న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌లో జూమ్ యాప్ మొదటిస్థానంలో నిలిచింది. యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ సెన్సార్ టవర్ విడుదల చేసిన దాని ప్రకారం ఏప్రిల్ నెలలో జూమ్‌యాప్‌ని 131మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో భారతీయులే ఎక్కువ మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. భారత్ తరువాత అమెరికా ఈ యాప్‌ని ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంది. ఈ యాప్‌తో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే హెచ్చరించినప్పటికి ఇంత మంది డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. (నయా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’)
లాక్‌డౌన్ సమయంలో గ్రూప్ కాలింగ్ కోసం చాలా కంపెనీలు, ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించడం కోసం చాలా విద్యాసంస్థలు విద్యార్ధులు, వీరితో పాటు సామాన్యులు సైతం తమకి ఇష్టమైన వారితో మాట్లాడుకోవడానికి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులెవ్వరు ఈ యాప్‌ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక జూమ్ యాప్ తరువాత ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న లిస్ట్‌లో టిక్‌టాక్ నిలిచింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్ల మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీటిలో 22 శాతం భారతదేశం నుంచే డౌన్‌లోడ్ చేసుకున్నారు. (కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’)
Comments
Please login to add a commentAdd a comment