మోస్ట్‌ ఎవైటెడ్‌ జియో ఫోన్‌..అద్భుత ఫీచర్లతో | #RIL 40th AGM: #jio phone a 100% 4G LTE phone to support all of India's 22 different languages | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ ఎవైటెడ్‌ జియో ఫోన్‌..అద్భుత ఫీచర్లతో

Published Fri, Jul 21 2017 12:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

#RIL 40th AGM: #jio phone a 100% 4G LTE phone to support all of India's 22 different languages



ముంబై: ఎప్పటినుంచో ఊరిస్తున్న జియో ఫీచర్‌ ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. 40వ రిలయన్స్‌ ఏజీఎం  సమావేశంలో ఇండియాస్‌ ఇంటిలిజెంట్‌ ఫోన్‌ అంటూ ముకేష్‌ అంబానీ  ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు.  ఈ సందర‍్భంగా ముకేశ్ వారసులు ఈశా, ఆకాశ్ యూనిక్‌ రెవల్యూషనరీ  జియో ఫీచర్‌ ఫోన్‌ను  పరిచయం చేశారు.

వాయిస్‌ కమాండ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఫోన్‌ చేయాలన్నా, ఎస్‌ఎంఎస్‌ సెండ్‌ చేయాలన్సా వాయిండ్‌ కమాండ్‌తో సులువుగా చేసుకోవచ్చు. అన్ని రకాల పేమెంట్‌ సర్వీసులను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నామని తెలిపారు. 'భాషా అనేక్‌ భారత్‌ ఏక్‌' అంటూ 22  భాషల్లో మొబైల్ యాక్సెస్‌  ఉంటుందన్నారు.  జియో  ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు రూ.153/- ప్లాన్‌ ద్వారా నెల రోజుల వ్యాలిడిటీతో అన్‌ లిమిడెట్‌ డేటాను ఉచితంగా అందిస్తామని ముకేష్‌ ప్రకటించారు.

అంబానీ కొడుకు ఆకాశ్‌, కూతురు ఈషా, కిరణ్‌ థామస్‌లు ఫోన్‌ ఫీచర్స్‌ను వివరించారు. చిన్న సైజులో కనిపిస్తున్న ఫోన్‌లో వందల కొద్దీ స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నట్లు ఈషా చెప్పారు.
 

1. వాయిస్‌ కమాండ్‌ ఫోన్‌
కిరణ్‌, ఆకాశ్‌లు జియో ఫోన్‌లతో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రాక్టికల్‌గా కాల్‌ చేసి చూపించారు. కిరణ్‌, ఆకాశ్‌కు కాల్‌ చేయమని చెప్పగానే ఆటోమేటిక్‌గా కాల్‌ ఆకాశ్‌ను రీచ్‌ అయింది. అంతేకాదు మెసేజ్‌లు కూడా వాయిస్‌ కమాండ్‌తో పంపించింది జియో ఫోన్‌.

2. ప్రీలోడెడ్‌ అప్లికేషన్స్‌
జియో అందించే అన్ని రకాల ప్రీ లోడెడ్‌ అప్లికేషన్స్‌ జియో ఫోన్‌లో ఉచితంగా వినియోగదారులు అందుకోనున్నారు.

3. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌
ఫోన్‌లోని నెంబర్‌ 5ను నొక్కిపట్టుకోవడం ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు ప్రమాదంలో ఉన్నప్పుడు మెసేజ్‌ పంపుకోవచ్చు. దీన్ని కూడా ప్రాక్టికల్‌గా ఆకాశ్‌, కిరణ్‌లు వార్షిక సమావేశంలో చేసి చూపించారు. ఎమర్జెన్సీ మెసేజ్‌లో లొకేషన్‌తో పాటు లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్‌ వివరాలు మెసేజ్‌లో వెళ్లాయి.

రెహమాన్‌ వందేమాతరం, బాహుబలి -2 ట్రైలర్‌ , ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌ కీ బాత్‌  ప్రోగ్రాంలను జియో ఫోన్‌లో ప్లే చేసి వినిపించారు కూడా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement