
ఇక ‘మోడీ’ మొబైల్స్ హల్‌చల్...!
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ రాజకీయాల్లోనే కాదు మొబైల్ ఫోన్‌ల రంగంలోనూ హల్‌చల్ సృష్టించనున్నారు! ఆయనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి... స్మార్ట్‌నమో పేరుతో రెండు రకాల స్మార్ట్‌ఫోన్‌లను ఒక గుజరాతీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ‘నమో’ అంటే నరేంద్ర మోడీ అని, నెక్సట్ జనరేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఒడెస్సీ అని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ అందిస్తున్న స్మార్ట్‌నమో సఫ్రాన్ 1(16 జీబీ ఫోన్ ధర రూ.18,000, 32 జీబీ ఫోన్ ధర రూ.23,000), స్మార్ట్‌నమో సఫ్రాన్ 2(ధర రూ.24,000,) ఫోన్‌లు ఆండ్రాయిడ్ 4.2 ఓఎస్‌పై పనిచేస్తాయి. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ ఫోన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
ఈ ఫోన్‌లలో ఆల్ట్రా పవర్‌ఫుల్ క్వాడ్ కోర్ 1.5 గిగాహెర్ట్స్ సీపీయూ, 6589 -టీ-క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్‌లను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు ఫోన్లలలో మోడీకి సంబంధించిన వాల్ పేపర్లు, వీడియోలు, యాప్‌లు ప్రిలోడెడ్‌గా ఉండటం విశేషం.