళ్ల వారిని గుర్తించడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నా రు. మండలాలలో ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఓటరు ఎన్‌రోల్ మెంట్ నూరు శాతం చేయాలన్నారు.
ఓటర్ లిస్టును క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. బోగస్ ఓట్ల నమోదు కాకుండా చూడాలన్నారు. బీఎల్‌ఓలు 80 ఏళ్ల వయసు గల ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు. 1,400 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండాలన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓటర్లకు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరా రెడ్డి, డీఆర్‌ఓ నగేశ్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment