పూనమ్ కౌర్‌ మరో సంచలన ట్వీట్‌.. ఆ వివాదం గురించేనా? | Poonam Kaur Once Again Allegations On Star Hero Harassed Actress | Sakshi
Sakshi News home page

Poonam kaur: పూనమ్ కౌర్‌ మరో సంచలన ట్వీట్‌.. ఏకంగా స్టార్ హీరో అంటూ!

Published Sun, Nov 17 2024 7:19 PM | Last Updated on Sun, Nov 17 2024 7:21 PM

Poonam Kaur Once Again Allegations On Star Hero Harassed Actress

కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్‌ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్‌ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

పూనమ్ తన ట్వీట్‌లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్‌గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్‌ వెళ్లినప్పుడు ‍అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్‌ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్‌ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

అందులో తన ట్వీట్‌లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement