న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీంతో కేటాయింపులు, మినహాయింపులు, ఎలాంటి ఉపశమనం లభించనుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలపై బీజేపీ సర్కార్ మొగ్గు చూపుతుందనే అంచనాలు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌తో మురిపిస్తారా, ఆశలపై నీళ్లు జల్లుతారా అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడబోతోంది. (బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?)
అత్యధిక బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్ తర్వాత, 2021 నుంచి కాగిత రహితంగా డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారు. మేడిన్‌ఇండియా ట్యాబ్లెట్ ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి. (Union Budget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ కీలక సూచనలు)
కేంద్ర బడ్జెట్ 2023-24 బడ్జెట్ పేపర్‌లెస్‌గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. బడ్జెట్ సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్టు గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' పీడీఎఫ్ ఫార్మాట్ ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో చూడొచ్చు.
యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్లు యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్జెట్ యాప్‌ను అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఐఓఎస్ యూజర్లయితే
ముందుగా యాపిల్ యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్ చేయాలి. అనంతరం అధికారిక యాప్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసుకుంటే చాలు. దీంతో ఫోన్‌లోనే పూర్తిగా బడ్జెట్ వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment