మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది! | Airtel's Wynk crosses 1 lakh downloads in 4 days | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది!

Published Tue, Sep 9 2014 2:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది!

మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది!

న్యూఢిల్లీ: ఇటీవల భారతీ ఎయిర్ టెల్ విడుదల చేసిన వింక్ మ్యూజిక్ అప్లికేషన్ కు భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో వింక్ (Wynk) అప్లికేషన్ ను లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నాట్టు ఎయిర్ టెల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంగీతాభిమానుల కోసం ఉచితంగా అందించే యాప్స్ లలో వింక్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఎయిర్ టెల్ తెలిపింది. 
 
అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 5 యాప్ లలో ఒకటిగా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 2 తేదిన ఎయిర్ టెల్ వింక్ యాప్ ను విడుదల చేసింది. వింక్ యాప్ కు విశేష ఆదరణ లభించడంతో మరో ఆరు కేటగిరిలపై దృష్టిని పెట్టింది. సోషల్ నెట్ వర్క్స్, వీడియో, మ్యూజిక్, గేమింగ్, ఈ కామర్స్, ట్రావెల్, ఇతర కేటగిరిలలో ప్రోడక్ట్స్ ను రూపొందించడానికి ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement