Mobile application (App)
-
టిక్.. టిక్.. టిక్.. షేరింగ్‌కు సమయం లేదు మిత్రమా!
మన దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్ ఫోన్ అప్లికేషన్(యాప్) టిక్‌టాక్. యాప్‌లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టుచేసి, లైక్‌లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో యాప్ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్‌పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్‌టాక్‌ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకీ నిషేధం? ► టిక్‌టాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత. ► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి. ► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్‌టాక్ యాప్ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి. ► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ► టిక్‌టాక్ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్‌టాక్ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏయే దేశాలు నిషేధించాయి? ► 2021 జనవరిలో భారత్ టిక్‌టాక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్‌లపైనా నిషేధం విధించింది. ► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. ► అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్‌టాక్ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ► అమెరికా సైనిక దళాల్లో టిక్‌టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. ► తైవాన్‌లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో టిక్‌టాక్ యాప్ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్లో నిషేధించారు. టిక్‌టాక్ వాదనేంటి? ► తమ యాప్ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్‌టాక్ యాజమాన్యం ఖండించింది. ► యాప్ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్‌ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ► కొన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. ► యాప్‌ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది. ► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. ► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్‌టాక్‌ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్‌పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది. అసలు ఏమిటీ యాప్? చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే కంపెనీ ‘డౌయిన్’ పేరిట 2016 సెప్టెంబర్‌లో యాప్‌ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్లోడ్లు జరిగాయి. దాంతో బైట్‌డ్యాన్స్ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి టిక్‌టాక్ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్ కోసం టిక్‌టాక్ యాప్‌ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్ సింకింగ్, డ్యాన్సింగ్ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్‌టాక్ యాప్ అందుబాటులో ఉంది. -
ముచ్చటగా మూడోసారి పేపర్‌లెస్ బడ్జెట్: ఎపుడు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీంతో కేటాయింపులు, మినహాయింపులు, ఎలాంటి ఉపశమనం లభించనుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలపై బీజేపీ సర్కార్ మొగ్గు చూపుతుందనే అంచనాలు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌తో మురిపిస్తారా, ఆశలపై నీళ్లు జల్లుతారా అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడబోతోంది. (బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?) అత్యధిక బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ తర్వాత, 2021 నుంచి కాగిత రహితంగా డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు. మేడిన్ఇండియా ట్యాబ్లెట్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి. (Union Budget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు) కేంద్ర బడ్జెట్ 2023-24 బడ్జెట్ పేపర్‌లెస్‌గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. బడ్జెట్ సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్టు గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' పీడీఎఫ్ ఫార్మాట్ ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో చూడొచ్చు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్లు యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్జెట్ యాప్‌ను అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లయితే ముందుగా యాపిల్ యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్ చేయాలి. అనంతరం అధికారిక యాప్ డౌన్లోడ్పై క్లిక్ చేసుకుంటే చాలు. దీంతో ఫోన్లోనే పూర్తిగా బడ్జెట్ వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్‌గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్‌లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్‌లో కులగణన పూర్తయి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్‌లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్‌గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్‌డెస్క్ -
ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ అప్లికేషన్‌కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్‌ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్లో ఎన్రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు. -
నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇందుకోసం ‘ఏపీ సీఎం ఎంఎస్’ (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో సిద్ధమయ్యే ఈ యాప్ ద్వారా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా సరే రోడ్ల సంబంధిత సమస్యలపై ఫొటో తీసి అప్లోడ్ చేయగానే, నిర్దిష్ట వ్యవధిలోగా మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టాణాల్లోని సమస్యలపై రియల్ టైం మానిటరింగ్ ద్వారా దృష్టి సారించాలని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు అవసరమైన సేవలు సత్వరం అందాలి. ఆయా విభాగాల అధికారులు నిర్దేశిత సమయంలోగా అనుమతులు మంజూరు చేయాలి. అన్ని సేవలు త్వరితగతిన అందేలా పాలనలో మార్పులు తీసుకురావాలి. ప్లాన్ అప్రూవల్ తదితర ప్రజా సేవలు సత్వరమే అందించడం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై నిశితంగా సమీక్షించి, తగిన ప్రణాళికను రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వార్డుల్లో రోజూ 2 గంటలు తనిఖీలు ► రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రజా సమస్యలపై తనిఖీలు చేపట్టాలి. తమ పరిధిలోని సుమారు 6– 7 కి.మీ మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ► తమ పరిధిలో రోడ్లు ఎలా ఉన్నాయి.. గుంతలు, కంకర కొట్టుకు పోవడం, పచ్చదనం తదితర వాటిని పరిశీలించడంతో పాటు వీధి లైట్లు, పుట్‌పాత్‌లు, ట్రాఫిక్ జంక్షన్ల పని తీరునూ గమనించాలి. వార్డు సచివాలయ పరిధిలో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌లో అప్ లోడ్ చేయడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. ► సిబ్బంది మాత్రమే కాకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సామాన్య ప్రజలు కూడా తమ దృష్టికి వచ్చిన ఈ సమస్యలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ► యాప్ ద్వారా అందిన సమస్యలు సంబంధిత విభాగాలకు వెళ్లగానే నిర్ణీత వ్యవధిలోగా వాటిని పరిష్కరించాలి. అందుకు అనగుణంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. గ్రామాలకు ఇదే తరహా యాప్ ►నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న ఈ యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా మెరుగైన రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దీర్ఘకాలం మన్నేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ► ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి.సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి.రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్ రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్పొరేషన్ పరిధితో పాటు సమీపంలోని మరో 28 అర్బన్ లోకల్‌బాడీల నుంచి వచ్చే చెత్తను ఇక్కడ ప్రాసెస్ చేసేలా ప్లాంట్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
జోడీల ముసుగులో కేడీలు
(బీవీ రాఘవరెడ్డి): అప్పట్లో పెళ్లిళ్ల పేరయ్యలు, ఆ మ్యారేజి బ్యూరోలు సంబంధాలు కుదర్చటంలో ముఖ్య పాత్ర పోషించగా టెక్నాలజీ పెరిగాక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చేశాయి. కాలికి బలపం కట్టుకుని తిరిగే పని లేకుండా ఇంట్లో కూర్చుని ఇంటిల్లిపాదీ తిలకించేలా చౌకగా సేవలందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ పెళ్లిళ్ల వెబ్సైట్లను పరిశీలిస్తే భారత్ మ్యాట్రిమోనికి కోటి మందికి పైగా వినియోగదారులున్నారు. మ్యాచ్‌ఫైండర్ మ్యాట్రిమోనిలో రెండు వేల ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు రిజిస్టర్ చేసుకున్నారు. 2002లో ప్రారంభించిన ఫ్రీ వెబ్సైట్ వివాహ్ డాట్‌కామ్ ఉచితంగానే సేవలందిస్తోంది. వెబ్గేట్ డాట్‌కామ్ రోజుకు 600 మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. 1996లో ప్రారంభమైన షాదీ డాట్‌కామ్ దేశంలోనే మొదటిదిగా చెబుతారు. కమ్యూనిటీ మ్యాట్రిమోనికి దేశంలో 140 శాఖలున్నాయి. డైవర్సీ మ్యాట్రిమోని యాప్‌ను 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. వెబ్సైట్ నిర్వాహకుల్లో కొందరు ఉచితంగా సేవలందిస్తుంటే మిగిలిన వారు రూ.500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీజు చెల్లిస్తే సరైన జోడీని వెతికి పెడతామంటున్నారు. విద్యార్హతలు, ఉద్యోగం, ఇష్టాయిష్టాలు, కుల గోత్రాలు, జాతకచక్రాలు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం లాంటి వివరాలన్నీ ఫొటోలు, ఫోన్ నంబర్లతో సహా వెబ్సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. యువతీ యువకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్ఫెక్ట్ మ్యాచ్‌లను సూచిస్తున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే చురుగ్గా ఉంటున్నారు. ఆచి తూచి అడుగేయాల్సిందే... ఇదంతా ఒకఎత్తు కాగా పెళ్లిళ్ల వెబ్సైట్లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్, ఫొటోలతో రిజిస్టర్ చేసుకుని అమాయకులను మోసగిస్తున్నారు. మార్ఫింగ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి కొందరు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వివరాలు సేకరించి బహుమతులు పంపి ఎర వేస్తుంటారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా అప్రమత్తత అవసరం. సమాచారం కోసమే మ్యాట్రిమోని సైట్లను ఉపయోగించుకోవాలి. పెద్దల ద్వారా ప్రత్యక్షంగా పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. ఫోన్ చేసి డబ్బులు అడగడం, వ్యక్తిగత ఫొటోలు పంపమనటం, హోటళ్లకు రావాలని కోరితే సందేహించాల్సిందే. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలి. అమెరికా వెళ్దామని.. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన రజని (పేరు మార్చాం) భర్తతో మనఃస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఓ మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా కొచ్చర్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామని చెప్పడంతో నమ్మింది. వీసా కావాలంటే బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలంటూ విడతల వారీగా రూ.48 లక్షలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. బీఫార్మసీ చదివి వ్యసనాలకు బానిసై మోసాల బాట పట్టాడు. అతడిపై హైదరాబాద్, రామగుండం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 2009 నుంచి 16కిపైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని అమెరికా పేరుతో రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఏడాది జనవరి 30న పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరిగి అదే పంథాలో నరసరావుపేట మహిళను మోసగించి పరారయ్యాడు. సంపన్న మహిళలపై వల మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 40 మంది మహిళలను మోసగించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో తన వద్ద రూ.2.25 లక్షలు కాజేసినట్లు యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాల్ సురేశ్ చవాన్ అలియాస్ అనురాగ్ చవాన్(34) మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి సంపన్న మహిళలపై వల విసిరాడు. ఖరీదైన ఐ ఫోన్లను బహుమతిగా పంపి ఆకట్టుకునేవాడు. పెట్టుబడుల పేరుతో డబ్బులు కాజేయడంతోపాటు, కొందర్ని హోటళ్లకు రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి.. పెళ్లిళ్ల వెబ్సైట్ల ద్వారా 12 మంది మహిళలను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మెకానికల్ ఇంజనీర్‌ను ముంబై పోలీసులు 2021 జూన్ 8న అరెస్టు చేశారు. మహేశ్ అలియాస్ కరణ్ గుప్తా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. మహిళలతో ఫోన్లో మాట్లాడి పబ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేవాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని వెల్లడైంది. హ్యాకర్‌గా పనిచేసిన అనుభవంతో తెలివిగా నేరాలకు పాల్పడేవాడు. గిఫ్ట్‌లు పంపి.. విశాఖకు చెందిన మీనాక్షి (పేరు మార్చాం) భర్త చనిపోవడంతో మాట్రిమోనీ డాట్‌కామ్ ద్వారా అమెరికాలోని ఓ సా‹ఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకుంది. అమెరికా నుంచి పలుసార్లు గిఫ్్టలు కూడా ఆమెకు అందాయి. కొన్నాళ్ల తర్వాత అత్యవసరమని చెప్పడంతో బాధితురాలు రూ.50 లక్షలు అతడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత నుంచి నిందితుడి ఫోన్ పనిచేయలేదు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Illegal Loan Apps: దారుణానికి అడ్డుకట్ట!
అప్పులిస్తున్నామంటూ అమానవీయంగా ప్రవర్తిస్తున్న చట్టవిరుద్ధమైన డిజిటల్ యాప్‌లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుందా? ఆర్థిక మంత్రి సారథ్యంలో గత వారం జరిగిన సమావేశం ఆ మేరకు ఆశలు రేపుతోంది. దేశంలో సాధారణ బ్యాంకింగ్ మార్గాలకు వెలుపల చట్టవిరుద్ధంగా నడుస్తున్న డిజిటల్ రుణ వేదికలపై మరిన్ని చర్యలకు కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నడుం బిగించాయి. చట్టబద్ధంగా రుణాలిచ్చే సవ్యమైన యాప్‌లతో జాబితాను సిద్ధం చేసే బాధ్యతను ఆర్బీఐకి అప్పగించారు. ఇక ఆ ‘శ్వేతజాబితా’లోని యాప్‌లే డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖ జాగ్రత్తలు తీసుకోనుంది. అందుకోసం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ లాంటి వాటికీ, ఆర్బీఐకీ మధ్య సమన్వయం చేయనుంది. అలాగే, పేమెంట్ యాగ్రిగేటర్లు నిర్ణీత కాలవ్యవధి లోపల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్టర్ కాని వాటిని ఆ తర్వాత అనుమతించరాదనేది తాజా నిర్ణయం. వేల కుటుంబాలు కూలిపోవడానికి కారణమైన లోన్ యాప్‌లపై వేటుకు ఇవి తొలి అడుగులుగా భావించవచ్చు. దేశంలోని వేగవంతమైన డిజిటలీకరణ, మారుమూలలకు సైతం వ్యాపించిన మొబైల్ సర్వీసు లకు విపరిణామం ఈ లోన్ యాప్‌ల తంటా. అవసరంలో ఉన్న అల్పాదాయ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని అప్పులు, సూక్ష్మ రుణాలు ఇచ్చే అక్రమ యాప్‌ల దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల సాంకేతిక నిరక్షరాస్యత వాటికి వాటంగా మారింది. అత్యధిక వడ్డీ రేట్లు, పైకి కనిపించని రుసుములు, బాకీ వసూళ్ళ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌లకు ఇవి పేరుమోశాయి. అడ్డూ అదుపూ లేని ఈ డిజిటల్ రుణ యాప్‌లలో అత్యధికం చైనావే. ఇవి తక్షణ రుణాలు ఇస్తామంటూ లక్షలాది వినియోగ దార్లను వలలో వేసుకుంటున్నాయి. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కస్టమర్లు తీసుకున్న రుణా లపై వడ్డీలకు వడ్డీలు వేస్తూ, వాటి వసూలుకై రాక్షసరూపం దాలుస్తున్నాయి. ఈ డిజిటల్ యాప్‌ల రుణ వసూలు ఏజెంట్ల ముందు అలనాటి నక్షత్రకులు సైతం దిగదిడుపే. అప్పు తీసుకొనేందుకు సదరు యాప్‌లకు ఫోన్లోని నంబర్లు, ఫోటోలను అందుబాటులోకి తేవడం కొంపముంచుతోంది. వెంటాడి, వేధించే వారి మాటలు, చేష్టలు, అసభ్య మెసేజ్‌లు, మహిళల మార్ఫింగ్ ఫోటోలతో చివరకు పరువు పోయిందనే వేదనతో దేశవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు తీసుకున్నారు. డిజిటల్ రుణ యాప్‌లపై 2020 జనవరి నుంచి గత ఏడాది మార్చి వరకు రెండున్నర వేలకు పైగా ఫిర్యాదులు ఆర్బీఐకి అందాయి. దరిమిలా పరిశీలనలో రిజిస్టర్ కాని లోన్ యాప్‌లు దాదాపు 600కు పైగానే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంపై రేగిన రచ్చతో గూగుల్ సైతం చర్యలు చేపట్టక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి తమ ప్లే స్టోర్‌లో 2 వేలకు పైగా వ్యక్తిగత రుణాల యాప్‌లను తొలగించినట్టు గత నెలలో ఆ సంస్థ ప్రకటించింది. అంటే, వ్యక్తిగత రుణ విభాగంలోని మొత్తం యాప్‌లలో దాదాపు సగానికి పైచిలుకు గూగుల్ తొలగించిందన్న మాట. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యాప్ ఆధారిత తక్షణ రుణాల్లో అవకతవకలు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికీ వచ్చాయి. అందుకే ఇటీవల బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ తదితర ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. లోన్‌యాప్‌లతో పైకి కనిపించని ప్రమాదాలెన్నో! వీటి కార్యకలాపాలతో అక్రమ నగదు తర లింపు, పన్నుల ఎగవేతకు వీలుంది. వ్యక్తిగత డేటా చౌర్యం, డొల్ల కంపెనీలు, కార్యకలాపాలు ఆపే సిన బ్యాకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) దుర్వినియోగం విచ్చలవిడిగా సాగే ముప్పుంది. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. నిజానికి, నియంత్రణ లేని ఈ యాప్‌ల బారి నుంచి సామాన్య ప్రజలను కాపాడాలంటే, వాటిని నిషేధిస్తూ కేంద్రం ఓ చట్టం తేవాలని ఆర్బీఐ ఇటీవల సిఫార్సు చేసింది. చట్టపరమైన అనుమతులున్న, ఆర్బీఐ నియంత్రణలోని సంస్థలే అప్పులివ్వాలని నెల రోజుల క్రితం ఆగస్ట్ 10న నియంత్రణ చట్రాన్ని నిర్దేశించింది. అలాగే, డిజిటల్ రుణాలను నేరుగా రుణగ్రహీతల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలనీ, మూడోవ్యక్తి ద్వారా కానే కాదనీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో చట్టవిరుద్ధమైన రుణ తిమింగలాలను యాప్ స్టోర్లలో అనుమతించనంత మాత్రాన అంతా మారిపోతుందనుకోలేం. యాప్‌లను పక్కదోవన లోడ్ చేసేలా లొసుగులున్నాయి. యాప్ స్టోర్లతో పని లేకుండా నేరుగా లింక్ పంపి, దాన్ని నొక్కితే సరిపోయే వీలుంది. అందుకే, కస్ట మర్లు, బ్యాంక్ ఉద్యోగులు, చట్టాన్ని పరిరక్షించే విభాగాల దాకా అందరికీ సైబర్ వ్యవహారాలపై చైతన్యం కలిగించడం ముఖ్యం. చట్టవిరుద్ధంగా చెలరేగిపోతున్న యాప్‌లకు ముకుతాడు వేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థలు తగు చర్యలు చేపట్టాలి. ఆర్థిక మోసాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పరిష్కార కేంద్రం పెట్టడం లాంటివీ యోచించాలి. ఫిన్‌టెక్ సంస్థలు సైతం తమ వ్యాపార నమూనాలను సమీక్షించుకొని, పారదర్శక విధానం వైపు సాగాలి. కట్టాల్సివచ్చే రుసుములు వగైరా ముందే స్పష్టం చేయాలి. దాని వల్ల తెలుసుకొని మరీ కస్ట మర్లు నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే సమయంలో పారదర్శకత వదిలేసి, ‘శ్వేత జాబితా’ పేరిట సంక్లిష్ట ప్రమాణాలను పెట్టి, న్యాయబద్ధమైన లోన్‌యాప్‌లను ఆర్బీఐ తొలగించకూడదు. సరైన పద్ధతులు అనుసరిస్తూనే, అనుమతించినా, నిరాకరించినా కారణాలూ పేర్కొనడం ముఖ్యం. అప్పుడే నిఖార్సయిన యాప్‌లకు చిక్కులు లేకుండా, దారుణ యాప్‌ల కథ కంచికి చేరుతుంది. -
అక్రమ రుణ యాప్‌లకు చెక్!
న్యూఢిల్లీ: డిజిటల్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్ బ్యాంక్ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వీటి ప్రకారం మనీ లాండరింగ్ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్ చేసే బాధ్యత కార్పొరేట్ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రుణాల యాప్‌లు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన తదితర అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
లంచమడిగితే వెంటనే చర్యలు
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా ‘ఏసీబీ 14400 యాప్’ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు. మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ఏసీబీ 14400 కాల్ సర్వీసులు, దానిపై రూపొందించిన యాప్‌పై వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ యాప్‌ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాప్‌లో లైవ్ రికార్డు ఆడియో, ఫొటో లేదా వీడియో సౌకర్యం వంటి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయని వివరించారు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఇందులో ఉందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్‌కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్ వస్తుందన్నారు. -
శుభవార్త చెప్పిన సెబీ.. ఇన్వెస్టర్ల కోసం కొత్తగా..
SEBI: దేశవ్యాప్తంగా యువతరంలో స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న డీమ్యాట్ ఖాతాలే ఇందుకు ఉదాహారణ. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారికి దారి చూపేందుకు సారథి (Saa~thi) పేరుతో మొబైల్ యాప్‌ని తీసుకొచ్చింది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ. కొత్తగా మార్కెట్‌కి వస్తున్న వారిలో చాలా మంది మార్కెట్ తీరుతెన్నులు, లోతుపాతులు తెలుసుకోకుండా బ్రోక్రర్లను ఆశ్రయించే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కష్టనష్టాల పాలవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు మార్కెట్‌కి సంబంధించిన సమస్త వివరాలు వెల్లడించే విధంగా సారథిని రూపొందించినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. త్వరలోనే సారథి యాప్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ యాప్ అందుబాటులో ఉంది. -
బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని జనవరి 28 వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా, దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జనవరి (17) సోమవారం విచారణ జరగనుంది. బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్‌తో పాటు శ్వేత, మయాంక్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుల తరపు న్యాయవాది, తమ క్లయింట్ల ట్విటర్ ఖాతాను హ్యక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. ఇప్పటికే శ్వేత, మయాంక్‌లను ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు విశాల్ కుమార్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. విశాల్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో అతడిని ముంబైలోని కలీనా క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నీరజ్‌ను భోపాల్‌లోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పదిహేను సంవత్సరాల వయసులోనే హ్యకింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ బుల్లి బాయ్ యాప్‌తో మహిళలను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’ -
హ్యాక్ అయితే 7 లోపు సంప్రదించండి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్వో సంస్థ తయారీ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగగస్’ కారణంగా మొబైల్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు భావించే బాధితులు జనవరి ఏడో తేదీ లోపు తమను సంప్రదించాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ప్రజలకు సూచించింది. ఈ మేరకు కమిటీ ఆదివారం ఒక పబ్లిక్ నోటీస్‌ను జారీచేసింది. ‘ పెగసస్ మాల్వేర్ తమ ఫోన్‌ను హ్యాక్ చేసిందని ఎందుకు భావిస్తున్నారో తగు కారణాలను కమిటీ ముందు ఆయా బాధితులు వెల్లడించాలి. హ్యాక్ అయిన మొబైల్/డివైజ్‌ను టెక్నికల్ కమిటీ పరిశీలించేందుకు మీరు అంగీకరిస్తారా? అనే విషయాన్నీ కమిటీకి పంపే ఈ–మెయిల్లో స్పష్టం చేయాలి’ అని ఆ నోటీస్‌లో కమిటీ పేర్కొంది. ‘ మీ కారణాలు సహేతుకమైనవని కమిటీ భావిస్తే ఆ మొబైల్/డివైజ్‌ను కమిటీ పరిశీలన/పరీక్ష/దర్యాప్తునకు తీసుకుంటుంది’ అని నోటీస్‌లో పేర్కొన్నారు. విపక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, జడ్జీలు సహా ప్రముఖుల మొబైల్ ఫోన్లను మోదీ సర్కార్ పెగసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసి నిఘా పెట్టిందని పెను దుమారం చెలరేగిన విషయం విదితమే. -
IOS 15.2 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి.. సాక్షి.కామ్ని వీక్షించండి
ప్రియమైన సాక్షి.కామ్ వీక్షకులకు స్వాగతం. ఐఓఎస్ యాప్ అప్డేట్ (IOS) వెర్షన్ 15.1 తో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా ఐఫోన్ యూజర్లకు కంటెంట్‌లో కొన్ని ఒత్తులు, అక్షరాలు తారుమారు అయ్యాయి. IOS లేటెస్ట్ వెర్షన్ 15.2 లో ఆ సమస్యలు పరిష్కరించబడ్డాయి. IOS లేటెస్ట్ వెర్షన్ 15.2 డౌన్లోడ్ చేసుకుని సాక్షి.కామ్‌ను వీక్షించండి. ధన్యవాదాలు. - సాక్షి డిజిటల్ ఇప్పుడు (IOS 15.2 వెర్షన్) ఇంతకు ముందు (IOS 15.1 వెర్షన్) -
గ్రామాల్లో పారిశుధ్యంపై ‘యాప్’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేసింది. తమ ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్రతపై స్థానికులు మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సర్పంచ్ ఆధ్వర్యం లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. గ్రామాలను పరి శుభ్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకునే చర్యల ఆధా రంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నారు. యాప్ ద్వారా అందే ఫిర్యాదుల పరి ష్కారంపై పర్యవేక్షణకు జిల్లా డీపీవో కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో మరొకటి ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఫిర్యాదు అందిన తర్వాత 72 గంటలపాటు కంట్రోల్ రూం ద్వారా పర్య వేక్షిస్తారు. పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు తెలియజేస్తారు. ఒకవే ళ సంతృప్తి చెందకున్నా, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకున్నా మరోసారి ఫిర్యాదు చేసే వీలుంది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. అతి త్వరలో అందుబాటులోకి యాప్.. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ‘జేఎస్ఎస్’ పేరుతో ఇప్పటికే మొబైల్ యాప్ సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ప్లే స్టోర్ ద్వారా యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసిన ఫోటో లేదా చిన్నపాటి వీడియోను మాత్రమే ఫిర్యాదుతో జోడించేలా యాప్‌ను రూపొందించారు. యాప్ ద్వారా పంపిన ఫిర్యాదు వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శికి చేరుతుంది. 24 గంటల తర్వాత మండల స్థాయి ఈవోపీఆర్డీకి, 48 గంటల తర్వాత జిల్లా డీపీవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం వద్దకు ఆటోమెటిక్‌గా సమాచారం అందుతుంది. ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు? క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గ్రామాలను సైతం పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన విషయం తెలిసిం దే. పల్లెల్లోనూ ప్రతి ఇంటినుంచి చెత్తసేకరణ కార్య క్రమాన్ని చేపడుతున్నారు. తమ ఇళ్ల నుంచి నిర్ణీత గడువు ప్రకారం రోజువారీ చెత్తను సేకరించక పో యినా, రోడ్లపక్కన ఒకేచోట పెద్దమొత్తంలో పేరుకు పోయినా, మురుగు కాల్వలు సక్రమంగా లేకున్నా, మురుగునీటి గుంతలున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదులో వివరాలు నమోదు చేసేలా వీలు కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో.. గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వ మే అందజేస్తోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు, ఆటో రిక్షాలు లాంటివి అన్ని గ్రామాలకు సరఫరా చేసింది. అక్టోబరు 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 55.41 లక్షల ఇళ్ల నుంచి రోజువారీ చెత్త సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే హై ప్రెజర్ క్లీనర్స్, దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఒక ఫాగింగ్ మిషన్, ఇతర యంత్రాల సరఫరాకు చర్యలు చేపట్టారు. 2022 డిసెంబరు వరకు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షించే ఈ కార్యక్రమాలు తర్వాత పంచాయతీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. -
యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటి పన్ను వసూలు: పెద్దిరెడ్డి
-
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్‌లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్‌ని ప్రారంభించింది. -
ప్రపంచ జనాభాను మించి... యూట్యూబ్ వరల్డ్ రికార్డ్ !
ప్రపంచంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. టెక్నాలజీ ప్రపంచంలో మిగిలిన యాప్‌లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరీ అందనంత ఎత్తులో నిల్చుంది. 1000 కోట్లు ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు, అయితే ఇప్పటి వరకు యూ ట్యూబ్ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్లోడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటన్నింటీని వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు వచ్చాయి. దీంతో యూట్యూబ్ వరల్డ్ రికార్డు సాధించగలిగింది. ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్ యాప్ వెయ్యి కోట్ల సార్లు డౌన్లోడ్ అయ్యింది. తర్వాత స్థానం ప్లే స్టోర్‌కి సంబంధించి యూట్యూబ్ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్లోడ్లలతో ఫేస్బుక్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాట్సప్ 600 కోట్లు, ఫేస్బుక్ మెసేంజర్ 500 కోట్లు, ఇన్స్టాగ్రామ్ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ సైతం ఇక సంచలనాలకు కేంద్ర బిందువైన టిక్‌టాక్ 200 కోట్లు, సబ్వే సర్ఫర్ వంద కోట్లకు పైగా డౌన్లోడ్లు సాధించాయి. ఫేస్బుక్ లైట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్‌లు రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్లోడ్ అయ్యాయి. -
దిశ యాప్ డౌన్లోడ్ ఇలా..
మహిళల భద్రత విషయంలో ఏపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. హామీలు ఇవ్వడం, పథకాలు ప్రారంభించడంతోనే కాదు వాటిని పక్కాగా అమలు చేయడంలో అదే అంకిత భావం చూపిస్తోంది. అందుకు దిశ యాప్ ప్రమోషనల్ కార్యక్రమం మరో ఉదాహరణ. అమరావతి: ఏపిలో దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించారు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారా వచ్చిన కాల్స్, మేసేజ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు 850 పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 160 సందర్భాల్లో ఎప్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇంచుమించు వెయ్యి మంది మహిళలు, అమ్మాయిలను ప్రమాదాల బారి నుంచి దిశ యాప్ రక్షించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం జగన్ దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొని ప్రతీ ఒక్క మహిళ చేత ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డౌన్లోడ్ ఇలా ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ప్లే స్టోర్, ఆప్ స్టోర్ నుంచి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి ► యాప్ డౌన్లోడ్ పూర్తైన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ నంబర్ వస్తుంది ► ఓటీపీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత.. పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ► అక్కాచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్‌లో ఉన్న అత్యవసర సహాయం (SOS) బటన్ నొక్కితే వారి ఫోన్ నంబరు, చిరునామా, వారున్న లోకేషన్‌తో సహా వారి వాయిస్‌తో పాటు 10 సెకన్ల వీడియో రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి పంపేలా దిశ యాప్‌కి రూపకల్పన చేశారు. ► అక్కాచెల్లెమ్మల నుంచి అలెర్ట్ రాగానే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కి సమాచారం చేరవేస్తారు. పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారికి రక్షణ కల్పిస్తారు. దిశతో ప్రయోజనాలు ► యువతులు, మహిళలు ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు ► ప్రయాణ సమయంలో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ ఏర్పాటు. ఈ ఆప్షన్లో తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ జరుగుతుంది. ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుంది. ► దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామాకేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు కూడా ఉంటాయి. ► కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఏకకాలంలో దిశ యాప్ ఉపయోగించే వారందరికి సలహాలు, సూచనలు ఇస్తూ జరగబోయే ప్రమాదాలను నివారిస్తారు ► విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్ ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి ఆపద సందేశం చేరుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్‌కి కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్‌కి ఎవరూ స్పందించకపోతే పోలీస్ వెహికల్స్‌లో అమర్చిన మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్‌కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు. దిశ యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha చదవండి : ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలి: సీఎం జగన్ -
ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. రేణూ దేశాయ్ పంచుకున్న విషయాల ప్రకారం... ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: Digital Rules: ట్విటర్‌కు ఫైనల్ వార్నింగ్ View this post on Instagram A post shared by renu (@renuudesai) -
చైనా యాప్స్‌కు చెక్
బెంగళూరు: భారత్‌లో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతుండగా.. చైనా యాప్స్ క్రమంగా వెనుకబడుతున్నాయి. మార్కెటింగ్ అనలిటిక్స్ సంస్థ యాప్స్‌ఫ్లయర్ నివేదిక ప్రకారం గతేడాది భారత మార్కెట్లో చైనా యాప్స్ వాటా 29%కి పరిమితం కాగా.. దేశీ యాప్స్ ఇన్స్టాల్స్ పరిమాణం 40%గా ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, జర్మనీ యాప్స్ కూడా ప్రవేశించి.. చైనా యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నివేదిక ప్రకారం గతేడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 మధ్య లో 4,519 యాప్స్‌కు సంబంధించి 730 కోట్ల ఇన్స్టాల్స్ నమోదయ్యాయి. వీటిలో వినోదం, ఫైనాన్స్, షాపింగ్, గేమింగ్, ట్రావెల్, న్యూస్ తదితర విభాగాల యాప్స్ ఉన్నాయి. చౌక హ్యాండ్సెట్స్, డేటా చార్జీల ఊతంతో ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాల్లో గేమింగ్, ఫైనాన్స్, వినోద విభాగాల్లో మొబైల్ వాడకం పెరిగింది. ప్రాంతీయ భాషల్లోనే కంటెంట్ లభ్యత ఈ ధోరణికి కారణమని యాప్స్‌ఫ్లయర్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్ త్రిశల్ తెలిపారు. ఫిన్‌టెక్ యాప్స్‌కు కష్టాలు.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. భారత మార్కెట్లో భారీగా అమ్మకాలు సాధిస్తున్నప్పటికీ.. ఫిన్‌టెక్ రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. షావోమి, ఒప్పో, రియల్‌మి వంటి పలు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థలు 2020 తొలినాళ్లలో తమ ఫిన్‌టెక్ యాప్స్‌ను ప్రవేశపెట్టాయి. మి పే, మి క్రెడిట్, ఒప్పో క్యాష్, రియల్‌మి పేసా పేర్లతో అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీల స్మార్ట్ఫోన్లకు యూజర్ల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా గూగుల్ ప్లే స్టోర్‌లో వీటిలో ఒక్కో యాప్ డౌన్లోడ్స్ పది లక్షల కన్నా తక్కువే ఉండటం గమనార్హం. ఇక లావాదేవీలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం.. గతేడాది మొత్తం మీద చూస్తే నెలవారీ లావాదేవీలు మి పే ద్వారా 4,80,000, రియల్‌మి పేసాద్వారా 10,000 మాత్రమే జరిగాయి. అదే ఫోన్‌పే ద్వారా 90.23 కోట్లు, గూగుల్ పేలో 85.44 కోట్ల మేర నెలవారీ లావాదేవీలు నమోదయ్యాయి. ఇక తక్షణ రుణాలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల సరీ్వసులు మొదలైన వాటికీ ఆదరణ లభించడం లేదు. చైనాపై వ్యతిరేకతే కారణం.. తమకు ప్రస్తుతం ఉన్న యూజర్ల ఊతంతో ఆర్థిక సర్వీసులు మొదలైన విభాగాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించవచ్చని చైనా కంపెనీలు భావించాయి. దానికి అనుగుణంగానే ఫిన్‌టెక్ సేవలను ప్రవేశపెట్టాయి. కానీ, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా కంపెనీలపై కూడా ఆ ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని పరిశీలకులు తెలిపారు. దీంతో భారతీయుల్లో ప్రస్తుతం ఉన్న సెంటిమెంటు దృష్ట్యా చైనా కంపెనీలు పెద్దగా ప్రచార ఆర్భాటాల జోలికి పోవడం లేదని పేర్కొన్నారు. ఏడాది, రెండేళ్ల వ్యవధిలో బ్రాండ్లు మార్చేసే యూజర్లు.. ఆర్థిక సేవల విషయంలో ఎక్కువగా పేటీఎం లేదా గూగుల్ పే వంటి వాటినే ఎంచుకుంటారు తప్ప చైనా ఫిన్‌టెక్ యాప్‌లపై ఆధారపడటం లేదని వివరించారు. తగ్గుతున్న థర్డ్ పార్టీ యాప్స్ రుణాలు.. కరోనా వైరస్ మహమ్మారి దరిమిలా చాలా మంది క్రెడిట్ స్కోర్లు గతేడాది భారీగా పడిపోయాయి. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రుణాల లావాదేవీలు కూడా గణనీయంగా తగ్గాయి. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ ఫిన్‌టెక్ కార్యకలాపాలను పెద్దగా విస్తరించలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని రీసెర్చ్ సంస్థ టెక్ఆర్క్ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలు తొందరపడకుండా, నెమ్మదిగా ప్రణాళికల అమలుపై పనిచేస్తున్నాయని ఒప్పో కాష్, రియల్‌మి పేసాకి సర్వీసులు అందించే ఫిన్‌షెల్ వర్గాలు వివరించాయి. -
ఈ-వాచ్ యాప్‌పై వెనక్కు తగ్గిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. యాప్‌పై అనేక అభ్యంతరాలు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెనక్కు తగ్గింది. యాప్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినందున, యాప్‌ను విత్‌డ్రా చేసుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. -
యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను ‘యాప్’ ద్వారా నియంత్రించేందుకు పన్నిన కుట్ర లోతులు.. మెల్లగా బహిర్గతమవుతున్నాయి. ఈ ‘యాప్’ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్న మాటలు, పాటిస్తున్న గోప్యత చూస్తుంటే... అసలీ ఎన్నికల్లో పారదర్శకత మచ్చుకైనా ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ యాప్ జియోలో ఏపీ పంచాయతీ ఎన్నికల పేరిట లభ్యమవుతుందని, దీనికి రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, సందేశాలు పంపవచ్చని శుక్రవారం అనంతపురంలో విలేకరులతో చెప్పారాయన. సందేశం ఇచ్చిన వారికి రిప్లై ఇస్తామంటూ... తొలిసారికే ఇది విజయవంతం కాదని, మూడో దశకల్లా బలపడుతుందని, పట్టు వస్తుందని చెప్పారు. ఈ మాటలు విన్నవారికి... ఇలా మాట్లాడుతున్నది ఒక ఎన్నికల కమిషనరేనా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారేనా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలై... తొలి దశ పోలింగ్ కూడా సమీపిస్తోంది. ఇప్పటికీ ఈ యాప్ గురించి ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డకు తప్ప ఎవ్వరికీ వివరాలు తెలియవు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని రెండు రోజుల కిందట ‘సాక్షి’తో చెప్పిన నిమ్మగడ్డ కార్యదర్శి... శుక్రవారం నాలిక కర్చుకున్నారు. అలాంటిదేమీ పంపలేదన్నారు. ఇంకా విచిత్రమేంటంటే... జియోలో యాప్ ఉంటుందనే మాటకు అర్థమే లేదు. జియో అనేది బయటి యాప్‌లను హోస్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి ప్లాట్‌ఫామ్ కాదు. ప్రస్తుతానికి అదో మొబైల్ నెట్వర్క్. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ మాదిరే ఇది కూడా. మరి దీన్లో అధికారిక యాప్‌ను ఎలా ఆవిష్కరిస్తారు? మొదటి దశకు సక్సెస్ కాదని, చివరి దశకల్లా పట్టు వస్తుందని చెప్పటమేంటి? అసలీయన తెలిసే మాట్లాడుతున్నారా? లేక బయటి నుంచి ఎవరో చెప్పమన్న మాటలను చెబుతూ... తడబడుతున్నారా? కావాలని తప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారా? తనకు కావాల్సిన వారికే లాగిన్? యాప్ వివరాలు తన కార్యాలయంలో కూడా ఎవ్వరికీ తెలియకుండా సొంత వ్యవహారంలా చక్కబెడుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్... ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను తెరిచి చూసుకునేందుకు వీలైన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇది ఆయనకు, ఆయనకు ఇష్టమైన కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యులకు మాత్రమే ఉంటుందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. లాగిన్ తన ఒక్కడి దగ్గరే ఉంటుందన్న విషయాన్ని నిమ్మగడ్డ స్వయంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది కానీ... వారికి సీఈసీ పంపిన ఫిర్యాదులు మాత్రమే ఎవరి జిల్లావి వారికి కనిపిస్తాయి. దీనివల్ల సీఈసీ తనకు వచ్చిన ఫిర్యాదుల్లో కావాలనుకున్న వాటిని మాత్రమే కలెక్టర్లకు పంపించే అవకాశం ఉంటుంది. తనకు ఇష్టం లేని ఫిర్యాదుల్ని అక్కడే డిలీట్ చేసేయొచ్చు కూడా. ఎక్కడా నిఘా లేకుండా, ప్రభుత్వ అ«దీనంలో కాకుండా ఒక ప్రయివేటు వ్యక్తి మాదిరిగా ఇలా యాప్‌ను నిర్వహించటం అత్యంత ప్రమాదమన్నది ప్రజాస్వామ్య వాదుల మాట. సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటాయి. కానీ వేటికీ సంబంధం లేకుండా తనే సొంత యాప్‌ను తయారు చేయించుకుని, తన ఒక్కడి వద్దే లాగిన్ ఉంచుకుని ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? అసలు పారదర్శకత అనే మాటకు అర్థమైనా తెలుసా? రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డంపెట్టుకుని ఇలా విలువల్ని కాలరాయటం కరెక్టేనా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. యాప్ తయారైందా.. లేదా.. అదీ రహస్యమే!! ఈ ఎన్నికల కోసం తానే ప్రత్యేక యాప్ తయారు చేయిస్తున్నట్టు చెప్పి నిమ్మగడ్డ ఏడాది కిత్రం పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన నిఘా యాప్‌ను సైతం పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చారు. అయితే, నిఘా యాప్‌కు బదులుగా ఆయన చెబుతున్న యాప్ ఇప్పటికే తయారైందా.. లేదా అన్నది తేల్చటం లేదు. గోప్యత పాటిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అనంతపురంలో శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు ఇంకా ఆ యాప్ తయారు చేయించడం పూర్తి కాలేదనే చెప్పటం గమనార్హం. మరో పక్క పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారం ప్రారంభమైంది. 3249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన్ల పోలింగ్ కూడా జరగబోతుంది. అంటే ఖచ్చితంగా మరో పది రోజులకు మించి సమయం లేదు. మరి ఈయన ఉద్దేశమేంటి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తయారు చేసి, తమ అ«దీనంలో నడిపిస్తున్న యాప్‌ను ఈయన వాడతారా? చివరి రోజు వరకూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలాగే అందరినీ చీకట్లో ఉంచాలన్నది ఆయన వ్యూహమా? ‘ఔట్ సోర్సింగ్’ సిబ్బందిలో టీడీపీ హస్తం! ఇటీవలే కమిషన్ కార్యాలయంలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పిన నిమ్మగడ్డ... ఆ సెల్‌కు కేటాయించిన ఫోన్ నెంబర్లు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 15 మంది లోపే రెగ్యులర్ ఉద్యోగుల పనిచేస్తున్నారని.. మరో 20 మంది దాకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు సెల్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చూస్తున్నారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారని సమాచారం. వారికే ఈ సెల్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. -
టీడీపీ కుట్రకు యాప్ దన్ను
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రయోజనాలే లక్ష్యంగా భారీ కుట్రకు పావులు కదులుతున్నాయి. మొదటి నుంచీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. దీన్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారనేందుకు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. కరోనా వేళ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయటం.. అధికారుల బదిలీలతో పాటు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారుల్ని అభిశంసిస్తూ (సెన్సూర్) ఉత్తర్వులివ్వటం.. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి వ్యతిరేకించేలా వాŠయ్ఖ్యానించటం చేసిన ఈసీ.. ఈ సారి ఎన్నికలను వెబ్‌కాస్టింగ్ బదులు యాప్ ద్వారా పర్యవేక్షిస్తామంటూ కొత్త ఎత్తుగడకు తెరతీశారు. బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఎన్నికల వెబ్‌క్యాస్టింగ్ అంశం చర్చకు వచ్చింది. అయితే వెబ్ కాస్టింగ్ క్వాలిటీ బాగుండటం లేదంటూ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తంచేశారు. పైపెచ్చు ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఒక యాప్ అవసరమన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిఘా యాప్ ఉంది కదా? అని ఓ అధికారి చెప్పగా... తనకు అది అవసరం లేదని నిమ్మగడ్డ సమాధానమిచ్చారు. ఈ ఫిర్యాదుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక యాప్‌ను తీసుకొచ్చిందని, అలాంటిదే తానూ తయారు చేయించానని, దాన్ని వాడతామని ఆయన చెప్పటంతో విస్తుపోవటం అధికారుల వంతయింది. ఎందుకంటే యాప్‌కు సంబంధించి ఆయన ఇతరత్రా ఏ వివరాలూ వెల్లడించలేదు. పైపెచ్చు ఇప్పటిదాకా యాప్ గురించి ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినా ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఎన్నికల కమిషనర్ తన సొంత యాప్‌ను తయారు చేయించటమేంటి? దాన్ని ఇప్పటిదాకా గోప్యంగా ఉంచటమేంటి? ఒకవేళ అలాంటివేవైనా తయారు చేయిస్తే ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారమిచ్చి ఉండాలి కదా? ఏ కంపెనీ తయారు చేసింది? ఆ కంపెనీకి ఆ పని ఎవరు అప్పగించారు? ప్రయివేటు కంపెనీల డేటా చౌర్యం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తోందో తెలియంది కాదు కదా? అసలు ఎన్నికల కమిషనర్ తనే సొంతంగా తనకు నచ్చిన కంపెనీతో ఇలాంటివి తయారు చేయించొచ్చా? వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో వినియోగించవచ్చా? ఇదేమైనా ఆయన సొంత వ్యవహారమా? అధికారులను వేధిస్తున్న ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఈసీ అయితే జవాబివ్వలేదు. మాటలకు, చేతలకు పొంతనలేని నేపథ్యంలో ఎన్నికల్లో పారదర్శకత కూడా ప్రశ్నార్థకమేనని వస్తున్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతున్నట్లవుతోంది. అంతా తెదేపా కనుసన్నల్లోనే... ఎన్నికల కమిషనర్‌గా తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమవుతుండటం వెనక తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడాలన్న ఉద్దేశమే కనిపిస్తోంది. ఈ యాప్ విషయంలోనూ అదే తీరు. పోలింగ్ రోజున తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావు, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ యాప్ ద్వారా హైదరాబాద్ నుంచి ఎన్నికలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకుడొకరు చెప్పారు. పైపెచ్చు పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ఏకంగా టీడీపీ తరఫున మ్యానిఫెస్టోనే విడుదల చేశారు. తమ పార్టీ వారంతా ఎక్కడికక్కడ నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి బలం లేని గ్రామాల్లోనూ నామినేషన్లు వేయించాలని, ఏకగ్రీవ ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో ఘర్షణలు సృష్టించాలని వ్యూహం పన్నినట్లు సమాచారం. దీనికోసం ఏకంగా ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యాప్ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించకుండా నిమ్మగడ్డ గోప్యత పాటిస్తున్నారని, పోలింగ్ నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యాప్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు చేసేలా... వాటిని సమీక్షించి వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా వ్యూహం రచించారని సమాచారం. అందుకనే తాను మరో రెండు నెలల పాటు ఈసీగా పదవిలో ఉండగానే ఎన్నికల ప్రక్రియను జరిపించడానికి ఆయన తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘వెబ్ కాస్టింగ్’ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇక ఫిర్యాదుల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిఘా యాప్‌ను నిర్వహిస్తోంది. వీటన్నిటినీ కాదని సొంత యాప్‌ను పెడతానని ఆయన చెప్పటమే విచిత్రమని అధికారులు వాపోతున్నారు. బాబుతో బంధం ఈనాటిది కాదు... గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయడంతోనే రాష్ట్ర ప్రజలకు ఈసీ నిజ స్వరూపం తెలిసింది. తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిమ్మగడ్డ రాసిన ఓ లేఖ టీడీపీ అనుకూల మీడియా సంస్థలో తయారైందంటేనే ఆయనకు వారికి మధ్య ఎంత బలమైన సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని విమర్శించారు. పైపెచ్చు విచారణలో భాగంగా ఆ లేఖ ఈసీ కార్యాలయంలో తయారైంది కాదని అక్కడి కంప్యూటర్లను పరిశీలించాక ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ తరవాత కూడా ఆయన తన కంప్యూటర్లను తనకివ్వాలని కోరటం గమనార్హం. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఇప్పుడు బయటపడుతున్న కుట్రలకు సజీవ సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబుకు బినామీగా పేరున్న ఓ మీడియా అధిపతి ఆధ్వర్యంలో పన్నెండేళ్ల క్రితం ఓ ఎల్లో టీవీ ఛానెల్ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన ఆ ఛానల్‌కు రేటింగ్ దక్కేందుకు ‘రాజ్‌భవన్‌లో రాసలీలలు’ పేరిట రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియో ఫుటేజీ సదురు ఎల్లో టీవీ ఛానల్‌కు మాత్రమే లీక్ అవడం వెనుక కుట్ర దాగి ఉందని అప్పట్లోనే గుప్పుమంది. ప్రస్తుత ఎస్ఈసీ ఆ సమయంలో నాటి గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ కుమార్తెకు భారీగా లబ్ది చేకూర్చిన వైనం ఇప్పటికే బయటపడింది. ‘యాప్’ యమ డేంజర్ – యాప్‌ను పోలింగ్ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా డౌన్లోడు చేసుకోవచ్చు. – ఈ విధానంలో ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదుకు అనుకూలంగా ఆడియో, వీడియోలను పంపించే అవకాశం ఉంటుంది. – అంటే జరిగిన సంఘటన జరిగినట్టుగా కాకుండా తమ వాదనకు తగ్గ రీతిలో పంపించవచ్చు. ఫోన్లోని యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి ఏది అనుకుంటే అది ఫిర్యాదుకు ఆధారంగా పంపించవచ్చు. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే ఒకరు మాత్రమే దాడి చేసిన దృశ్యాలను యాప్ ద్వారా పంపించొచ్చు. అవతలి వ్యక్తి కూడా దాడి చేసినప్పటికీ ఆ విషయాన్ని రికార్డు చేయకుండా వాస్తవాలను తొక్కిపెట్టవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా వాస్తవాలను వక్రీకరిస్తూ అందుకు అనుగుణంగా ఆధారాలను సృష్టించవచ్చు. – అంతే కాదు...యాప్ నిర్వహణను ఎవరైనా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థలోని తమ వ్యక్తుల ద్వారా వాస్తవాలను వక్రీకరించవచ్చు.సెంట్రల్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులలో ఎంపిక చేసిన వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటే అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు. –యాప్ ద్వారా ఎడిట్ చేసిన వీడియో, ఆడియోలు పంపిస్తే...వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. – అవి ట్యాంపర్ చేసిన వీడియోలు, ఆడియో రికార్డులు అని రుజువు చేయాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇంతలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సక్రమంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... ‘వెబ్ కాస్టింగ్ అన్నది ఆబ్జెక్టివ్( పారదర్శక విధానం)...యాప్ సబ్జెక్టివ్ (తమ ఫిర్యాదుకు అనుకూలంగా ఆధారాలు సృష్టించే విధానం). ఇంతటి వివాదాస్పద నిర్ణయానికి కమిషనర్ ఎందుకు తీసుకుంటున్నారన్నది అంతుపట్టనిదేమీ కాదు. అతని వ్యవహారశైలి ముందునుంచి వివాదాస్పదమే. అఖిలభారత సర్వీసు అధికారిగా 23 ఏళ్లుగా నేను ఆయనను గమనిస్తున్నాను. ఓ రాజ్యంగబద్దమైన పదవిలో ఉండటానికి ఎంత మాత్రం అర్హత లేని వ్యక్తి. మళ్లీ చెపుతున్నా వెబ్ కాస్టింగ్ అన్నది ఫ్యాక్ట్, యాప్ అన్నది ట్యాంపర్. –ఓ మాజీ ఐఎఎస్ అధికారి -
మరింత పారదర్శకత.. జవాబుదారీతనం
సాక్షి, అమరావతి: సాగు సేవలన్నీ రైతు ముంగిటకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుతున్న సేవల్లో మరింత పారదర్శకతను, సిబ్బందిలో మరింత జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వైఎస్సార్ యాప్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 660 మండలాల్లో 10,641 ఆర్బీకేలున్నాయి. వీటికి అనుసంధానంగా 65 హబ్‌లు, 13 జిల్లా రిసోర్స్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆర్బీకేల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. గతేడాది మే 30 నుంచి అందుబాటులోకి వచ్చిన ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,850 విత్తన, 12 వేల ఎరువులు, 1.21 లక్షల పురుగుల మందుల డీలర్‌షాపులను ఈ కేంద్రాలకు అనుసంధానించారు. వైఎస్సార్ యాప్‌లో సమగ్ర వివరాలు విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతిదీ నమోదు, రియల్ టైం ఫలితాలు రాబట్టడం వైఎస్సార్ యాప్ ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ద్వారా సిబ్బంది తాము పనిచేసే ఆర్బీకే వివరాలను రిజిస్టర్ చేసిన తర్వాత అసెట్ ట్రాకర్‌లో ఆర్బీకే భవనం, ఆస్తులు, ఆధునిక సాంకేతిక పరికరాలు, ఇతర సామగ్రి వివరాలను డిజిటల్ స్టాక్ రిజిస్టరులో నమోదు చేయాలి. పరికరాల వినియోగంలో సమస్యలు ఎదురైతే తక్షణం పరిష్కరించేలా ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ కింద నమోదు చేసిన పంటల వివరాలు, డాక్టర్ వైఎస్సార్ పొలంబడి, పంట కోత ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ వంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. సేవల్లో పారదర్శకత, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ యాప్‌లో మరిన్ని ఫీచర్లు జోడిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. జవాబుదారీతనం కోసం జియోఫెన్స్ ఈ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన జియోఫెన్స్ ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం తీసుకురానున్నారు. ప్రతిరోజు ఆర్బీకేకి ఐదు కిలోమీటర్ల పరిధిలో రైతులకు అందించిన సాగుసేవలు, అమలు చేసిన కార్యక్రమాలపై సమగ్ర విశ్లేషణ, చిత్రాలు అప్లోడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్బీకే పనితీరుపై అంచనా వేసి గ్రేడింగ్ ఇస్తారు. తద్వారా ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పనితీరుకు రాష్ట్రస్థాయిలో స్కోరింగ్ ఇస్తారు. ఆర్బీకేల్లో సేవలు, సిబ్బంది పనితీరుపై ‘చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు’ అనే నాలుగంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. పంట ఆరోగ్యం, ఉత్పాదకాల లభ్యత, రైతులకు శిక్షణ ఇతర అవసరాల కోసం కూడా అభిప్రాయాలు సేకరిస్తారు. తదనుగుణంగా సేవలను మరింత మెరుగుపర్చే దిశగా చర్యలు చేపడతారు.