ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు.
తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు.
“యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు.
ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment