టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారు.
- స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.
- కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.
- కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.
- స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.
- ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
- ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.
- వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.
- ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.
ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
ఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్‌వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment