top place
-
Andhra Pradesh: అప్పుల్లో మనోళ్లది రెండోస్థానం
సాక్షి, హైదరాబాద్: అప్పులు, చేబదుళ్ల వంటివి చేసే వారిలో తెలంగాణ ప్రజలు దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. లక్షమందికి గాను సగటున 42,407 మంది ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచో, మరో రూపంలోనో అప్పులు తీసుకున్నట్టు వెల్లడైంది. అప్పులు తీసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయానికొస్తే...లక్ష మందికి గాను సగటున 60,092 మంది రుణాలు తీసుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. లక్ష మందికి గాను 35,703 మంది రుణం తీసుకోవడం ద్వారా తమిళనాడు ప్రజలు మూడో స్థానంలో నిలిచారు. కాంప్రహెన్సి యాన్యువల్ మాడ్యులర్ సర్వే (సీఏఎంఎస్)–2022–23 (2022 జూలై నుంచి 2023 జూన్ దాకా)కు సంబంధించిన వివరాలను కేంద్ర అర్థ గణాంకాల శాఖ విడుదల చేసింది. తెలంగాణలో అప్పులు తీసుకున్న వారిలో పురుషులు 54,538, మహిళలు 30,287 ఉన్నట్టుగా సర్వేలో వెల్లడైంది. రూ.500 లేదా ఆపై మొత్తాన్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించేనాటికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే ఆ వ్యక్తిని రుణగ్రస్తునిగా (ఇన్‌డెబ్టెడ్) పరిగణనలోకి తీసుకున్నారు. అఖిల భారత స్థాయిలో 3,02,086 కుటుంబాలకు చెందిన (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) 12,99,988 మంది నుంచి అప్పుల వివరాలు సేకరించారు. జాతీయ సగటుకు మించి పట్టభద్రులు తెలంగాణకు సంబంధించి సర్వే వెల్లడించిన ఇతర అంశాలను పరిశీలిస్తే..21 ఏళ్లు ఆ పైబడిన వయసు వారు జాతీయ సగటు కంటే ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీలలో పట్టభద్రులుగా ఉన్నారు. 62.3 శాతం మంది సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్. అదే ఏపీలో 58.5 శాతం మంది మాత్రమే ఈ సబ్జెక్ట్‌లలో పట్టభద్రులు. సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్ అయిన వారిలో పురుషులు 61.6 శాతం, మహిళలు 63.6 శాతం ఉన్నారు. వీరి శాతం కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికం. దేశవ్యాప్తంగా ఇతర గణాంకాల విషయానికొస్తే...15–24 ఏళ్ల మధ్యనున్న వారిలో 96.9 శాతం మంది ఏదైనా ప్రకటనను చదివి, రాయగలుగుతున్నారు. సాధారణ లెక్కలు చేయగలుగుతున్నారు. వీరిలో పురుషులు–97.8%, మహిళలు–95.9%. 18 ఏళ్లు ఆపై వయసున్న వారిలో అఖిల భారత స్థాయిలో 94.6% మంది ఏదైనా బ్యాంక్‌లో లేదా ఆర్థిక సంస్థలో ఖాతా కలిగి ఉన్నారు. దేశంలో 92.3 శాతం మంది మొబైల్ ఫోన్లు (స్మార్ట్ఫోన్లతో సహా) వాడుతున్నారు.–ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు 64.8% మంది. ఏదైనా సమాచారం కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేయడంతో పాటు ఈ–మెయిల్స్ పంపగలిగినవారు, ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలా పాలు నిర్వహించగలిగినవారు 39.4% ఉన్నారు. -
థియేటర్లలో రాని క్రేజ్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోన్న థ్రిల్లర్ మూవీ!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. నెల రోజులు కాకముందే సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింతుకుంటోంది. ఓటీటికి వచ్చిన ఒక్క రోజులోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చినా.. 24 గంటల్లోనే ఇండియా వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు రూ.27 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. The magic has now reached every home in the country 💫 Magical Entertainer #OoruPeruBhairavakona is entertaining every household and Trending #1 in India on @PrimeVideoIN ❤️🔥 - https://t.co/sDCJn9vPA7@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy@VarshaBollamma… pic.twitter.com/KV2bzeVgxe — AK Entertainments (@AKentsOfficial) March 9, 2024 -
ఇంధన పొదుపులో ఏపీనే లీడర్
సాక్షి, విశాఖపట్నం: ఇంధన సామర్థ్య నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం) లీడర్‌గా వ్యవహరిస్తోందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ రాకేష్ కే రాయ్ వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీని బ్రాండ్‌గా చూపిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపునకు ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్డీఏ)లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. వాటిలో ప్రధానమైనవి.. ఏపీలో ఏటా రూ.3,500 కోట్లు ఆదా ఇంధన సామర్థ్య చర్యల్ని పటిష్టంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఏపీఎస్ఈసీఎం ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డుని ఏపీఎస్ఈసీఎం దక్కించుకోవడం ఇంధన పొదుపుపై ఏపీ విధానాలకు నిదర్శనం. ఇప్పటికే పవర్ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీని ద్వారా పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ (ప్యాట్) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోంది. ఏపీలో 12 వేల ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఈఈ విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు వారధులైన విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా లక్ష ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 12 వేల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి క్లబ్‌కు ఏటా రూ.10 వేలు నిధులు సమకూరుస్తాం. ఈ క్లబ్‌లు విద్యార్థుల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయి. త్వరలో వలంటరీ కార్బన్ ట్రేడ్.. బీఈఈ అడ్మినిస్ట్రేటర్‌గా ఈ ఏడాది నుంచి వలంటరీ కార్బన్ ట్రేడింగ్ ఫ్రేమ్ వర్క్‌కు సిద్ధమవుతున్నాం. ఇంధన పొదుపు పాటించే ప్రతి పరిశ్రమకు కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బీఈఈ ఈ ట్రేడ్ ధ్రువపత్రం అందిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరో 1.5 డిగ్రీలు దాటితే మరింత కర్బన ఉద్గారాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రుతుపవనాల రాకలో కూడా తీవ్రమైన మార్పులుంటాయి. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45 శాతం తగ్గించే లక్ష్యంతో రోషనీ అనే కార్యక్రమాన్ని బీఈఈ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికత సాయంతో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల నియంత్రణలో భారత్ దిక్సూచిగా మారబోతోంది. మనం ఆదా చేసే విద్యుత్ శ్రీలంక సరఫరాతో సమానం ఇంధన సామర్థ్యం విషయంలో భారత్.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాల్ని అమలు చేస్తుండటం వల్ల ఏటా రూ.48 వేల కోట్లు ఆదా విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్ సరఫరాతో సమానం. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. -
మళ్లీ ఎన్ఎస్ఈ టాప్, వరుసగా నాలుగో ఏడాది రికార్డ్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సే్ఛంజీగా వరుసగా నాలుగో ఏడాది నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) నిలిచింది. ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యరీత్యా 2022లోనూ రికార్డ్ నెలకొలి్పంది. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఎఫ్ఐఏ) వెల్లడించిన వివరాలివి. మరోవైపు నాలుగో ఏడాదిలోనూ టాప్ ర్యాంకులో నిలిచినట్లు ఎన్ఎస్ఈ సైతం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతేకాకుండా లావాదేవీల సంఖ్య(ఎల్రక్టానిక్ ఆర్డర్ బుక్) రీత్యా 2022లో ఈక్విటీ విభాగంలో ఎన్ఎస్ఈ మూడో స్థానానికి మెరుగుపడినట్లు ఎక్సే్ఛంజీల వరల్డ్ ఫెడరేషన్(డబ్ల్యూఎఫ్ఈ) వెల్లడించింది. 2021లో ఎన్ఎస్ఈ నాలుగో ర్యాంకులో నిలిచింది. గత క్యాలండర్ ఏడాది(2022)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50 18,887ను అధిగమించడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్‌లో లిక్విడిటీ భారీగా పెరిగింది. ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్‌ల రోజువారీ సగటు టర్నోవర్ 2022లో 51 శాతం జంప్‌చేసి రూ. 470 కోట్లను తాకింది. ఇక సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ల రోజువారీ సగటు టర్నోవర్ 59% ఎగసి రూ. 7 కోట్లకు చేరింది. ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ గత నెలలో సగటు టర్నోవర్ రూ. 3 కోట్లకు చేరడం గమనార్హం! చదవండి: గత ఎన్నికల ముందు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి? -
‘డిజిటల్ హెల్త్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఆభా) కార్డుల జారీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ కృషి చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని చెప్పారు. ఆభా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ డిజిటల్ యుగం వైపు దేశం దూసుకుపోతున్న తరుణంలో వైద్య, ఆరోగ్య రంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు ప్రజలకు అందించే వైద్య సేవలను వారి ఆభా ఐడీలకు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలిసిపోతుందని, సత్వర వైద్యం అందించేందుకు దోహదపడుతుందని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకాధికారి బీవీ రావు, డాక్టర్ కోటిరెడ్డి, పాల్గొన్నారు. -
ట్రంప్ సోషల్ మీడియా యాప్ ఆరంభం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ యాప్ ‘ ట్రూత్ సోషల్’ సోమవారం ప్రారంభమైంది. గతంలో ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ ప్రఖ్యాత సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం తెల్సిందే. దీంతో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యాపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచి్చంది. గతంలోనే కోరుకున్న వారికి తాజాగా యాప్ సబ్‌స్రై్కబ్ సౌకర్యం కల్పించారు. కొత్త వారికి మరో 10 రోజుల్లో అవకాశమిస్తారు. అయితే, యాప్ ప్రారంభమైన కొద్ది సేపటికే లాగిన్ చిక్కులొచ్చాయి. వచ్చే నెలదాకా సమస్య తీరదని వార్తలొచ్చాయి. ఈ యాప్ కోసం సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో యాపిల్ ర్యాంకింగ్స్ ప్రకారం సోమవారం అమెరికాలో టాప్ ఫ్రీ యాప్ జాబితాలో ఈ యాప్ అగ్రస్థానంలో నిలిచింది. -
ఎక్కడా తగ్గేదే లే.. ‘రాధేశ్యామ్’ను వెనక్కి నెట్టి టాప్‌లో ‘పుష్ప’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఈ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదు. తగ్గేదే లే అని బన్నీ చెప్పిన ఊర మాస్ డైలాగ్‌తో పాటు ట్రైలర్ ఓ రేంజ్లో ఉండడం, పైగా బన్నీకిది ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకుల అంచనాలు కూడా ఎక్కడా తగ్గట్టేదు. అంత క్రేజ్ ఉంది కాబట్టే ఈ సినిమా జాతీయ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీ వరకు వెళ్ళి టాప్ ప్లేస్ కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వచ్చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల విడుదల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఎక్కువ మంది ఎదురుచూస్తున్న భారతీయ సినిమా జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఒకటి బన్నీ‘పుష్ప’ కాగా మరొకటి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇందులో చోటు దక్కించుకున్నాయి. కాగా బాహాబలితో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్, ఫ్యాన్స్‌ను సంపాదించిన ప్రభాస్ సినిమా కంటే బన్నీ పుష్ప టాప్‌లో ఉండడం గమనార్హం. ఈ జాబితాలో ‘ రాధేశ్యామ్ ’ మూడో స్థానంలో ఉంది. చదవండి: Rajinikanth: సూపర్ స్టార్ యూఎస్ ఫోటోలు లీక్..లోకల్ ట్రైన్లో అలా.. -
జియో సంచలనం: 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో టాప్
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులకు సంబంధించి డౌన్లోడ్ వేగంలో రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్ (ఎంబీపీఎస్) డౌన్లోడ్ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. అప్లోడ్ స్పీడ్ విభాగంలో వొడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ వేగంతో నంబర్ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్వర్క్ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ.. సమీప ప్రత్యర్థి సంస్థ వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది. వొడాఫోన్ ఐడియా సగటు డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడ్ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను, అప్లోడ్ స్పీడ్ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్లోడ్ స్పీడ్ విషయంలో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం లో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్), ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్ డేటాలో వెల్లడి కాలేదు. -
Covid Cases in India: వామ్మో.. గతవారం మనమే
సాక్షి , న్యూఢిల్లీ: ఒకప్పుడు అమెరికా, బ్రెజిల్‌లలో ప్రతిరోజూ లక్షలాదిగా కొత్తకేసులు రావడం చూసి... వామ్మో అనుకున్నాం. చిగురుటాకులా వణికిపోయిన అగ్రదేశంపై అయ్యో పాపమని జాలిపడ్డాం. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే మనమూ అదే పరిస్థితుల్లోకి వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. వారం రోజులుగా కరోనా గణాంకాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వారం రోజుల్లో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. ఏప్రిల్ 12 –18వ తేదీల మధ్య, భారత్‌లో 64% వృద్ధి రేటుతో 15.34 లక్షల మంది కరోనా బారినపడగా, 8,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో భారీగా కేసులు వస్తున్న దేశాలతో పోల్చిచూస్తే గతవారం భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ప్రపంచంలో కొత్తగా కరోనా బారినపడ్డ వారిలో 30% వాటా భారత్‌దే. అదే సమయంలో అమెరికాలో 2 శాతం వృద్ధిరేటుతో 4.71 లక్షల మంది, బ్రెజిల్లో –7% వృద్ధిరేటుతో 4.61 లక్షల మంది, టర్కీలో 17% వృద్ధిరేటుతో 4.19 లక్షలమంది, ఫ్రాన్స్‌లో –10% వృద్ధిరేటుతో 2.30 లక్షల మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 19 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక యాక్టివ్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19,29,329 కు పెరిగాయి. రికవరీ రేటు 86 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 1,44,178 మంది కరోనాను ఓడించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,29,53,821 కు చేరింది. రోజువారీ కేసులతో పోలిస్తే రికవరీలు సగం ఉండడమనేది ఆందోళనకరంగా మారింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి‡వరకు 26,78,94,549 శాంపిల్స్‌ను పరీక్షించగా, వాటిలో 13,56,133 శాంపిల్స్‌ను కేవలం ఆదివారం పరీక్షించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 12,69,56,032 మందికి టీకాలు వేశారు. 79.25%... 10 రాష్ట్రాల్లోనే దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 68,631 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 503 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 6,70,388కు చేరుకుంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 3 నెలలు ఉచితరేషన్ కరోనాపై పోరాటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 పెద్ద నగరాలు భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్‌ల్లో 2 వేల పడకల కోవిడ్ హాస్పిటల్స్ ప్రారంభించనుంది. పేదలకు (బీపీఎల్ కార్డు ఉన్నవారికి) 3 నెలల పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ డే... 2,73,810 సోమవారం విడుదలైన గణాంకాలు ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేశాయి. దేశంలో అత్యధికంగా ఒకే రోజు 2,73,810 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. వైరస్ సంక్రమణతో 1,619 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఎక్కువగా కోవిడ్–19 ప్రభావితమైన రాష్ట్రాల్లో రోగులకు పడకలు, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరం కరోనా సంక్రమణ ప్రారంభమైన తరువాత, దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన రోగుల సంఖ్య 1.5 కోట్లు దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య కేవలం 15 రోజుల్లోనే 1.25 కోట్ల నుంచి 1.5 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో 1 కోటి 29 లక్షల 47 వేల 297 మంది కోలుకున్నారు. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన 1,619 మందితో కలిసి కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 1,78,769 కు చేరుకుంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది. -
రికవరీలో ప్రపంచంలో మనమే టాప్
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ రికవరీలో ప్రపంచంలో మనమే నంబర్ వన్ భారత్‌లో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 42,08,431 మంది కోవిడ్–19 నుంచి కోలుకున్నారు. దీంతో భారత్ రికవరీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అమెరికా 41 లక్షల మంది రికవరీతో రెండో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు 4.04 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల 13 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 53,08,014కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 79.28గా ఉంది. రికవరీ సాధించింది ఇలా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడం, అత్యధికంగా పరీక్షలు చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని సమర్థంగా నిర్వహించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ఈ స్థాయిలో రికవరీ సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. అంతేకాకుండా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, శరీరంలో వైరస్ దాడి తీవ్రతరం కాకుండా రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగం, ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్ల వినియోగం పెంచడం, ప్లాస్మా థెరపీ, అవసరమైతే స్టెరాయిడ్స్ ఇస్తూ ఉండడంతో ఈ స్థాయిలో రికవరీ సాధించామని తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో జనాభాతో పోల్చి చూస్తే చాలా స్వల్పమేనని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 60% వరకు రికవరీ కేసులు వస్తున్నాయని వివరించింది. -
రికవరీకి ఏడాది పడుతుంది..
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇది ఎప్పటికి వదులుతుందో తెలియక అందరిలోనూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ కోవిడ్ 19 అదుపులోకి వచ్చినా.. దీని ప్రతికూల ప్రభావాల నుంచి బైటపడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పట్టేస్తుందని దేశీయంగా ప్రజలు భావిస్తున్నారు. అంతే కాదు.. అత్యంత భయంకరమైన వ్యాధుల జాబితాలో క్యాన్సర్, ఎయిడ్స్‌ను కూడా దాటేసి కోవిడ్ 19 టాప్ ప్లేస్‌లో ఉంది. మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ వెలాసిటీ ఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఇందులో 2,100 మంది పాల్గొనారు. చేతులు కడుక్కుంటున్నారు.. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని 70 శాతం మందిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. సక్రమంగా పరిశుభ్రత పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. 81 శాతం మంది గతంలో కన్నా మరింత తరచుగా చేతులు కడుక్కుంటున్నారు. 78 శాతం మంది జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకున్నారు. భవిష్యత్‌లోనూ విదేశాలకు ప్రయాణించేటప్పుడు ఇదే తీరు పాటించాలని భావిస్తుండటంతో .. జీవనవిధానపరమైన ఈ మార్పులు ఇకపైనా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని వెలాసిటీ ఎంఆర్ ఎండీ, సీఈవో జసల్ షా తెలిపారు. బైటతిరగడం మానుకోలేకపోతున్నారు.. లాక్డౌన్, ఆంక్షలు అమలవుతున్నప్పటికీ చాలా మంది.. ఎంత వద్దనుకున్నా తమ రోజువారీ అలవాట్లను మానుకోలేకపోతున్నారు. రద్దీ లేని వేళల్లోనే నిత్యావసరాల కొనుగోళ్లు జరపడం, ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తున్న ప్రాంతాల్లో దాన్ని ఉపయోగించడం మానుకోలేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక, ఉద్యోగ సంబంధ ప్రయాణాలు చేయడం తప్పటం లేదని 46 శాతం మంది తెలిపారు. 25 శాతం మంది తమకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు లభించలేదని పేర్కొన్నారు. సర్వేలో మరిన్ని విశేషాలు ► కోవిడ్–19 సంబంధ సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా టీవీ, సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లు, దినపత్రికల (వరుస క్రమంలో)పై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విశ్వసనీయ సమాచారం కోసం టీవీలు, దినపత్రికలపై ఆధారపడుతున్నారు. ► వైరస్ వ్యాప్తితో ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం పెరిగింది. ► దీని వ్యాప్తి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని 87 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► చాలా మంది ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవడంతో ట్రావెల్, టూరిజం రంగాలు అత్యధికంగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఉంది. ఇతర త్రా వ్యాపారాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావమే పడిందని 92 శాతం మంది భావిస్తున్నారు. ► తెలిసినవారు ఎదురుపడినప్పుడు షేక్హ్యాండ్లు, కౌగిలించుకోవడాల్లాంటివి కొంత కాలం పాటు ఆగుతాయని 71 శాతం మంది తెలిపారు. అలాగే, విదేశాలకు వెళ్లేవారు కూడా మరింత జాగ్రత్తగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ► వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ప్రపంచం కోవిడ్ 19 ప్రభావాల నుంచి బైటపడగలదని 84% మంది ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అంతర్జాతీయ స్టార్టప్, ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం లభించిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీ హబ్ ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిందన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుందని, గత నాలుగు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి భాగస్వాములతో ఇన్నోవేషన్, స్టార్టప్ రంగంలో ముందుకు పోతున్నదన్నారు. ఇన్నోవేషన్ రంగంలో ముందు వరుసలో నిలవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రగతి ద్వారా కేవలం కార్పొరేట్ సెక్టార్లోనే కాకుండా, పారిశ్రామిక రంగంలోనూ అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణలోని యువత, స్టార్టప్ కంపెనీలు పనిచేయాలని ఆయన కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలోనూ ముందు వరుసలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ–వర్క్స్‌ని ప్రారంభించనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పలు టెక్నాలజీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. -
వీరు నవ్వితే.. నవరత్నాలు
సాక్షి, హైదరాబాద్ : ఏ ఇంట్లో అయినా పసిపాప బోసినవ్వు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. సమస్యలెన్ని ఉన్నా మరచిపోయేలా చేస్తుంది. అంత శక్తి ఉన్న బోసినవ్వులో దేశంలో కేరళ తొలిస్థానంలో ఉంది. ఆరోగ్యం, విద్య, చిన్నారులపై హింస లాంటి 24 ప్రభుత్వ ప్రమాణాల ఆధారంగా, చిన్నారుల శ్రేయస్సు కొలమానంగా జరిపిన తాజా పరిశోధనలో చివరి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ‘ద ఇండియన్ చైల్డ్ వెల్ బీయింగ్ రిపోర్టు’ని తాజాగా విడుదల చేసింది. వివిధ ప్రమాణాల ఆధారంగా పసిపాపల ఆనందాన్ని కొలిస్తే.. టాప్ 3 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ వరుసగా నిలిచాయి. అధ్యయన అంశాలివి... శిశు మరణాలు, పసివారి మానసిక ఆరోగ్యం, బాలబాలికల నిష్పత్తిలో వ్య త్యాసం, చిన్నవయసులోనే గర్భం దాల్చ డం, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను అధ్యయనంలో కొలమానాలుగా తీసుకు న్నారు. విద్య విషయంలో డ్రాపౌట్ రేటు , టెన్త్ ఉత్తీర్ణత, తరగతి గదిలో పిల్లలు, టీచర్ల నిష్పత్తి, గణితంలో నైపుణ్యాలను ప్రమాణాలుగా తీసుకున్నారు. చిన్నారుల నేర ప్రవృత్తి, బాలకార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో ఆత్మహత్యాశాతాన్ని అంచనా వేసింది. ఇళ్లులేని చిన్నారులూ, 5,000 కన్నా తక్కువ ఆదాయం కలిగిన పనులు చేసుకుంటోన్న చిన్నారుల తల్లిదండ్రుల పని పరిస్థితులనూ అధ్యయనం చేశారు. కేరళ టాప్... పౌష్టికాహారం, పసివారి ఆరోగ్య సం రక్షణ విషయంలో, రక్షిత మంచినీటి విషయంలో, సానిటేషన్ విషయంలో కేరళ చాలా ముందుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మంచి స్కోరుని సాధించింది. చివరి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో చిన్నారుల శ్రేయస్సు, పౌష్టికాహారం, జువైనల్ క్రైమ్స్ వంటివి వారి శ్రేయస్సును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. జార్ఖండ్‌లో చిన్నారులు ఎత్తు కు తగిన బరువు లేరు. ఆస్పత్రుల్లో ప్రస వాలు తక్కువగా నమోదయ్యాయి. ఐదేళ్లలోపే చిన్నారులు మరణిస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. జార్ఖండ్‌లో స్కూల్ డ్రాపౌట్ రేట్ కూడా అధికంగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో పసివారు సురక్షితం... ఈశాన్య రాష్ట్రాల్లో పసివారి పెరుగుదల క్షేమకరంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. లింగ నిష్పత్తి సైతం ఇక్కడ మెరుగ్గా ఉంది. హింసలో పాల్గొంటున్న పిల్లలు తక్కువే. నాగాలాండ్‌లో అత్యధిక జననాలు నమోదవుతున్నాయి. పిల్లల ఆత్మహత్యలు కూడా తక్కువే. సిక్కిం ఇందుకు పూర్తి భిన్నం. చిన్నారుల్లో నేరప్రవృత్తి ఎక్కువగా ఉండటం, పిల్లల ఆత్మహత్యలు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం జనాభాలో 40 శాతం మంది 1 నుంచి 18 ఏళ్ల వయస్సువారే. వారి ఎదుగుదలకు అడ్డుకట్టగా మారుతున్న పేదరికం, అసమానతలు అధిగమించే ప్రయత్నాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఈ సర్వే తేల్చి చెబుతోంది. -
బ్యాంక్ బ్యాలెన్స్‌లో బీఎస్పీ టాప్
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ ఖాతాల్లో ప్రస్తుతం రూ.669 కోట్లున్నాయి. బీఎస్పీ తర్వాతి స్థానాల్లో వరుసగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఉండగా ఐదో స్థానంలో అధికార బీజేపీ ఉండటం గమనార్హం. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా ఈ విషయం వెల్లడయింది. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘానికి అందించిన నివేదిక ప్రకారం.. బహుజన్ సమాజ్ పార్టీకి దేశ రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పార్టీకి చెందిన 8 ఖాతాల్లో రూ.669 కోట్ల నిధులున్నాయి. దీంతోపాటు రూ.95.54 లక్షలు నగదు రూపంలో కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదంతా విరాళాల ద్వారానే సేకరించినట్లు బీఎస్పీ పేర్కొందని అధికారులు వివరించారు. రూ.471 కోట్ల నిల్వలతో సమాజ్‌వాదీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికల తర్వాత ఈ మొత్తం రూ.460 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో తమకు రూ.24 కోట్ల మేర విరాళాలు అందడంతో నిల్వలు రూ.669 కోట్లకు చేరినట్లు బీఎస్పీ వెల్లడించింది. బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో రూ.196 కోట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ లెక్కలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గత ఏడాది నవంబర్‌లో ఈసీకి సమర్పించిన వివరాల్లో పేర్కొన్నవి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కాంగ్రెస్ ఈసీకి అందజేయలేదు. అధికార బీజేపీ విషయానికొస్తే.. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినట్లు వెల్లడించిన ఈ పార్టీ రూ.82 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు వెల్లడించింది. 2017–18 సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్లు, విరాళాల ద్వారా అందిన రూ.1,027 కోట్లలో రూ.758 కోట్లను ఎన్నికల్లో వెచ్చించినట్లు ఈసీకి బీజేపీ తెలిపింది. ఈ విషయంలో రూ.107 కోట్లున్న తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ వెనుకబడి ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆయా పార్టీల నిధుల్లో 87 శాతం వరకు స్వచ్ఛంద విరాళాల ద్వారా అందినవేనని పేర్కొనగా బీజేపీ మాత్రమే 2017–18 కాలంలో రూ.210 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించినట్లు తెలిపింది. కాగా, ఆయా పార్టీలు ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో బీజేపీ అత్యధికంగా రూ.1,034 కోట్లు, రూ.1,027 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఆదాయం రూ.174 కోట్ల నుంచి రూ.52 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా, 2016–17లో కాంగ్రెస్ ఆదాయం రూ.225 కోట్లుగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఈసీకి ఆదాయ వివరాలను అందజేయలేదు. సీపీఎం ఆదాయం గత కొద్ది సంవత్సరాలుగా రూ.100 కోట్లుగా ఉంది. -
పీఎన్బీ.. సంస్కరణల అమల్లో టాప్
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్బీఐ (74.6), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69), కెనరా బ్యాంక్ (67.5), సిండికేట్ బ్యాంక్ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది. ‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండిబాకీలకు రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్‌ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్.. భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్ లభించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కి 66.7, యూకో బ్యాంక్ (64.1), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్ (60.2), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (55.7), దేనా బ్యాంక్‌కు 53.8 ర్యాంక్ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి. దివాలా చట్టంతో ప్రయోజనాలు.. దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది. కొనసాగనున్న బ్యాంకుల విలీనం.. అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్స్టాప్ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు. -
చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను విశ్లేషించిన క్రై అనే ఎన్జీవో సంస్థ డైరెక్టర్ కోమల్ గనోత్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరిగిన నేరాల్లో 50 శాతం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. ఈ నేరాల్లో 15 శాతంతో యూపీ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. మరోవైపు 2014–16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడ్డ వృద్ధుల(సీనియర్ సిటిజన్స్)పై జరిగిన నేరాల్లో 40 శాతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. వృద్ధులను దోచుకోవడం, దాడిచేయడం, మోసం చేయడం వంటి నేరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు. చిన్నారుల కిడ్నాపుల్లో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,11,569 మంది పిల్లలు(41,175 మంది బాలురు, 70,394 మంది బాలికలు) తప్పిపోయారన్నారు. పోలీసులు, అధికారుల చొరవతో 2016 చివరినాటికి 55,944 మంది చిన్నారుల్ని కాపాడగలిగామన్నారు. -
హరితహారంలో బీర్కూర్ టాప్
బీర్కూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో బీర్కూర్ మండలం జిల్లాలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. లక్ష్యానికి మించి మొక్కలు నాటి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మండంలో 6.80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా, 7.22 లక్షల మొక్కలు నాటి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలిచింది. మొత్తం 106 శాతం మొత్తం నాటినట్లు ప్రత్యేకాధికారి, డీఎల్పీవో హనూఖ్ తెలిపారు. ప్రణాళిక బద్దంగా ముందుకు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లారు. మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో హనూక్, తహసీల్దార్ కిష్టానాయక్, ఎంపీడీవో భరత్‌కుమార్ సారథ్యంలో అన్ని శాఖల అధికారులను రెండు బృందాలుగా విడిపోయారు. పల్లె నిద్ర చేస్తూ హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపాధి హామీ ఏపీవో హలీం అక్మల్, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామస్తులంతా కలిసి సమష్టిగా కదిలారు. లక్ష్యాన్ని అధిగమించి మొక్కలు నాటారు. ఎంపీపీ మల్లెల మీనా, మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు కిషన్‌నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపునకు అవకాశాలు.. వ్యవసాయ దినోత్సవం రోజున అన్ని గ్రామాల్లోని పొలం గట్లపై టేకు మొక్కలు నాటారు. శనివారం ఎక్సైజ్ డే సందర్భంగా తిమ్మాపూర్‌లోని చెరువు కట్టపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా ప్రజలు ఈత మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, కూలీలు భాగస్వాములై టార్గెట్‌ను పూర్తి చేశారు. లక్ష్యం సాధించిన తొలి మండలంగా నిలిచిన బీర్కూర్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని డీఎల్పీవో హనూఖ్ తెలిపారు. మండలంలోని 17 పంచాయతీల్లో వంద శాతం మొక్కలు నాటడంతో కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అభినందనలు.. లక్ష్యాన్ని అధిగమించి జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన బీర్కూర్ మండల ప్రజలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిస్తే జిల్లాలో తన సొంత నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం టాప్ ప్లేస్‌లో నిలవడం హర్షణీయమన్నారు. ప్రతి పంచాయతీలో 40 వేల మొక్కలు నాటే వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. -
ఉపాధిలో నెం.1
♦ ఈజీఎస్ అమలులో జిల్లాకు ప్రథమస్థానం ♦ అత్యధిక కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత ♦ కూలీ డబ్బుల చెల్లింపుల్లోనూ అగ్రస్థానం ♦ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు అడిగిన కూలీలందరికీ ఉపాధి పని.. పనిచేసిన కూలీలకు సకాలంలో చెల్లింపులు.. జాబ్‌కార్డులున్న వారిలో ఎక్కువ మందికి వందరోజుల పని కల్పించడం.. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్దేశించిన లక్ష్యంలో మెరుగైన పురోగతి.. నీటి గుంతల తవ్వకాల్లో లక్ష్యానికి నాలుగురెట్ల సాధన.. ఇన్ని రికార్డులతో గ్రామీణాభివృద్ధిలో పరుగులు పెడుతూ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయడంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. జిల్లా నీటి యాజమాన్య సంస్థను ప్రశంసలతో ముంచెత్తింది. బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో డ్వామా పీడీ హరితతోపాటు సిబ్బందిని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అభినందించారు. లక్ష్యాలు అధిగమించి.. 2016-17 వార్షిక సంవత్సరంలో గత నెలాఖరు నాటికి జిల్లాలోని కూలీలకు 44.06 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అటు పట్టణ వాతావరణ, ఇటు గ్రామీణ ప్రాంతం తోడవడంతో లక్ష్యసాధన కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉపాధికి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా 45.85 లక్షల పనిదినాలు కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో 104.08 శాతం పురోగతి సాధించి పని కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం (91.88%), నిజామాబాద్ (88.54%) జిల్లాలున్నాయి. 1,644 కుటుంబాలకు వందరోజుల పని.. ఈజీఎస్ పథకంలో ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పించాలి. కరువు నేపథ్యంలో పనిదినాలను 150కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజా వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వంద రోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు 1,644 ఉన్నాయి. రాష్ట్రంలో వందరోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు జిల్లా నుంచే నమోదు కావడం గమనార్హం. ఫాంపండ్స్.. అదుర్స్ రైతుల పొలాల్లో నీటి కొలను (ఫాంపండ్స్) ఏర్పాటు ప్రక్రియను ఈజీఎస్‌లో పొందుపర్చారు. ఈ క్రమంలో 2016- 17 వార్షిక సంవత్సరంలో జిల్లాకు ఫాంపండ్స్ లక్ష్యాన్ని 1000గా ప్రభుత్వం నిర్ధారించింది. కానీ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ లక్ష్యాన్ని ఏకంగా 8,700 పెంచు తూ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మూడు వేల ఫాంపండ్స్ నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. ఇప్పటివరకు 550 ఫాంపండ్స్ పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఫాంపండ్స్ నిర్మించింది జిల్లాలోనే. చెల్లింపుల్లోనూ జోరు.. ఉపాధి పథకం కింద పనిచే సిన ప్రతి కూలీకి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. అయితే పలు జిల్లాల్లో పోస్టాఫీస్ సిబ్బంది ద్వారా డబ్బులు చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం కూలీలకు ప్రత్యేకం బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిల్లో ఆన్లైన్ పద్ధతిలో డబ్బులు జమచేస్తున్నాడు. కూలీ డబ్బుల చెల్లింపుల ప్రక్రియ ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డిజిల్లాలో వేగంగా జరుగుతుంది. ఈక్రమంలో కూలీ చెల్లింపుల విభాగంలోనూ జిల్లా ముందువరుసలో ఉంది. నెలాఖర్లోగా 56 గ్రామాల్లో... వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ జిల్లా దూసుకెళ్తోంది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈక్రమంలో త్వరలో జిల్లాలో 56 గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించనుంది. ఈనెలాఖర్లోగా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రాజెక్టు డెరైక్టర్ హరిత ‘సాక్షి’తో అన్నారు. మొత్తంగా నెలాఖర్లోగా బహిరంగ మల విసర్జన నిషేధిత కేటగిరీలో 56గ్రామాలను ప్రకటిస్తామని ఆమె అన్నారు. -
హామిల్టన్ దూకుడు
‘పోల్ పొజిషన్’తో సీజన్ మొదలు నేడు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి మెల్బోర్న్: గతేడాది ఏకంగా 11 విజయాలతో స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్‌ను పూర్తి విశ్వాసంతో ప్రారంభించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 26.327 సెకన్లలో పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 39వ సారి ‘పోల్ పొజిషన్’ సంపాదించిన హామిల్టన్ ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని నాలుగోసారి ‘పోల్ పొజిషన్’తో ఆరంభించనున్నాడు. గతంలో మూడుసార్లు విఫలమైన అతను నాలుగోసారైనా సఫలమవుతాడో లేదో వేచి చూడాలి. గతేడాది ‘పోల్ పొజిషన్’తోనే ఈ రేసును ప్రారంభించిన హామిల్టన్ నాలుగు ల్యాప్‌ల తర్వాత సాంకేతిక కారణాలతో రేసు నుంచి వైదొలిగాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి... విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్న ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా 14వ, 15వ స్థానాల నుంచి బరిలోకి దిగుతారు. ‘క్వాలిఫయింగ్‌లో రాణించడంతో సీజన్లో శుభారంభం లభించింది. తొలి రేసులో నెగ్గకపోయినా ప్రపంచమేమీ అంతం కాదని గత సీజన్లో నేను నిరూపించాను. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు ‘పోల్ పొజిషన్’ తొలి అడుగులాంటిది’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. గ్రిడ్ పొజిషన్స్ స్థానం డ్రైవర్ జట్టు 1 హామిల్టన్ మెర్సిడెస్ 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 3 మసా విలియమ్స్ 4 వెటెల్ ఫెరారీ 5 రైకోనెన్ ఫెరారీ 6 బొటాస్ విలియమ్స్ 7 రికియార్డో రెడ్‌బుల్ 8 సెయింజ్ ఎస్టీఆర్ 9 గ్రోస్యెన్ లోటస్ 10 మల్డొనాడో లోటస్ 11 నాసర్ సాబెర్ 12 వెర్స్టాపెన్ ఎస్టీఆర్ 13 క్వియాట్ రెడ్‌బుల్ 14 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 15 పెరెజ్ ఫోర్స్ ఇండియా 16 ఎరిక్సన్ సాబెర్ 17 బటన్ మెక్లారెన్ 18 మాగ్నుసెన్ మెక్లారెన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య: 58 సర్క్యూట్ పొడవు: 5.303 కి.మీ. రేసు దూరం: 307.574 కి.మీ. మలుపుల సంఖ్య: 16 ల్యాప్ రికార్డు: 1ని:24.125 సెకన్లు (షుమాకర్-2004లో) గతేడాది విజేత: రోస్‌బర్గ్