సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: లోన్ యాప్ నిర్వాహకుల వికృత చేష్టలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహిళకు దిశ యాప్ అండగా నిలిచింది. లోన్ తీసుకోకపోయిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ టూ టౌన్ పరిధిలోని మహిళకు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దుర్భాషలాడుతూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో దిశ(ఎస్‌వోఎస్)కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి లొకేషన్‌కు చేరుకున్న దిశ పోలీసులు వివరాలు సేకరించారు.
బాధితురాలి కుమారుడు సెల్ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ పొరపాటున లోన్ యాప్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే రెండు వేలు ఆటోమెటిక్ గా బాధితురాలి ఖాతాలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. బాధితురాలి సెల్ ఫోన్‌కు పంపించిన అసభ్యకరమైన వీడియోలతో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు సేకరించారు.
చదవండి: యాప్‌లతో సేఫ్టీకి భరోసా!
Comments
Please login to add a commentAdd a comment