paperless
-
ముచ్చటగా మూడోసారి పేపర్‌లెస్ బడ్జెట్: ఎపుడు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీంతో కేటాయింపులు, మినహాయింపులు, ఎలాంటి ఉపశమనం లభించనుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలపై బీజేపీ సర్కార్ మొగ్గు చూపుతుందనే అంచనాలు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌తో మురిపిస్తారా, ఆశలపై నీళ్లు జల్లుతారా అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడబోతోంది. (బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?) అత్యధిక బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ తర్వాత, 2021 నుంచి కాగిత రహితంగా డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు. మేడిన్ఇండియా ట్యాబ్లెట్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి. (Union Budget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు) కేంద్ర బడ్జెట్ 2023-24 బడ్జెట్ పేపర్‌లెస్‌గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. బడ్జెట్ సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్టు గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' పీడీఎఫ్ ఫార్మాట్ ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో చూడొచ్చు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్లు యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్జెట్ యాప్‌ను అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లయితే ముందుగా యాపిల్ యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్ చేయాలి. అనంతరం అధికారిక యాప్ డౌన్లోడ్పై క్లిక్ చేసుకుంటే చాలు. దీంతో ఫోన్లోనే పూర్తిగా బడ్జెట్ వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తక్కువ పేజీల్లోనే బడ్జెట్.. మొత్తం డిజిటల్ రూపంలో!
న్యూఢిల్లీ: ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ- భారత్ వార్షిక బడ్జెట్ అంటే మొదట గుర్తుకు వచ్చేది... బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు సాంప్రదాయక హల్వా తయారీ, ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రితో సహా సీనియర్ అధికారుల సందడి.. ఆ రోజు నుంచి నిర్దిష్ట సిబ్బంది బయటి ప్రపంచానికి దూరంగా బడ్జెట్ ముద్రణకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం-నార్త్‌బ్లాక్ బేస్మెంట్లోని ప్రధాన ముద్రణా కేంద్రంలోకి మకాం మార్చడం... కుటుంబానికి దూరంగా కనీసం రెండు వారాల వారి క్వారంటైన్... అటుపై టన్నుల బరువుండే బడ్జెట్ వందలాది పత్రాలను పార్లమెంటుకు ప్రత్యేక రక్షణ వలయంలో తీసుకుని రావడం.. సుశిక్షిత జాగిలాల హడావిడి. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కాపీల ముద్రణను తగ్గించింది. ఈ ప్రక్రియ డిజిటల్ రూపంలోకి క్రమంగా మారిపోవడం ప్రారంభమైంది. మొదట్లో జర్నలిస్టులకు, బయటి విశ్లేషకులకు పంపిణీ చేసే ప్రతులను ఆర్థికశాఖ తగ్గించింది. ఆటుపై మహమ్మారి వ్యాప్తిని ఉటంకిస్తూ లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంటు సభ్యులకు అందించే ప్రతుల సంఖ్యలోనూ కొతపెట్టింది. పార్లమెంట్ సభ్యులు, సాధారణ ప్రజలు బడ్జెట్ పత్రాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయడానికి ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ని ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021లో ప్రారంభించింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2022-23 వార్షిక బడ్జెట్లో డిజిటల్ పక్రియ మరింత వేగవంతంగా మారనుంది. బడ్జెట్ అంశాల ప్రింటింగ్ కేవలం కొన్ని పేజీలకే పరిమితం కానుంది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల సమర్పణకు సంబంధించిన పత్రాల విస్తృత ముద్రణ ఈ దఫా చాలా తక్కువకు పరిమితం కానుంది. బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. కొన్ని ఫిజికల్ కాపీల లభ్యత మాత్రమే ఉంటుంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో హల్వా కార్యక్రమం కూడా సాదాసీదాగా సాగింది. కేవలం డిజిటల్ బడ్జెట్ పత్రాల పూర్తికి సంబంధించి కేవలం కొంత మంది అధికారులే నార్త్‌బ్లాక్ బేస్మెంట్లో జనజీవనానికి దూరంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి 2019లో తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో బడ్జెట్ పత్రాలను ప్రత్యేక బ్రీఫ్‌కేస్‌లో తీసుకెళ్లే దీర్ఘకాల పద్ధతికి స్వస్తి పలికారు. ఆమె తన ప్రసంగాన్ని చదవడానికి హ్యాండ్‌హెల్డ్ టాబ్లెట్‌ను ఉపయోగించారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన గాడ్జెట్‌ను తీసుకుని పార్లమెంటుకు వచ్చారు. (చదవండి: ఢిల్లీలో జియో-బీపీ ఈవీ చార్జింగ్ హబ్!) -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్‌లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్‌లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్‌లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్‌లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్‌గా నిలవడానికి దుబాయ్‌కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్‌లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్‌తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
ఇకపై కాగిత రహిత విధానంలోకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో నిత్యం జరిగే ఉత్తరప్రత్యుత్తరాలను కాగిత రహిత (పేపర్‌లెస్) విధానంలోకి తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారు లు చర్యలు చేపట్టారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా యావ త్ పోలీస్ శాఖను ఆధునీకరిస్తున్న అధికారులు తాజా గా ఈ–ఆఫీస్ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా పలు జిల్లాలు, కమిషనరేట్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ–ఆఫీస్ విధానం విజయవంతం కావడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని అడ్మిన్ విభాగాల బాధ్యులకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. డీఎస్ఆర్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనల వరకు పోలీస్‌శాఖలో శాంతిభద్రతల విభాగాలపై నిత్యం సబ్ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి నుంచి డీజీపీ వరకు ఉదయమే సమీక్ష జరుగుతుంది. నిన్న ఏం జరిగింది, నేడు చర్యలు ఏం తీసుకోవాలన్న డీఎస్ఆర్ (డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్)పై టెలి కాన్ఫరెన్స్, అవసరమైతే కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, డీజీపీ నిర్వహిస్తారు. ఇప్పటివరకు డీఎస్ఆర్లు కేవలం పేపర్లపై ప్రింట్ రూపంలో ఉన్నతాధికారులకు చేరేవి. ఇకపై అలా కాకుండా ప్రతీ పోలీస్‌స్టేషన్ నుంచి ట్యాబ్‌ల ద్వారా ఆయా సర్కిల్, సబ్‌డివిజినల్, జిల్లా ఎస్పీ, డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఆన్లైన్లో ఈ–ఆఫీస్ టూల్స్ ద్వారా క్షణాల్లో చేరిపోతాయి. కీలక కేసుల వివరా లు, క్రైమ్ డైరీ ఫైల్స్, చార్జిషీట్లు ఈ–ఆఫీస్ ద్వారానే పంపేందుకు పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్, సిద్దిపేట కమిషనరేట్లతో పాటు నాగర్‌కర్నూల్, కామారెడ్డి, టీఎస్ఎస్పీ (తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్), గ్రేహౌండ్స్ విభాగాల్లో ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమవడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉపయోగించేలా చర్యలు తీసుకోబోతున్నారు. -
ఎంపీడీఓ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన
- జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్ ఉయ్యాలవాడ : జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి బీఆర్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కాగిత రహిత పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లోనే నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఉపాధి కూలీలకు మంచినీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎంపీడీఓ మహేష్‌కుమార్, ఈఓఆర్డీ పాపారాయుడు, ఏపిఓ గణేష్‌బాబు, ఉయ్యాలవాడ గ్రామ సర్పంచ్ మిద్దె సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
ఎంఎఫ్ ఇన్వెస్టర్లకు పేపర్ లెస్ ‘సిప్’..!
♦ దీపావళికల్లా అందుబాటులోకి ♦ తీసుకురానున్న బీఎస్ఈ ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు కాగిత రహిత(పేపర్‌లెస్) సిప్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు, దీపావళికల్లా ఈ కాగిత రహిత సిప్‌ను అందించే అవకాశాలున్నాయని బీఎస్ఈ ప్రతినిధి వెల్లడించారు. ఈ కాగిత రహిత సిప్ కారణంగా ఇన్వెస్టర్లకు కాలం బాగా ఆదా అవుతుందని, నెట్ బ్యాంకింగ్‌తో సహా వివిధ చెల్లింపుల విధానాల్లో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని వివరించారు. ఈ కొత్త విధానంలో ఎలాంటి ధ్రువపత్రాలు దాఖలు చేసే అవసరం లేనందున, సంతకాలు ఇతర విషయాల్లో తప్పులున్నాయనే కారణాలతో తిరస్కరణకు గురయ్యే సమస్య కూడా ఉండదని పేర్కొన్నారు. బీఎస్ఈ స్టార్ ఎంఫ్ ద్వారా ఈ కాగిత రహిత సిప్‌ను అందిస్తామని వివరించారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు తమ క్లయింట్ల కోసం ఎక్స్చేంజ్ సిప్(ఎక్స్సిప్)ద్వారా మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఉందని, ఈ విధానంలో ఇన్వెస్టర్లు ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) ద్వారా చెల్లింపులు జరిపే వీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక కొత్త కాగిత రహిత సిప్ విధానంలో ఏసీహెచ్(ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్)/ఈసీఎస్ లేదా డెరైక్ట్ డెబిట్ మాండేట్ ఫారమ్ అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఊసే ఉండదని వివరించారు. ఈ విధానం కోసం ప్రముఖ చెల్లింపుల అగ్రిగేటర్‌తో బీఎస్ఈ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం వల్ల తమ చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇన్వెస్టర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని వివరించారు. బీఎస్ఈ స్టార్ మ్యూచువల్ ఫండ్... భారత్‌లో అతిపెద్ద ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్ ప్లాట్‌ఫామ్.. నెలకు నాలుగు లక్షల సిప్ లావాదేవీలు జరుగుతాయి. -
ప్రతి ఎమ్మెల్యే ముందు కంప్యూటర్
తిరువనంతపురం: మరో రికార్డుకు కేరళ తెరతీసింది. అసలు కాగితం అవసరాలు లేకుండా సభా వ్యవహారాలు నడిపేందుకు సర్వత్రా సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గురువారం ఒక ప్రకటన చేశారు. 'హిమాచాల్ ప్రదేశ్ ఇప్పటికే అసెంబ్లీ పేపర్ లెస్ కార్యక్రమాలు చేస్తోంది. మేం కూడా దానిని సాధించాలని అనుకుంటున్నాం' అని స్పీకర్ అన్నారు. సెప్టెంబర్ 26న కేరళ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొత్తం 29 రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందట. నవంబర్ 10న సమావేశాలు ముగుస్తాయని తెలుస్తోంది. ఆన్ లైన్ లోనే ప్రశ్నలు అడగాలని ఇప్పటికే 140మంది శాసన సభ్యులకు సూచనలు కూడా చేశారట. పూర్తి స్థాయిలో పేపర్ లెస్ కార్యక్రమం కోసం తమ చట్టసభ్యులకు ప్రత్యేక తర్ఫీదును ఇవ్వనున్నట్లు కూడా స్పీకర్ చెప్పారు. ఒక్కసారి ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క సభ్యుడి ముందు ఓ కంప్యూటర్ ఉంటుందని, ఒక్క క్లిక్ తో అతడు సభాకార్యక్రమాలు మొత్తం చూడొచ్చని, సభకు సంబంధించి అవసరమైన పనులు చేసుకోవచ్చని అన్నారు.