జియోకు షాక్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌ | Airtel's new plan gives 14GB 4G data at Rs 145, matches Jio Prime's data rates | Sakshi
Sakshi News home page

జియోకు షాక్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌

Published Tue, Feb 28 2017 3:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

జియోకు షాక్‌: ఎయిర్‌టెల్‌  కొత్త ఆఫర్‌

జియోకు షాక్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌​  జియో ఎఫెక్ట్‌తో అంతకంతకూ దిగివస్తున్న టెలికం కంపెనీలు తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా  మార్కెట్‌ లీడర్‌ భారతి ఎయిర్‌టెల్‌  అతి చవకైన రెండు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.ఇటీవల రిలయన్స్‌ జియో లాంచ్‌  ప్రైమ్‌  మెంబర్లకు అందుబాటులోకి తీసుకు రానున్న సేవలను ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 3జీ, 4 జీ ధరల్లో కోత పెట్టింది. అంతేకాదు  జియో ను మించి చవకైన ప్లాన్‌ ను ఎయిర్టెల్ అందించింది. జియో తరహాలో ప్రతీనెల రూ.300లకు 30 జీబీ కాకుండా.. రూ.145ల చిన్న ప్యాక్‌ ఆఫర్‌  చేస్తోంది. రూ.145 14జీబీ 3జీ / 4జీ   డ్యాటా అందిస్తోంది

145 రీచార్జ్‌పై 14జీబీ, 3/4 జీ డ్యాటాను అందిస్తోది. అంతేకాదు ఈ ప్లాన్‌ లో ఎయిర్‌ టెల్‌  టు ఎయిర్‌ టెల్‌ ఫ్రీ కాలింగ్‌ సదుపాయం.
349 రీచార్జ్‌ ప్యాక్‌లో 14జీబీ, 3/4 జీ డ్యాటాతో పాటు అన్‌ లిమిటెడ్‌ (అన్ని నెట్‌ వర్క్స్‌)కాలింగ్‌ సదుపాయం.

కాగా జియో  హ్యాఫీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ మార్చి 31తో ముగియనుండడంతో  ప్రైమ్ మెంబర్‌ షిప్‌  స్కీం, కొత్త టారిఫ్‌ లను ప్రకటించింది.   ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే అన్నిటికన్నా ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది.  రిలయన్స్‌ అధినేత ముకేష్‌​ అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement