
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ యాప్ ‘ ట్రూత్ సోషల్’ సోమవారం ప్రారంభమైంది. గతంలో ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ ప్రఖ్యాత సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం తెల్సిందే. దీంతో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యాపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచి్చంది. గతంలోనే కోరుకున్న వారికి తాజాగా యాప్ సబ్‌స్రై్కబ్ సౌకర్యం కల్పించారు. కొత్త వారికి మరో 10 రోజుల్లో అవకాశమిస్తారు. అయితే, యాప్ ప్రారంభమైన కొద్ది సేపటికే లాగిన్ చిక్కులొచ్చాయి. వచ్చే నెలదాకా సమస్య తీరదని వార్తలొచ్చాయి. ఈ యాప్ కోసం సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో యాపిల్ ర్యాంకింగ్స్ ప్రకారం సోమవారం అమెరికాలో టాప్ ఫ్రీ యాప్ జాబితాలో ఈ యాప్ అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment