దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్ | JioBharat Diwali Dhamaka You Get 4g Phone At Only Rs 699 | Sakshi
Sakshi News home page

దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్

Published Sat, Oct 26 2024 4:26 PM | Last Updated on Sat, Oct 26 2024 5:12 PM

JioBharat Diwali Dhamaka You Get 4g Phone At Only Rs 699

రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్‌లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.

రూ.123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ & ప్రయోజనాలు
పండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. 
⋆అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్
⋆నెలకు 14 జీబీ డేటా
⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు
⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు
⋆వీడియో షోలు
⋆లైవ్ స్పోర్ట్స్
⋆జియో సినిమాలో హైలెట్స్
⋆క్యూఆర్ కోడ్ స్కాన్‌లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్
⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం
⋆గ్రూప్ చాట్‌లు
⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడం

ఇతర ఆపరేటర్‌లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement