దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు దిశ యాప్‌పై అవగాహన కల్పించి, డౌన్‌లోడ్ చేసి చూపిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తదితరులు
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం దిశ యాప్ డౌన్‌లోడ్స్ మెగా డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి మొత్తం 3.20 లక్షల డౌన్‌లోడ్స్‌తో పాటు 1.70 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు. ఇది రాష్ట్రంలోనే రికార్డుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.34 లక్షల రిజిస్ట్రేషన్లతో విశాఖ జిల్లా టాప్‌లో ఉండగా తాము దాన్ని అధిగమించినట్టు చెప్పారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు.
చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు
జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రామ/వార్డు వలంటీర్లు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్‌లో దిశా యాప్ ఉండాలన్న లక్ష్యంతో విద్యారి్థనులు, గృహిణుల ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఉదయం ఈ మెగా డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ ఎన్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా ప్రారంభించారు. నగరంలోని బస్టాండ్, కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లు పర్యటించి అక్కడున్న విద్యారి్థనులు, మహిళలతో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment