
బీజింగ్: భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన విషయం తెలిసిందే. దీంతో చైనాను దెబ్బ తీసేందుకు ఆ దేశ వస్తువులు, యాప్స్‌ను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు షాకిస్తూ 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటనలో చైనా పేరు ప్రస్తావించకపోయినా.. దాదాపు ఈ యాప్‌లన్నీ చైనావేననడంలో ఎలాంటి సందేహం లేదు.
ఊహించని పరిణామానికి హతాశురాలైన చైనా మంగళవారం దీనిపై స్పందించింది. చైనా యాప్‌లను నిషేధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిని చైనా సమీక్షిస్తోందని తెలిపారు. కాగా భారత్ బ్యాన్ చేసిన యాప్స్ జాబితాలో టిక్‌టాక్, హలో, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్ వంటి పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ట్విటర్‌లో #RIPTiktok ట్రెండింగ్ అవుతోంది. (59 చైనా యాప్‌లపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment