download
-
గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్ల జారీ మొదలుకాగా ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు.. ఎస్బీఐ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీంతో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు బ్యాంకు అంగీకారం తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ఈ అంశాన్ని సాకుగా చూపి గ్రూప్ –2 పరీక్షను వాయిదా వేయించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అడ్డంకులన్నీ తొలగడంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. 4,83,525 మంది దరఖాస్తు.. గ్రూప్–2 పరీక్షల షెడ్యూల్‌ను గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25, మార్చి 4ను మెయిన్స్ తేదీలుగా ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజు ఎస్బీఐ, గ్రూప్స్ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల 5 వేల మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి. అభ్యర్థుల వివరాలు పంపండి.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌తోపాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోగా appschelpdesk@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్బీఐ స్లాట్‌లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్‌లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష కూడా రాసేవారు 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీపీఎస్సీ.. ఎస్బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను యధావిధిగా నిర్వహించనున్నారు. -
ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో 'స్మార్ట్‌ఫోన్' జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో మొబైల్స్ ఎంత వేగంగా అప్డేట్ అవుతున్నాయి, వాటికి అనుగుణంగా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన యాప్‌లలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 2022లో జనాదరణ పొందిన యాప్స్ 2020లో భారత్ నిషేదించిన 'టిక్‌టాక్' 2022లో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ ఎంటర్టైన్మెంట్ యాప్. ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ఏకంగా 672 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం దీని వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ) ఇక అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న టాప్ 5 సోషల్ మీడియా యాప్‌ల స్థానంలో ఇన్స్టాగ్రామ్ (547 మిలియన్స్), ఫేస్బుక్ (449 మిలియన్స్), వాట్సాప్ (424 మిలియన్స్), టెలిగ్రామ్ (310 మిలియన్స్), ఫేస్బుక్ మెసెంజర్ (210 మిలియన్స్) ఉన్నాయి. షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా 'షీఇన్' (Shein) నిలిచింది. ఈ యాప్ సుమారు 229 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మీషో (Meesho) 210 మిలియన్స్ డౌన్లోడ్స్ పొందింది. భారతదేశంలో కూడా ఈ యాప్ ఎక్కువమంది వినియోగిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ విభాగంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్శించిన యాప్ 'సబ్వే సర్ఫర్స్' (Subway Surfers). దీనిని 304 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్‌గా 'ఫోన్ పే' (PhonePe) నిలిచి సుమారు 94 మిలియన్ల డౌన్లోడ్స్ పొందింది. ఆ తరువాత పేపాల్ (92 మిలియన్స్), గూగుల్ పే (69 మిలియన్స్), పేటీఎమ్ (60 మిలియన్స్) వంటివి ఉన్నాయి. ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్), ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), విద్యకు సంబంధించిన యాప్‌లో డుయోలింగో (98 మిలియన్స్), ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్‌కాయిన్ (52 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే? ఏఐ యాప్‌లకు పెరిగిన ఆదరణ ప్రస్తుతం టెక్నాలజీ మరింత వేగంగా ఉంది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉపయోగించడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. నేడు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా వెంటనే 'చాట్‌జీపీటీ' మీద ఆధారపడిపోతున్నారు. రానున్న రోజుల్లో వీటి ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది?
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. Hey Bangalore! What's going on in your city? I am traveling to your city and what do I see the unlock, download, and search buttons in garbage bins! Sigh. Explain please. #mysterybuttons pic.twitter.com/K8MitUa11n — Sapana Singh (@Sapanasinghj) July 11, 2023 ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక పబ్లిక్ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్ డిటాక్స్’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు మొబైల్ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. Just spotted massive 'Unlock', 'Uninstall', and 'Download' buttons for the first time, lying in the trash bins. Wondering what secrets they hold. @DeccanHerald, any guesses? #ButtonsDiscovered @NewIndianXpress pic.twitter.com/NAA8KtAYob — Balram Sharma (@Brsharma_In) July 11, 2023 ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు! -
ముచ్చటగా మూడోసారి పేపర్‌లెస్ బడ్జెట్: ఎపుడు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీంతో కేటాయింపులు, మినహాయింపులు, ఎలాంటి ఉపశమనం లభించనుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలపై బీజేపీ సర్కార్ మొగ్గు చూపుతుందనే అంచనాలు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌తో మురిపిస్తారా, ఆశలపై నీళ్లు జల్లుతారా అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడబోతోంది. (బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?) అత్యధిక బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ తర్వాత, 2021 నుంచి కాగిత రహితంగా డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు. మేడిన్ఇండియా ట్యాబ్లెట్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి. (Union Budget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు) కేంద్ర బడ్జెట్ 2023-24 బడ్జెట్ పేపర్‌లెస్‌గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. బడ్జెట్ సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్టు గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' పీడీఎఫ్ ఫార్మాట్ ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో చూడొచ్చు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్లు యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్జెట్ యాప్‌ను అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లయితే ముందుగా యాపిల్ యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్ చేయాలి. అనంతరం అధికారిక యాప్ డౌన్లోడ్పై క్లిక్ చేసుకుంటే చాలు. దీంతో ఫోన్లోనే పూర్తిగా బడ్జెట్ వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క రోజులో 3.20 లక్షల ‘దిశ’ డౌన్లోడ్స్
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం దిశ యాప్ డౌన్లోడ్స్ మెగా డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి మొత్తం 3.20 లక్షల డౌన్‌లోడ్స్‌తో పాటు 1.70 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు. ఇది రాష్ట్రంలోనే రికార్డుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.34 లక్షల రిజిస్ట్రేషన్లతో విశాఖ జిల్లా టాప్‌లో ఉండగా తాము దాన్ని అధిగమించినట్టు చెప్పారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు. చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రామ/వార్డు వలంటీర్లు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్లో దిశా యాప్ ఉండాలన్న లక్ష్యంతో విద్యారి్థనులు, గృహిణుల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. ఉదయం ఈ మెగా డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ ఎన్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా ప్రారంభించారు. నగరంలోని బస్టాండ్, కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పర్యటించి అక్కడున్న విద్యారి్థనులు, మహిళలతో యాప్ డౌన్లోడ్ చేయించారు. -
జూన్ 6న టీఎస్ఆర్జేసీ సెట్–22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. 24 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. -
Hyderabad: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో రైల్ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గురువారం అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ట్రైన్స్ అన్నింటా షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలిచే హైపర్ లోకస్ ఎడ్జ్ క్లౌడ్ ఆధారిత సాంకేతికత రూపశిల్పి షుగర్ బాక్స్ నెట్వర్క్స్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైల్ తమ ప్రయాణికులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్లోడ్, స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా అందిస్తుంది. దీంతో వినోదం, విద్య, ఈ– కామర్స్, ఫిన్‌టెక్ విభాగాలలో కంటెంట్‌ను పొందవచ్చు. విమానాలలో ఏ విధంగా అయితే సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నగరంలో షుగర్ బాక్స్ నెట్వర్క్స్ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్ ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని దాదాపు 60 నిమిషాలు తమ ఫోన్లలోనే గడుపుతున్నట్టు వెల్లడైంది. నేపథ్యంలో షుగర్ బాక్స్ యాప్ ప్రయాణ సమయంలో రెండవ అత్యంత ప్రాధాన్యతా యాప్‌గా నిలిచింది. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సేవలను అందించగలుగుతున్నామని షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కో ఫౌండర్, సీఈవో రోహిత్ పరాంజపీ చెప్పారు. హైదరాబాద్ స్మార్ట్ నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఓ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీరెడ్డి తెలిపారు. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) -
దేశంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన యాప్ ఇదే!
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020లో భారతదేశంలో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసే వారి శాతం 28% పెరిగినట్లు ఒక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ డౌన్లోడ్ పరంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న భారత్ ఉంది. మొబైల్ డేటా ఎనలిటిక్స్ ఫ్లాట్ ఫారం యాప్ అన్నీ(Annie) విడుదల చేసిన మొబైల్ మార్కెట్ స్పాట్ లైట్ రిపోర్ట్ 2021 నివేదికలో ఈ విషయం బయట పడింది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రపంచ యాప్ మార్కెట్లో బూమ్ ఏర్పడినట్లు ఈ నివేదిక హైలైట్ చేసింది. డౌన్లోడ్ పరంగా చూస్తే గేమ్ యాప్స్, సోషల్ యాప్స్, ఎంటర్ టైన్ మెంట్ యాప్స్‌ను అత్యధికంగా డౌన్లోడ్ చేశారు. ఇందులో అధికంగా యూట్యూబ్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్ యాప్స్‌ను ఎక్కువగా డౌన్లోడ్ చేసినట్లు నివేదిక తెలిపింది. 2020లో భారతీయులు 651 బిలియన్ గంటలు ఆన్లైన్లో గడిపారు. మన దేశంలో ఒక సగటు మొబైల్ వినియోగదారుడు ప్రతిరోజూ ఫోన్లలో 4.8 గంటలు గడిపారని తెలిపింది. 2019లో రోజుకు 3.3 గంటల నుంచి 40 శాతం పెరిగింది.కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొబైల్ వాడకం భారీగా పెరిగిన సంగతి మనకు తెలిసిందే. కరోనా రాకముందు కంటే 2021లో మొబైల్ వాడకం 80 శాతం పెరిగింది. (చదవండి: పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర వస్తువల ధరలు) ఆండ్రాయిడ్ గేమింగ్ యాప్స్ భారతదేశంలో తమ పట్టు నిలుపుకున్నాయి. 2021 హెచ్1లో గేమ్ డౌన్లోడ్ సంఖ్య 4.8 బిలియన్లకు చేరుకుంది. 2021 హెచ్1లో భారతదేశంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన గేమ్ యాప్ గా లుడో కింగ్ నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో ఫౌజీ, క్యారమ్ పూల్ నిలిచాయి. ఇక పెట్టుబడి యాప్స్ విషయానికి వస్తే అప్ స్టోక్స్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఆ తర్వాత స్థానాలలో వజీర్ఎక్స్, కాయిన్ స్విచ్ వంటి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ యాప్స్ నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) కూడా వినియోగదారులకు ఆసక్తి కలిగించింది. యుపీఐ లావాదేవీల పరిమాణం క్యూ2 2021లో దాదాపు ఎనిమిది బిలియన్లకు చేరుకుంది. (చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త!) -
యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేయండి ఇలా...
యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో ఒకటి. మనలో చాలా మంది యూట్యూబ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం. నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు వీడియోలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా ఫలానా వీడియోలను చూడటానికి యూట్యూబ్ అనుమతినిస్తుంది. వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాక తీరిక సమయంలో చూడవచ్చును. ఈ వీడియోలు మాత్రం మీ ఫోన్ లోకల్ స్టోరేజీలో కనిపించవు. వీడియోలను మొబైల్ లోకల్ స్టోరేజ్‌లో కన్పించాలంటే కొన్ని సులభమైన పద్దతులతో యూట్యూబ్ వీడియోలను మొబైల్ లోకల్ స్టోరేజీలో స్టోర్ చేసుకోవచ్చును. యూట్యూబ్ వీడియోలను మీ మొబైల్ లోకల్ స్టోరేజ్‌లో డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు థర్డ్‌పార్టీ యాప్‌పై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. స్నాప్‌ట్యూబ్ యాప్ ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వీడియోలను మొబైల్ లోకల్ స్టోరేజ్‌లో పొందవచ్చును. ఈ యాప్ సహాయంతో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫాంల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఆండ్రాయిడ్ యూజర్లు కేవలం Snaptubeapp.com ని సందర్శించి తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్న యూట్యూబ్ వీడియోను అడ్రస్‌ను స్నాప్‌ట్యూబ్ యాప్ సెర్చ్ బార్లో యూఆర్ఎల్ని కాపీ-పేస్ట్ చేయాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో థర్డ్‌పార్టీ యాప్‌ను డౌన్లోడ్ చేయకూడదనుకుంటే..మరో పద్దతిని ఉపయోగించి వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చును. “En.savefrom.net” వెబ్సైట్లో యూట్యూబ్ వీడియోల యూఆర్ఎల్ను పేస్ట్ చేయడం ద్వారా వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చును. అంతేకాకుండా వీడియో రిసల్యూషన్ కూడా మనము ఎంపిక చేసుకోవచ్చును. ఈ పద్ధతి డెస్క్‌టాప్, మొబైల్ రెండింటికీ పని చేస్తుంది. -
ఫ్రెండ్లీ యాప్ ‘యూట్యూబ్’ సంచలనం
మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా ఘనత దక్కించుకుంది. ఈ మేరకు 9టు5 గూగుల్ అనే వెబ్సైట్ కథనం ప్రచురించింది. ప్లే స్టోర్‌లో ఇదో అరుదైన రికార్డ్ అని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇదంతా ప్రీ ఇన్‌స్టాలేషన్‌తో కలిపే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్ సంబంధిత లిస్ట్‌లో యూట్యూబ్ తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ టెక్స్ టు స్పీచ్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో 5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌కి పైగా ఉన్నాయి. ఫ్రెండ్లీ యాప్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధిక డౌన్లోడ్ల కౌంట్‌లో మాత్రం ముందుండేది ఏదో తెలుసా?.. ‘గూగుల్ ప్లే స్టోర్’. ఇక 2005లో లాంఛ్ అయిన యూట్యూబ్‌ని.. 2006లో 1.6 బిలియన్ డాలర్లు చెల్లించి గూగుల్ సొంతం చేసుకుంది. ఆపై యూట్యూబ్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్రెండ్లీ యాప్‌గా యూట్యూబ్‌కి పేరుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్, 4జీ డివైజ్‌లు ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తర్వాత యూట్యూబ్ వినియోగం విపరీతంగా పెరిగింది. తద్వారా అతిపెద్ద స్ట్రీమింగ్ యాప్‌గా అవతరించింది యూట్యూబ్. ఇంత కాలం వీడియో చేసే వాళ్లకు మాత్రమే ఇన్కమ్సోర్స్గా ఉన్న యూట్యూబ్.. తాజాగా ‘సూపర్థ్యాంక్స్’ ద్వారా చూసేటోళ్ల నుంచి సైతం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. -
చిత్తూరు జిల్లా: దిశయాప్ డౌన్‌లోడ్‌లో చంద్రగిరి నియోజకవర్గం రికార్డ్
-
ఇప్పటివరకు 17 లక్షల దిశ యాప్ డౌన్ లోడ్స్ : కృత్తికా శుక్లా
-
జియో సంచలనం: 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో టాప్
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులకు సంబంధించి డౌన్లోడ్ వేగంలో రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్ (ఎంబీపీఎస్) డౌన్లోడ్ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. అప్లోడ్ స్పీడ్ విభాగంలో వొడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ వేగంతో నంబర్ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్వర్క్ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ.. సమీప ప్రత్యర్థి సంస్థ వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది. వొడాఫోన్ ఐడియా సగటు డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడ్ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను, అప్లోడ్ స్పీడ్ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్లోడ్ స్పీడ్ విషయంలో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం లో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్), ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్ డేటాలో వెల్లడి కాలేదు. -
ఆధార్ కార్డు డౌన్లోడ్ చాలా సులువు!
ఆధార్ కార్డ్ ఇండియాలో ప్రతి ఒక్కరూ దగ్గర తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డ్. ఇది చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్దుల వరకు ప్రతి చిన్న విషయంలో దీని యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. కానీ కొన్నిసార్లు మన అజాగ్రత్త వల్ల లేక మరే ఇతర కారణాల వల్ల మనం పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఐడీఏఐ వెబ్సైట్లో ఈ-ఆధార్ రూపంలోనో, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు రూపంలోనో పొందవచ్చు. దీనిని పొందటానికి చాలా రకాల పద్దతులున్నాయి. కానీ అన్నింటికంటే తేలికైన పద్దతి మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం. (చదవండి: ‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్) దీని కోసం మనం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో "గెట్ ఆధార్ కార్డు' సెక్షన్లో డౌన్‌డౌన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'గెట్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. "యూఐడీఏఐ" మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఒకే పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. దీని కోసం మనం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. -
ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా టాప్‌లోనే!
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్‌లో జూమ్ యాప్ మొదటిస్థానంలో నిలిచింది. యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ సెన్సార్ టవర్ విడుదల చేసిన దాని ప్రకారం ఏప్రిల్ నెలలో జూమ్యాప్ని 131మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో భారతీయులే ఎక్కువ మంది ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. భారత్ తరువాత అమెరికా ఈ యాప్‌ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంది. ఈ యాప్‌తో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే హెచ్చరించినప్పటికి ఇంత మంది డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. (నయా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’) లాక్డౌన్ సమయంలో గ్రూప్ కాలింగ్ కోసం చాలా కంపెనీలు, ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం కోసం చాలా విద్యాసంస్థలు విద్యార్ధులు, వీరితో పాటు సామాన్యులు సైతం తమకి ఇష్టమైన వారితో మాట్లాడుకోవడానికి ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులెవ్వరు ఈ యాప్‌ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక జూమ్ యాప్ తరువాత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్‌లో టిక్‌టాక్ నిలిచింది. ఈ లాక్డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్ల మంది ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. వీటిలో 22 శాతం భారతదేశం నుంచే డౌన్లోడ్ చేసుకున్నారు. (కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’) -
టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో మనమే టాప్
బీజింగ్ : సోషల్ వీడియో యాప్ టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే సహా యాప్ స్టోర్ నుంచి 150 కోట్ల డౌన్లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్ ఇన్‌స్టాల్స్‌తో భారత్ నెంబర్ వన్‌గా నిలిచింది. టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. 2019లో టిక్‌టాక్ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్లోడ్స్ సాధించిందని మొబైల్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది. 2019లో భారత నెటిజన్లు ఇప్పటివరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని, గ్లోబల్ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ఇక చైనా 4.5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రెండవ అత్యధిక డౌన్‌లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా టాప్ 3లో నిలిచాయి. టిక్‌టాక్ 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఈ ఏడాది అత్యధిక డౌన్లోడింగ్ నాన్ గేమింగ్ యాప్ విభాగంలో మూడవ స్ధానంలో ఉంది. వాట్సాప్ 70.74 కోట్లతో, ఫేస్బుక్ మెసెంజర్ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్లోడింగ్ యాప్‌లుగా టాప్ 2 స్ధానాలను దక్కించుకున్నాయి. -
నేటి నుంచి ‘పీసీబీ’ పరీక్షలకు హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ)లో వివిధ కేటగిరీల్లోని పోస్టులకు జరిగే రాత పరీక్షలకు నేటి నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అనలిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నేటి సాయంత్రం నుంచి, ఇతర కేటగిరీ పోస్టుల దరఖాస్తుదా రులు ఈ నెల 6 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్లైన్ పరీక్షలను ఈ నెల 7న, 13న, 14న నిర్వహించనున్నట్లు తెలిపింది. -
అంగట్లో ఆధార్
* ఆన్లైన్లో ‘ఆధార్’ చౌర్యం * సాంకేతిక సాయంతో ఫొటోలు మారుస్తున్న వైనం * అధికారుల నిర్లక్ష్యంతోనే గోప్యత బట్టబయలు ఆధార్ కార్డు.. ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఇదే ఆధారం. వంటిట్లో గ్యాస్ నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు వరకు ఆధార్ నంబరుతోనే అనుసంధానమై ఉన్నాయి. ఆధార్ నంబర్ విషయంలో గోప్యత ఎంతో అవసరం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మనకు తెలియకుండా ఆధార్ కార్డును దొంగిలించేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో కార్డులోని ఫొటోలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గుంటూరు (నగరంపాలెం): కార్డుదారుని ప్రమేయం లేకుండానే ఆధార్ డౌన్లోడ్ చేసేస్తున్నారు. వీటిని కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల రవాణా శాఖలో ఒకరి వాహనం యాజమాన్యం హక్కులు మార్చటం కోసం అతనికి తెలియకుండానే ఆధార్ కార్డును సంపాదించి పెద్ద మొత్తంలో రుణం పొందాడు. ప్రస్తుతం స్మార్ట్ పల్స్ సర్వేలో కూడా చాలా మంది ఆధార్ కార్డులు వారికి తెలియకుండానే వేరే వాటికి అనుసంధానం జరిగినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత గుర్తింపు కార్డుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ యూనిక్ ఐడీ ఏర్పాటు నిమిత్తం ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా సేకరించిన వివరాలను ఆన్లైన్lసర్వర్‌లో అప్లోడ్ చేసింది. రాష్ట్రాలకు వెరిఫికేషన్ కోసం స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వెబ్ సైట్‌ను రూపొందించి ఆన్లైన్ సర్వర్‌ను దీనికి లింక్ చేసింది. ఈ వెబ్‌సైట్‌కు ప్రత్యేక లాగిన్ పాస్‌వర్డు ద్వారా మాత్రమే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని వ్యక్తి ఆధార్ కార్డు వివరాలనైనా తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో అందించే సేవలకు ఆధార్ కార్డు అనుసంధానం చేసినప్పటి నుంచి కార్యాలయంలోని గజిటెడ్ ర్యాంక్ అధికారులకు రెండేళ్ల క్రితం ఎస్ఆర్డీహెచ్ లాగిన్లు అందజేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి లాగిన్ పాస్వర్డ్లు.. ప్రభుత్వ కార్యాలయంలో సేవలు పొందుటకు అందించిన ఆధార్ కార్డు కాపీ సరైనదా ? కాదా ? తెలుసుకునేందుకు అధికారులు ఎస్ఆర్డీహెచ్ వెబ్‌సైట్‌కు లాగినై వివరాలు సరిపోల్చుకుంటారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వినియోగిస్తున్న అన్ని సేవలకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్, మీటర్లు, భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలంలో వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేసింది. దీనికి ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో సేవలు పొందుతున్న వారి ఆధార్ కార్డుల నంబర్లు ఎస్ఆర్డీహెచ్ సైట్‌కు లాగినై తెలుసుకున్నారు. దీని కోసం కార్యాలయంలోని క్షేత్రస్థాయి సిబ్బందికి, కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఎస్ఆర్డీహెచ్ లాగిన్లు, పాస్వర్డులు అందించి ఆధార్ వివరాలను సెర్చ్ చేయించారు. ఈ విధంగా లాగిన్, పాస్వర్డులు ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వారి ద్వారా డీటీపీ, ఇంటర్నెట్, రిజిస్ట్రేషన్, ఆర్టీవో తదితర కార్యాలయాల వద్ద ఏజెంట్లకు చేరాయి. వీరు కార్డు నంబరు తెలిసినా, వ్యక్తి పేరు తెలిసినా అనధికారికంగా లాగినై కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారు. కొంత మంది ఫొటోషాప్ సహాయంతో వాటిలో ఫొటోలు, వివరాలు సైతం మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. రెండేళ్ల క్రితం లాగిన్లు, పాస్వర్డులు ఇప్పటికీ మార్చకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్రోల్మెంట్ నంబర్లతో డౌన్లోడ్.. ఆధార్‌కార్డు డౌన్ లోడ్ చేయాలంటే ఎన్రోల్మెంట్ నంబరు (వివరాలు అందించినప్పుడు కేటాయించింది) కావాలి. వ్యక్తి పేరు, ప్రాంతం , ఆధార్ నంబరు తెలిస్తే ఎస్ఆర్డీహెచ్ సైట్ ద్వారా ఎన్రోల్మెంట్ నంబరు తెలుసుకుంటున్నారు. దీని ద్వారా యూఐడీఏ గెట్ ఆధార్ సైట్లో కార్డులను డౌన్లోడ్ చేస్తున్నారు. కార్డు డౌన్‌లోడ్‌కు రూ.100, కార్డు సెర్చింగ్‌కు రూ.200 నుంచి 500 వరకు అవసరాన్ని బట్టి వసులూ చేస్తున్నారు. ఫోన్ నంబరు రిజిస్టరయిన కార్డులు మాత్రమే ఆధార్ నంబరుతో డౌన్లోడ్ చేసే అవకాశముంది. మిగిలిన ఆధారు కార్డులన్నీ ఎన్రోల్మెంట్ నంబరు ద్వారానే డౌన్ లోడ్ చేయాల్సిందే.. -
క్లిక్ చేస్తే ఎఫ్ఐఆర్ నకలు
►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ ►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న పోలీస్ శాఖ ►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ 24 గంటల్లోపు హోంశాఖ వెబ్సైట్లో అప్లోడ్ ►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ ఉగ్రవాదం, అత్యాచారం వంటి కేసులకు మినహాయింపు! ►ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్ నవంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం బెంగళూరు : దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరు సమాచార సాంకేతిక రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంటుంది. తాజాగా పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను ఎక్కడినుంచైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈనెల 15 రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ పెద్ద ప్రహసనం అన్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువ. ఎఫ్ఐఆర్ నమోదైనా సదరు నకలను తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇకపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన 24 గంటల్లోపు పోలీస్ వెబ్సైట్లో సదరు అప్లోడ్ కానుంది. దీంతో కాపీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి అవసరంఉండదు. ఒక్క క్లిక్‌తో ఆ ఎఫ్ఐఆర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల బాధితులకు సత్వరం కేసుకు సంబంధించి ప్రాథమిక అవగాహన ఏర్పడటమే కాకుండా పోలీసుల్లో కూడా జవాబుదారితనం పెరుగుతుందని హోంశాఖ చెబుతోంది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అవసరమైన సర్వర్ సమకూర్చుకోవడంతో పాటు స్టేషన్‌కు చెందిన సంబంధిత సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. అయితే ఉగ్రవాద, మావోయిస్ట్, అత్యాచార, లైంగిక వేధింపులు వంటి అత్యంత సున్నితమైన కేసులను మాత్రం ఈ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ విధానం నుంచి తప్పించారు. ఈ విషయమై రాష్ట్ర అదనపు డీజీపీ (క్రైం అండ్ టెక్నికల్ సర్వీస్) భాస్కర్‌రావ్ మాట్లాడుతూ... సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ఎఫ్ఐఆర్ను రాష్ట్ర హోంశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నాం. బాధితులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. వచ్చే నెల 15 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. అని పేర్కొన్నారు. అయితే నూతన సదుపాయం పై రాష్ట్ర పోలీసుశాఖ మాజీ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఎఫ్ఐఆర్లు వెబ్సైట్లో పెట్టడం, సదరు ఎఫ్ఐఆర్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీని వల్ల బాధితులకు నిందితుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. -
యూజర్లకు ఫేస్బుక్ హెచ్చరిక
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన యూజర్లకు హెచ్చరికలు జారీచేసింది. తను ప్రవేశపెట్టిన కొత్త ఫోటో యాప్ మూమెంట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని లేకపోతే యూజర్ల ఫోటోలను వారి ఎఫ్ బీ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఇటీవలే ఫోటోలను సమీకరించే ఫీచర్ ను తన మెయిన్ మొబైల్ యాప్ నుంచి తొలగించింది. ఈ కోర్ ఫేస్ బుక్ యాప్ ద్వారా ఫోన్ లోని లోకల్ కెమెరా నుంచి ఆటోమేటిక్ గా ఫోటోలు ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ కు వెళ్లిపోతాయి. ఇవి యూజర్ల ప్రైవేట్ ఆల్బమ్ లో దాగిఉంటాయి. అవసరమైనప్పుడు ఫేస్ బుక్ లో తేలికగా షేరు చేసుకోవచ్చు. కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ లోని యూజర్ల ఫోటోలను తొలగిస్తామని చెప్పింది. ఎవరైతే ఫేస్ బుక్ ఆటో సింక్ ఫీచర్ ను వాడుతున్నారో వారు జూలై 7 వరకు మూమెంట్స్ యాప్ ను డౌన్ లౌడ్ చేసుకోండి.. లేదా సింక్డ్ ఫోటో జిప్ ఫైల్ క్రియేట్ చేసుకోమని హెచ్చరిస్తోంది. లేదంటే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలనున తొలగిస్తామని బెదిరిస్తోంది. ఈ నిబంధన కేవలం ఆటో-సింక్డ్ ఫోటోలకేనని, పర్సనల్ గా అప్ లోడ్ చేసిన ఫోటోలకు వర్తించదని పేర్కొంది. అయితే ఫేస్ బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలు తొలగిస్తామని యూజర్లకు వస్తున్న హెచ్చరికలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. సింక్డ్ గా అన్ని ఫోటోలు అప్ లోడ్ చేశామని, అసలు ఆ విషయం తమకు గుర్తులేదని పేర్కొంటున్నారు. -
ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు!
న్యూఢిల్లీ : ఇక చాలా చవకైన డేటా రేట్లకే యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసు యూట్యూబ్ ఓ కొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. స్మార్ట్ ఆఫ్ లైన్ అనే ఫీచర్ ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ తో రాత్రి సమయాల్లో తక్కువ డేటారేట్లకే వీడియో డౌన్ లోడ్లను మొబైల్ ఆపరేటర్లు యూజర్లకు ఆఫర్ చేసేలా ఆవిష్కరించింది. 2014లో ఆఫ్ లైన్ వీడియోల ఆఫర్ ను యూట్యూబ్ యూజర్ల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఆఫ్ లైన్ ఫీచర్ యూట్యూబ్ యాప్ అప్ డేటెడ్ వెర్షన్లో పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వై-ఫై నెట్ వర్క్ లకు ఇది పనిచేయదని తెలిపింది. ఈ ఫీచర్ యాక్సస్ కు 'సేవ్ ఓవర్ నైట్' అనే ఆప్షన్ ను యూజర్లు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా రాత్రి వేళల్లో డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలను తర్వాతి రోజు ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కోసం ఎయిర్ టెల్, టెలినార్ సంస్థలతో యూట్యూబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్ లో యూజర్లందరికీ ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆశిస్తున్నట్టు యూట్యూబ్ పేర్కొంది. -
27 వరకే హాల్‌టికెట్ల డౌన్లోడ్
ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 27 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారితోపాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, టీఎస్ఓఓఎస్ఎస్, ఆర్జీయూకేటీల నుంచి ఇంటర్ చదివినవారికి హాల్‌టికెట్ డౌన్లోడ్ సమయంలో ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫారం ఇస్తారన్నారు. దాన్ని పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలతో మార్కుల జాబితాను అటెస్టేషన్ చేయించి ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆఫీసుకు 30 లోగా పంపాలన్నారు. రూ. 10 వేల అపరాధ రుసుంతో ఈ నెల 27 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తామన్నారు. రూ.5 వేలు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకున్న వారికి, మెడిసిన్‌లో పలుమార్లు పరీక్షకు హాజరవుతున్నవారికి కాకినాడ రీజినల్ సెంటర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని చెప్పారు. -
టెట్ హాల్‌టికెట్లు 2 రోజులు వాయిదా
23వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 8 వేల మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నిరవధిక బంద్ నేపథ్యంలో టెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియను రెండు రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించడంతో టెట్ విభాగం వాయిదా వేసింది. ఈనెల 23 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. -
ఐట్యూన్స్, గ్యాస్, డౌన్లోడ్..!
స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలకు రహస్య సంకేతాలు ఇవి... జ్యూరిక్: కాదేదీ ‘కోడ్’కు అనర్హం అంటే ఇదేనేమో! ఇంతకీ దేనికంటారా.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునేవాళ్లకు రహస్య సంకేతాల్లో ట్రెండ్ ఇది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు నల్లధనంపై కొరడా ఝుళిపిస్తుండటంతో స్విస్ బ్యాంకులు తమ గుట్టును విప్పాల్సి వస్తోంది. కేవలం ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కోడ్లను వినియోగిస్తుంటారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే, అక్కడి బ్యాంకర్లకు క్లయింట్లకు మధ్య జరిగే ప్రతి ఒక్క లావాదేవీకి కూడా ఒక రహస్య సంకేతం ఉంటుందన్న విషయం ఇటీవలే బయటికొచ్చింది. అమెరికా పన్ను శాఖలతో పలు స్విస్ బ్యాంకులు చేసుకున్న సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం ఖాతాలకు చెందిన అనేక వివరాలను ఆయా బ్యాంకులు తెలియజేశాయి. ఇందులో కోడ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంక్ క్లయింట్లు తమ ఖాతాల నుంచి సొమ్మును ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడానికి ‘డౌన్లోడ్’ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందట! అదేవిధంగా నిధులను డ్రా చేసుకోవాలంటే చెప్పాల్సిన రహస్య సంకేతాల్లో ‘ఐట్యూన్స్’, ‘గ్యాస్’ వంటివి ఉన్నాయి. బ్లాక్ మనీపై భారత్ సహా అనేక దేశాలు ఇటీవల పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్విస్ బ్యాంకులు రహస్య ఖాతాల గుట్టును విప్పాల్సి వస్తోంది. అయితే, తాజా కోడ్లను పరిశీలిస్తే.. ఇప్పటికే స్విస్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సింగపూర్, ఇజ్రాయెల్, సైప్రస్, లెబనాన్, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయిందన్న విషయం తేటతెల్లమవుతోంది. యూఎస్ న్యాయ శాఖకు వివిధ స్విస్ బ్యాంకులు ఇచ్చిన ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ నివేదిక దీన్ని బయటపెట్టింది. తమ క్లయింట్లు నల్లధనాన్ని దాచుకోవడానికి వివిధ దేశాల్లో దొంగ సంస్థలను రిజిస్టర్ చేసుకోవడానికి, బోగస్ బీమా పథకాలను సృష్టించడంలో ఎలా తోడ్పాటునందించిందీ కూడా బ్యాంకులు ఆ నివేదికలో వెల్లడించాయి. భారీస్థాయి(హై ప్రొఫైల్) ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరయ్యే సంపన్నులను తమ నల్లధనాన్ని సురక్షితంగా ఎలా దాచుకోవచ్చో వివరించేందుకు స్విస్ బ్యాంకులు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను రంగంలోకి దించేవన్న సంగతి కూడా తాజాగా బట్టబయలైంది. -
మహిళా డెరైక్టర్ల ఎంపికకు మరింత గడువు
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్‌హోమ్ గేమింగ్ సంస్థ మోజంగ్కు చెందిన మైన్క్రాఫ్ట్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్ డాలర్లను(రూ. 15,000 కోట్లు) వెచ్చించనుంది. 2009లో విడుదలైన మైన్‌క్రాఫ్ట్ గేమ్‌ను దీర్ఘకాలంగా కంప్యూటర్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటూనే ఉండటం విశేషం. ఎక్స్‌బాక్స్‌లో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్కాగా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్‌లోనూ టాప్ యాప్‌గా నిలుస్తోంది. మైన్‌క్రాఫ్ట్ అత్యంత విజయవంత మైన గేమింగ్ ఫ్రాంచైజీ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గేమింగ్ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలకు తెరలేపనున్నట్లు చెప్పారు. 2014 చివర్లో డీల్ పూర్తికాగలదని అంచనా. కాగా, 2015కల్లా మైన్‌క్రాఫ్ట్ లాభాలు ఆర్జించే స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుతుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది.