క్లిక్ చేస్తే ఎఫ్‌ఐఆర్ నకలు
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న పోలీస్ శాఖ
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ 24 గంటల్లోపు హోంశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ఉగ్రవాదం, అత్యాచారం వంటి కేసులకు మినహాయింపు!
►ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ నవంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం
బెంగళూరు : దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరు సమాచార సాంకేతిక రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంటుంది. తాజాగా పోలీస్ శాఖ ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను ఎక్కడినుంచైనా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈనెల 15 రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ పెద్ద ప్రహసనం అన్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువ. ఎఫ్‌ఐఆర్ నమోదైనా సదరు నకలను తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇకపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన 24 గంటల్లోపు పోలీస్ వెబ్‌సైట్‌లో సదరు అప్‌లోడ్ కానుంది. దీంతో కాపీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి అవసరంఉండదు. ఒక్క క్లిక్‌తో ఆ ఎఫ్‌ఐఆర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల బాధితులకు సత్వరం కేసుకు సంబంధించి ప్రాథమిక అవగాహన ఏర్పడటమే కాకుండా పోలీసుల్లో కూడా జవాబుదారితనం పెరుగుతుందని హోంశాఖ చెబుతోంది.
ఇందు కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అవసరమైన సర్వర్ సమకూర్చుకోవడంతో పాటు స్టేషన్‌కు చెందిన సంబంధిత సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. అయితే ఉగ్రవాద, మావోయిస్ట్, అత్యాచార, లైంగిక వేధింపులు వంటి అత్యంత సున్నితమైన కేసులను మాత్రం ఈ ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ విధానం నుంచి తప్పించారు. ఈ విషయమై రాష్ట్ర అదనపు డీజీపీ (క్రైం అండ్ టెక్నికల్ సర్వీస్) భాస్కర్‌రావ్ మాట్లాడుతూ... సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నాం. బాధితులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. వచ్చే నెల 15 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. అని పేర్కొన్నారు. అయితే నూతన సదుపాయం పై రాష్ట్ర పోలీసుశాఖ మాజీ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లు వెబ్‌సైట్‌లో పెట్టడం, సదరు ఎఫ్‌ఐఆర్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీని వల్ల బాధితులకు నిందితుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.