
మొబైల్‌లో నాతో కనెక్ట్ అవ్వండి..
న్యూఢిల్లీ: తన డిజిటల్ ప్రచారాన్ని మరింత విస్తృత చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరుతోనే ఒక మొబైల్ అప్లికేషన్(యాప్)ను బుధవారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రధానికి సంబంధించిన వార్తలు, ఆయన నుంచి వచ్చే సందేశాలు, మెయిల్స్‌ను నేరుగా పొందేందుకు వీలు కలుగుతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేసే ఈ యాప్ ద్వారా ప్రజలు మోదీతో తమ భావాలను పంచుకోవడంతో పాటు ఆయనకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
‘నరేంద్ర మోదీ యాప్‌ను ప్రారంభించాను. రండి.. నాతో మొబైల్‌లో అనుసంధానం అవ్వండి. ఈ మొబైల్ యాప్‌లో చాలా సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫీడ్ బ్యాక్‌ను స్వాగతిస్తాం’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.