ఆధార్ కార్డ్ ఇండియాలో ప్రతి ఒక్కరూ దగ్గర తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డ్. ఇది చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్దుల వరకు ప్రతి చిన్న విషయంలో దీని యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. కానీ కొన్నిసార్లు మన అజాగ్రత్త వల్ల లేక మరే ఇతర కారణాల వల్ల మనం పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఈ-ఆధార్ రూపంలోనో, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు రూపంలోనో పొందవచ్చు. దీనిని పొందటానికి చాలా రకాల పద్దతులున్నాయి. కానీ అన్నింటికంటే తేలికైన పద్దతి మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం. (చదవండి: ‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్)
దీని కోసం మనం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో "గెట్ ఆధార్ కార్డు' సెక్షన్‌లో డౌన్‌డౌన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'గెట్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. "యూఐడీఏఐ" మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఒకే పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. దీని కోసం మనం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment