వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలో ఆండ్రాయిడ్, ఐఫోన్‌లతో పనిలేకుండా డెస్క్‌టాప్‌లలో ఈజీగా వాట్సాప్ వెబ్ లాగిన్ అవ్వొచ్చు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ ఆప్షన్ బీటా వెర్షన్‌లో ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
ఆన్‌లైన్‌తో పనిలేదు
వాట్సాప్ వెబ్ లాగిన్ అవ్వాలంటే వాట్సాప్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సదుపాయం వినియోగించుకోవాలంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ పీసీని లాగౌట్ చేసే వరకు వాట్సాప్ వెబ్‌ను వినియోగించుకోవచ్చు.ఈ ఫీచర్ విండోస్ 10, విండోస్ 11,మాక్ ఓఎస్‌లలో వాట్సాప్ వెబ్ మెరుగ్గా పనిచేయనుందని వాట్సాప్ తెలిపింది.
బీటా వెర్షన్ అందుబాటులో ఉంది
ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌పై వర్క్ చేస్తుండగా..పర్సనల్ కంప్యూటర్‌లలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే డెరెక్ట్‌గా వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. అలా మన పీసీలో ఒక్కసారి వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత మీరు లాగౌట్ చేయకపోతే 14 రోజుల పాటు అలాగే ఉంటుంది. 14రోజుల తరువాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాగా, గతంలో వాట్సాప్ మల్టీడివైజ్ ఆప్షన్ బీటావెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే ముందుగా వినియోగదారులు బీటాను సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. డైరెక్ట్‌గా ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఇలా నాలుగు రకాల డివైజ్‌లలో ఒకే సారి వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment