సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసుకోండి! | Whatsapp Introduces Dark Mode Feature For Both Iphone And Android | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న వాట్సాప్‌ ఫీచర్‌ వచ్చేసింది

Published Sat, Mar 7 2020 6:27 PM | Last Updated on Sat, Mar 7 2020 6:46 PM

Whatsapp Introduces Dark Mode Feature For Both Iphone And Android - Sakshi

ప్రత్యేక డార్క్‌ గ్రే కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న యాప్‌ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది.

కాలిఫోర్నియా: కొద్ది నెలలుగా యూజర్లను ఊరిస్తున్న వాట్సాప్‌ డార్క్‌మోడ్‌ ఫీచర్‌ వచ్చేసింది. రాత్రి వేళల్లో వాట్సాప్‌ వినియోగించే యూజర్ల కళ్లకు శ్రమ తగ్గించేందుకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు.  ఈ వారం ఆరంభంలోనే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాగా.. భారత యూజర్లకు మాత్రం నేటి (శనివారం) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది యూజర్లు డార్క్‌మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోనున్నారు. ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13లో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రత్యేక డార్క్‌ గ్రే కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న యాప్‌ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది. రీడబిలిటీ, సమాచార సోపానక్రమం ప్రధానంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు తెలిపారు.
(చదవండి: వాట్సాప్‌ చాట్‌ బ్యాక్ అప్‌ ఇక సేఫ్‌..)

ఇలా డార్క్‌మోడ్‌ యాక్టివేట్‌ చేయండి
డార్క్‌మోడ్‌ అంటే..సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు  బ్యాక్‌ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుంది. రాత్రి వేళల్లో  యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది. వాట్సాప్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ నుంచి చాట్స్‌లోకి వెళ్లి థీమ్‌లోకి వెళ్లండి. డార్క్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకోండి. 
(చదవండి: వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్‌ తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement