SEBI: దేశవ్యాప్తంగా యువతరంలో స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న డీమ్యాట్ ఖాతాలే ఇందుకు ఉదాహారణ. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారికి దారి చూపేందుకు సారథి (Saa~thi) పేరుతో మొబైల్ యాప్‌ని తీసుకొచ్చింది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.
కొత్తగా మార్కెట్‌కి వస్తున్న వారిలో చాలా మంది మార్కెట్ తీరుతెన్నులు, లోతుపాతులు తెలుసుకోకుండా బ్రోక్రర్లను ఆశ్రయించే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కష్టనష్టాల పాలవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు మార్కెట్‌కి సంబంధించిన సమస్త వివరాలు వెల్లడించే విధంగా సారథిని రూపొందించినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. త్వరలోనే సారథి యాప్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ యాప్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment