ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు! | Now, download YouTube videos overnight on cheaper data rates | Sakshi
Sakshi News home page

ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు!

Published Fri, Jun 10 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు!

ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు!

న్యూఢిల్లీ : ఇక చాలా చవకైన డేటా రేట్లకే యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసు యూట్యూబ్ ఓ కొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. స్మార్ట్ ఆఫ్ లైన్ అనే ఫీచర్ ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ తో రాత్రి సమయాల్లో తక్కువ డేటారేట్లకే వీడియో డౌన్ లోడ్లను మొబైల్ ఆపరేటర్లు యూజర్లకు ఆఫర్ చేసేలా ఆవిష్కరించింది. 2014లో ఆఫ్ లైన్ వీడియోల ఆఫర్ ను యూట్యూబ్ యూజర్ల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ స్మార్ట్ ఆఫ్ లైన్ ఫీచర్ యూట్యూబ్ యాప్ అప్ డేటెడ్ వెర్షన్‌లో పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వై-ఫై నెట్ వర్క్ లకు ఇది పనిచేయదని తెలిపింది. ఈ ఫీచర్ యాక్సస్ కు 'సేవ్ ఓవర్ నైట్' అనే ఆప్షన్ ను యూజర్లు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా రాత్రి వేళల్లో డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలను తర్వాతి రోజు ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కోసం ఎయిర్ టెల్, టెలినార్ సంస్థలతో యూట్యూబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్ లో యూజర్లందరికీ ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆశిస్తున్నట్టు యూట్యూబ్ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement