Panchayat buildings
-
30 లోగా జీపీ పనులు ప్రారంభించండి
పంచాయతీ భవనాల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని, కొన్ని ఇంకా ప్రారంభించలేదని సాక్షిలో మంగళవారం ప్రచురిత మైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ శరత్ స్పందించారు. రివ్యూ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలన్నింటినీ గ్రౌండింగ్ చేసి, పనులు ఈనెల 30 లోపు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ● స్వచ్ఛ సర్వేక్షణ్ కింద మూడు కేటగిరీలలో 15 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఆయా కేటగిరీలలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా సంబంధిత అధికారులు, ప్రత్యేక అధికారులు చూసుకోవాలన్నారు. ● హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో ఆయా అధికా రులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు ప్రణాళికతో మొక్కలు నాటాలని సూచించారు. ● హరితహారంలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్స్, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, విద్యాసంస్థల్లో నాటిన మొక్కలలో గల గ్యాప్స్ పూర్తి చేయాలని తెలిపారు. ● ఎంపీడీవోలు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ● బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం కింద జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు. ● మహిళా సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్య శాఖ సబ్ సెంటర్ బిల్డింగ్స్ నిర్మాణాలపైనా దృష్టి సారించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డీపీఎంలకు కలెక్టర్ సూచించారు. ● మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో మండలంవారీగా సమీక్షించారు. ● ఆయా పాఠశాలల్లో మంజూరైన పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ● పనుల పురోగతిపై రెగ్యులర్గా సమీక్షించాలని డీఇఓకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీపీఓ సురేష్ మోహన్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, డీ ఎల్పీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, ఏపీవోలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఎంఈఓలు, ఎంఈలు పాల్గొన్నారు. సర్వే నూరు శాతం చేయాలి ఎలక్ట్రోలు ఇంటింటి సర్వే నూరు శాతం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో డీఆర్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లతో ఈసీఐ నియమావళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బీఎల్ఓ, వీఎల్ఓ, బీఆర్ఓ, సూపర్ వైజర్లు ఇంటింటి సర్వే చేసి బోగస్ ఓట్లు గుర్తించాలన్నారు. 18 నుంచి 29 ఏళ్ల వారిని గుర్తించడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నా రు. మండలాలలో ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఓటరు ఎన్రోల్ మెంట్ నూరు శాతం చేయాలన్నారు. ఓటర్ లిస్టును క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. బోగస్ ఓట్ల నమోదు కాకుండా చూడాలన్నారు. బీఎల్ఓలు 80 ఏళ్ల వయసు గల ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు. 1,400 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండాలన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓటర్లకు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరా రెడ్డి, డీఆర్ఓ నగేశ్, అధికారులు పాల్గొన్నారు. -
పునాదుల్లోనే ప్రగతి
♦ పంచాయతీ భవనాలకు గ్రహణం ♦ 82 మంజూరు కాగా 15 పూర్తి ♦ నిర్మాణంలో తీవ్ర జాప్యం ♦ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే.. మంజూరైన నిధులు : రూ.9.84కోట్లు ఒక్కో భవన నిర్మాణానికి : రూ.12కోట్లు ఆదిలాబాద్: జిల్లాలో పలు గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. భవనాలతో గ్రామాలకు కొత్తకళ వస్తుందని ఆశించిన పంచాయతీ సభ్యులు, గ్రామస్తులకు నిరాశే మిగులుతోంది. ప్రతీరోజు కళ్లెదుటే పిల్లర్లు, మొండిగోడలతో అసంపూర్తి భవనాలు కనిపిస్తుండడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేయించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది ఈజీఎస్ కింద జిల్లాకు 82గ్రామపంచాయతీ నూతన భవనాలు మంజూరు కాగా రూ.9.84 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. అయినా పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. కొనసా.. గుతున్న పనులు.. జిల్లాలో గతేడాది మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామపంచాయతీలుండగా 82 గ్రామపంచాయతీలకు గతేడాది ప్రభుత్వం నూతన –భవనాలు మంజూరు చేసింది. 82 భవనాల్లో 15 పంచాయతీ భవనాలు మాత్రమే పూర్తి కాగా ఇంకా 57 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పది భవనాల పనులు ఇంకా ప్రారంభించకపోవడం శోచనీయం. జిల్లాలో చాలా చోట్ల బేస్మెంట్, పిల్లర్లు, రూఫ్లెవల్లోనే భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టకుండా చేతులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ పనులు పూర్తికావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయకుంటే ఇప్పటికే పనులు పూర్తి చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటే భవన నిర్మాణాలు పూర్తవుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కార్యక్రమాలకు ఇబ్బందులే.. పంచాయతీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇటు పంచాయతీ భవనాలు లేక, అటు సరైన సౌకర్యాలు లేక ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలు, ఇతర కార్యకలాపాలు చెట్ల కింద, ఇతర ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమ కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. ప్రతీనెల పం పిణీ చేసే ఆసరా పింఛన్లు కూడా లబ్ధిదారులకు చెట్ల కింద, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మి స్తున్న పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేసి సరైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
పనుల్లో దగా.. కాంట్రాక్టర్లు ధగధగ
నవాబుపేట: కోట్ల రూపాయల నిధులు రోడ్లపాలవుతున్నాయి. కొత్త రోడ్డు వేశారన్న ఆనందం పల్లెవాసులకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు మామూళ్లకు తలొగ్గడంతో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా పనులు చేసి నిధులు కాజేస్తున్నారు. ఏడాది గడిచేసరికి ఆ రోడ్లు అస్థిత్వాన్ని కూడా కోల్పోయి దశాబ్దాల క్రితం వేసిన రోడ్లలా మారుతున్నాయి. మండలంలో ఆర్అండ్బీ శాఖ పని తీరు అధ్వానంగా మారింది. రూ. 2.84 కోట్లతో నిర్మించిన రోడ్లు ఏడాది తిరగక ముందే శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్ మండలం బంగారుమైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట మండలం మైతాప్ఖాన్గూడ వరకు 12 కిలోమీటర్ల పొడవున్నా ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో మరమ్మతులు, రిబీటీ కోసం ప్రభుత్వం ఏడాది కిందట రూ. 2 కోట్లు మంజూరు చేసింది. పనులను నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో దక్కించుకున్నారు. వారు కమీషన్ తీసుకొని మరో కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పారు. రెండో కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత పాటించకుండా మరమ్మతు పనులు చేపట్టడంతో ఆరు మాసాల్లోనే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది. పనుల్లో నాణ్యత లేదంటూ అధికారులు బిల్లులు నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్ మళ్లీ రోడ్డుపై మరో పూత పూసి బిల్లులు క్లియర్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మునుపటిలాగే తయారైంది. రూ. 50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలది అదే పరిస్థితి... గతేడాది క్రితం మండల పరిధిలోని పూలపల్లి, ఎల్లకొండ, ఎత్రాజ్పల్లి, మీనపల్లిలాన్, కడ్చర్ల గ్రామాల్లో రూ. 10 లక్షల చొప్పున ఖర్చు చేసి పంచాయతీ భవనాలు నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో అప్పుడు ఈ భవనాలు వర్షానికి ఉరుస్తున్నాయి. వీటి పరిస్థితి చూసి సర్పంచులు ఈ భవనాల్లో కార్యకలాపాలు సాగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి.