మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా ఘనత దక్కించుకుంది.
ఈ మేరకు 9టు5 గూగుల్ అనే వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. ప్లే స్టోర్‌లో ఇదో అరుదైన రికార్డ్ అని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇదంతా ప్రీ ఇన్‌స్టాలేషన్‌తో కలిపే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్ సంబంధిత లిస్ట్‌లో యూట్యూబ్ తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ టెక్స్ టు స్పీచ్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో 5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌కి పైగా ఉన్నాయి.
ఫ్రెండ్లీ యాప్
అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధిక డౌన్‌లోడ్‌ల కౌంట్‌లో మాత్రం ముందుండేది ఏదో తెలుసా?.. ‘గూగుల్ ప్లే స్టోర్’. ఇక 2005లో లాంఛ్ అయిన యూట్యూబ్‌ని.. 2006లో 1.6 బిలియన్ డాలర్లు చెల్లించి గూగుల్ సొంతం చేసుకుంది. ఆపై యూట్యూబ్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్రెండ్లీ యాప్‌గా యూట్యూబ్‌కి పేరుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్, 4జీ డివైజ్‌లు ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తర్వాత యూట్యూబ్ వినియోగం విపరీతంగా పెరిగింది. తద్వారా అతిపెద్ద స్ట్రీమింగ్ యాప్‌గా అవతరించింది యూట్యూబ్. ఇంత కాలం వీడియో చేసే వాళ్లకు మాత్రమే ఇన్‌కమ్‌సోర్స్‌గా ఉన్న యూట్యూబ్.. తాజాగా ‘సూపర్‌థ్యాంక్స్’ ద్వారా చూసేటోళ్ల నుంచి సైతం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment