మీరు పాత ఐఫోన్‌ని(iPhone) ఉపయోగిస్తున్నారా లేదా మీ ఫోన్ ఐఓఎస్(iOS) పాత వెర్షన్‌లో రన్ అవుతుందా?అయితే మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేయకుంటే ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలను వినియోగించడం కుదరుదు. ఎందుకంటే ఈ దీపావళి తర్వాత నుంచి కొన్ని ఐఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు.
కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 24 నుంచి ఐఫోన్5, ఐఫోన్ 5సీ మొబైల్స్‌తో పాటు ios 10, ios 11తో పని చేస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఫోన్లను ios 12, లేదా ఆపైన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షర్ ఓఎస్‌లు(os) మీద పని చేస్తున్న మొబైల్స్‌లోనూ వాట్సాప్ సేవలు ఉండవు.
iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి
iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్‌డేట్ కాకపోతే వెంటనే అప్‌డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. కాగా ఆపిల్ గతంలో.. కొన్ని పాత iPhoneలలో వాట్సాప్ యాప్ పని చేయదని తెలిపింది. వాట్సాప్ ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నుంచి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు పేర్కొన్న ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే
చదవండి: ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు.. వచ్చే 12 నెలల్లో భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment