నాతో వస్తే.. పిల్లలు పుట్టిస్తా.. | TDP Leaders Harassment Against Women In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

నాతో వస్తే.. పిల్లలు పుట్టిస్తా..

Published Mon, Oct 28 2024 7:48 AM | Last Updated on Mon, Oct 28 2024 9:57 AM

harassment tdp leaders against women

బరితెగించి మహిళను వేధించిన టీడీపీ నేత 

గుళికలు తిని బాధితురాలు ఆత్మహత్యాయత్నం 

నెల్లూరు జిల్లాలో ఘటన

చేజర్ల: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల వేధింపులతో కొందరు మహిళలు ప్రాణాలు తీసుకోగా అనేకమంది ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు, దాష్టీకాలు పరాకాష్టకు చేరాయి. ఇంటర్‌ విద్యార్థినిని ప్రేమపేరుతో లొంగదీసుకుని ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేయడంతో బాధితురాలు ఆత్మహత్యా­యత్నం చేసిన ఘటనను మరువకముందే అదే నియోజకవర్గంలోని చేజర్ల మండలంలో మరో దుర్మార్గం వెలుగు చూసింది.

 నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా.. అంటూ టీడీపీ నేత వేధిస్తుండటంతో బాధిత గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. చేజర్ల మండలం యనమదల గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఒక గిరిజన మహిళకు ఏడాదిన్నర కిందట పెళ్లయింది. ఆమెకు ఇంకా పిల్లలు కలగలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మల్లినేని పెంచలయ్య కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తరచు లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ ఆమె ఇంటికి వచ్చి ‘నీకు పెళ్లై ఇంతకాలమైనా పిల్లలు పుట్ట లేదు.. నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా’ అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించసాగాడు. ‘నేను చెప్పినట్లు వినకపోతే నీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరిస్తున్నాడు. 

ఈ విషయాన్ని బాధితురాలు స్థానిక పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్దానిక చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన చికిత్స కోసం 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ విషయంపై చేజర్ల పోలీసులను అడగగా.. తమకు సమాచారం లేదని చెప్పారు. సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement