vulgar
-
అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
చిన్నపిల్లలకు అసభ్యకర ప్రశ్నలు.. మండిపడుతున్న నెటిజన్స్!
సోని పిక్చర్స్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ -3. ఈ షో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను చిలిపి ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్‌ను నవిస్తుంటారు. ఈ షోకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, చిత్రనిర్మాత అనురాగ్ బసు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నారు. అయితే ఈ డ్యాన్స్ కాస్తా అసభ్యకరమైన చర్చలకు దారితీసింది. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను అతని తల్లిదండ్రులను ఉద్దేశించి అసభ్యకరమైన, లైంగిక ప్రశ్నలు వేస్తూ జడ్జిలు నవ్వుకుంటున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో అన్ని వయసుల వారికి వీడియో అందుబాటులో ఉందని నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జడ్జిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చిన్న పిల్లలను ఇలాంటి ప్రశ్నలా అడిగేది.. మీకు అసలు కొంచెమైన సిగ్గుందా' అంటూ మండిపడుతున్నారు. మరో నెటిజన్ రాస్తూ..'ఇది చాలా అసహ్యంగా ఉంది. అస్సలు ఇది వినోదం కాదు. పిల్లలతో ఇలాంటివీ చెప్పిస్తారా?' ఫైరయ్యారు. కాగా.. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలను ఛానెల్ ఉల్లంఘించిందని ఎన్సీపీసీఆర్ పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌కు ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది. లేఖ అందిన 7 రోజులలోపు కమిషన్‌కు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని లేఖలో ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ఆదేశించారు. కాగా.. ఈ రియాలిటీ షో ఏప్రిల్ 2019 నుండి జూన్ 2019 వరకు ప్రసారం చేయబడింది. (ఇది చదవండి: ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్‌కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!) Child is made to deliver vulgar remarks on parents on stage in a kid show Everyone laughs and the episode is available for all ages on YouTube!#BollywoodKiGandagi are not role models. They are biggest enemies of Vishwaguru vision. Destroyer of our kidspic.twitter.com/49K7RzSWzr — Gems of Bollywood बॉलीवुड के रत्न (@GemsOfBollywood) July 24, 2023 What a shameful thing to do! Papa is shocked & embarrassed at this, but even he did not dare open his mouth. Only glamour rules the idiot box. https://t.co/30nr83q6Ye — Achhabachha🇮🇳 (@Lovepettyquotes) July 24, 2023 -
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’
పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు. అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్ ఇజ్రాయెల్‌కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యునిగా చేశారు. -
'బ్రా'లో వల్గర్ ఏముంది: కంగనా
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై నటి కంగనా రనౌత్ స్పందించింది. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని తెలిపింది. మూడుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కంగనా ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించింది. 'నేను డైరెక్టర్‌ను కాదు, దర్శక విభాగం గురించి ఎక్కువగా అవగాహన కూడా లేదు. కానీ వృత్తిలో భాగంగా వారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటాను. ప్రస్తుత పరిణామాలు వారికి చాలా విసుగు తెప్పించేవిలా ఉన్నాయి' అని కంగనా అన్నారు. క్వీన్ చిత్ర విడుదల సమయంలో డైరెక్ట్ వికాస్ బహల్ తన వద్దకు వచ్చి ఓ సన్నివేశంలోని 'బ్రా'ను బ్లర్ చేస్తున్నట్టుగా చెప్పాడని కంగనా తెలిపింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశంలో ధరించకుండానే ఉన్న 'బ్రా'ను వల్గర్‌గా ఉందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లర్ చేయాల్సి వచ్చిందట. ధరించకుండానే ఉన్న మామూలు 'బ్రా'వల్ల సొసైటీకి ఎలాంటి హాని జరగదని.. మహిళల 'బ్రా'లో వల్గర్ ఏముంటుందని సెన్సార్ బోర్డు పై కంగనా మండిపడింది. -
వక్రబుద్ధి టీచర్‌కు దేహశుద్ధి
రాజంపేట టౌన్: అతను పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన వాడు. కానీ ఎందుకో వక్రమార్గం ఎంచుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పడం మానుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వేధింపులు తీవ్రం కావడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతా కలిసి శనివారం పాఠశాల వద్దకు చేరుకుని దేహశుద్ధి చేసి తగిన గుణ‘పాఠం’ చెప్పారు. సంఘటనపై తీవ్రంగా స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయగా, పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. రాజంపేట ఉర్దూ జెడ్పీ హైస్కూలులో గ్రేడ్ -1 ఉర్దూ పండిట్‌గా పనిచేస్తున్న అజీజ్ అహ్మద్ ఏడాదిన్నర క్రితం పాఠశాలకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆయన విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు పలుమార్లు హెడ్మాస్టర్ హిదయతుల్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెడ్మాస్టర్ సదరు ఉపాధ్యాయుడు అజీజ్‌ను మందలించి ఆయనతో క్షమాపణ చెప్పించారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. తిరిగి పాత పద్ధతినే కొనసాగించడం మొదలుపెట్టాడు. బోర్డుపై బూతుబొమ్మలు వేసి వాటి గురించి వివరించమని విద్యార్థినులను ఒత్తిడి చేసేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ విద్యార్థిని భోజనం చేసేందుకు వెళ్తుండగా ఈ ఉపాధ్యాయుడు తన వద్ద కూడా అన్నం ఉంది.. ఇద్దరం కలిసి తిందాం రమ్మని పిలిచి ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఇన్చార్జి హెడ్మాస్టర్ సుబ్రమణ్యం రాజు దృష్టికి వెళ్లింది. ఆయన శనివారం విద్యార్థినులను పిలిచి విచారించగా ఉపాధ్యాయుడి వికృత చేష్టలను వారు ఏకరువు పెట్టారు. సమస్య తీవ్రతను గమనించిన ఇన్చార్జి హెడ్మాస్టర్ ఈ విషయాన్ని డిప్యూటీ డీఈఓ రంగారెడ్డికి వివరించేందుకు ఫోన్ చేయగా ఆయన ప్రయాణంలో ఉండటంతో అసలు విషయం ఆయన దృష్టికి స్పష్టంగా వెళ్లలేదు. శుక్రవారం జరిగిన సంఘటనను విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారితో పాటు స్థానికులు, ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం మధ్యాహ్నం పాఠశాల వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న ఉపాధ్యాయుడు అజీజ్‌ను కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అజీజ్‌ను వెనకేసుకొచ్చే యత్నం కాగా ఉర్దూ పాఠశాలలోని పలువురు ఉపాధ్యాయులు అజీజ్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించిన కొద్దిసేపటికే పదో తరగతి విద్యార్థినులు ఆయనకు అనుకూలంగా మాట్లాడారు. అజీజ్ లేకపోతే ఉర్దూ పాఠ్యాంశం చెప్పేవారు ఉండరని, దీంతో అంతా ఫెయిల్ అవుతారని కొంత మంది ఉపాధ్యాయులు వారికి నూరిపోసినట్లు సమాచారం. దీంతో టెన్త్ విద్యార్థినులు డిప్యూటీ డీఈఓ ఎదుట తమ ఉపాధ్యాయుడు చాలా మంచివాడని, సార్‌కు అన్యాయం జరిగిందని చెప్పడం గమనార్హం. నిర్భయ కేసు నమోదు రాజంపేట రూరల్: ఉర్దూ బాలికోన్నతపాఠశాల ఉపాధ్యాయుడు అజీజ్ అహమ్మద్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్ఎం అలీ తెలిపారు. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విదార్థినులను గత కొంతకాలంగా అజీజ్ లైంగికంగా వేధిస్తున్నట్లు బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కడప ఎడ్యుకేషన్: రాజంపేట ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అజీద్ అహమ్మద్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ ఉపాధ్యాయుడు బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లైంగిక వేధింపులు వాస్తవమే రాజంపేట టౌన్: ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు అజీజ్ అహమ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడటం వాస్తవమేనని తమ విచారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ తెలిపారు. స్థానిక ఉర్దూ పాఠశాలలోని విద్యార్థినులను ఆమె శనివారం విచారించారు. కొంతమంది ఉపాధ్యాయులు కీ చక ఉపాధ్యాయుడిని కాపాడేందుకు పదో తరగతి విద్యార్థులను పావుగా వాడుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల గురించి తొలిసారి తెలిసిన వెంటనే హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే తిరిగి ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల రక్షణ సమితి జిల్లా కన్వీనర్ రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.