data rates
-
ఈ ఏడాదే 25 నగరాల్లో 5జీ
న్యూఢిల్లీ: టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్‌కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘దేశంలో డేటా ధరలు అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. 5జీలోనూ ఇదే పంథా కొనసాగుతుంది. నెట్వర్క్ ప్రొవైడర్ల విషయంలో నమ్మదగ్గ దేశంగా భారత్ టాప్‌లో నిలుస్తుంది. మన 4జీ, 5జీ ఉత్పత్తులు, సాంకేతికతలపై పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆయాచిత ఫోన్‌కాల్స్‌కు సంబంధించి కీలక నిబంధన రానుంది. కాల్ చేస్తున్న వారి వివరాలు కేవైసీ ఆధారంగా ఫోన్లోనే ప్రత్యక్షమవుతాయి’’ అని మంత్రి తెలిపారు. ఢిల్లీ సహా పలు నగరాల్లో మొబైల్ టవర్లపై ప్రజలు అభ్యంతరాల నేపథ్యంలో, రేడియేషన్‌పై ఆందోళన అవసరం లేదన్నారు. -
జియోకు షాక్: ఎయిర్టెల్ కొత్త ఆఫర్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో అంతకంతకూ దిగివస్తున్న టెలికం కంపెనీలు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ లీడర్ భారతి ఎయిర్టెల్ అతి చవకైన రెండు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.ఇటీవల రిలయన్స్ జియో లాంచ్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తీసుకు రానున్న సేవలను ఎయిర్టెల్ ప్రకటించింది. 3జీ, 4 జీ ధరల్లో కోత పెట్టింది. అంతేకాదు జియో ను మించి చవకైన ప్లాన్ ను ఎయిర్టెల్ అందించింది. జియో తరహాలో ప్రతీనెల రూ.300లకు 30 జీబీ కాకుండా.. రూ.145ల చిన్న ప్యాక్ ఆఫర్ చేస్తోంది. రూ.145 14జీబీ 3జీ / 4జీ డ్యాటా అందిస్తోంది 145 రీచార్జ్‌పై 14జీబీ, 3/4 జీ డ్యాటాను అందిస్తోది. అంతేకాదు ఈ ప్లాన్ లో ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం. 349 రీచార్జ్ ప్యాక్‌లో 14జీబీ, 3/4 జీ డ్యాటాతో పాటు అన్ లిమిటెడ్ (అన్ని నెట్ వర్క్స్)కాలింగ్ సదుపాయం. కాగా జియో హ్యాఫీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే అన్నిటికన్నా ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే. -
ఇక చౌక రేట్లకే యూట్యూబ్ వీడియోలు!
న్యూఢిల్లీ : ఇక చాలా చవకైన డేటా రేట్లకే యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసు యూట్యూబ్ ఓ కొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. స్మార్ట్ ఆఫ్ లైన్ అనే ఫీచర్ ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ తో రాత్రి సమయాల్లో తక్కువ డేటారేట్లకే వీడియో డౌన్ లోడ్లను మొబైల్ ఆపరేటర్లు యూజర్లకు ఆఫర్ చేసేలా ఆవిష్కరించింది. 2014లో ఆఫ్ లైన్ వీడియోల ఆఫర్ ను యూట్యూబ్ యూజర్ల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఆఫ్ లైన్ ఫీచర్ యూట్యూబ్ యాప్ అప్ డేటెడ్ వెర్షన్లో పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వై-ఫై నెట్ వర్క్ లకు ఇది పనిచేయదని తెలిపింది. ఈ ఫీచర్ యాక్సస్ కు 'సేవ్ ఓవర్ నైట్' అనే ఆప్షన్ ను యూజర్లు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా రాత్రి వేళల్లో డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలను తర్వాతి రోజు ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కోసం ఎయిర్ టెల్, టెలినార్ సంస్థలతో యూట్యూబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్ లో యూజర్లందరికీ ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆశిస్తున్నట్టు యూట్యూబ్ పేర్కొంది.