iOS app
-
ట్రంప్ సోషల్ మీడియా యాప్ ఆరంభం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ యాప్ ‘ ట్రూత్ సోషల్’ సోమవారం ప్రారంభమైంది. గతంలో ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ ప్రఖ్యాత సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం తెల్సిందే. దీంతో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యాపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచి్చంది. గతంలోనే కోరుకున్న వారికి తాజాగా యాప్ సబ్‌స్రై్కబ్ సౌకర్యం కల్పించారు. కొత్త వారికి మరో 10 రోజుల్లో అవకాశమిస్తారు. అయితే, యాప్ ప్రారంభమైన కొద్ది సేపటికే లాగిన్ చిక్కులొచ్చాయి. వచ్చే నెలదాకా సమస్య తీరదని వార్తలొచ్చాయి. ఈ యాప్ కోసం సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో యాపిల్ ర్యాంకింగ్స్ ప్రకారం సోమవారం అమెరికాలో టాప్ ఫ్రీ యాప్ జాబితాలో ఈ యాప్ అగ్రస్థానంలో నిలిచింది. -
జోరు మీదున్న మొబైల్ గేమింగ్
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ గేమింగ్ జోరు మీద ఉంది. కోవిడ్–19 పుణ్యమాని స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయిన వారి సంఖ్య పెరిగింది. దీంతో గేమింగ్ మార్కెట్ 2023 నాటికి భారత్‌లో రూ.21,750 కోట్లకు చేరనుందని పరిశోధన సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. ప్రస్తుతం ఈ విపణి రూ.8,700 కోట్లుంది. అలాగే 36.5 కోట్ల పైచిలుకు మొబైల్ గేమర్స్ ఉన్నట్టు అంచనా. ఈ సంఖ్య గణనీయంగా అధికమవుతోంది. ప్రొఫెషనల్ గేమర్స్, వ్యూయర్స్ పెరుగుతుండడంతో సంప్రదాయ క్రీడల మాదిరిగానే ఈ–స్పోర్ట్స్ సైతం వృద్ధి బాటలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దూసుకెళ్తున్న సంఖ్య.. 2020 ద్వితీయ త్రైమాసికంలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచి గేమ్స్ డౌన్లోడ్స్ 20 శాతం వృద్ధి చెందాయి. అలాగే ఆన్‌డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి 51 శాతం అధికమయ్యాయి. గతంలో చాలా ఏళ్లపాటు డిజిటల్ సేవలు అణిచివేతకు గురయ్యాయి. ఇంటర్నెట్ లేకపోవడం, స్మార్ట్ఫోన్లు ఖరీదుగా ఉండడం, అధిక డేటా చార్జీలు, డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ప్రస్తుతం 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉండడం, చవక డేటా చార్జీలు, స్మార్ట్ఫోన్ల విస్తృతి, కోవిడ్–19.. వెరశి మొబైల్ గేమింగ్ అభివృద్ధి చెందుతోందని నివేదిక అంటోంది. డిజిటల్ వినియోగం, ఆన్లైన్ కస్టమర్లు అంతకంతకూ పెరగడం, చవక స్మార్ట్ఫోన్లు, డేటా చార్జీలు పరిశ్రమను నడిపిస్తున్నాయి. పీసీ, కన్సోల్ గేమింగ్ పెద్ద ఎత్తున పెరిగినప్పటికీ, మొబైల్ గేమ్స్ స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదని సీఎల్ఎస్ఏ అనలిస్ట్ దీప్తి చతుర్వేది అన్నారు. ప్రముఖ కంపెనీలు ఇవే.. దేశంలో నజారా, డ్రీమ్ 11, గేమ్స్ 24/7, పేటీఎం ఫస్ట్ గేమ్స్, మొబైల్ ప్రీమియర్ లీగ్, జియో గేమ్స్ వంటి కంపెనీలు ప్రముఖంగా నిలిచాయి. గేమింగ్ రంగంలో అయిదేళ్లలో రూ.300 కోట్లను నజారా వెచ్చించింది. రూ.100 కోట్లు సమీకరించింది. బిలియన్ డాలర్ల కంపెనీగా డ్రీమ్ 11 నిలిచింది. గేమ్స్ 24/7లో టైగర్ గ్లోబల్ పెట్టుబడులు ఉన్నాయి. పేటీఎం ప్రమోట్ చేస్తున్న పేటీఎం ఫస్ట్ గేమ్స్‌కు 4.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 300 గేమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. జియో గేమ్స్‌ను రిలయన్స్ జియో, మీడియాటెక్ ప్రమోట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా.. మీడియా రంగంలో అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో గేమింగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ మార్కెట్ రూ.12 లక్షల కోట్లపైమాటే. ఇందులో మొబైల్ గేమింగ్ వాటా రూ.5.36 లక్షల కోట్లు. 2016లో మొబైల్ గేమింగ్ పరిశ్రమ విలువ రూ.2.97 లక్షల కోట్లు. ఇక చైనాలో 5జీ కారణంగా ఈ–గేమింగ్‌కు ఊతమిస్తోంది. భారత్‌లో గేమ్స్, ఆన్లైన్ అనుభూతి మెరుగవుతుండడంతో వినియోగదార్లు లైవ్ ఈవెంట్స్ వీక్షణంతోపాటు ప్రైజ్ మనీ అందుకోవడానికి పోటీలోకి దిగుతున్నారని నివేదిక వెల్లడించింది. -
టాప్ డౌన్లోడింగ్ యాప్స్ ఇవే..
నేటి డిజిటల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుంటే నిమిషం కూడా గడవదు.. ఆత్మీయులతో మాట్లాడటానికి, క్యాబ్ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ ఇలా ఇంట్లో కూర్చునే పనులు పూర్తి చేయాలంటే అందుకు సంబంధించిన యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘యాప్ అన్నే’ నివేదిక-2018 ప్రకారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల వాడకంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న టాప్- 10 యాప్‌లపై ఓసారి లుక్కేద్దాం. 1. ఫేస్బుక్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ అగ్రస్థానంలో నిలిచింది. 2. యూసీ బ్రౌజర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వెనక్కి నెట్టి యూసీ బ్రౌజర్ రెండో స్థానంలో నిలిచింది. ఫాస్ట్ బ్రౌజింగ్, డాటా సేవింగ్ వంటి ఫీచర్ల వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి యూజర్ల సంఖ్య పెంచుకోగలిగింది యూసీ బ్రౌజర్. 3. వాట్సాప్ ప్రస్తుతం ఉన్న మెసేజింగ్ యాప్‌లన్నింటిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాట్సాప్. కానీ అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న యాప్‌లలో మూడో స్థానంలో నిలిచింది. 4. ఎఫ్బీ మెసెంజర్ గతేడాది నాల్గో స్థానంలో నిలిచిన ఎఫ్బీ మెసెంజర్ ఇప్పుడు కూడా అదే స్థానంలో కొనసాగుతోంది. 5. షేర్ ఇట్ వివిధ డివైస్ల మధ్య ఫైళ్లు, ఫొటోలు షేర్ చేసుకోవడాన్ని సులభతరంగా మార్చిన షేర్ ఇట్ యాప్ ఐదో స్థానం సంపాదించింది. 6. జియో టీవీ గతేడాది చివరి స్థానంలో నిలిచిన జియో టీవీ ఈసారి ఆరో స్థానానికి ఎగబాకింది. సీరియల్స్, క్రికెట్ మ్యాచులు చూసేందుకు వీలుగా రూపొందిచబడిన ఈ యాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. 7. ఎయిర్ టెయిల్ టీవీ తక్కువ ధరకే డేటాను అందించడం ద్వారా ఎయిర్టెల్ టీవీ యూజర్ల సంఖ్యను పెంచుకొని ఏడో స్థానంలో నిలిచింది. 8. హాట్ స్టార్ స్టార్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన హాట్ స్టార్ మొదటి సారిగా మోస్ట్ డౌన్లోడెడ్ యాప్‌ల జాబితాలో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది. 9. ట్రూకాలర్ రాంగ్ కాల్స్ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్ యాప్‌కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతేడాది ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ యాప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 10. హైప్స్టార్ వీడియో కమ్యూనిటీ యాప్ హైప్స్టార్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకే క్లిక్‌తో వైరల్ వీడియోలు చూసేయొచ్చు. గతేడాది టాప్ 10లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ యప్ ఈసారి పదో స్థానంలో నిలిచింది.ఈ టాప్- 10 యాప్‌లు మీ మొబైల్లో కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి. -
ఫేస్బుక్ లేటెస్ట్ యాప్ ‘లైఫ్‌స్టేజ్’
న్యూయార్క్: హైస్కూల్ విద్యార్థుల కోసం సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ ‘లైఫ్‌స్టేజ్’ పేరుతో కొత్త ఐఓఎస్ యాప్‌ను ప్రారంభించింది. ఇందులో... వినియోగదారుడు వీడియో రూపంలో ఇచ్చిన ఇష్టాయిష్టాలు, బెస్ట్ ఫ్రెండ్, అభిరుచులు, సంతోషం, బాధ కలిగించిన సందర్భాలు తదితర వివరాలను వర్చువల్ ప్రొఫైల్ వీడియోగా మార్చి ఈ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. దీంతో తోటివారితో ఉన్న ఉమ్మడి ఆసక్తులు, కోరికల గురించి వారు మరింత తెలుసుకోవచ్చని శనివారం ఓ పోస్టులో ఫేస్బుక్ వెల్లడించింది. 21 ఏళ్లకు కిందనున్న వారికే ఈ సౌకర్యం ఉంటుంది. ఎవరైనా తమ పేజీని అప్డేట్ చేసిన ప్రతిసారి దాన్ని చెక్ చేసుకునేలా ఇతరులకు ఫీడ్ వెళ్తుంది. యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత స్కూల్ పేరు తెలపగానే ఇతరుల ప్రొఫైల్‌లను చూపుతుంది. ఒకే స్కూల్ నుంచి కనీసం 20 మంది ఇందులో నమోదై ఉండాలి. 21 ఏళ్లకు పైనున్న వారు కూడా ఈ యాప్‌తో ప్రొఫైల్‌లు తయారుచేసుకోవచ్చు. కానీ వీరికి ఇతరుల ప్రొఫైల్‌లను చెక్ చేసే అవకాశం ఉండదు.