
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులకు సంబంధించి డౌన్‌లోడ్ వేగంలో రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్ (ఎంబీపీఎస్) డౌన్‌లోడ్ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. అప్‌లోడ్ స్పీడ్ విభాగంలో వొడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ వేగంతో నంబర్ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్‌వర్క్ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ.. సమీప ప్రత్యర్థి సంస్థ వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది.
వొడాఫోన్ ఐడియా సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను, అప్‌లోడ్ స్పీడ్ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్‌లోడ్ స్పీడ్ విషయంలో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం లో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్), ఎయిర్‌టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్ డేటాలో వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment