Wynk
-
ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ షట్‌డౌన్: కారణం ఇదే..
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ తన వింక్ మ్యూజిక్ యాప్‌ను త్వరలోనే నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపించేది లేదని, వారందరినీ కంపెనీలోని సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఎయిర్టెల్ కంపెనీ యాపిల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ నిలిపివేసిన తరువాత ఎయిర్టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్ అందించే అవకాశం ఉందని సమాచారం. -
న్యూ ఇయర్ ఆఫర్ అదరహో.. ఎయిర్టెల్ యూజర్లుకు 50జీబీ డేటా ఫ్రీ!
కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్టెల్ తాజాగా న్యూ ఇయర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉచితంగా 50 జీబీ డేటా (Data) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్రీ డేటా ఆఫర్ పొందాలనుకున్న కస్టమర్లు ఏం చేయాలంటే.. ఎయిర్టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకుని వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. యాడ్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజులు తీసుకుంటే వారి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రూ. 98కే ఈ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే మీరు ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ రూ. 301గా ఉంది. గమనించాల్సిన విషయం ఎంటంటే.. ఇక్కడ ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. చదవండి: వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్! -
లోకల్ ఆర్టిస్టులకు గుడ్‌న్యూస్: వింక్ మ్యూజిక్ రూ.100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంగీతంలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ మ్యూజిక్ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. స్వతంత్య్ర కళాకారుల కోసం పంపిణీ విభాగంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించింది. ‘ఔత్సాహిక సంగీత కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడమేగాక సంపాదించుకోవచ్చు. చదవండి: ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు వింక్ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది ఆర్టిస్టులను ఏడాదిలో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 100 మంది ఉన్నారు. భారత్‌లో ప్రజాదరణ పొందిన పాటల్లో 30 శాతం స్వతంత్య్ర కళాకారులవే. పరిశ్రమను భవిష్యత్‌లో నడిపించేది వీరే. భారతీయులు వారంలో సగటున 21 గంటలు సంగీతం వింటున్నారు. ప్రపంచ సగటు 18 గంటలు ఉంది’ అని ఎయిర్టెల్ డిజిటల్ సీఈవో అదర్శ్ నాయర్ తెలిపారు. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
వాన పాటకి చాన్స్ వస్తే కాదంటానా?
అలా కన్ను కొట్టి ఇలా ఫేమస్ అయిపోయారు ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ కన్ను కొట్టే సీన్ ఆమెకు ‘వింక్ బ్యూటీ’ అనే పేరు తెచ్చింది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇక.. ఈ బ్యూటీని ‘వానాకాలమ్’ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. అది కూడా ట్రాన్స్ప్యారంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని, స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వేరే వాహనాలు వెళ్లినప్పుడు మా యూనిఫామ్ మీద బురదనీళ్లు పడేవి. చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలంటే నాకివే. ఆ రోజులే వేరు. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ ఇంట్లో? వానలో తడిచినా ఏమీ అనేవాళ్లు కాదు. మా సొసైటీలో ఉండే పిల్లలమంతా వానలో తడుస్తూ ఆడుకునేవాళ్లం. వానలో తడుస్తూ దాగుడుమూతలు ఆడేవాళ్లం. చివరికి బ్యాడ్మింటన్ కూడా ఆడుకునేవాళ్లం. అయితే వానలో తడిచి, జ్వరం తెచ్చుకుంటే అప్పుడు తిట్లు పడేవి. ► కాగితపు పడవలు చేసేవారా? చేసేదాన్ని. అది మాత్రమే కాదు.. వర్షం నీళ్లను సీసాల్లో పట్టి, ఆడుకునేదాన్ని. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? రష్యాలో... షాపింగ్ కోసం బయటకెళ్లాం. ఒక్కసారిగా బాగా వర్షం వచ్చింది. పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లాం. అప్పటికే కొంచెం తడిసిపోయాం. ► వర్షాకాలం ఇష్టమేనా? చాలా. నేను మాన్సూన్ లవింగ్ పర్సన్‌ని. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నా మూడ్ కూడా అలానే ఉంటుంది. మంచి మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తుంటాను. ► నచ్చే రెయినీ ఫుడ్? మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా ఇష్టమే. వాన అంటే మాత్రం న్యూడుల్స్ తినాల్సిందే. ► మరి.. వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? నేను ఫిల్మీ పర్సన్. వాన పాటకి చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. అంతెందుకు.. షవర్ కింద నిలబడి దాన్నే వాన అనుకుని, ఎంజాయ్ చేస్తుంటాను. ఇక వాన పాట అంటే కాదంటానా? ► రెయినీ సీజన్లో వర్క్ చేయడం ఇష్టమేనా? అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడను. ► నచ్చిన వాన పాట? చాలా పాటలు ఉన్నాయి. ఒక్క పాట అంటే చెప్పలేను. అయితే రెయినీ సీజన్లో మెలోడీ సాంగ్స్ వింటాను. రెయినీ సీజన్ కోసం ప్రత్యేకంగా నా ప్లే లిస్ట్‌లో కొన్ని పాటలు పెట్టుకున్నాను. అవి వింటుంటాను. ► వర్షాకాలంలో ఇబ్బందులకు గురైన సందర్భాలు... వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. దినదిన గండంలా గడిపారు. ఆ సమయంలో స్వయంగా క్యాంప్స్‌కి వెళ్లి నాకు చేతనైనంత సాయం చేశాను. ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలీక వాళ్లు పడిన బాధ చూసి చలించిపోయాను. -
మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది!
న్యూఢిల్లీ: ఇటీవల భారతీ ఎయిర్ టెల్ విడుదల చేసిన వింక్ మ్యూజిక్ అప్లికేషన్ కు భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో వింక్ (Wynk) అప్లికేషన్ ను లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నాట్టు ఎయిర్ టెల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంగీతాభిమానుల కోసం ఉచితంగా అందించే యాప్స్ లలో వింక్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఎయిర్ టెల్ తెలిపింది. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 5 యాప్ లలో ఒకటిగా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 2 తేదిన ఎయిర్ టెల్ వింక్ యాప్ ను విడుదల చేసింది. వింక్ యాప్ కు విశేష ఆదరణ లభించడంతో మరో ఆరు కేటగిరిలపై దృష్టిని పెట్టింది. సోషల్ నెట్ వర్క్స్, వీడియో, మ్యూజిక్, గేమింగ్, ఈ కామర్స్, ట్రావెల్, ఇతర కేటగిరిలలో ప్రోడక్ట్స్ ను రూపొందించడానికి ప్రయత్నాల్ని మొదలుపెట్టింది.