దేశంలో జియో 5జీ సేవలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కంపెనీ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు ఆ సంస్థ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇక దీపావళికి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఎంపిక చేసిన జియో వినియోగదారులకు మాత్రమే జియో ట్రూ 5జీని వినియోగించుకునే సదుపాయం ఉంది.
జియో 5జీని వినియోగించుకోవాలంటే
మీరు మై జియో అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్‌ని ఓపెన్ చేసి మీ జియో నంబర్‌ను ఎంటర్ చేయండి. అనంతరం యాప్ స్క్రీన్ మీద పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా ‘జియో వెల్‌కమ్ ఆఫర్’ అని డిస్‌ప్లే అవుతుంది.
చదవండి👉 గుడ్ న్యూస్: జియో 5జీ ట్రయల్స్,యూజర్లకు ఆహ్వానం
ఆతర్వాత జియో వెల్‌కమ్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే ‘మోస్ట్ యూజ్‌డ్ ఏరియాస్’ 5జీ సపోర్ట్ చేస్తుందో లేదో యాప్ తనిఖీ చేస్తుంది. ఇది మీ ఫోన్ 5జీకి (అన్ని సంబంధిత అప్‌డేట్‌లతో) మద్దతు ఇస్తుందని నిర్ధారిస్తుంది. అది పూర్తయిన తర్వాత, వెల్‌కమ్ ఆఫర్ కింద 5జీ సపోర్ట్‌ని పొందడానికి మీరు వరుసలో ఉన్నారని నిర్ధారిస్తూ మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడే జియో 5జీ అందిస్తున్న ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఈ నాలుగు సర్కిల్‌లలో ఒకదానిలో ఉన్నట్లయితే మీరు 5జీని వినియోగించుకోవచ్చు.
చదవండి👉 ఫోన్‌ల జాబితా వచ్చేసింది, ఎయిర్‌టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్‌లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment