ఫ్లోరిడా: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో అభిమానులను అలరించారు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ తాజాగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. తెలుపు రంగు గోల్ఫ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చేతిలో ఎరుపు రంగు క్యాప్ పట్టుకుని సందర్శకులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
అయితే ఈ లుక్‌లో ట్రంప్‌లో కొత్త దనం ఏంటంటే మారిన ఆయన జుట్టు. ఎప్పుడూ కదులుతూ ఫ్రీగా ఉండే ఆయన జుట్టు స్టైల్ ఇప్పుడు పూర్తిగా మారింది. జుట్టు పైకి దువ్వి వెనక్కి సెట్ చేయడంతో ‘హ్యాట్ హెయిర్’ స్టైల్‌లోకి వచ్చేసింది.
PRESIDENT DONALD J. TRUMP HAS A NEW HAIRSTYLE MAKEOVER pic.twitter.com/j4gXErl2KN
— X Analyst (@topic_flow) December 18, 2024
కాగా, ట్రంప్‌కు హష్‌మనీ కేసులో తాజాగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటికే దోషిత్వం రుజువైన కేసును అధ్యక్ష పదవి వచ్చినంత మాత్రానా కొట్టేయడం కుదరదని కోర్టు ఇటీవలే తేల్చి చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment