ఎంపీడీఓ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన | peperless work att mpdo offices | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన

Published Sat, Apr 29 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

peperless work att mpdo offices

- జెడ్పీ సీఈఓ బీఆర్‌ ఈశ్వర్‌
 
ఉయ్యాలవాడ : జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్‌ కార్యనిర్వహణాధికారి బీఆర్‌ ఈశ్వర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉయ్యాలవాడ మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కాగిత రహిత పాలన కొనసాగుతోందన్నారు.  ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఉపాధి కూలీలకు మంచినీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎంపీడీఓ మహేష్‌కుమార్, ఈఓఆర్డీ పాపారాయుడు, ఏపిఓ గణేష్‌బాబు, ఉయ్యాలవాడ గ్రామ సర్పంచ్‌ మిద్దె సుబ్బరాయుడు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement