సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. యాప్‌పై అనేక అభ్యంతరాలు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెనక్కు తగ్గింది. యాప్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినందున, యాప్‌ను విత్‌డ్రా చేసుకుంటామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment