సిమ్‌ లేకుండా కాల్స్‌ చేసుకోవచ్చు! | BSNL Starts First Internet Telephony Service In India | Sakshi
Sakshi News home page

సిమ్‌ లేకుండా కాల్స్‌ చేసుకోవచ్చు!

Published Wed, Jul 11 2018 4:44 PM | Last Updated on Wed, Jul 11 2018 5:05 PM

BSNL Starts First Internet Telephony Service In India - Sakshi

న్యూఢిల్లీ : వాట్సాప్‌, మెసెంజర్‌ బాటలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వినూత్న అవకాశాన్ని తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయ తొలి టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. ఈ సర్వీసులతో తాను అందించే మొబైల్‌ యాప్‌ ద్వారా భారత్‌లో ఉన్న ఏ టెలిఫోన్‌ నెంబర్‌కైనా డయల్‌ చేసుకునేలా అవకాశం కల్పిస్తుంది. దీని కోసం ‘వింగ్స్‌’ అనే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు కంపెనీ మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను వాడుతూ.. దేశంలో ఉన్న ఏ ఫోన్‌ నెంబర్‌కైనా కాల్స్‌ చేసుకోవచ్చు. 

‘ప్రస్తుతమున్న పోటీకర వాతావరణంలో, బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ షేరును పెంచుకోవడం మెచ్చుకోదగినదే. సిమ్‌ లేకుండా కాల్స్‌ చేసుకునేలా యూజర్లకు వీలుకల్పిస్తూ.. ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసులు తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సర్వీసులను లాంచ్‌ చేసిన అనంతరం టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా అన్నారు. ఈ సర్వీసులను వాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వై-ఫై లేదా మరే ఇతర సర్వీసు ప్రొవైడర్‌ ద్వారానైనా ఇతర నెట్‌వర్క్‌కు కాల్స్‌ చేసుకోవచ్చు. వాలిడ్‌ టెలికాం లైసెన్స్‌ కలిగి ఉన్న టెలికాం కంపెనీలు వై-ఫై కనెక్షన్‌ను వాడుతూ యాప్‌ ఆధారిత కాలింగ్‌ సర్వీసు అందించవచ్చని గతంలోనే టెలికాం కమిషన్‌ అనుమతి ఇచ్చింది. మామూలు కాల్స్‌కు ఏ మాదిరి ఛార్జీలు అమలవుతున్నాయో అవే ఛార్జీలను టెలికాం ఆపరేటర్లు విధించాలని కూడా ఆదేశించింది . 

ఈ వారం ప్రారంభంలో ఈ సర్వీసుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతాయి. జూలై 25 నుంచి ఈ సర్వీసులు యాక్టివేట్‌ అవుతాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు అందించే డేటా ప్రయోజనాలను కూడా సమీక్షిస్తోంది. తాజాగా రూ.444 ప్యాక్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. దీని కింద అంతకముందు రోజుకు 4 జీబీ డేటా లభిస్తే, ప్రస్తుతం రోజుకు 6 జీబీ డేటా అందివ్వనున్నట్టు తెలిపింది. రోజుకు 6 జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత ఆన్‌-నెట్‌ వాయిస్‌ కాల్స్‌ను కూడా 60రోజుల పాటు అందించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement