మేడ్చల్ , శామీర్‌పేట్‌లలో.. మంత్రి హరీష్‌రావు పర్యటన నేడు | minister harish rao ready to visit medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్ , శామీర్‌పేట్‌లలో.. మంత్రి హరీష్‌రావు పర్యటన నేడు

Published Thu, Apr 23 2015 1:09 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM

minister harish rao ready to visit medchal

మేడ్చల్/శామీర్‌పేట్: రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గురువారం మేడ్చల్ మండలంలో పర్యటించనున్నారని బుధవారం ఎంపీడీఓ శోభ తెలిపారు. కండ్లకోయ పరిధిలోని మేడ్చల్ మార్కెట్ యార్డులో రూ.1.5 కోట్లతో నిర్మించిన 3 వేల మెట్రిక్ టన్నుల గోదాంను మంత్రి ప్రారంభించనున్నారు. జాతీయ రహదారి కండ్లకోయ చౌరస్తా నుంచి గుండ్లపోచంపల్లి వరకు రూ.65 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

అనంతరం మేడ్చల్ పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తారని ఎంపీడీఓ పేర్కొన్నారు. అలాగే శామీర్‌పేట్ మండలంలో గురువారం సాయంత్రం మంత్రి హరీష్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, లక్ష్మాపూర్ సర్పంచ్ కటికెల శ్యామల పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మాపూర్ పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులతో పాటు లక్ష్మాపూర్ నుంచి బొమ్మరాశిపేట్ వరకు నూతన రహదారి పనులను ప్రారంభిస్తారని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement